
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: ఐటీఐ పూర్తయిన విద్యార్థులు లేటరల్ ఎంట్రీ కింద పాలిటెక్నిక్ డిప్లొమాలో చేరేందుకు నిర్వహించే ఎల్‌పీసెట్– 2021 దరఖాస్తుల గడువును జూలై 12వ తేదీ వరకు పొడిగించారు. అప్పటివరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా విద్యార్థులు దరఖా స్తు చేసుకోవచ్చని రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి (ఎస్‌బీటీఈటీ) కార్యదర్శి డాక్టర్ శ్రీనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. రూ. 100 ఆలస్య రుసుముతో జూలై 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పరీక్షను జూలై 25వ తేదీన నిర్వహిస్తామని వెల్లడించారు.
టీఎస్ ఐసెట్ దరఖాస్తు గడువు పెంపు
కేయూ క్యాంపస్: రాష్ట్రంలోని కళాశాలల్లో 2021– 22 విద్యాసంవత్సరానికి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఐసెట్ దరఖాస్తు గడువును జూలై 8వ తేదీ వరకు పొడిగించారు. అప్పటివరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా దర ఖాస్తు చేసుకోవచ్చని టీఎస్ ఐసెట్ కన్వీనర్, కేయూ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాల ఆచార్యులు కె.రాజిరెడ్డి పేర్కొన్నారు.
పీఈసెట్ దరఖాస్తుల గడువు ఈ నెల 15 వరకు పెంపు
సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పీఈసెట్ దరఖాస్తుల గడువును జూలై 15వ తేదీ వరకు పొడిగించారు. అప్పటివరకు విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పీఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సత్యనారాయణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
మోడల్ స్కూల్స్‌లో ప్రవేశాలకు గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: మోడల్ స్కూళ్లలో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షకు ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును జూలై 7వ తేదీ వరకు పొడిగించారు. ఆరో తరగతిలో కొత్త ప్రవేశాలు, 7 నుంచి టెన్త్ వరకు మిగిలిన సీట్లలో ప్రవేశాల కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. వివరాలను (https://telanganams.cgg.gov.in) పొందవచ్చని తెలిపింది.