![Sebi has barred Knowledge Research Institute - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2022/11/26/KRI-SEBI.jpg.webp?itok=9AS07lqS)
న్యూఢిల్లీ: అనధికార పెట్టుబడి సలహాలు ఇస్తున్న కారణంగా నాలెడ్జ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(కేఆర్‌ఐ)తోపాటు సంస్థ యజమాని ఆయుష్ ఝవార్‌పై క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కన్నెర్ర చేసింది. ఆరు నెలలపాటు సెక్యూరిటీల మార్కెట్ల నుంచి నిషేధించింది. కేఆర్‌ఐ, ఆయుష్‌లకు సెబీ 2021 జులైలో షోకాజ్ నోటీసులను జారీ చేసింది.
తదుపరి తాజా ఆదేశాలు జారీ చేసింది. సెబీ నుంచి సర్టిఫికెట్ పొందకుండానే కేఆర్‌ఐ, ఆయుష్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వయిజరీ సర్వీసులను అందించడం ద్వారా అడ్వయిజరీ నిబంధనలను అతిక్రమించాయి. దీంతో సెబీ తాజా చర్యలను చేపట్టింది. సలహాల ద్వారా ఫీజు రూపేణా ఆర్జించిన రూ. 27.57 లక్షలను 3 నెలల్లోగా వాపస్ చేయవలసిందిగా సెబీ ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment