
న్యూఢిల్లీ: ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచడం, ఎయిర్ కార్గో కార్యకలాపాలు ప్రోత్సహించడం, ఉడాన్ స్కీమ్ కింద 56 కొత్త ఎయిర్‌పోర్ట్‌లలో త్వరితగతిన కార్యకలాపాలు ప్రారంభించడం అనేవి పౌరవిమానయాన శాఖ ముందున్న ప్రధాన అంశాలని వాణిజ్య శాఖ మంత్రి సురేశ్ ప్రభు పేర్కొన్నారు. ఆయన సోమవారం పౌరవిమానయాన శాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు చేపట్టారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఏవియేషన్ మార్కెట్ కలిగిన చైనాతో పోలిస్తే భారత్‌లో ప్రయాణికుల సంఖ్య వేగంగా పెరుగుతోందని తెలిపారు. ప్రయాణికుల సంఖ్యలో 16–20 శాతం వృద్ధి నమోదవుతోందన్నారు. ‘ప్రయాణికుల సేవలు, కనెక్టివిటీ మెరుగుదలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలని భావిస్తున్నాం. ఉడాన్ స్కీమ్ కింద కొత్తగా 56 ఎయిర్‌పోర్ట్‌లు అనుమతులు పొందాయి. వీలైనంత త్వరగా వీటిల్లో కార్యకలాపాలు ప్రారంభించాలని చూస్తున్నాం. దీని వల్ల కనెక్టివిటీ మరింత పెరుగుతుంది’ అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment