ST reserve
-
అరకు పార్లమెంట్లో బీజేపీకి గడ్డు పరిస్థితి..!
అరకు పార్లమెంట్ పరిధిలో ఏమాత్రం క్యాడర్‌లేని బీజేపీ ఈ ఎన్నికల్లో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్లే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2019 ఎన్నికల్లో నేరుగా పోటీచేస్తే కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చినా ఓటమి తప్పలేదు.వైఎస్సార్సీపీ 2014 ఎన్నికల్లో 91,398 ఓట్లు, 2019లో 2,23,999 ఓట్ల ఆధిక్యతతో అరకు ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ పరిస్థితుల్లో కూటమి తరఫున బీజేపీ అభ్యర్థగా పోటీచేస్తున్న కొత్తపల్లి గీతకు మిగతా పార్టీల శ్రేణుల నుంచి సహకారం లభించే పరిస్థితి కానరావడం లేదు. రంపచోడవరం: అరకు పార్లమెంట్ పరిధిలో ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలు పాలకొండ, కురుపాం, సాలూరు, అరకువేలీ, పాడేరు, రంపచోడవరంతో పాటు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం పార్వతీపురం ఉంది. వైఎస్సార్ సీపీ పార్టీ ఆవిర్భావం నాటి నుంచి గిరిజనులు జగన్మోహన్రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారు. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థులను ఆఖండ మెజారిటీతో గెలిపించారు. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి తరఫున అరకు ఎంపీ సీటును బీజేపీకి కేటాయించారు. గత రెండు దఫాల ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే ఆ పార్టీ పరిస్థితి దయనీయంగానే ఉందని రాజకీయ పరిశీలకులు విశ్లే స్తున్నారు. ఈ పరిస్థితుల్లో అభ్యర్థి కొత్తపల్లి గీతకు వ్యతిరేకంగా గిరిజన సంఘాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. గిరిజన వ్యతిరేకి అయిన ఆమెను ఓడించాలని పిలుపునిస్తున్నాయి. కూటమిపైనే ఆశలు.. అరకు పార్లమెంట్ పరిధిలో బీజేపీకి సొంత బలం లేకపోయినా సీట్లు సర్దుబాటులో భాగంగా టికెట్ దక్కంచుకున్నా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ పార్లమెంట్‌లోని అసెంబ్లీల పరిధిలో ఆ పార్టీకి పెద్దగా క్యాడర్ కూడా లేదు. టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్నా ఆ పార్టీ శ్రేణులు సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. 2014లో వైఎస్సార్సీకి 91,398 ఓట్ల ఆధిక్యత.. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ 4,13,191 ఓట్లు దక్కించుకుని విజయం సాధించింది. టీడీపీ, బీజేపి ఉమ్మడి అభ్యరి్థకి 3,21,793 ఓట్లు, కాంగ్రెస్‌కు 52,884 ఓట్లు వచ్చాయి. వైఎస్సార్సీపీ అభ్యరి్థకి 91,398 ఓట్ల మెజారిటీ వచ్చింది. రెండు పార్టీల ఓట్లు కలిపితే 3,74,677 ఓట్లు వచ్చాయి. ఇలా రెండింటిని కలిపినా వైఎస్సార్సీకి 38,514 ఓట్ల ఆధిక్యత ఉంది. 2019లోనూ 2,23,999 ఓట్ల మెజారిటీ.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఎటువంటి పొత్తులు లేకుండా ఒంటరిగా ఎన్నికల బరిలో నిలవగా కేవలం 17,867 ఓట్లు మాత్రమే సాధించింది. అంటే నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. వైఎస్సార్ సీపీ 5,62,190 ఓట్లు సాధించగా టీడీపీకి 3,38,101, జనసేనకు 42,794 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ 2,24,089 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. ఈ రెండు దఫాల ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే బీజేపీకి సొంత బలం లేనట్టేనని స్పష్టమవుతోంది. బలమైన పార్టీగా.. అరకు పార్లమెంట్ పరిధిలోని గ్రామాల్లో వైఎస్సార్సీపీ గ్రామస్థాయిలో మరింత పటిష్టంగా ఉంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో అరకు పార్లమెంట్ పరిధిలో ఒక అసెంబ్లీ స్థానం మినహా అన్నింటిని కైవసం చేసుకుంది. 2019 ఎన్నికల్లో అన్ని అసెంబ్లీ స్థానాలను దక్కించుకుని క్షేత్రస్థాయిలో మన్యంలో బలమైన పునాది వేసింది. కూటమి క్యాడర్ చెల్లాచెదురు అరకు పార్లమెంట్ పరిధిలోని రంపచోడవరం, అరకువేలీ, పాడేరు నియోజకవర్గాల్లో టీడీపీ, బీజేపీ, జనసేన (కూటమి) పార్టీల క్యాడర్ వర్గపో రు కారణంగా చెల్లాచెదురైంది. టీడీపీ విషయానికొస్తే రెండుగా చీలిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో కూటమి ఎంపీ అభ్యర్థి (బీజేపీ) కొత్తపల్లి గీతకు ఎంతవరకు సహకరిస్తారనేది ప్రశ్నార్థకమే. ♦ అరకు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీకి చెందిన ఇద్దరు సీనియర్ నాయకులు సివేరి అబ్రహం, సియ్యారి దొన్నుదొర తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. దీనివల్ల ఆ పార్టీ ఉనికి కోల్పోయే పరిస్థితి ఎదుర్కొంటోంది. ♦ పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆ పార్టీ అధిష్టానంపై కారాలు మిరియాలు నూరుతున్నారు. రెబల్‌గా పోటీచేసి అమీతుమీ తేల్చుకుంటానని ఆమె ఇప్పటికే హెచ్చరించారు. ♦ రంపచోడవరం అసెంబ్లీ మిరియాల శిరీషాదేవికి టికెట్ కేటాయింపు నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు అరకు ఎంపీ బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీతపై గుర్రుగా ఉన్నారు. ఈ టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరితోపాటు మరో మాజీ ఎమ్మెల్యే కూడా ఆశించారు. వీరి కాకుండా పారీ్టలోకి కొత్తగా వచ్చిన మిరియాల శిరీషా దేవికి టికెట్ కేటాయింపుపై వారు జీర్ణించుకోలేకపోతున్నారు. శిరీషకు సహకరించేది లేదని వారి అనుచరులు ఇప్పటికే ప్రకటించారు. కూటమి అభ్యర్థికి అరకు, పాడేరు, రంపచోడవరంలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. -
గిరిజన విద్యార్థులకు ఏపీ సర్కారు తీపికబురు
సాక్షి, అమరావతి: ఏపీ ప్రభుత్వం తొలిసారిగా గిరిజన విద్యార్థులకు ఆయూష్‌లో పీజీ సీట్లలో చోటు కల్పించింది. గత ఐదేళ్లలో ఆయూష్ పీజీ సీట్లలో గిరిజన (ఎస్టీ) రిజర్వేషన్లు అమలు కాలేదు. ఇదే విషయాన్ని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడలో ఒక సీటు, తిరుపతి కళాశాలలో రెండు సీట్లను గిరిజనులకు కేటాయించింది. ప్రభుత్వ నిర్ణయంపై గిరిజన మెడికల్ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఎస్టీలకే దక్కిన పీఠం..
సాక్షి, కొత్తగూడెం: జిల్లాల పునర్విభజన తరువాత ఆవిర్భవించనున్న సరికొత్త జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం ఎస్టీ జనరల్‌కు రిజర్వ్ అయింది. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పటికీ రెండున్నర సంవత్సరాలుగా జిల్లా, మండల పరిషత్‌లు ఉమ్మడిగానే ఉన్నాయి. ప్రస్తుత పాలకవర్గాల పదవీ కాలం ముగుస్తుండడంతో కొత్త జిల్లాల ప్రాతిపదికన ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ తగిన ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాల పునర్విభజనలో భాగంగా ఖమ్మం ఉమ్మడి జిల్లా నుంచి విడిపోయినప్పటికీ మరికొన్ని మండలాలు మహబూబాబాద్, ములుగు జిల్లాల్లోకి వెళ్లాయి. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 23 మండలాలు ఉండగా, వాటిలో భద్రాచలం, కొత్తగూడెం మండలాలు పూర్తిగా మున్సిపాలిటీ పరిధిలోకి వస్తున్నాయి. మిగిలిన 21 మండలాల జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాలకు, ఆయా మండలాల పరిధిలోని మండల ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి జెడ్పీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేశారు. జిల్లాలో మొత్తం 21 మండలాలకు గాను జెడ్పీటీసీలు ఎస్టీ జనరల్‌కు 05, ఎస్టీ మహిళలకు 05 కేటాయించారు. జనరల్ 05, జనరల్ మహిళకు 06 రిజర్వ్ చేశారు. మొత్తం మహిళలకు 11 రాగా, జనరల్‌కు 10 వచ్చాయి. బీసీ, ఎస్సీలకు ఒక్క జిల్లా ప్రాదేశిక నియోజకవర్గం కూడా కేటాయించలేదు. ఇక మండల పరిషత్ అధ్యక్ష పదవుల్లో ఎస్టీ జనరల్‌కు 09, ఎస్టీ మహిళలకు 09, జనరల్‌కు 01, జనరల్ మహిళకు 01, ఎస్సీ మహిళకు 01 కేటాయించారు. ఎంపీపీ పదవుల్లో మహిళలకు 11, జనరల్‌కు 10 వచ్చాయి. వీటిలో ఎస్టీ కోటాలోనే మొత్తం 18 ఎంపీపీలు వచ్చాయి. బీసీలకు ఒక్క ఎంపీపీ కూడా రాలేదు. జెడ్పీటీసీలపైనే అందరి దృష్టి.. మండల ప్రజాపరిషత్‌లు సింహభాగం ఎస్టీలకు రిజర్వు కావడంతో జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాలపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. 21 జెడ్పీటీసీల్లో 10 ఎస్టీలకు రిజర్వు కాగా, 11 జెడ్పీటీసీలు జనరల్‌కు వచ్చాయి. వీటిల్లో 05 జనరల్, 06 జనరల్ మహిళలకు కేటాయించారు. జిల్లాలో గత ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో విపక్ష కాంగ్రెస్ పార్టీ కూటమి విజయం సాధించింది. దాదాపు అన్ని మండలాల్లోనూ ఓట్లపరంగా ఆధిక్యం సాధిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో విపక్షాలు ఈ ఎన్నికలపై పకడ్బందీగా దృష్టి పెట్టాయి. అయితే తరువాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ హవా నడిచింది. సింహభాగం పంచాయతీలను గులాబీ పార్టీ మద్దతుదారులు గెలుచుకున్నారు. దీంతో టీఆర్ఎస్లోనూ జోష్ వచ్చింది. ఇక భద్రాద్రి జిల్లాలో వామపక్షాలు స్థానికంగా గట్టి ప్రాబల్యం కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో వామపక్షాలు సైతం తగినన్ని జెడ్పీటీసీలు, మండల పరిషత్‌లు గెలుచుకునేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. జిల్లా ప్రజా పరిషత్ పీఠం సాధించేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 11 సాధించే విషయంలో ప్రతి జెడ్పీటీసీ స్థానం కీలకమే. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పీఠం కోసం సైతం పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డనున్నాయి. ఇక మండల ప్రజాపరిషత్‌ల అధ్యక్ష పదవుల విషయంలో రాజకీయం మరింత రసవత్తరంగా ఉండనుంది. కొన్ని మండలాల్లో 4 ఎంపీటీసీ స్థానాలు, మరొకొన్ని మండలాల్లో 5 ఎంపీటీసీలు ఉన్నాయి. ఇలాంటి చోట్ల ఒక్క ఎంపీటీసీ గెలుచుకున్నవారు సైతం ఎంపీపీ రేసులో ముందు వరుసలో ఉండే అవకాశాలు ఉన్నాయి. దీంతో జిల్లా, మండల పరిషత్‌ల పోరు రసవత్తరంగా మారనుంది. జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాల జనాభా, రిజర్వేషన్లు.. మండలం మొత్తం జనాభా జెడ్పీటీసీ స్థానాలు రిజర్వేషన్ ఆళ్లపల్లి 12268 1 ఎస్టీ జనరల్ అన్నపురెడ్డిపల్లి 21130 1 జనరల్ మహిళ చండ్రుగొండ 27911 1 జనరల్ చర్ల 42947 1 ఎస్టీ మహిళ చుంచుపల్లి 42290 1 జనరల్ దుమ్ముగూడెం 46802 1 ఎస్టీ జనరల్ గుండాల 15857 1 ఎస్టీ మహిళ జూలూరుపాడు 33395 1 ఎస్టీ మహిళ కరకగూడెం 15221 1 ఎస్టీ జనరల్ లక్ష్మీదేవిపల్లి 38093 1 జనరల్ మహిళ మణుగూరు 40026 1 జనరల్ ములకలపల్లి 34794 1 ఎస్టీ జనరల్ పాల్వంచ 33673 1 జనరల్ పినపాక 33155 1 జనరల్ మహిళ టేకులపల్లి 47879 1 ఎస్టీ జనరల్ ఇల్లందు 57302 1 ఎస్టీ మహిళ అశ్వాపురం 43067 1 జనరల్ మహిళ బూర్గంపాడు 36910 1 జనరల్ మహిళ దమ్మపేట 58444 1 జనరల్ సుజాతనగర్ 27989 1 ఎస్టీ మహిళ మొత్తం 768805 21 -
ఆ ఊళ్లో ఎన్నికల్లేవు.!
సాక్షి, ఆసిఫాబాద్: కొత్త పంచాయతీలుగా ఏర్పడిన సంబరం ఆ గ్రామస్తులకు లేకుండా పోయిం ది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ సర్పంచ్ పదవి లేకుండా పోతోంది. చిన్న చిన్న గ్రామ పంచాయతీలు ఏర్పడిన ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులే పూర్తిగా ఉండి అసలు గిరిజనులే లేని పంచాయతీల్లో ఎన్నికలు నిలిచిపోనున్నా యి. రెండో విడత ఎన్నికలు జరిగే 107 పం చాయతీల్లో రెండు గ్రామాలు ఎన్నికలకు దూరంగా ఉండనున్నాయి. అలాగే మూడో విడత ఎన్ని కలు జరిగే 114 గ్రామ పంచాయతీల పరిధిలో ఒక పంచాయతీ ఎన్నికలకు ఆటంకం కలుగుతోంది. ఈ మూడు పంచాయతీ పరిధిలోనూ ఒకటే సమస్య. ఆ గ్రామ పంచాయతీలు ఎస్టీలకు రిజర్వు అయినప్పటికీ ఒక్క ఎస్టీ ఓటరు లేకపోవడమే. పూర్తిగా ఏజెన్సీ ప్రాంతంలో ఉండడంతో భవిష్యత్‌లోనూ ఈ రిజర్వేషన్లు మార్చే అవకాశం తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఈ గ్రామాలకు సర్పంచ్ ఎన్నికల జరుగుతాయా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒక్క ఎస్టీ లేరు... పంచాయతీలు ఎస్టీలకు రిజర్వు కావడంతో పోటీ చేసేందుకు అసలు అభ్యర్థులే లేకపోవడం సమస్యగా మారింది. జిల్లాలో మొత్తం 334 గ్రామ పంచాయతీలు ఉండగా ఇందులో షెడ్యూ ల్డ్ ఏరియా పరిధిలో ఉన్నవి 162. 164 నాన్ షెడ్యూల్డ్ ఏరియా పరిధిలోఉండగా, మరో ఎని మిది వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న పంచాయతీలుగా ఏర్పడ్డాయి. ఈ మొత్తం పంచాయతీల్లో మూడు విడతలుగా ఎన్నికలు జరుగుతన్న విషయం తెలిసిందే. అయితే రెండో విడత ఎన్నికలు జరిగే ఆసిఫాబాద్ మండలం రహపల్లి, వెంకటపూర్ గ్రామ పంచాయతీలు ఎస్టీ రిజర్వు కాగా వీటిలో ఒక్క ఎస్టీ కూడా లేకపోవడంతో కనీసం సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేసేందుకు ఒక్క అభ్యర్థి కూడా లేకుండా పోయారు. అలాగే మూడో విడత ఎన్నికలు జరిగే వాంకిడి మండలం తేజపూర్ గ్రామ పంచాయతీలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ కూడా సర్పంచు స్థానానికి పోటీ చేసేందుకు ఎస్టీలు కరువయ్యారు. గతంలో ఈ మూడు పంచాయతీలు పాత పంచాయతీల్లో ఉండగా గిరిజనులు ఉండేవారు. కొత్తగా ఏర్పడిన ఈ పంచాయతీల్లో ఒక్క ఎస్టీ ఓటరు కూడా లేరు. దీంతో సర్పంచ్ ఎన్నిక లేకుండా పోయిం ది. ఈ మూడు పంచాయతీల్లో ఎనిమిది చొప్పున వార్డులు ఉన్నాయి. వీటిలో వెం కటపూర్ గ్రామస్తులు ఎస్టీ రిజర్వేషను వచ్చినందుకు నిరసనగా పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తు తీర్మానం చేశారు. మూడు వార్డులకు జనరల్‌కు రిజర్వు అయినప్పటికీ నామినేషన్లు ఎవరూ వేయలేదు. దీంతో ఇక్కడ పూర్తిగా ఎన్నికలే జరిగే అవకాశం లేకుండా పోయింది. ఇక రహపల్లి, తేజపూర్‌లో ఎనిమిదింటిలో ఒక్కో పంచాయతీలో నాలుగు జనరల్ స్థానాలకు చొప్పున కావడంతో ఈ వార్డులకు నామినేషన్లు రావడంతో ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని పంచాయతీ అధికారులు చెబుతున్నారు. ఈ రెండు పంచాయతీల్లో నాలుగింటిలో ఎన్నిక జరిగితే ఒక ఉప సర్పంచ్ ఎన్నిక జరిగే అవకాశముంది. ఉపసర్పంచ్ కోసం భారీ పోటీ.. ఎలాగు సర్పంచ్ అభ్యర్థులు లేకపోవడంతో వార్డు మెంబర్లుగా పోటీ చేసి ఉప సర్పంచ్‌గానైనా గ్రామంలో చక్రం తిప్పుదామని కొంత మంది ఆశావావహులు ఆరాట పడుతున్నారు. ఇందు కోసం తనతో పాటు మరో ఇద్దరు వార్డు సభ్యులను తన వైపు చేర్చుకుంటే ఉపసర్పంచ్ పదవి దక్కే అవకాశముందని భావించి ప్రయత్నాలు మొదలుపెట్టారు. సర్పంచ్ పదవి ఎలాగు దక్కే అవకాశం లేకపోవడంతో ఉపసర్పంచ్ పదవి కైవసం చేసుకునేందుకు బేరాసారాలు ప్రారంభమైనట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. మార్చాలని కోరాం మా గ్రామంలో ఒక్కరు కూ డా ఎస్టీ ఓటరు లేరు. కాని పంచాయతీ ఎన్నికల్లో ఎస్టీకి రిజర్వు అయింది. దీనిపై కలెక్టర్‌ను కలిసి రిజర్వేషన్ మార్చాలని కోరాం. అయితే ఎస్టీ రిజర్వేషన్ మార్పు మా పరిధిలో లేదని తెలిపారు. దీంతో భవిష్యత్‌లో ఎన్నికలు జరుగుతాయా అనేది అనుమానంగా ఉంది. – చెండి సోమేశ్వర్, మాజీ ఎంపీటీసీ, గాట్ జనగాం, తేజపూర్ ఒక్క ఎస్టీ ఓటరు లేరు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇక్కడ గిరిజనులు ఎవరూ లేరు. అయితే పంచాయతీ ఎన్నికల్లో మాత్రం బీసీలు అధికంగా ఉన్న పంచాయతీలో ఎస్టీకి రిజర్వుకావడంతో సర్పంచ్‌ను ఎన్నుకోలేక పోతున్నాం. రిజర్వేషను మార్చాలి. – చౌదరి శంకర్, తేజపూర్ జనాభా ప్రకారం కేటాయించాలి మా గ్రామంలో ఎస్టీలు ఎవరూ లేకున్నా సర్పంచ్ ఆ కేటగిరికి రిజర్వు అయింది. దీంతో మేం సర్పంచ్‌ను ఎన్నుకోలేకపోతున్నాం. గ్రామంలో ఉన్న ప్రస్తుత జనాభా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలి. – పెద్దపల్లి సంతోశ్, రహపల్లి, ఆసిఫాబాద్. -
పాపం ఎమ్మెల్యే...
పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది...నువ్వైతే ఎమ్మెల్యే అయిపోయావు... మా పరిస్థితి అర్థం అయితలేదని నల్లగొండ జిల్లాకు చెందిన ఓ నియోజకవర్గం టీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నేత ఒకాయన ఎమ్మెల్యేపై నిష్టూరమాడుతున్నారు. పార్టీ విజయం కోసం కష్టపడ్డావు కాదనలేని సత్యం, అందుకే కదా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి నీకే రిజర్వు చేసింది...ఆ పదవి నీకే రాసిపెట్టుకో అని ఎమ్మెల్యే ఊరడించారు. రేపు మాపూ అంటూ ఊరిస్తున్న మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులకు రిజర్వేషన్లు అంటూ ప్రభుత్వం జీవో ఇచ్చేసరికి ఎమ్మెల్యేకు ముచ్చెమటలు...ఏం చేయాలో పాలుపోవడం లేదు. నియోజకవర్గంలో ముఖ్య నేతకు ఇస్తానని ఆశపెట్టిన పదవి ప్రభుత్వం ఎస్టీకి రిజర్వు చేసింది. భూతద్దం పెట్టి వెతికినా ఆ నియోజకవర్గంలో ఎస్టీ నేత కనిపించలేదు. తమకు పదవి వస్తే ఎక్కడ బలపడిపోతామో అని ఎస్టికి రిజర్వు అయ్యేలా ఎమ్మెల్యే పావులు కదిపారంటూ నియోజకవర్గం నేతలు మండిపడుతున్నారు...పాపం ఎమ్మెల్యే.