
ప్రతీకాత్మక చిత్రం
అమరావతి: భాషా పండితుల కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఎల్‌పీసెట్)కు నోటిఫికేషన్‌ను విడుదలైంది. జూలై 6 నుంచి 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆన్‌లైన్‌లో aplpcet.apcfss.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. వెబ్‌సైట్‌లో అర్హత తదితర వివరాలు పొందుపరిచారు. ఆన్‌లైన్ మినహా మాన్యువల్‌గా వచ్చే దరఖాస్తులను స్వీకరించరు.
జూలై 26 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడింగ్ చేసుకోవచ్చు. జూలై 31న ఎల్‌పీసెట్ పరీక్ష నిర్వహిస్తారు. ఆగస్టు 1న ఎల్‌పీసెట్ ఫలితాలు విడుదల చేస్తారు. ఆగస్టు 9 నుంచి 11 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. ఆగస్టు 13,14 తేదీల్లో కౌన్సిలింగ్ ఉంటుందని మంత్రి గంటా శ్రీనివాస రావు తెలిపారు.