21న విజయవాడలో యోగాసనాల పోటీలు | International Yoga Day On 21 June At Vijayawada | Sakshi
Sakshi News home page

21న విజయవాడలో యోగాసనాల పోటీలు

Published Tue, May 31 2022 5:49 AM | Last Updated on Tue, May 31 2022 10:40 AM

International Yoga Day On 21 June At Vijayawada - Sakshi

సాక్షి, అమరావతి: జూన్‌ 21న 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయుష్‌ విభాగం రాష్ట్ర వ్యాప్తంగా యోగాసనాల పోటీలను నిర్వహిస్తున్నట్టు కమిషనర్‌ రాములు తెలిపారు. 8 ఏళ్లు పైబడిన వారందరూ పోటీల్లో పాల్గొనడానికి అర్హులని వెల్లడించారు. ఎంపిక చేసిన 16 ఆసనాలలో 8 ఆసనాలను వేయగలిగిన వారు సంబంధిత ఫోటోలను advyoga2022@gmail.comకు మెయిల్‌ చేయాలన్నారు.

ఫొటోతో పాటు పేరు, వయస్సు, ఆధార్‌ నెంబర్, చిరునామా, కాంటాక్ట్‌ ఫోన్‌ నెంబర్‌ వివరాలను జత చేయాలన్నారు. జూన్‌ 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా ఫొటోలు పంపాల్సి ఉంటుందన్నారు. పంపిన ఫోటోలను ప్రాథమికంగా పరిశీలించిన అనంతరం ఎంపికైన వారు జూన్‌ 10న న్యాయ నిర్ణేతల సమక్షంలో అవే ఆసనాలను ఆన్‌లైన్‌లో వేయాలన్నారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి జూన్‌ 21న విజయవాడలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనే అవకాశం కల్పిస్తామన్నారు. వివరాల కోసం 9441014521 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement