62 మందికి స్థానచలనం కల్పిస్తూ ఆదేశాలు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌గా కేరళ కేడర్‌కు చెందిన కృష్ణతేజ
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీగా ఎంవీ శేషగిరిబాబు
సీఎస్ నీరభ్‌కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 62 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్ ప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. కేరళ కేడర్‌కు చెందిన మైలవరపు కృష్ణతేజను పంచాయతీరాజ్–గ్రామీణీభివృద్ధి శాఖ డైరెక్టర్‌గా నియమించారు.
స్టాంప్స్ అండ్ రిజి్రస్టేషన్ ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా ఎంవీ శేషగిరిబాబు, మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్‌గా సీహెచ్ శ్రీధర్‌బాబును నియమించారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వీసీఎండీగా శ్రీధర్‌బాబుకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. సెర్ప్ సీఈఓగా జి. వీరపాండియన్, పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్‌గా సీహెచ్ హరికిరణణ్‌ను నియమించారు. నేషనల్ హెల్త్ మిషన్ ఎండీగా సీహెచ్ హరికిరణ్‌కు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను అప్పగించారు. బదిలీల పూర్తి వివరాలు ఇవీ..
Comments
Please login to add a commentAdd a comment