సిద్దిపేటజోన్: ప్రభుత్వం ఆయుష్ విభాగాన్ని బలోపేతం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని, ఆయుర్వేద వైద్య సేవలను మరింతగా విస్తృతం చేసి దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉండేలా చూస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.
ఆదివారం ఆయన సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పోలీసు కన్వెన్షన్ హాల్‌లో ఆయుష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సమావేశంతోపాటు పలు ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు ఆయుర్వేద వైద్యాన్ని నిర్లక్ష్యం చేశాయని అన్నారు. గతంలో కేవలం 400 మంది వైద్యులను నియమిస్తే, తెలంగాణ ప్రభుత్వం ఒకేసారి 1,200 మందిని నియమించిందని పేర్కొన్నారు.
జీవనధార మాకు జీవం అయింది..
ఆయుష్ ఆధ్వర్యంలో కరోనా సమయంలో తయా రుచేసిన జీవనధార ఔషధం తమకు జీవం అయిందని, సీఎం కేసీఆర్‌తోపాటు తానుకూడా జీవనధా ర మందును కరోనా సమయంలో నిత్యం వాడానని హరీశ్‌రావు తెలిపారు.
ఆయుర్వేద వైద్య సేవలను మరింతగా విస్తరించడానికి త్వరలో సిద్దిపేట, భూ పాలపల్లి, వికారాబాద్ జిల్లాల్లో 50 పడకల ఆసుపత్రులను ఏర్పాటుచేసే ఆలోచనలో ఉన్నట్టు తెలిపా రు. అలాగే సిద్దిపేట మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఆయుర్వేద ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. జిందాల్ ప్రకృతి చికిత్సాలయం తరహా లో వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి హిల్స్‌లో ఔ షధమొక్కలతో ఆయుర్వేద ఔషధాలను తయారు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తెలంగాణ విద్యార్థులకు అన్యాయం
రాష్ట్రవ్యాప్తంగా పల్లె దవాఖానాల నిర్మాణం కోసం చర్యలు తీసుకుంటామని మంత్రి హరీశ్ చెప్పారు. ఇందులో భాగంగా రెండు వేల పల్లె దవాఖానాల నిర్మాణం కోసం అనుమతులు ఇచ్చి నట్టు వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో జరిగిన ఒప్పందం వల్ల తెలంగాణ ప్రాంత విద్యార్థులకు అన్యాయం జరుగుతోందన్నారు.
ఇక్కడి మెడికల్ కళాశాలల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఉమ్మడి ఒప్పందం ద్వారా అడ్మిషన్లు తీసుకుంటున్నారని, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చి న 21 మెడికల్ కళాశాలల్లో అడ్మిషన్లు కేవలం తెలంగాణ విద్యార్థులకు ఉండేలా జీఓ తెస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఒకప్పటి జర్నలిజానికి, ఇప్పటి జర్నలిజానికి చాలా తేడా ఉందని మంత్రి అన్నారు. తెలంగాణ దళిత జర్నలిస్టులకు దళితబంధు ఇస్తామని చెప్పారు.
కోమటి చెరువు సూపర్
హరీశ్‌కు సహచర మంత్రుల అభినందన
సిద్దిపేటజోన్: సిద్దిపేట కోమటి చెరువు చాలా బాగుందని.. సహచర మంత్రి హరీశ్ రావు చిత్తశుద్ధి, పట్టుదలకు ఇది నిదర్శనమని రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు కితాబిచ్చారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గ్యాదరి కిషోర్, రసమయి బాలకిషన్, క్రాంతి కిరణ్ పర్యటించారు.
ఈ సందర్భంగా వారంతా కోమటి చెరువును సందర్శించారు. తీగల వంతెన, నెక్లెస్ రోడ్, గ్లో గార్డెన్, సింథటిక్ ట్రాక్‌ను తిలకించారు. వారికి మంత్రి హరీశ్ రావు అభివృద్ధి పనుల గురించి వివరించారు. వారి వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ విజిత వేణుగోపాల్ రెడ్డి, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు సాయిరాం తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment