devaki
-
ప్రశాంత్ వర్మ కథలో శ్రీకృష్ణుడిగా మహేశ్ బాబు?
-
దేవిక కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సాయం: సీఎం జగన్
సాక్షి, అమరావతి/కరప : కాకినాడ జిల్లా పెదపూడి మండలం కాండ్రేగుల కూరాడ గ్రామంలో హత్యకు గురైన దేవిక కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.10 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఆమె కుటుంబాన్ని పరామర్శించి వారికి అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు. దేవిక హత్య ఘటనపై ఇప్పటికే దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి జగన్.. దిశ చట్టంలో పేర్కొన్న విధంగా త్వరితగతిన కేసు విచారణ పూర్తి చేసి, నిర్ణీత సమయంలోగా ఛార్జిషీటు దాఖలు చేయాలని చెప్పారు. దోషి రెడ్ హేండెడ్‌గా పట్టుబడ్డ కేసుల విషయంలో దిశ చట్టంలోని మార్గదర్శకాల ప్రకారం ముందుకు సాగాలని, తద్వారా నేరం చేసిన వ్యక్తికి కఠిన శిక్ష పడేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన రూ.10 లక్షల సాయాన్ని దేవిక కుటుంబ సభ్యులకు రెండు రోజుల్లో అందజేస్తారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు తెలిపారు. ఆదివారం కరపలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని కూరాడ సర్పంచ్ వాసంశెట్టి వెంకటరమణ, పీఏసీఎస్ అధ్యక్షుడు రావుల ప్రసాద్, ఇతర నాయకులకు వివరించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. న్యాయమూర్తి ఎదుట హాజరు ప్రేమను నిరాకరించిందన్న కక్షతో యువతి కాదా దేవికను హత్య చేసిన నిందితుడు గుబ్బల వెంకట సూర్యనారాయణను పోలీసులు న్యాయమూర్తి ముందు హాజరు పరచి, రిమాండ్‌కు తరలించారు. కాకినాడ రూరల్ సీఐ కె.శ్రీనివాస్ కథనం ప్రకారం.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం గంగవరం గ్రామానికి చెందిన కాదా రాంబాబు కుమార్తె దేవిక.. కాకినాడ జిల్లా కరప మండలం కూరాడలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ డిగ్రీ చదువుకుంటోంది. అదే గ్రామంలో మేనమామ ఇంటి వద్ద ఉండే గుబ్బల వెంకట సూర్యనారాయణ అనే యువకుడు తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని ఏడాది కాలంగా దేవికను వేధిస్తున్నాడు. అందుకు నిరాకరించిందన్న అక్కసుతో శనివారం ఆమెను పెదపూడి మండలం కాండ్రేగుల–కూరాడ గ్రామాల మధ్య కత్తితో అతి దారుణంగా నరికి హతమార్చిన విషయం విదితమే. నిందితుడు వెంకట సూర్యనారాయణను కాకినాడ రూరల్ పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేశారు. ఆదివారం కోర్టుకు సెలవు కావడంతో కాకినాడ రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎం.ప్రసన్నలక్ష్మి నివాసంలో ఆమె ఎదుట హాజరు పరిచారు. నిందితుడికి ఈ నెల 21వ తేదీ వరకూ రిమాండ్ విధించగా, అతడిని కాకినాడ సబ్ జైలుకు తరలించారు. చదవండి: (కాకినాడ జిల్లాలో దారుణం.. ప్రేమను నిరాకరించిందని..) -
కాకినాడ జిల్లా యువతి హత్య ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
అమరావతి: కాకినాడ జిల్లా కాండ్రేగుల కూరాడ గ్రామంలో యువతి హత్య ఘటనపై సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి దిశ చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించారు. చట్టంలో పేర్కొన్న విధంగా త్వరతిగతిన కేసు విచారణ పూర్తి చేసి, నిర్ణీత సమయంలోగా చార్జిషీటు దాఖలు చేయాలన్నారు. అదే సమయంలో బాధిత కుటుంబానికి తోడుగా నిలవాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. కాగా, కాకినాడ జిల్లాలో ఓ యువతి ప్రేమోన్మాదానికి బలైంది. కాకినాడ రూరల్.. కాండ్రేగుల కూరాడ గ్రామంలో దేవకి అనే యువతిని సూర్యనారాయణ అనే యువకుడు ప్రేమించాడు. అయితే దేవకి అతడి ప్రేమను నిరాకరించింది. దీంతో కక్ష పెంచుకున్న సూర్యనారాయణ దేవకి.. కరప నుంచి కూరాడకు స్కూటీపై వస్తుండగా వెంబడించి కత్తితో దాడి చేశాడు. దీంతో దేవకి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు నిందితుడిని అదపులోకి తీసుకొని.. పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
కాకినాడ జిల్లాలో దారుణం.. ప్రేమను నిరాకరించిందని..
కరప/కాకినాడ క్రైం: ప్రేమోన్మాది చేతిలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. తన ప్రేమను నిరాకరించిందన్న కక్షతో పట్టపగలు అతి కిరాతకంగా హత్య చేశాడు. ఏపీలోని కాకినాడ జిల్లా పెదపూడి మండలం కాండ్రేగుల సమీపంలో శనివారం ఈ దారుణం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం గంగవరానికి చెందిన కాదా రాంబాబు బతుకుదెరువు కోసం హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఆయన కుమార్తె దేవిక(21) కాకినాడ జిల్లా కరప మండలం కూరాడలోని అమ్మమ్మ.. కొప్పిశెట్టి చంద్రమ్మ ఇంటి వద్ద ఉంటూ కాకినాడ పీఆర్ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బాలవరం గ్రామానికి చెందిన గుబ్బల వెంకటసూర్యనారాయణ కూరాడలోని మేనమామ ఇంటి వద్ద ఖాళీగా ఉంటున్నాడు. కొంతకాలంగా దేవిక వెంటపడుతూ తనను ప్రేమించాలని వేధిస్తున్నాడు. వేధింపులు భరించలేక దేవిక ఈ విషయాన్ని బంధువులకు, పెద్దలకు చెప్పడంతో వారు యువకుడిని మందలించారు. అతడి మేనమామ కూడా యువకుడిని మందలించి ఏదైనా పనిచేసుకోవాలంటూ హైదరాబాద్‌కు పంపారు. కాగా, మళ్లీ అతను ఇక్కడికొచ్చాడు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం దేవిక కరపలోని ఓ షాపులో వస్తువులు తీసుకుని తిరిగి కూరాడకు బైక్‌పై బయలు దేరింది. పెదపూడి మండలం కాండ్రేగుల, కూరాడ గ్రామాల మధ్యలో ఆమె బైక్‌ను వెంకటసూర్యనారాయణ ఆపి.. తన బ్యాగ్‌లోంచి కత్తి తీసి దేవికను అత్యంత కిరాతకంగా నరికివేశాడు. ఆ రోడ్డు పరిసర పొలాల్లో పనిచేసుకుంటున్న రైతులు, కూలీలు వచ్చి నిందితుడిని పట్టుకుని.. చెట్టుకు కట్టేసి కొట్టారు. సమాచారం తెలుసుకున్న కాకినాడ రూరల్ సీఐ శ్రీనివాస్, పెదపూ డి ఎస్ఐ వాసులు ఘటన స్థలానికి చేరుకుని.. రక్తపు మడుగులో కొన ఊపిరితో ఉన్న దేవికను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే ఆమె మృతిచెందినట్టు ధ్రువీకరించారు. ఆమె శరీరంపై 48 కత్తి పోట్లున్నాయి. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి ప్రేమోన్మాది ఘాతుకానికి బలైన యువతి ఘటనను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తీసుకెళ్లారు. దీనిపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారని కురసాల తెలిపారు. ఈ సంఘటన తీవ్రంగా కలచి వేసిందని సీఎం చెప్పినట్టు తెలిపారు. ఈ ఘాతుకానికి బలైన దేవిక కుటుంబం చాలా నిరుపేద కుటుంబమ ని సీఎంకు వివరించామన్నారు. ఆ కుటుంబాన్ని అన్ని విధాలా మానవతా దృక్పథంతో ఆదుకుంటామని సీఎం జగన్ చెప్పారని కన్నబాబు వెల్లడించారు. చదవండి: (అమరావతి రైతుల మహాపాదయాత్రకు నిరసన సెగ) -
ఆమె అడవిగా విస్తరించింది
పురుషుడి చేతిలో భూమి ఉంటే దానిని వ్యాపారం చేయాలని చూస్తాడు. స్త్రీ చేతిలో భూమి ఉంటే అందులో నాలుగు మొక్కలు నాటుదామని చూస్తుంది. నేలపై మొక్క లేదంటే ఆమడ దూరంలో కరువు ఉన్నట్టే. ఆ పైన ఆ నేల ఎడారి కానున్నట్టే. ప్రపంచం ఈ విషయం కనిపెట్టడానికి ముందే 40 ఏళ్ల క్రితం తన ఇంటి వెనుక ఉండే నాలుగున్నర ఎకరాలను అడవిగా మార్చడం మొదలెట్టింది దేవకీ అమ్మ. అందుకే ఆమెను అందరూ ‘అమ్మ చెట్టు’ అని పిలుస్తారు. ఆమె పరిచయం. దుబాయ్ నుంచి 12 ఏళ్ల ముని మనవరాలు కేరళ లో ఉన్న 85 ఏళ్ల దేవకీ అమ్మకు కుతూహలంగా ఫోన్ చేస్తుంది. ‘అవ్వా... నేను నాటిన మొక్క పెద్దదయ్యిందా’ అని అడుగుతుంది. దానికి దేవకీ అమ్మ కావాలనే జవాబు చెప్పదు. ‘మళ్లీ ఎప్పుడొస్తావ్... నువ్వొచ్చి కొత్త మొక్కలు నాటితే కదా’ అంటుంది. ‘వస్తా.. వస్తా... ఎంత తొందరగా అయితే అంత తొందరగా రావాలని ఉంది’ అంటుంది మునిమనవరాలు. ఆ మునిమనవరాలే కాదు, మనవలు, కడుపున పుట్టినవారు అందరూ దేవకీ అమ్మ కోసం ఒక సంస్కారాన్ని పారంపర్యంగా స్వీకరించారు. అది వారి పూర్వికుల ఇంటి వెనుక ఉన్న నాలుగున్నర ఎకరాల భూమిలో విత్తనాలు, మొక్కలు నాటడం. అది ఇవాళ్టి పరంపర కాదు. దాదాపు 40 ఏళ్లుగా వస్తోంది. దానిని మొదలెట్టింది దేవకీ అమ్మ. ముత్తుకులం కోడలు దేవకిది అలెప్పికి 40 కిలోమీటర్ల దూరంలో ఉండే ముత్తుకులం అనే చిన్న పల్లెటూరు. ఆ ఊళ్లో అందరూ వ్యవసాయం చేస్తారు. ఇంటి దగ్గర మొక్కలు పెంచడం కూడా ఆనవాయితీనే. ‘మా నాన్న వైద్యన్. ఆయన ఇంట్లో అప్పుడప్పుడు విత్తనాలు, మొక్కలు తెచ్చి నాటేవారు. నేను ఇంట్లో అందరి కంటే చిన్నదాన్ని కాబట్టి నన్ను నాటమనేవారు. అలా నాకు మొక్కలంటే ఇష్టం ఏర్పడింది’ అంటుంది దేవకీ అమ్మ. ఆమెకు వయసు వచ్చాక అదే ఊళ్లో ఉన్న గోపాలకృష్ణ పిళ్లై అనే ఇంగ్లిష్ టీచర్‌ను వివాహం చేసుకుంది. అత్తగారిది విశాలమైన ఇల్లు. దాని వెనుక దాదాపు నాలుగున్నర ఎకరాల పెరడు ఉంది. ఇంట్లో ఉన్న స్త్రీలందరూ వ్యవసాయ పనులు చేసి సొంత పొలంలో వరి పండించేవారు. ‘నాకు వ్యవసాయం ఇష్టం కనుక అత్తయ్యకు సాయం చేసేదాన్ని’ అంటుంది దేవకీ అమ్మ. 1980లో మారిన కథ 1980లో దేవకీ వెళుతున్న కారుకు యాక్సిడెంట్ అయ్యింది. ఆమె కాలు కదల్లేని పరిస్థితి వచ్చి మూడేళ్లు మంచాన ఉండిపోయింది. పొలానికి వెళ్లొద్దని డాక్టర్లు చెప్పారు. ‘నాకేమో పొలం పనులు ఇష్టం. ఏం చేయాలో తోచక పెరట్లో ఒక మొక్క నాటాను. అది పెరిగింది. మరోటి నాటాను. ఆ తర్వాత ఆ నాలుగున్నర ఎకరాల స్థలమే నా నివాసం అయ్యింది. అక్కడ మొక్కలు నాటుతూ వెళ్లాను. నా భర్త ఆ పనిలో నేను ఆనందం పొందుతూ పూర్తిగా కోలుకోవడం చూసి రోజూ తప్పనిసరిగా కొత్త కొత్త మొక్కలు తెచ్చివ్వడం మొదలుపెట్టారు. నా మొక్కల ఇష్టం చూసి బంధువులు, స్నేహితులు ఎవరు మా ఇంటికి వచ్చినా మొక్కలు తీసుకు వచ్చారు. రోజులు గడిచాయి. నాకు తెలియకనే నా పెరడు ఒక అద్భుతమైన అడవిగా మారిపోయింది’ అంటుంది దేవకీ అమ్మ. స్త్రీ పెంచిన అడవి దేవకీ అమ్మ ఆ రోజుల్లోనే సేంద్రియ పద్ధతి లో ఆ అడవిని పెంచింది. ఎరువులు వాడలేదు. పేడనీళ్లే ఎరువు. అడవిలో ఏయే వృక్షాలు ఉంటాయో అవన్నీ ఆమె పెరట్లో ఉన్నాయి. దాదాపు 200 రకాల వృక్షజాతులు ఉన్నాయి. 3000 చెట్లు, మొక్కలు ఉన్నాయి. ‘నేను రోజూ ఈ అడివంతా తిరుగుతాను. చెట్లతో మాట్లాడతాను. నా మాటలు వాటికి అర్థమవుతాయి. మాకేం చింత లేదు... ఈమె ఉంది కదా అని అనుకుంటాయి’ అంటుంది దేవకీ అమ్మ. చిన్న ఊరి మధ్యలో ఇంటి వెనుక పెద్ద అడవి ఏర్పడటం నిజంగా వింతే. అందుకే వృక్షశాస్త్రం అభ్యసించేవారు తరచూ దేవకీ అమ్మ అడవిని సందర్శిస్తూ ఉంటారు. అధ్యయనం చేస్తూ ఉంటారు. ‘సాధారణంగా చాలామంది అడవికి కంచె వేస్తుంటారు. నేను వేయను. వచ్చే జంతువులన్నీ రానీ. వాలే పక్షులన్నీ వాలనీ. ఈ భూమి అందరిదీ. నేను రోజూ నా కుటుంబం మంచితో పాటు ఈ భూమి మీద ఉన్న సకల జీవరాశుల మంచిని కోరుతూ ప్రార్థిస్తాను’ అంటుంది దేవకీ అమ్మ. అమ్మ చెట్టు దేవకీ అమ్మకు ఇప్పుడు 85 ఏళ్లు. నిజానికి అడివంతా తిరగలేదు. అయినా సరే కొన్ని అడుగులైతే చెట్ల మధ్య వేసి వస్తుంది. పిల్లలు, మనమలు, మునిమనవలు ఎక్కడ ఉన్నా సెలవల్లో తప్పనిసరి గా వచ్చేస్తారు. అందరూ పండగలాగా అడవిలో కొత్త మొక్కలు నాటుతారు. ఈ నేల బతకాలంటే పచ్చగా ఉండాలని వారందరూ గట్టిగా నమ్ముతారు. ‘మా అమ్మ ప్రోత్సాహంతో నేను ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ చదివాను. మా పిల్లల్లో ఒకరిద్దరు బోటనీ స్టూడెంట్స్‌గా మారారు. ఇదంతా అమ్మ చలవే’ అని దేవకీ అమ్మ కుమార్తె ప్రొఫెసర్ టంకమణి అంటుంది. దేవకీ పెంచిన అడవిలోనే రెండు నీటి చెలమలు కూడా ఉన్నాయి. వాటిలో చేపలు ఆ చెట్ల నీడలతో ఆడుకుంటూ ఉంటాయి. ‘మా ఇంటికి వచ్చి చూసిన వారందరూ ఇలాంటి అడవిని పెంచడానికి తమ ఇళ్లల్లో స్థలాల్లో ప్రయత్నిస్తున్నారు. ఇంతకంటే ఏం కావాలి’ అంటుంది దేవకీ అమ్మ. జీవం ఎప్పుడూ బతుకునిస్తుంది. జీవం గురించి జీవం పోస్తే స్త్రీకి కాకుండా ఇంకెవరికి తెలుస్తుంది. ఈ భూమి జీవంతో ఉండాలంటే... ఈ భూమిపై ఉన్నవారు జీవంతో ఉండాలంటే... ఈ భూమిని జీవంతో నింపాలి. అలా నింపే శక్తి చెట్టుకే ఉంది. దేవకీ అమ్మవంటి వారికి ఆ సంగతి తెలుసు. భూమిని నిర్జీవం చేసే కార్యకలాపాలను నియంత్రించుకుంటూ అవసరమైన నేలను మాత్రమే వాడుకుంటూ మిగిలిన నేలను ఎప్పుడూ పచ్చదనంతో నింపుకుంటూ రావాలి మనిషి. దేవకీ అమ్మ వంటి వారు అందుకు ఒక పచ్చటి సందేశంలా నిలుస్తూనే ఉంటారు. అవార్డులు దేవకీ అమ్మ కృషికి, పర్యావరణ ప్రేమకు ఆమెకు ఎన్నో అవార్డులు వచ్చాయి. ప్రతిష్టాత్మక ఇందిరాగాంధీ ‘వృక్షమిత్ర’ పురస్కారం దక్కింది. కేరళ ప్రభుత్వం ‘హరి వ్యక్తి పురస్కారం’తో సత్కరించింది. కేంద్ర ప్రభుత్వం ‘నారిశక్తి అవార్డు’ను బహూకరించింది. వీటన్నింటిని మర్యాద కోసం దేవకీ అమ్మ స్వీకరించింది. నిజానికి ఆమెకు ఒక ఉదయం లేచినప్పుడు కొన్ని పక్షులు వచ్చి తన అడవిలో వాలి కువకువలు వినిపించడమే అతి పెద్ద పురస్కారం. అది ఇచ్చే ఆనందం అనుభవించినవారికే తెలుస్తుంది. – సాక్షి ఫ్యామిలీ -
విజేతలు ఆయుష్, దేవకి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర జూనియర్ ఓపెన్ గోల్ఫ్ టోర్నమెంట్లో ఆయుష్, దేవకి విజేతలుగా నిలిచారు. హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్, డీపీఎస్ సంయుక్తంగా నిర్వహించిన ఈ టోర్నీలో కేటగిరీ- బాలుర విభాగంలో ఆయుష్ శర్మ అగ్రస్థానం సాధించగా... వినయ్ రోహిత్ రన్నరప్‌గా నిలిచాడు. కేటగిరీ-బి బాలికల విభాగంలో దేవకీ రెడ్డి, రాగిణి సైని... బాలుర విభాగంలో నవ్జయ్ జైశ్వాల్, తేజ్ తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ఈ టోర్నీలో నగరానికి చెందిన 25 పాఠశాలల నుంచి మొత్తం 95 మంది చిన్నారులు తలపడ్డారు. ఇతర విభాగాల విజేతల వివరాలు కేటగిరీ- సి బాలురు: 1. శ్రేయస్, 2. విలోక్ గద్వాల్. బాలికలు: 1. స్నేహ సింగ్, 2. ఆరోహి కటారియా. కేటగిరీ-డి బాలురు: 1. ప్రవల్ రెడ్డి, 2. వరుణ్‌దీప్ సింగ్. బాలికలు: 1. అమ్రిత మండవ. కేటగిరీ- ఇ బాలురు: 1. అక్షయ్, 2. వేదాన్ష రావు. బాలికలు: 1. శ్రీహిత మండవ, 2. రమ్య గుప్తా.