నలుగురి ఏకగ్రీవం ఇక లాంఛనమే
రాజ్యసభ నామినేషన్లకు ముగిసిన గడువు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం నుంచి నలుగురు రాజ్యసభ అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నిక ఇక లాంఛ నమే కానుంది. వైఎస్సార్‌సీపీ, టీడీపీ, బీజేపీల నుంచి వీరు ఎన్నిక కానున్నారు. జూన్ 3న నామినేషన్ల ఉపసంహరణ అయిన తరువాత వీరి ఏకగ్రీవ ఎన్నికను అధికారి కంగా ప్రకటించనున్నారు. నామినేషన్ల దాఖ లుకు చివరిరోజు మంగళవారం ైవె ఎస్సార్‌సీపీ అభ్యర్థి వి.విజయసాయిరెడ్డి మరోసెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ఇంతకుముందు 2 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. విజయసాయిరెడ్డి సతీమణి సునందరెడ్డి వైఎస్సార్‌సీపీ డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు.
బీజేపీ, టీడీపీ అభ్యర్థులుగా కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు, కేంద్ర మంత్రి వై. సుజనాచౌదరి, రాష్ట్ర మాజీ మంత్రి టీజీ వెంకటేష్ నామినేషన్లు వేశారు. దీంతో మొత్తం నామినేషన్ల సంఖ్య ఐదుకు చేరింది. బుధవారం ఉదయం 11 గంటల నుంచి అభ్యర్థుల నామినేషన్లను పరిశీలించనున్నారు. ఆ తర్వాత సునంద తన నామినేషన్‌ను ఉపసంహరించుకుంటే.. మిగతా నలుగురు ఏకగ్రీవం గా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ ఇన్‌చార్జి కార్యదర్శి కె.సత్యనారాయణ ప్రకటిస్తారు. 3న సాయంత్రం 3 గంటలకు ఆ నలుగురూ రాజ్యసభకు ఎన్నికైనట్లుగా ధ్రువపత్రాలను అందజేస్తారు.
ముగ్గురిని ప్రతిపాదించిన చంద్రబాబు
బీజేపీ, టీడీపీ అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి కె. సత్యనారాయణకు అందచేశారు. సురేష్ ప్రభు, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్‌ల అభ్యర్థిత్వాలను ప్రతిపాదిస్తూ ముఖ్యమంత్రి, టీడీ పీ అధినేత చంద్రబాబునాయుడు తొలి సంతకం చేశారు. అనంతరం సురేష్ ప్రభు, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్‌లు తాము ముందుగా నిర్ణయించుకున్న ముహూర్తం ప్రకారం ఉ. 11.07 గంటల నుంచి 11.50 గంటల మధ్య నామినేషన్లు వేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు. ఆయన అసెంబ్లీకి రావడం ఇదే తొలిసారి.
బాబుకు కృతజ్ఞతలు తెలిపిన ప్రభు
లోకేష్, సుజనాచౌదరి, టీజీ వెంకటేష్ తదితరులతో కలసి అసెంబ్లీ మీడియా పాయింట్‌లో విలేకరులతో మాట్లాడిన అనంతరం సురేష్ ప్రభు అక్కడి నుంచే చంద్రబాబుకు ఫోన్ చేసి తన అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతోనూ ప్రభు ఫోన్‌లో మాట్లాడి కృతజ్ఞతలు తెలిపారు.