మార్చి 3 నుంచి ఎంసెట్‌ దరఖాస్తులు | EAMCET applications from March 3 | Sakshi
Sakshi News home page

మార్చి 3 నుంచి ఎంసెట్‌ దరఖాస్తులు

Published Tue, Feb 21 2017 2:25 AM | Last Updated on Tue, Sep 5 2017 4:11 AM

మార్చి 3 నుంచి ఎంసెట్‌ దరఖాస్తులు

మార్చి 3 నుంచి ఎంసెట్‌ దరఖాస్తులు

ఏప్రిల్‌ 3 వరకు ఆన్‌లైన్‌లో స్వీకరణ
మే 12న పరీక్ష.. అదేనెల 22న ర్యాంకుల ప్రకటన

సాక్షి, హైదరాబాద్‌: ఎంసెట్‌–2017 షెడ్యూల్‌ జారీ అయింది. మే 12న నిర్వహించనున్న ఎంసెట్‌కు వచ్చేనెల 3 నుంచి ఏప్రిల్‌ 3వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. సోమవారమిక్కడ జేఎన్‌టీయూహెచ్‌లో జరిగిన ఎంసెట్‌ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఆన్‌లైన్‌ దరఖాస్తుల రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద రూ.250 చెల్లించాలి. ఇతర విద్యార్థులు రూ.500 రిజిస్ట్రేషన్‌ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎంసెట్‌ నిర్వహణ కోసం 25 ప్రాంతీయ సమన్వయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో 6, తెలంగాణలోని ఇతర జిల్లాల్లో 16, ఆంధ్రప్రదేశ్‌లో 3 కేంద్రాలను ఏర్పాటు చేశారు. గతంలో కర్నూలులోనూ సమన్వయ కేంద్రం ఏర్పాటు చేసినా.. ఈసారి ఇవ్వలేదు. మహబూబ్‌నగర్, వనపర్తి సమన్వయ కేంద్రాలు సమీపంలోనే ఉండటం, కర్నూలులో పరీక్ష రాసే వారి సంఖ్య తక్కువగా ఉన్నందున అక్కడ కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదని విలేకరుల సమావేశంలో పాపిరెడ్డి తెలిపారు.

ఈసారి కొత్తగా నిర్మల్, భువనగిరి, శంషాబాద్, పెద్దపల్లిలో సమన్వయ కేంద్రా లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. హైదరాబాద్‌లో 2 జోనల్‌ కేం ద్రాలను తగ్గించినట్లు పేర్కొ న్నారు. గతేడాది ఎంసెట్‌ లీకేజీ నేపథ్యంలో ప్రశ్నపత్రాల ముద్రణ, పరీక్షల నిర్వహణలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుం టున్నట్లు వెల్లడిం చారు. సమావేశంలో ఎంసెట్‌ కమిటీ చైర్మన్, జేఎన్‌టీయూహెచ్‌ వీసీ ప్రొఫెసర్‌ వేణుగోపాల్‌రెడ్డి, ఉన్నత విద్యా మండలి వైస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎస్‌.మల్లేశం, ఎంసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ యాదయ్య, కో కన్వీనర్‌ ప్రొఫెసర్‌ మంజూర్, ఈసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ గోవర్ధన్, కో–కన్వీనర్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆయుష్‌పై ఆరోగ్య శాఖకు లేఖ రాస్తాం
నీట్‌ పరిధిలోకి ఆయుష్‌ కోర్సులు వెళ్లే విషయంలో తమకు అధికారికంగా ఎలాంటి సమాచారం రాలేదని పాపిరెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌ కోర్సుల తోపాటు ఆయుష్‌ (ఆయుర్వేద, యునానీ, హోమియోపతి, నేచురోపతి, యోగా) కోర్సులకు ఎంసెట్‌ చేపడుతున్నామన్నారు. ఆయుష్‌పై స్పష్టత కోసం వైద్య ఆరోగ్య శాఖకు లేఖ రాస్తామన్నారు. ఈ కోర్సుల్లో ప్రవేశాలకు నీట్‌ నిర్వహిస్తారా? తాము ఎంసెట్‌ నిర్వహించాలా? అన్న అంశాన్ని అడుగుతామని, వారి నుంచి వచ్చే వివరణను బట్టి తదుపరి చర్యలు చేపడతామన్నారు.

పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుతించబోమని, విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ఈసారి గంట ముందు నుంచే విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని పేర్కొన్నారు. సందేహాల నివృత్తి కోసం హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలా? వద్దా? అన్నది తర్వాత నిర్ణయిస్తామన్నారు. మే నెలాఖరుకల్లా కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సూచించామని, ఈసారి త్వరగా ప్రవేశాలు చేపట్టి జూలై 1 నుంచి తరగతులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. 2018 నుంచి జాతీయ స్థాయి పరీక్షల ద్వారా ప్రవేశాలపై కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలతో మాట్లాడాల్సి ఉంటుందన్నారు.

భవిష్యత్‌లో ఆన్‌లైన్‌ పరీక్షలు
భవిష్యత్‌లో ప్రవేశ పరీక్షలను ఆన్‌లైన్‌లో చేప ట్టేందుకు అవసరమైన చర్యలు చేపడతామని జేఎన్‌టీయూహెచ్‌ వీసీ వేణుగోపాల్‌రెడ్డి తెలి పారు. గతేడాది అగ్రికల్చర్‌ ఎంసెట్‌ను ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌లో నిర్వ హించినా... ఈసారి ఆఫ్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నట్లు చెప్పా రు. ఏపీలో అన్ని పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వ హించేందుకు చర్యలు చేపట్టారని, అక్కడి ఫలి తాలను పరిశీలించి, భవిష్యత్‌లో అవసర మైన ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈసారి ఈసెట్, పీజీఈసెట్‌ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహిం చేందుకు చర్యలు చేపట్టామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement