గ్రూప్–1 (2011) ఎంపిక జాబితాను టీఎస్‌పీఎస్సీ ఉపసంహరించింది. శనివారం ప్రకటించిన పోస్టింగుల్లో తప్పిదాలున్నట్లు తెలియడంతో సోమవారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పోస్టులకు అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్లను పరిగణనలోకి తీసుకోవడంలో సెంటర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) పొరపాటు చేయడంతో పోస్టింగులు మారిపోయాయి. టాప్ ర్యాంకర్లకు ప్రాధాన్యంలేనివి.. దిగువన ఉన్న వారికి ప్రాధాన్యమున్న పోస్టులు లభించాయి.