recruit
-
హడలిపోతున్న తరుణంలో చల్లటి కబురు.. ఐటీ కంపెనీల ప్లాన్ ఇదే..!
ఐటీ పరిశ్రమలలో ప్రస్తుతం లేఆఫ్‌లు బెంబేలెస్తున్నాయి. కొత్త నియామకాలు తగ్గిపోయాయి.. ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి. దీంతో తమ పరిస్థితి ఏంటని ఫ్రెషర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి తరుణంలో వారు ఎగిరి గంతేసే ఓ నివేదిక వెల్లడైంది. టీమ్‌లీజ్ ఎడ్టెక్ కెరీర్ ఔట్లుక్ రిపోర్ట్ 2024 ప్రకారం.. ప్రముఖ ఐటీ దిగ్గజాలు రాబోయే ఆరు నెలల్లో 40,000 మందికి పైగా ఫ్రెషర్లను నియమించుకునే ప్రణాళికలో ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్‌కు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ ఐటీ పరిశ్రమ వృద్ధికి దోహదం చేస్తోందని రిక్రూట్మెంట్ సంస్థ టీమ్‌లీజ్ డిజిటల్ విశ్లేషిస్తోంది. "జెనరేటివ్ ఏఐ ఆటోమేషన్‌కు అనుగుణంగా వర్క్‌ఫ్లో మారబోతోంది. ఈ ఏఐ సిస్టమ్‌లతో సమర్థవంతంగా సహకరించడానికి ఫ్రెషర్లు సిద్ధంగా ఉండాలి" అని టీమ్‌లీజ్ ఎడ్టెక్ సీవోవో జైదీప్ కేవల్రమణి పేర్కొన్నారు. "ఎంప్లాయర్లు కొంతకాలంగా సంప్రదాయవాద అడుగులు వేశారు. ప్రపంచ గందరగోళాల మధ్య నియామకం మందగించింది. అయితే మా ఇటీవలి సర్వే భారతదేశ వృద్ధి కథనంపై ఎంప్లాయర్ విశ్వాసాన్ని వెల్లడిస్తుంది. సంస్థలు తమ భవిష్యత్తు మార్గాలపై మరింత నమ్మకంగా ఉన్నాయి" టీమ్‌లీజ్ వ్యవస్థాపకుడు, సీఈవో ఎడ్టెక్ శంతను రూజ్ తెలిపారు. గతేడాది కంటే తక్కువే.. ఐటీ రంగంలో ఫ్రెషర్ల నియామకం ఉద్దేశం 2024 తొలి ఆర్నెళ్లలో 42 శాతానికి తగ్గింది. 2023లో ఇదే కాలంలో ఇది 49 శాతంగా ఉండేది. ముఖ్యంగా ఎంట్రీ-లెవల్ ప్రొఫెషనల్స్ కోసం నియామక ఉద్దేశం గత ఏడాది ఇదే కాలంలో 62 శాతం నుంచి ప్రస్తుత ప్రథమార్ధంలో (జనవరి-జూన్ 2024) అన్ని రంగాలలో 68 శాతానికి స్వల్పంగా మెరుగుపడిందని నివేదిక పేర్కొంది. ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరం ప్రథమార్ధంలో ఫ్రెషర్లను నియమించుకునే అవకాశం ఉన్న మొదటి మూడు పరిశ్రమలు ఈ-కామర్స్, టెక్నాలజీ స్టార్టప్‌లు (55%), ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ (53%), టెలికమ్యూనికేషన్స్ (50%) అని నివేదిక విశ్లేషించింది. -
గుడ్ న్యూస్: ఎయిర్‌బస్‌లో భారీగా ఉద్యోగాలు
గ్లోబల్ ఏరోస్పేస్ మేజర్ ఎయిర్‌బస్ (Airbus) వచ్చే రెండేళ్లలో భారత్ నుంచి 2,000 మంది ఇంజనీర్లను నియమించుకోవాలని చూస్తోంది. తద్వారా సంస్థలో భారతీయ ఇంజనీర్ల మొత్తం సంఖ్యను 5,000కి తీసుకెళ్లాలని భావిస్తోంది. ఎయిర్‌బస్ ఇండియా ప్రెసిడెంట్, దక్షిణాసియా ఎండీ రెమి మెయిలార్డ్ మాట్లాడుతూ.. తాము భారత్‌ను కేవలం మార్కెట్‌గా మాత్రమే కాకుండా టాలెంట్ హబ్‌గా చూస్తున్నామన్నారు. కొత్త ఇంజనీరింగ్ కోర్సు ఎయిర్‌బస్.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సమక్షంలో వడోదరలోని గతి శక్తి విశ్వవిద్యాలయ (GSV)తో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఏరోస్పేస్ రంగంలో కొత్త ఇంజనీరింగ్ కోర్సును ప్రారంభించేందుకు ఈ ఒప్పందం మార్గం సుగమం చేసింది. గతి శక్తి విశ్వవిద్యాలయ భాగస్వామ్యంతో నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్‌ను అభివృద్ధి చేస్తామని, ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏరోస్పేస్ రంగానికి సేవలందించేందుకు భవిష్యత్తులో సిద్ధంగా ఉంటుందని మెయిలార్డ్ తెలిపారు. (Google: ప్రభుత్వ ఉద్యోగులకు గూగుల్ బంపరాఫర్.. ) ఎయిర్‌బస్ సంస్థలోని డిజైన్, డిజిటల్ కేంద్రాలలో ఇప్పిటికే 3,000 మందికిపైగా భారతీయ ఇంజనీర్లు పనిచేస్తున్నారని, 2025 నాటికి ఈ సంఖ్యను 5,000లకు పైగా పెంచుతామని మెయిలార్డ్ వివరించారు. భారత్ శక్తిసామర్థ్యాలపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, అందుకే ఇక్కడ పెట్టుబడులు పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఇక మొదటి మేక్-ఇన్-ఇండియా C295 మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌ను 2026 సెప్టెంబర్‌లో డెలివరీ చేయనున్నట్లు చెప్పారు. -
ఐపీఓకు ముందే పేటీఎం కీలక నిర్ణయం: వేల ఉద్యోగాలు
సాక్షి, ముంబై: ప్రముఖ డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ పేటీఎం బంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 20 వేల ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లను నియమించుకోవాలని నిర్ణయించింది. మార్కెట్లో ప్రధాన పోటీ, త్వరలోనే పబ్లిక్ ఇష్యూకు రానున్న తరుణంలో పేటీఎం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కంపెనీ ప్రతినిధి ఈ విషయంపై వ్యాఖ్యానించనప్పటికీ, అండర్ గ్రాడ్యుయేట్లు ఈ ఉద్యోగాలకు అర్హులుగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ 20,000 మంది ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్‌లకు నెలవారీ వేతనంగా 35 వేల రూపాయలు ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ ఉద్యోగుల ద్వారా పేటీఎం, క్యూఆర్ కోడ్, పీవోఎస్ మెషీన్, పేటీఎం సౌండ్ బాక్స్, వ్యాలెట్, యూపీఐ, పేటీఎం పోస్ట్ పెయిడ్, మర్చంట్ లోన్స్, ఇన్సూరెన్స్ స్కీంలను ప్రమోట్ చేయాలని భావిస్తోంది. తద్వారా భారీ వ్యాపార విస్తరణకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పిసిఐ) మే నాటి డేటా ప్రకారం ప్రస్తుత యూపీఐ మార్కెట్లో పేటీఎం కు 11 శాతం వాటా మాత్రమే ఉండగా, 45 శాతం మార్కెట్ వాటాతో ఫోన్ పే మొదటి స్థానంలో, గూగుల్ పే 35 శాతం రెండో స్థానంలో ఉన్నాయి. ఫోన్ పే, గూగుల్ పే సహా పలు ఫిన్ టెక్ కంపెనీల పోటీని ఎదుర్కొనేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రూ.16,000 కోట్ల పబ్లిక్ ఇష్యూ కోసం అక్టోబర్ నాటికి స్టాక్ మార్కెట్లోకి రానుంది. జూలై 15 న మార్కెట్ రెగ్యులేటర్ సెబీవద్ద ఇప్పటికే ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది పేటీఎం. -
20 వేల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి : ఇన్నాళ్ల నిరుద్యోగుల ఎదురు చూపులు ఫలించాయి. ఎట్టకేలకు రాష్ట్రంలో పలు శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 20, 010 వేల పోస్టుల నియమకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేబినేట్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించి పూర్తి వివరాలతో నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపింది. త్వరలో ఎన్నికలు సమీపించనుండటంతో టీడీపీ ప్రభుత్వం యువతను ఆకర్షించే ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగా గ్రూప్ 1, 2, 3, డీఎస్సీతో పాటు పోలీస్ శాఖల్లో పోస్టుల భర్తీకి చంద్రబాబు ప్రభుత్వం ఓకే చెప్పింది. ఏపీపీఎస్సీ, డీఎస్సీ ద్వారా ప్రత్యక్ష పద్ధతిలో ఖాళీల నియామకం జరపనున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం పోస్టుల వివరాలు... గ్రూప్-1 ఖాళీలు 150 గ్రూప్-2 ఖాళీలు 250 గ్రూప్-3 ఖాళీలు 1,670 డీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఖాళీలు 9,275 పోలీస్ ఎగ్జిక్యూటివ్, ఏపీఎస్ఎల్పీఆర్బీ ఖాళీలు 3,000 వైద్య శాఖలో ఖాళీలు 1,604 ఇతర ఖాళీలు 1,636 పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులు 310 జూనియర్ లెక్చరర్ (ఇంటర్మీడియేట్) పోస్టులు 200 ఏపీఆర్ఈఐ సొసైటీ పోస్టులు 10 ఏపీఆర్ఈఐ సొసైటీ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టులు 5 డిగ్రీ కళాశాల లెక్చరర్ పోస్టులు 200 సమాచార పౌర సంబంధాల శాఖలో 21 ఖాళీల భర్తీకి ఆమోదం తెలిపింది. ఇవికాక ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతి ద్వారా డీపీఆర్వో పోస్టులు 4, ఏపీఆర్వో పోస్టులు 12, డీఈటీఈ పోస్టులు 5 పోస్టుల భర్తీకి కేబినేట్ ఆమోదం తెలిపింది. -
18 వేల పోలీసు పోస్టులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ శాఖలో భారీగా కానిస్టేబుళ్లు, సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై) పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సుమారు 18 వేల వరకు కానిస్టేబుల్, ఎస్సై పోస్టులను భర్తీ చేయనుంది. ఈ మేరకు ఏప్రిల్ రెండో వారం లేదా మూడో వారంలో నోటిఫికేషన్ రానుందని పోలీసుశాఖ ఉన్నతాధికార వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రం ఏర్పాటయ్యాక 2015లో 9,600 కానిస్టేబుల్ పోస్టులు, 539 ఎస్సై పోస్టులకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైనవారు రెండు నెలల క్రితమే శిక్షణ పూర్తిచేసుకుని ఉద్యోగాల్లో చేరారు. ఎస్సై పోస్టులకు ఎంపికైనవారికి మరో మూడు నాలుగు నెలల్లో శిక్షణ ముగియనుంది. అయితే కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో.. భారీగా పోలీసు పోస్టులు భర్తీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందులో 3,500 కానిస్టేబుల్ పోస్టులకు ఆర్థికశాఖ గతేడాది అక్టోబర్‌లోనే ఆమోదం తెలపగా.. తాజాగా మరో 14 వేలకుపైగా పోస్టులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. దీంతో నియామక ప్రక్రియ ప్రారంభించేందుకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కసరత్తు చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. వయసు సడలింపు ఉంటుందా? పోలీసు పోస్టుల భర్తీలో ఈసారి కూడా అభ్యర్థులకు వయోపరిమితి సడలింపు ఇవ్వాలా? వద్దా అన్న అంశంపై స్పష్టత ఇవ్వాలని పోలీస్ శాఖ ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిసింది. వారం రోజుల్లో ఈ విషయం తేలే అవకాశముందని భావిస్తున్నారు. ఇక గతంలోలా రిజర్వేషన్ల అ మలు సమస్య వంటివి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో రాకుండా చూడాలని ఉన్నతాధికారులు రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశించినట్లు తెలుస్తోంది. -
ఐడీబీఐలో కొలువుల జాతర
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంక్ ఐడీబీఐ నిరుద్యోగులకు శుభవార్త అందించింది. కాంట్రాక్ట్ పద్ధతిలో వందలమంది ఉద్యోగులను నియమించుకోనుంది. ఈ మేరకు అభ్యర్థులనుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కాంట్రాక్ట్ బేస్ గా సుమారు 500 ఎక్జికెటివ్ లను నియమించుకొనేందుకు రంగం సిద్ధం చేసింది. 20-25 మధ్యగల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. మూడు సంవత్సరాలపాటు ఈ కాంట్రాక్ట్ అమల్లో ఉండనుంది. మొదటి సంవత్సరంలో నెలకు రూ.17,000 ఏకీకృత వేతం నెలకు ఉంటుంది, రెండవ సంవత్సరంలో రూ.18,500 మూడో ఏడాది రూ 20,000 చెల్లించనుంది. అలాగే మూడేళ్ల కాలాన్నివిజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులు అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్ ఎ) ఉద్యోగాలకు అర్హత పొందుతారు. అప్లికేషన్లు, అర్హత, ఆన్లైన్ పరీక్షకేంద్రాలు తదితర పూర్తి వివరాలు ఐడీబీఐ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి. -
వెల్లింగ్టన్ లో వింత సమస్య!
వెల్లింగ్టన్ : న్యూజిల్యాండ్ లోని ఓ పట్టణం వింత సమస్యను ఎదుర్కొంటోంది. ప్రపంచంలోని అనేక ప్రాంతాలు నిరుద్యోగ సమస్యతో బాధపడుతుంటే.. అక్కడ మాత్రం ఉద్యోగాలు చేసేవారు లేక, ఇతర ప్రాంతాలనుంచి వచ్చేవారికోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగాలు ఫుల్ గా ఉన్నా అభ్యర్థులు లేకపోవడం ఆ సిటీలో పెద్ద సమస్యగా మారిపోయింది. అంతేకాదు అక్కడ ఉన్న ఇళ్ళలో కూడ ఎవరూ నివసించేందుకు ముందుకు రావడం లేదట. న్యూజిల్యాండ్ క్లుతా జిల్లా, కైటంగట పట్టణంలో ఇప్పుడు నిరుద్యోగ సమస్యకు బదులుగా అభ్యర్థుల కొరత బాధిస్తోందట. ప్రపంచంలో ఎన్నోదేశాలు ఎదుర్కొంటున్న సమస్యకు భిన్నంగా అక్కడి ప్రభుత్వం.. ఉద్యోగులు కావాలంటూ ఎదురు చూడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అతి చిన్న పట్టణమైన కైటంగటలో కేవలం 800 కుటుంబాలు మాత్రమే నివసిస్తున్నాయి. అయితే ఉద్యోగాలు అత్యధికంగా ఉండటంతో ప్రభుత్వం అభ్యర్థులకోసం పడిగాపులు పడాల్సివస్తోంది. ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఏకంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగం చేస్తామని ముందుకొచ్చేవారికి ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటిస్తోంది. ఇల్లు, స్థలంతోపాటు, అధిక వేతనాలు అందించేందుకు సైతం సిద్ధమైంది. జిల్లాలో మొత్తం 1000 దాకా ఉద్యోగాలు ఖాళీగా ఉండిపోయాయని, అందుకే ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, ఇతర ప్రాంతాలనుంచి కూడ అభ్యర్థులను రిక్రూట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు జిల్లా మేయర్ బ్రియాన్ కేడోజిన్ తెలిపారు. క్లుతా జిల్లాలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు ఎక్కువగా డైరీ ప్రాసెసింగ్ ప్లాంట్లు, పరిశ్రమల్లోనే కావడం, దానికి తోడు కైటంగట పట్టణం ఓ మారుమూలకు ఉండటం కూడ ఇక్కడకు ఉద్యోగాలకోసం వచ్చేందుకు అభ్యర్థులు వెనుకాడుతున్నట్లు మేయర్ చెప్తున్నారు. ఖాళీలను భర్తీ చేసేందుకు తమవంతు ప్రయత్నం చేస్తున్నామని మేయర్ తెలిపారు. స్థానిక ప్రజలు ఉద్యోగాలకు సరిపోకపోవడంతో సమీపంలోనే ఉన్న డునిడెన్ నుంచి బస్సుల్లో కొందర్ని ఇక్కడికి రప్పిస్తున్నట్లు తెలిపారు. ఒకప్పుడు తాను, తన కుటుంబం తిండికోసం ఇబ్బందులు పడుతున్నపుడు ఈ ప్రాంతం తనకు ఉద్యోగాన్నిచ్చి ఆదుకుందని, ఇప్పుడు తానుసైతం ఇబ్బందులుపడే ఇతర కివి కుటుంబాలకు ఉద్యోగాలను అందించే ప్రయత్నం చేస్తున్నట్లు బ్రియాన్ చెప్తున్నారు. అలాగే కైటంగటలో డైరీ ఫాం నిర్వహిస్తున్న మూడో తరం వ్యక్తి ఎవాన్ డిక్ కూడ ఈ డ్రైవ్ లో భాగం పంచుకున్నాడు. ఇదో ఓల్డ్ ఫ్యాషన్ కమ్యూనిటీ అని, ఇక్కడ ఇళ్ళకు ఎవ్వరూ తాళాలు కూడ వేసుకోరని, పిల్లలు హాయిగా పరుగులు పెట్టి ఆడుకునేట్లుగా ఉండే ఈ ప్రాంతంలో అధికశాతం ఉద్యోగాలు, ఇళ్ళు ఉన్నా... ప్రజలే తక్కువగా ఉన్నారని చెప్తున్నారు. ఈ పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. ఉద్యోగాలు కావాలన్నా దొరకని నేటి పరిస్థితుల్లో ఇక్కడ ఉద్యోగాలిస్తాం రండి బాబూ.. అంటూ అభ్యర్థులకోసం పడిగాపులు పడటం నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదూ... -
ముస్లిం యోగా శిక్షకుల నియామకంపై దుమారం
న్యూఢిల్లీ: 'వరల్డ్ యోగా డే' సందర్భంగా ముస్లింలను యోగా శిక్షకులు, టీచర్లుగా నియమించకపోవడంపై వివాదం చెలరేగింది. తాత్కాలిక ప్రాతిపదికన ఎంపికచేసిన శిక్షకుల్లో ముస్లిం అభ్యర్థులకు చోటు దక్కకపోవడంతో.. ఒక విధానం ప్రకారమే ముస్లింలను యోగా టీచర్లుగా నియమించడం లేదంటూ వచ్చిన ఆరోపణలను కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శ్రీపాద్ నాయక్ తోసిపుచ్చారు. ఇది తమ ప్రతిష్ఠను దిగజార్చేందుకు కొంతమంది చేస్తున్న ప్రచారమని ఖండించారు. ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు. దీనిపై పూర్తి విచారణకు ఆదేశిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గత ఏడాది అక్టోబర్ 15న జరిగిన ప్రపంచ యోగా దినం కోసం ఉద్దేశించిన నియామకాల్లో ముస్లిం అభ్యర్థులకు మొండిచేయి చూపారంటూ అంతర్జాతీయ పత్రిక ది హఫింగ్టన్ పోస్ట్ ఒక కథనాన్ని ప్రచురించింది. సుమారు 711 మంది అభ్యర్థులలో.. ఒక్క ముస్లిం టీచర్‌ను కూడా ఎంపిక చేయలేదని ఆ పత్రిక పేర్కొంది. దీనిపై జర్నలిస్టు పుష్పా శర్మ సమాచార హక్కు చట్టం ద్వారా పిటిషన్ దాఖలు చేశారు. దరఖాస్తు చేసుకున్న ముస్లిం అభ్యర్థుల సంఖ్య, ఎంపికైన అభ్యర్థుల సంఖ్య తదితర వివరాలు కావాలని కోరారు. 3,841 ముస్లిం అభ్యర్థులలో ఒక్కరూ ఎంపిక కాలేదని సమాధానం వచ్చింది. దీంతో వివాదం చెలరేగింది. కాగా ఆయుర్వేద, యోగ, నేచురోపతి, యునాని, సిద్ధ అండ్ హోమియోపతిలకు సంబంధించిన మంత్రిత్వశాఖ ఆయూష్. ఈ శాఖ ప్రధానంగా సంప్రదాయ ఔషధాలకు ప్రోత్సాహాన్నిస్తుంది. -
9 వర్సిటీలకు నియమించేందుకు చర్యలు
-
9 వర్సిటీలకు నియమించేందుకు చర్యలు
ఇప్పటికే సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్స్లర్లను (వీసీ) నియమించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఏళ్ల తరబడి రెగ్యులర్ వీసీలు లేక ఇన్చార్జీల పాలనలో అల్లాడుతున్న వర్సిటీలకు ఎట్టకేలకు రెగ్యులర్ వీసీలను నియమించేందుకు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం ఇటీవలే వీసీల ఎంపిక కోసం సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసింది. తాజాగా ఈ నెల 3న (గురువారం) వీసీ పోస్టుల నోటిఫికేషన్‌ను జారీ చేసేందుకు సిద్ధమైంది. 4వ తేదీన నోటిఫికేషన్‌ను అందరికి అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ వర్సిటీలతో పాటు 10 వర్సిటీలకు రెగ్యులర్ వీసీలు లేరు. దీంతో యూనివర్సిటీల్లో పాలనతోపాటు విద్యా కార్యక్రమాల అమ లు పూర్తిగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ మినహా మిగతా ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, జేఎన్టీయూ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ, పాలమూరు విశ్వ విద్యాలయం, మహాత్మాగాంధీ విశ్వ విద్యాలయాలకు వీసీల నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేయనుంది. పాత పద్ధతిలోనే నియామకాలు ఈ నియామకాలను పాత పద్ధతిలోనే చేపట్టాలని నిర్ణయించింది. ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే అర్హత కలిగిన ప్రొఫెసర్లు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో పదేళ్లపాటు ప్రొఫెసర్‌గా పనిచేసి ఉండాలన్న నిబంధన ప్రధానమైంది. దాంతోపాటు వారి ప్రత్యేకత, ఎన్ని పీహెచ్‌డీలకు, ఎన్ని ఎంఫిల్లకు గైడ్ చేశారు? ఎన్ని పేపర్లు రాశారు? ఎన్ని పుస్తకాలు రాశారు? తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఒక్కో వర్సిటీకి వీసీ పోస్టు కోసం వచ్చిన దరఖాస్తులను ఆయా సెర్చ్ కమిటీ ప్రాసెస్ చేస్తుంది. దరఖాస్తు చేసుకున్న ప్రొఫెసర్ల సీనియారిటీ, అర్హతలను బట్టి ప్రాధాన్య క్రమంలో ముగ్గురి పేర్లను సెర్చ్ కమిటీ ఎంపిక చేసి ప్రభుత్వానికి పంపుతుంది. ప్రభుత్వం ఆ ముగ్గురిలో ఎవరో ఒకరి పేరును ఆ వర్సిటీకి వీసీగా ఖరారు చేయనుంది. గతంలో యూనివర్సిటీకి చాన్స్‌లర్‌గా ఉండే గవర్నర్ వీసీని నియమించగా, ఇపుడు ప్రభుత్వమే వీసీని నియమించనుంది. రాష్ట్రంలో యూనివర్సిటీలకు చాన్స్‌లర్‌గా గవర్నర్ స్థానంలో నిఫుణులను ప్రభుత్వమే నియమించాలని నిర్ణయించింది. అలాగే వీసీల నియామక అధికారాలను ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చుకుంది. ఇటీవలే అందుకు అనుగుణంగా యూనివర్సిటీల చట్టాలకు సవరణలు చేసింది. తాజా నిబంధన ప్రకారం వీసీలను, ఆ తరువాత చాన్స్లర్లను ప్రభుత్వమే నియమించనుంది. -
తెలంగాణలో జాబుల జాతర