నేటి నుంచి ఐసెట్ కౌన్సిలింగ్
Published Sun, Jul 24 2016 11:33 PM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM
మురళీనగర్: ఐసెట్‌లో ర్యాంకులు పొందిన అభ్యర్థులు ఎంబీఏలో చేరడానికి సోమవారం నుంచి కౌన్సిలింగ్ ఐదు రోజుల పాటు నిర్వహిస్తామని పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ డి.ఫణీంద్ర ప్రసాద్ చెప్పారు. పాలిటెక్నిక్ కాలేజీతో పాటు కంచరపాలెం ప్రభుత్వ కెమికల్ ఇంజనీరింగు కాలేజీలల్లోని కౌన్సెలింగు కేంద్రాలకు అభ్యర్థులు వారికి ర్యాంకులకు కేటాయించిన షెడ్యూల్ ప్రకారం హాజరు కావాల్సి ఉంటుంది. మొదటి రోజు పాలిటెక్నిక్ కాలేజీలో 1–5,500ర్యాంకులు, కెమికల్ ఇంజినీరింగు కాలేజీలో 5,501–11,000ర్యాంకుల వారికి సర్టిఫికెట్ల పరిశీలన చేస్తారు. ఎస్టీ కేటగిరి విద్యార్థులు(1–11,000ర్యాంకుల వరకు) అందరూ పాలిటెక్నిక్ కాలేజీకి హాజరు కావాల్సి ఉంటుంది. అయితే డిగ్రీలో ఓసీ విద్యార్థులు 50% (49.50%), బీసీ/ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు 45%(44.50%)మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ విద్యార్థులురూ.500లు, ఇతరులు రూ.1,000లు రిజిస్ట్రేషను ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
సర్టిఫికెట్లు: విద్యార్థులు తమతోపాటు ఐసెట్ ర్యాంకు కార్డు, ఐసెట్ హాల్ టికెట్, ఎస్‌ఎస్‌సి మార్కుల సర్టిఫికెట్, ఇంటర్మీడియట్ మార్కుల మెమో, డిగ్రీ ప్రొవిజనల్/ఓడీ/అన్ని సంవత్సరాల మార్కుల మెమొరాండమ్‌లు, 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికెట్, జనవరి1, 2016తర్వాత పొందిన ఆదాయ ధవపత్రం, కులం ధ్రువపత్రాలు రెండు సెట్ల జెరాక్సి కాపీలు, ఒరిజినల్స్‌తో హాజరు కావాల్సి ఉంటుంది.
Advertisement