సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. రాష్ట్రంలోని ఆయుష్ విభాగంలో మెడికల్ ఆఫీసర్ల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆయుష్‌లో మొత్తం 156 ఖాళీలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానించనున్నట్టు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కాగా, అభ్యర్థులు ఆగస్టు 7న ఉదయం 10.30గంటల నుంచి నుంచి 22న సాయంత్రం 5 గంటలవరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొంది. అయితే, మొత్తం 156 ఉద్యోగాల్లో.. మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేదం) 54; హోమియో 33, యునాని 69 చొప్పున ఖాళీలు ఉన్నాయి. సంబంధిత విభాగాల్లో డిగ్రీ పాసైన వారు ఈ పోస్టులకు అర్హులు.
- అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మించరాదు.
- దరఖాస్తు రుసుం రూ.500.
- ప్రాసెసింగ్ ఫీజు రూ.200లుగా నిర్ణయించారు.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు ప్రాసెసింగ్ పీజు నుంచి మినహాయించారు. పూర్తి వివరాలను నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment