nirabh Kumar Prasad
-
ఏపీపీఎస్సీలో మార్పులకు కమిటీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో మార్పులు చేపట్టేందుకు అవసరమైన అంశాలపై అధ్యయనం కోసం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ అధ్యక్షుడిగా ఏడుగురు ఉన్నతాధికారులతో ప్రభుత్వం కమిటీని నియమించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరు ఇతర రాష్ట్రాల్లోని సర్వీస్ కమిషన్స్లో అనుసరిస్తున్న విధానాలు, వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ల జారీ తదితర అంశాలపై అధ్యయనం చేసి ఈనెల 30వ తేదీ నాటికి నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 19 నుంచి ఆయుష్ పోస్టులకు సర్టిఫికెట్ల పరిశీలనఆయుష్ విభాగంలో ఆయుర్వేద, హోమియో మెడికల్ ఆఫీసర్ల పోస్టులకు నిర్వహించిన పరీక్షల్లో విజయం సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్లను ఈనెల 19 నుంచి పరిశీలించనున్నట్టు ఏపీపీఎస్సీ కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో నిర్వహించిన వెరిఫికేషన్ సమయంలో ఆలస్యాన్ని నివారించేందుకు 1: 3 నిష్పత్తిలో అభ్యర్థులను పిలుస్తున్నట్టు పేర్కొన్నారు. అభ్యర్థుల మెరిట్ లిస్టును కమిషన్ వెబ్సైట్లో ఉంచామని, ఈనెల 19, 20 తేదీల్లో అభ్యర్థులు విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో హాజరు కావాలని సూచించారు. -
AP: భారీగా ఐఏఎస్‌ల బదిలీలు..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 62 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్ ప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. కేరళ కేడర్‌కు చెందిన మైలవరపు కృష్ణతేజను పంచాయతీరాజ్–గ్రామీణీభివృద్ధి శాఖ డైరెక్టర్‌గా నియమించారు.స్టాంప్స్ అండ్ రిజి్రస్టేషన్ ఇన్స్పెక్టర్ జనరల్‌గా ఎంవీ శేషగిరిబాబు, మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్‌గా సీహెచ్ శ్రీధర్‌బాబును నియమించారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వీసీఎండీగా శ్రీధర్‌బాబుకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. సెర్ప్ సీఈఓగా జి. వీరపాండియన్, పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్‌గా సీహెచ్ హరికిరణణ్ను నియమించారు. నేషనల్ హెల్త్ మిషన్ ఎండీగా సీహెచ్ హరికిరణ్‌కు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను అప్పగించారు. బదిలీల పూర్తి వివరాలు ఇవీ.. -
హెచ్ఎండీఏను వీడని గ్రహణం !
సాక్షి, సిటీబ్యూరో: విశ్వ నగరానికి విధి విధానాలు రూపొందించాల్సిన హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)కు పూర్తిస్థాయి బాధ్యత వహించే నాథుడు కరవయ్యాడు. పది నెలలుగా ఈ సంస్థ తల లేని మొండెంలా తయారైంది. తాజాగా ఆదివారం జరిగిన ఐఏఎస్‌ల బదిలీల్లో హెచ్ఎండీఏకు పూర్తిస్థాయి కమిషనర్‌ను ప్రభుత్వం నియమించక పోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. హెచ్ఎండీఏ పాలనా పగ్గాలను మళ్లీ ఎఫ్ఏసీకే పరిమితం చేయడం ప్రభుత్వ పెద్దల వైఖరికి అద్దంపడుతోందని కొందరు సిబ్బంది బాహాటంగా విమర్శిస్తున్నారు. ప్రజలకు సత్వర సేవలందించడంలో కృషి చేసే అధికారిగా పేరున్న బి. జనార్దన్‌రెడ్డినే హెచ్ఎండీఏకు పూర్తిస్థాయి కమిషనర్‌గా నియమించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రస్తుతం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి కమిషనర్ అండ్ డెరైక్టర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న జనార్దన్‌రెడ్డి నిత్యం సవాలక్ష పనులతో బిజీగా ఉంటున్నారు. ఇప్పుడు హెచ్ఎండీఏ కమిషనర్‌గా అదనపు బాధ్యతలను కూడా ఆయనకు అప్పగించడం వల్ల అత్యవసర ఫైళ్లను క్లియర్ చేయడానికే సమయం సరిపోతుందని, ఇక పాలసీ నిర్ణయాలు తీసుకొనేందుకు ఆయనకు టైం ఉండకపోచ్చని సీనియర్ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవలి వరకు హెచ్ఎండీఏ ఇన్చార్జి కమిషనర్‌గా బాధ్యతలు వహించిన ప్రదీప్ చంద్ర కూడా తగిన సమయం దొరక్క చాలావరకు సచివాలయానికే తెప్పించుకునేవారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఎదురవతుందన్న వాదనలు విన్పిస్తున్నాయి. పూర్తిస్థాయి కమిషనర్‌ను నియమించడం వల్ల నగరాభివృద్ధికి సంబంధించి భవిష్యత్ ప్రణాళికలు రూపొందించి వాటికి ప్రభుత్వం నుంచి ఆమోదం పొందేందుకు గట్టిగా కృషి చేస్తారని, తద్వారా సంస్థకు పూర్వవైభవం వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆఫీసులో కమిషనర్ ఉంటేనే.. సిబ్బందిలో అటెన్షన్ ఉంటుందని, వివిధ పనుల కోసం వచ్చే ప్రజలకు కూడా భరోసా ఉంటుందని రియల్టర్లు, బిల్డర్లు పేర్కొంటున్నారు. వెంటాడుతోన్న శాపం.. గతంలో హెచ్ఎండీఏ కమిషనర్‌గా నీరభ్ కుమార్ ప్రసాద్ పనిచేసిన సమయంలో అనేక అవకతవకలు, అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వానికి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందడంతో సీఎం కేసీఆర్ వెంటనే చర్యలు తీసుకుని ఆయన్ని బదిలీ చేశారు. ఆయన నిర్వాకాలే సంస్థకు శాపంగా మారాయని సిబ్బంది వాపోతున్నారు. ఆ తర్వాత ఈ సంస్థలో పలువురు అధికారులు, కిందిస్థాయి సిబ్బందిపై కూడా ఇలాంటి ఫిర్యాదులే రావడంతో సీఎం హెచ్ఎండీఏపై ఏహ్య భావంతో ఉన్నారన్న పుకార్లు వెల్లువెత్తాయి. ఈ తరుణంలో హెచ్ఎండీఏను సంస్కరించేందుకు ఉన్నతాధికారి ప్రదీప్ చంద్రను ఇన్చార్జిగా నియమించారు. అయితే, ఆయన హెచ్ఎండీఏకు సమయం కేటాయించకపోవడంతో అక్రమాలు యథావిధిగానే కొనసాగుతున్నట్లు విజిలెన్స్ నివేదికలు వెల్లడించాయి. ఈ క్రమంలో ఏసీబీ దాడులు చేసి అక్రమార్కులను ఏరివేయండంతో కొంత అలజడి నెలకొంది. ఈ తరుణంలో బి.జనార్దన్‌రెడ్డిని ప్రభుత్వం హెచ్ఎండీఏ ఇన్చార్జి కమిషనర్‌గా పగ్గాలు అప్పగించడం చర్చనీయాంశమైంది. -
గ్రీన్ చా‘నిల్’
సాక్షి, సిటీబ్యూరో: నగరాభివృద్ధికి దిశా నిర్దేశం చేయాల్సిన హెచ్ఎండీఏ.. ఇప్పుడు చుక్కానిలేని నావలా మారింది. సంస్థలో సంస్కరణల పేరిట ఉన్నతాధికారులు ప్రవేశపెట్టిన ఆర్భాటపు పథకాలు ఒక్కొక్కటీ వికటిస్తుండడం సంస్థ మనుగడకే ప్రశ్నార్థకంగా మారింది. హెచ్ఎండీఏలో వివిధ అనుమతులకు సంబంధించి సత్వర పరిష్కారం కోసం కమిషనర్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఆరు నెలల క్రితం ప్రవేశపెట్టిన ‘గ్రీన్ ఛానెల్’ పథకం ఇప్పుడు వట్టిపోయింది. ఫాస్ట్‌ట్రాక్ క్లియరెన్స్ కోసం ప్రారంభించిన ఈ స్కీమ్‌కు ఒక్క దర ఖాస్తు కూడా రాకపోవడం గమనార్హం. నిజానికి గ్రీన్ ఛానెల్ స్కీం ప్రారంభించక ముందు వివిధ అనుమతులు కోరుతూ నెలకు కనీసం 40-50 దరఖాస్తులు వచ్చేవి. వాటి పరిష్కారం ద్వారా రూ. 20-25 కోట్ల వరకు హెచ్ఎండీఏకు ఆదాయం చేకూరేది. ఈ నేపథ్యంలో కమిషనర్ కొత్త లే అవుట్లు, భవనాల అనుమతుల మంజూరులో జాప్యం నివారణకు ‘గ్రీన్ ఛానెల్’ ప్రారంభించారు. ప్రత్యేకంగా లెసైన్స్డ్ ఆర్కిటెక్ట్స్, డాక్యుమెంట్ ఆడిటర్స్‌ను అధికారికంగా నియమించి వీరి ద్వారా పరిశీలించిన దరఖాస్తులను వెంటనే ఆమోదింప జేస్తామని చెప్పారు. దరఖాస్తు దారు చెల్లించాల్సిన డెవలప్మెంట్ ఛార్జెస్, ఇతర పత్రాల వివరాలను 7 రోజుల్లోగా వారికి లేఖ ద్వారా తెలిపి, సంబంధిత పత్రాల స్వీకరణ, తనఖా వంటి ప్రక్రియ పూర్తి ద్వారా సత్వరం తుది అనుమతి పత్రం అందిస్తామని ప్రకటించారు. అయితే, అవన్నీ ఆచరణ దాల్చలేదు. నిబంధనలకు భయపడి బిల్డర్లు, రియల్టర్లు వెనుకడుగు వేశారు. ఫలితంగా దరఖాస్తులు తగ్గిపోయాయి. సాధ్యాసాధ్యాలను ఆలోచించకుండా ఏకపక్ష నిర్ణయంతో హడావుడిగా ప్రారంభించడం వల్లే గ్రీన్ ఛానెల్ పథకం బెడిసికొట్టిందని కింది స్థాయి అధికారులు అంటున్నారు. ప్రస్తుతం మార్కెట్ లేదట! హైదరాబాద్‌లో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మార్కెట్ లేదని, ఫలితంగా కొత్త పర్మిషన్ల కోసం దరఖాస్తులు రావట్లేదని అధికారులు సాకుగా చూపుతున్నారు. ఇటీవల రాష్ట్రం విడిపోవడంతో కొత్తగా ప్లాట్లు కొనేవారు, అమ్మేవారు లేరని ఆ ప్రభావం గ్రీన్ ఛానెల్‌పై పడిందంటున్నారు. అయితే, బడాబాబులు మాత్రం తమకున్న ‘ప్రత్యేక ఛానెల్’ ద్వారా అనుమతులు పొందుతుండటంతో గ్రీన్ ఛానెల్‌కు దరఖాస్తులు రావట్లేదని తెలుస్తోంది. ప్లానింగ్ విభాగంలో వేళ్లూనుకొన్న అవినీతిని అడ్డుకోకుండా ఇలాంటి ప్రయోగాలు ఎన్ని చేసినా ప్రయోజనం ఉండదని హెచ్ఎండీఏలో పలువురు ఉద్యోగులు బాహాటంగా విమర్శిస్తున్నారు. -
హెచ్ఎండీఏలో అనిశ్చితి
- వెంటాడుతున్న బదిలీ భయం - ఫైళ్ల కియరెన్స్కు కమిషనర్ విముఖత - అటకెక్కిన అనుమతుల జారీ సాక్షి, హైదరాబాద్: ‘మహా’ నగరాభివృద్ధి సంస్థలో ప్రస్తుతం అనిశ్చితి రాజ్యమేలుతోంది. కొత్త లేఅవుట్లు, భవనాలు, భూ వినియోగ మార్పిడికి సంబంధించిన ఫైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోవడమే ఇందుకు నిదర్శనం. హెచ్ఎండీఏ కమిషనర్ నీరభ్‌కుమార్ ప్రసాద్‌ను త్వరలో బదిలీ చేస్తారన్న సంకేతాలు రావడంతో ఆ ప్రభావం ఫైళ్ల క్లియరెన్స్‌పై పడిందని సిబ్బంది బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. రొటీన్ ఫైళ్లు తప్ప వివిధ కొత్త పర్మిషన్లు, పాలసీ నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్ల ఆయా సెక్షన్లలోనే మగ్గుతుండటం ప్రస్తుత పరిస్థితికి అద్దంపడుతోంది. ప్రత్యేకించి ప్లానింగ్ విభాగానికి చెందిన ఫైళ్లు తనకు పంపవద్దని ఇటీవల కమిషనర్ ఆదేశించడం కింది స్థాయి అధికారులను విస్మయానికి గురిచేసింది. స్వయంగా ఉన్నతాధికారి వద్దనడంతో కిందిస్థాయిలో ప్రాసెస్ జరిగిన ఫైళ్లు కూడా ఎక్కడివక్కడే ఆగిపోయాయి. 15 రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో ఏం చేయాలో తెలియక కిందిస్థాయి అధికారులు తల పట్టుకొంటున్నారు. నగరాభివృద్ధిలో కీలక భూమిక పోషించే హెచ్ఎండీఏలో అవినీతి వేళ్లూనుకొందని, దీన్ని సంస్కరించేందుకు తొలుత కమిషనర్‌ను తప్పించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చిందన్న ఊహాగానాలు ఇప్పుడు హెచ్ఎండీఏలో జోరందుకొన్నాయి. మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖను స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చూస్తున్న తరుణంలో దేనికి అనుమతి ఇచ్చినా... ప్రభుత్వం నుంచి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రత్యేకించి ప్లానింగ్ ఫైళ్ల విషయంలో ఏదైనా పొరపాట్లు జరిగితే భవిష్యత్‌లో అవి మెడకు చుట్టుకొనే ప్రమాదం ఉండటంతో కమిషనర్ కావాలనే ఆ ఫైళ్లను పక్కకు పెట్టేశారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. అయితే... కొందరు అధికారుల వాదన మరోలా ఉంది. నిత్యం సచివాలయంలో మీటింగ్‌లకు హాజరవుతున్న కారణంగా కమిషనర్ కొన్ని ఫైళ్లను చూడలేక పోతున్నారని, రొటీన్ ఫైళ్లు ఏరోజుకారోజు క్లియర్ అవుతున్నాయని చెబుతున్నారు. పడిపోయిన ఆదాయం... వివిధ అనుమతులకు సంబంధించిన ఫైళ్లు క్లియర్ కాకపోవడంతో ఫీజుల రూపంలో హెచ్ఎండీఏకు రావాల్సిన ఆదాయం గణనీయంగా పడిపోయింది. గతంలో తక్కువలో తక్కువ అంటే కొత్త లేఅవుట్స్ కోసం నెలకు 10-15 దరఖాస్తులు, నూతన భవనాల అనుమతులు కోరుతూ 25-30, భూ వినియోగ మార్పిడి కోరుతూ 5-10 దరఖాస్తులు హెచ్ఎండీఏకు వచ్చేవి. నిబంధనల మేరకున్న దరఖాస్తులను క్లియర్ చేసి అనుమతులిస్తే ఫీజుల రూపంలో నెలకు రూ.12-15 కోట్ల మేర ఆదాయం వచ్చేది. అయితే... ఇప్పుడు ఆ ఆదాయం రూ.2కోట్లకు పడిపోయింది. కొత్త దరఖాస్తులు రాకపోవడంతో పనిలేక ఖాళీగా కూర్చోవాల్సి వస్తోందని సిబ్బంది అంటున్నారు. నగరంలోని పార్కులు, కాంప్లెక్స్‌ల అద్దె, లీజ్‌ల రూపంలో నెలవారీగా వచ్చే రూ.12కోట్లు ఆదాయంతోనే హెచ్ఎండీఏ మనుగడ సాగిస్తోంది. ఈ తరుణంలో కీలక ఫైళ్లను పరిష్కరించకుండా పక్కన పెట్టేసి సంస్థను అనిశ్చితిలోకి నెట్టేసిన ఉన్నతాధికారుల తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.