విజేతలు ఆయుష్, దేవకి | ayush, devaki clinch golf titles | Sakshi
Sakshi News home page

విజేతలు ఆయుష్, దేవకి

Published Tue, Nov 15 2016 11:21 AM | Last Updated on Mon, Sep 4 2017 8:10 PM

ayush, devaki clinch golf titles

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర జూనియర్ ఓపెన్ గోల్ఫ్ టోర్నమెంట్‌లో ఆయుష్, దేవకి విజేతలుగా నిలిచారు. హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్, డీపీఎస్ సంయుక్తంగా నిర్వహించిన ఈ టోర్నీలో కేటగిరీ- బాలుర విభాగంలో ఆయుష్ శర్మ అగ్రస్థానం సాధించగా... వినయ్ రోహిత్ రన్నరప్‌గా నిలిచాడు. కేటగిరీ-బి బాలికల విభాగంలో దేవకీ రెడ్డి, రాగిణి సైని... బాలుర విభాగంలో నవ్‌జయ్ జైశ్వాల్, తేజ్ తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ఈ టోర్నీలో నగరానికి చెందిన 25 పాఠశాలల నుంచి మొత్తం 95 మంది చిన్నారులు తలపడ్డారు.

 ఇతర విభాగాల విజేతల వివరాలు
 కేటగిరీ- సి బాలురు: 1. శ్రేయస్, 2. విలోక్ గద్వాల్. బాలికలు: 1. స్నేహ సింగ్, 2. ఆరోహి కటారియా.
 కేటగిరీ-డి బాలురు: 1. ప్రవల్ రెడ్డి, 2. వరుణ్‌దీప్ సింగ్. బాలికలు: 1. అమ్రిత మండవ.
 కేటగిరీ- ఇ బాలురు: 1. అక్షయ్, 2. వేదాన్‌‌ష రావు. బాలికలు: 1. శ్రీహిత మండవ, 2. రమ్య గుప్తా.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement