lpcet
-
విద్యా సమాచారం: దరఖాస్తుల గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: ఐటీఐ పూర్తయిన విద్యార్థులు లేటరల్ ఎంట్రీ కింద పాలిటెక్నిక్ డిప్లొమాలో చేరేందుకు నిర్వహించే ఎల్పీసెట్– 2021 దరఖాస్తుల గడువును జూలై 12వ తేదీ వరకు పొడిగించారు. అప్పటివరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా విద్యార్థులు దరఖా స్తు చేసుకోవచ్చని రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి (ఎస్బీటీఈటీ) కార్యదర్శి డాక్టర్ శ్రీనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. రూ. 100 ఆలస్య రుసుముతో జూలై 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పరీక్షను జూలై 25వ తేదీన నిర్వహిస్తామని వెల్లడించారు. టీఎస్ ఐసెట్ దరఖాస్తు గడువు పెంపు కేయూ క్యాంపస్: రాష్ట్రంలోని కళాశాలల్లో 2021– 22 విద్యాసంవత్సరానికి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఐసెట్ దరఖాస్తు గడువును జూలై 8వ తేదీ వరకు పొడిగించారు. అప్పటివరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా దర ఖాస్తు చేసుకోవచ్చని టీఎస్ ఐసెట్ కన్వీనర్, కేయూ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ఆచార్యులు కె.రాజిరెడ్డి పేర్కొన్నారు. పీఈసెట్ దరఖాస్తుల గడువు ఈ నెల 15 వరకు పెంపు సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పీఈసెట్ దరఖాస్తుల గడువును జూలై 15వ తేదీ వరకు పొడిగించారు. అప్పటివరకు విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పీఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సత్యనారాయణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మోడల్ స్కూల్స్‌లో ప్రవేశాలకు గడువు పెంపు సాక్షి, హైదరాబాద్: మోడల్ స్కూళ్లలో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షకు ఆన్లైన్ దరఖాస్తుల గడువును జూలై 7వ తేదీ వరకు పొడిగించారు. ఆరో తరగతిలో కొత్త ప్రవేశాలు, 7 నుంచి టెన్త్ వరకు మిగిలిన సీట్లలో ప్రవేశాల కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. వివరాలను (https://telanganams.cgg.gov.in) పొందవచ్చని తెలిపింది. -
ఎల్పీసెట్ నోటిఫికేషన్ విడుదల
అమరావతి: భాషా పండితుల కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఎల్పీసెట్)కు నోటిఫికేషన్‌ను విడుదలైంది. జూలై 6 నుంచి 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆన్లైన్లో aplpcet.apcfss.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. వెబ్సైట్లో అర్హత తదితర వివరాలు పొందుపరిచారు. ఆన్లైన్ మినహా మాన్యువల్‌గా వచ్చే దరఖాస్తులను స్వీకరించరు. జూలై 26 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడింగ్ చేసుకోవచ్చు. జూలై 31న ఎల్పీసెట్ పరీక్ష నిర్వహిస్తారు. ఆగస్టు 1న ఎల్పీసెట్ ఫలితాలు విడుదల చేస్తారు. ఆగస్టు 9 నుంచి 11 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. ఆగస్టు 13,14 తేదీల్లో కౌన్సిలింగ్ ఉంటుందని మంత్రి గంటా శ్రీనివాస రావు తెలిపారు. -
ఎల్పీ సెట్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన
బుక్కపట్నం: బుక్కపట్నం డీఎడ్ కళాశాలలో మంగశవారం 72 మంది లాంగ్వేజ్ పండిట్ (ఎల్పీ) సెట్ అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించినట్లు ప్రిన్సిపాల్ జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఎల్పీ సెట్ ద్వారా తెలుగు, హిందీ పండిట్ కోర్సుకు అర్హత సాధించిన మెరిట్ జాబితా ప్రకారం అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలన బుధవారం కూడా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. -
డైట్లో ఎల్పీ సెట్ కౌన్సెలింగ్
కార్వేటినగరం : ఎల్పీ సెట్ తెలుగు, హిందీ పండిట్లకు మంగళవారం ఉదయం 11 గంటలకు జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్)లో ఇన్చార్జి ప్రిన్సిపల్ సాయిప్రసాద్ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో తెలుగు పండిట్ కోర్సులకు కుప్పంలోని ద్రవిడ యూనివర్సిటీలో 50 సీట్లు ఉన్నాయన్నారు. హిందీ పండిట్ కోర్సులకు జిల్లాలో 250 సీట్లు ఉన్నాయని చెప్పారు. ఇందులో భాగంగా మంగళవారం తెలుగుకు 23 మంది, హిందీకి 11 మంది కౌన్సెలింగ్‌కు హాజరయ్యారని తెలిపారు. సర్టిఫికెట్లు, అలాట్మెంట్ కాపీలను పరిశీలించి, మీసేవా కేంద్రంలో రుసుం చెల్లించిన అభ్యర్థులకు సీట్ల కేటాయింపు కాపీని అందించినట్లు చెప్పారు. కౌన్సెలింగ్‌లో అధ్యాపకులు డాక్టర్ గంగిరెడ్డి, ఉమాశంకర్, సుధీర్, అయ్యప్ప, సూపరింటెండెంట్ ఆండాలు తదితరులు పాల్గొన్నారు.