ఏపీ: 20న అసెంబ్లీ, మండలి సమావేశాలు | AP Assembly And Council Meetings From The 20th Of This Month | Sakshi
Sakshi News home page

ఏపీ: 20న అసెంబ్లీ, మండలి సమావేశాలు

Published Fri, May 14 2021 9:51 AM | Last Updated on Fri, May 14 2021 9:51 AM

AP Assembly And Council Meetings From The 20th Of This Month - Sakshi

సాక్షి, అమరావతి: పూర్తి స్థాయి రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు ఈ నెల 20వ తేదీన అసెంబ్లీతో పాటు శాసన మండలి సమావేశం కానుంది. ఈ మేరకు గవర్నర్‌ విశ్వ భూషణ్‌ హరిచందన్‌ గురువారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు రెండు చోట్లా సమావేశం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. కోవిడ్‌–19 ఉధృతి, వ్యాక్సినేషన్‌ నేపథ్యంలో ఈ సమావేశాలను ఒక రోజుకే పరిమితం చేయాలా? లేదా మరి కొన్ని రోజులు నిర్వహించాలా అనే విషయంపై శాసన సభా వ్యవహారాల సలహా కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

చదవండి: ఏపీ: మత్స్యకారులకు గుడ్‌ న్యూస్‌..
సీఎం జగన్‌ లేఖతోనే కదలిక 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement