
సాక్షి, అమరావతి: ఏపీ ప్రభుత్వం తొలిసారిగా గిరిజన విద్యార్థులకు ఆయూష్‌లో పీజీ సీట్లలో చోటు కల్పించింది. గత ఐదేళ్లలో ఆయూష్ పీజీ సీట్లలో గిరిజన (ఎస్టీ) రిజర్వేషన్లు అమలు కాలేదు. ఇదే విషయాన్ని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడలో ఒక సీటు, తిరుపతి కళాశాలలో రెండు సీట్లను గిరిజనులకు కేటాయించింది. ప్రభుత్వ నిర్ణయంపై గిరిజన మెడికల్ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment