న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. అభ్యర్ధుల అభ్యంతరాలను పక్కన పెట్టడంతో పాటు మెయిన్స్ పరీక్షల నిర్వహణకు ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
2022 లో ఇచ్చిన గ్రూప్-1 నోటిఫికేషన్ ను పక్కన పెట్టి 2024లో కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం చట్ట విరుద్దమంటూ కొందరు అభ్యర్థులు కోర్టుకెక్కారు. అలాగే.. 2024 గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షల్లో కూడా 14 తప్పులున్నాయని, మెయిన్స్‌ను సైతం వాయిదా వేయాలని కూడా కోరారు.
అయితే తెలంగాణ హైకోర్టులో వీళ్లకు చుక్కెదురైంది. దీంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన జస్టిస్ పీఎస్ నరసింహ ధర్మాసనం ఇవాళ తీర్పు వెల్లడించింది.
‘‘కోర్టును ఆశ్రయించిన అభ్యర్ధులు ఎవరూ ప్రిలిమ్స్ పరీక్షలు పాస్ కానందున మెయిన్స్ వాయిదా వేయాల్సిన అవసరం లేదు. పరీక్షల నిర్వహణలో కోర్టుల జోక్యం అనవసరం. దీనివల్ల రిక్రూట్ మెంట్ ప్రక్రియ తీవ్ర జాప్య మవుతుంది’’ అని జస్టిస్ పీఎస్ నరసింహ ధర్మాసనం అభిప్రాయపడింది.
Comments
Please login to add a commentAdd a comment