సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పకడ్బందీగా ఆరోగ్య పథకం(హెల్త్ స్కీం) అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వైద్య, ఆరో గ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం టీఎన్జీఓ గౌరవాధ్యక్షుడు దేవీ ప్రసాద్ ఆధ్వర్యంలో ఉద్యోగులు, పెన్షనర్లు మంత్రి హరీశ్‌రావును కలిశారు. ఉద్యోగుల హెల్త్ స్కీం, ఇతర సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఖ్యాతి గడించిందని, ఉద్యో గులు, పెన్షనర్ల అన్ని సమస్యలు పరిష్కరించేందుకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ఎంప్లాయీ హెల్త్ స్కీం (ఈహెచ్‌ఎస్)ను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల ప్రతినిధులు సభ్యులుగా ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలి పారు.
ఈ స్కీమ్ ద్వారా అత్యున్నత వైద్య సేవలు ఎలాంటి అంతరాయం లేకుండా అందుబాటులోకి వస్తాయ న్నారు. కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదలలో మొండి వైఖరి ప్రదర్శి స్తున్నప్పటికీ సీఎం కేసీఆర్ రాష్ట్ర అభి వృద్ధి, సంక్షేమంపై చిత్తశుద్దితో ఉన్నార న్నారు. మంత్రిని కలసిన వారిలో రిటై ర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షు డు దామోదర్ రెడ్డి, కార్యదర్శి చంద్ర శేఖర్ తదితరులున్నారు.
ఇబ్బందులు తొలగిస్తామన్నారు..
అన్ని ఆస్పత్రుల్లో నగదు రహిత ఈహెచ్ ఎస్ కార్డుల అమలుకు త్వరలోనే కమి టీని ఏర్పాటు చేసి, ఇబ్బందులు తొల గిస్తామని మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారని తెలంగాణ ప్రభుత్వ పెన్షన్ దారుల సంయుక్త కార్యాచరణ కమిటీ చైర్మన్ లక్ష్మయ్మ, ప్రధాన కార్యదర్శి సుభాకర్ తెలిపారు. ఈ మేరకు వారు శుక్రవారం హరీశ్‌ను కలసి వినతి పత్రం సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment