ప్రశాంతంగా ముగిసిన ఐసెట్
ప్రశాంతంగా ముగిసిన ఐసెట్
Published Wed, May 3 2017 12:18 AM | Last Updated on Tue, Sep 5 2017 10:13 AM
కర్నూలు(సిటీ) : ఐసెట్–2017 ఆన్‌లైన్ ప్రవేశ పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా జరిగాయి. ఈ పరీక్ష మొట్టమొదటిసారిగా ఆన్‌లైన్‌లో నిర్వహించడంతో కొంతమంది అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెకండ్ సెషన్ వారీగా పరీక్షలు జరిగాయి. జిల్లాలో కర్నూలు, నంద్యాల, ఎమ్మిగనూరులలో ఏర్పాటు చేసిన 12 కేంద్రాల్లో 4,759 మంది విద్యార్థులకు గాను 4,335 మంది హాజరయ్యారు.
Advertisement
Advertisement