సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రూప్–1 ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వి స్ కమిషన్ (ఏపీపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. జనరల్, స్పోర్ట్స్ కోటా కింద ఎంపికైనవారికి ఆగస్టు 2 నుంచి మౌఖిక పరీక్షలు ఉంటాయని వెల్లడించింది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న పోస్టులకనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేసినట్టు కమిషన్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ తెలిపారు. వచ్చే నెల 2న ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విజయవాడ ఎంజీ రోడ్డులోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఇంటర్వ్యూలు ఉంటాయని వెల్లడించారు.
స్పోర్ట్స్ కోటా కింద ఎంపికైనవారికి ఈ నెల 27 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందన్నారు. ఏపీపీఎస్సీ గతేడాది సెపె్టంబర్ 30న 111 గ్రూప్–1 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి 8న ప్రిలిమ్స్ (స్క్రీనింగ్) నిర్వహించి.. అదే నెల 27న ఫలితాలను వెల్లడించారు. 5,035 మంది మెయిన్స్ పరీక్షలకు ఎంపికయ్యారు. వీరికి జూన్ 3 నుంచి 10 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో నుంచి పోస్టుకు ఇద్దరు చొప్పున 110 పోస్టులకు 220 మందిని, స్పోర్ట్స్ కోటాలోని ఒక పోస్టుకు 39 మందిని ఇంటర్వ్యూలకు ఎంపిక చేశారు.
నోటిఫికేషన్ ఇచ్చిన తక్కువ కాలంలోనే ఎలాంటి వివాదాలకు తావులేకుండా పరీక్షలు నిర్వహించడం, అంతే వేగంగా ఇంటర్వ్యూలు కూడా నిర్వహించనుండటం ఏపీపీఎస్సీ చరిత్రలోనే ఇదే తొలిసారి. ప్రిలిమ్స్ పరీక్ష జరిగిన నాటి నుంచి 19 రోజుల్లో, మెయిన్స్ పరీక్షలు జరిగిన నాటి నుంచి 33 రోజుల్లోనే ఫలితాలను వెల్లడించడం విశేషం.
అధికారులకు అర్ధ వార్షిక పరీక్షలు
రాష్ట్రంలో పనిచేస్తున్న అఖిల భారత, రాష్ట్ర సర్వీసు అధికారులకు అర్ధ వార్షిక పరీక్షలను నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది. వీరికి సెపె్టంబర్ 12 నుంచి 15 వరకు పరీక్షలు ఉంటాయని తెలిపింది. ఆగస్టు 14లోగా ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని కార్యదర్శి ప్రదీప్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment