
అమరావతి: కాకినాడ జిల్లా కాండ్రేగుల కూరాడ గ్రామంలో యువతి హత్య ఘటనపై సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి దిశ చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించారు. చట్టంలో పేర్కొన్న విధంగా త్వరతిగతిన కేసు విచారణ పూర్తి చేసి, నిర్ణీత సమయంలోగా చార్జిషీటు దాఖలు చేయాలన్నారు. అదే సమయంలో బాధిత కుటుంబానికి తోడుగా నిలవాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు.
కాగా, కాకినాడ జిల్లాలో ఓ యువతి ప్రేమోన్మాదానికి బలైంది. కాకినాడ రూరల్.. కాండ్రేగుల కూరాడ గ్రామంలో దేవకి అనే యువతిని సూర్యనారాయణ అనే యువకుడు ప్రేమించాడు. అయితే దేవకి అతడి ప్రేమను నిరాకరించింది. దీంతో కక్ష పెంచుకున్న సూర్యనారాయణ దేవకి.. కరప నుంచి కూరాడకు స్కూటీపై వస్తుండగా వెంబడించి కత్తితో దాడి చేశాడు. దీంతో దేవకి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు నిందితుడిని అదపులోకి తీసుకొని.. పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment