సాక్షి,న్యూఢిల్లీ: 2022 నాటికి ఆయుష్ రంగంలో మూడు రెట్ల పెరుగుదలను కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఆయుష్ పరిశ్రమ భవిష్యత్తులో రెండంకెల వృద్ధిని సాధించనుందని, తద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీగా ఉపాధి అవకాశాలు లభింస్తాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ ప్రభు చెప్పారు. 2020 నాటికి 26 మిలియన్ల మందికి పరోక్ష ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఢిల్లీ నేటి (డిసెంబర్4) నుంచి మూడు రోజులపాటు జరగనున్న మొట్టమొదటి అంతర్జాతీయ వెల్‌నెస్, ఆరోగ్య 2017 సదస్సులో ఆయన మాట్లాడారు.
దేశంలో ఆయుష్ రంగం ప్రగతి దిశగా పయనిస్తోందని.. ఈ రంగంలో మున్ముందు కోట్ల మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయని సురేశ్ ప్రభు అన్నారు. 2020 నాటికి ఈ రంగం ప్రత్యక్షంగా 10లక్షల మందికి, పరోక్షంగా 2.5 కోట్ల మందిని ఉపాధి కల్పిస్తుందని చెప్పారు. ఆయుర్వేదం, యోగా, నేచురోపతి, యునాని, సిద్ధా, హోమియోపతి కలిసి ఉన్న ఆయుష్‌రంగం ద్వారా దేశీయంగా రూ. 500కోట్లను ఎగుమతుల ద్వారా రూ.200 వందలకోట్లను సాధిస్తుందని అంచనా వేసినట్టు చెప్పారు.
సంప్రదాయ ఔషధాలపై అవగాహన కల్పించేందుకు భారత్‌తో కలిసి అనేక దేశాలు పనిచేస్తున్నాయని, అందుకు చాలా ఆనందంగా ఉందని కేంద్రమంత్రి ప్రభు వెల్లడించారు. దాదాపు 6,600 ఔషధ మొక్కల సంపదతో ప్రపంచంలోని ఆయుష్ మరియు ఔషధ ఉత్పత్తుల ఎగుమతిలో భారత్ రెండో అతిపెద్ద ఎగుమతిదారుగా ఉందన్నారు. అలాగే ఆయుష్‌లో 100శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. వైద్యరంగంలో స్టార్టప్‌లు పెట్టాలనుకునే యువ పారిశ్రామికవేత్తలకు ఈ రంగంలో అనేక అవకాశాలున్నాయని ప్రభు తెలిపారు.వచ్చే ఐదేళ్లలో ఆయుష్ రంగం మూడు రెట్ల పరిమాణాన్ని పెంచేందుకు మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉందని ఆయుష్ మంత్రిత్వ శాఖ సెక్రటరీ వైద్య రాజేష్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment