
సాక్షి, అమరావతి : ఇన్నాళ్ల నిరుద్యోగుల ఎదురు చూపులు ఫలించాయి. ఎట్టకేలకు రాష్ట్రంలో పలు శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 20, 010 వేల పోస్టుల నియమకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేబినేట్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించి పూర్తి వివరాలతో నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపింది. త్వరలో ఎన్నికలు సమీపించనుండటంతో టీడీపీ ప్రభుత్వం యువతను ఆకర్షించే ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగా గ్రూప్ 1, 2, 3, డీఎస్సీతో పాటు పోలీస్ శాఖల్లో పోస్టుల భర్తీకి చంద్రబాబు ప్రభుత్వం ఓకే చెప్పింది. ఏపీపీఎస్సీ, డీఎస్సీ ద్వారా ప్రత్యక్ష పద్ధతిలో ఖాళీల నియామకం జరపనున్నట్లు అధికారులు తెలిపారు.
మొత్తం పోస్టుల వివరాలు...
గ్రూప్-1 ఖాళీలు 150
గ్రూప్-2 ఖాళీలు 250
గ్రూప్-3 ఖాళీలు 1,670
డీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఖాళీలు 9,275
పోలీస్ ఎగ్జిక్యూటివ్, ఏపీఎస్ఎల్‌పీఆర్‌బీ ఖాళీలు 3,000
వైద్య శాఖలో ఖాళీలు 1,604
ఇతర ఖాళీలు 1,636
పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులు 310
జూనియర్ లెక్చరర్ (ఇంటర్మీడియేట్) పోస్టులు 200
ఏపీఆర్ఈఐ సొసైటీ పోస్టులు 10
ఏపీఆర్ఈఐ సొసైటీ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టులు 5
డిగ్రీ కళాశాల లెక్చరర్ పోస్టులు 200
సమాచార పౌర సంబంధాల శాఖలో 21 ఖాళీల భర్తీకి ఆమోదం తెలిపింది.
ఇవికాక ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతి ద్వారా
డీపీఆర్‌వో పోస్టులు 4,
ఏపీఆర్‌వో పోస్టులు 12,
డీఈటీఈ పోస్టులు 5 పోస్టుల భర్తీకి కేబినేట్ ఆమోదం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment