
సాక్షి,హైదరాబాద్: గ్రూప్ వన్ అభ్యర్థుల ఆందోళనలపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. శనివారం(అక్టోబర్19) సాయంత్రం హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని పోలీస్ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు.
గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చినపుడే జీవో నెంబర్ 29 ఇచ్చామని చెప్పారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి గ్రూప్ 1 నియామకాలు జరగలేదన్నారు. కొంత మంది ఉద్యోగాలు పోవడంతో రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం పదేళ్లు గ్రూప్ వన్ ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. ప్రతిపక్షాల ఉచ్చులో విద్యార్థులు పడొద్దని హితవు పలికారు.
కాగా గ్రూప్ వన్ రద్దు చేయాలని శనివారం ఉదయం గ్రూప్ వన్ అభ్యర్థులు హైదరాబాద్ అశోక్‌నగర్‌తో పాటు సచివాలయం వద్ద ఆందోళనలు చేశారు. వీరి ఆందోళనలకు బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు మద్దతు పలికారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.
ఇదీ చదవండి: గ్రూప్-1 రగడ..సచివాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత
Comments
Please login to add a commentAdd a comment