counsiling
-
487మంది కానిస్టేబుళ్ల బదిలీ
సాక్షి, ఖమ్మం : ఉమ్మడి జిల్లాలైన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, భూపాలపల్లి జయశంకర్ జిల్లాల్లోని 487మంది కానిస్టేబుళ్లను బదిలీ చేస్తూ సీపీ తఫ్సీర్ ఇక్బాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీలపై వారం రోజులుగా కౌన్సిలింగ్ నడుస్తోంది. బదిలీలకు మొదటి ప్రాధాన్యంగా మెడికల్, రెండవ ప్రాధాన్యంగా స్పౌస్ (భార్య ఉద్యోగిని అయితే) పరిగణించారు. ఏజెన్సీలో మూడేళ్లు, నగరాల్లో ఐదేళ్లపాటు పనిచేసిసన వారిని బదిలీ చేశారు. త్రిశుంకు స్వర్గంలో అటాచ్మెంట్ సిబ్బంది అవినీతి ఆరోపణలతోపాటు ఏళ్లతరబడి ఒకేచోట పనిచేస్తున్న ఐడీ పార్టీ సిబ్బంది, డ్రైవర్లు, గన్‌మన్, ఇతర కానిస్టేబుళ్లను ఖమ్మం కమిషనరేట్‌లో 77 మందిని హెడ్ క్వార్టర్స్‌కు సీపీ అటాచ్మెంట్ చేసిన విషయం పాఠకులకు తెలిసిందే. దీనిపై కమిషనర్‌ను పోలీస్ అధికారుల సంఘం నాయకులు కలిశారు. వారిని (అటాచ్మెంట్లో ఉన్న వారిని) బదిలీ చేయాలని కోరారు. సీపీ మాత్రం, మూడు నెలలపాటు అటాచ్‌మెంట్‌లోనే విధులు నిర్వర్తించాలని ప్రకటించిన విషయం విదితమే. శనివారం విడుదలైన కానిస్టేబుళ్ల బదిలీ జాబితాలో.. అటాచ్‌మెంట్‌కు గురైన 77మంది ఉన్నారు. ‘‘బదిలీ అయినవారు వెంటనే విధుల్లో చేరాలి’’ అని, సీపీ స్పష్టంగా ఆదేశించారు. అయితే, అటాచ్మెంట్లో ఉన్నవారు వెంటనే విధుల్లో చేరాలా..? (సీపీ అన్నట్టుగా) మూడు నెలల తర్వాత చేరాలా...? అనే సందిగ్ధంలో ఉన్నారు. దీనిపై సోమవారం స్పష్టత వచ్చే అవకాశముంది. -
ఊపందుకున్న బదిలీల కౌన్సెలింగ్
ఏలూరు (ఆర్ఆర్ పేట) : ఈ నెల 22 నుంచి ప్రారంభించిన ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ మంగళవారం ఊపందుకుంది. తొలి 3 రోజుల్లో సాంకేతిక సమస్యలతో ఆలస్యమైన కౌన్సెలింగ్ మంగళవారం సజావుగానే సాగింది. ఈ కౌన్సెలింగ్‌లో ఉదయం 11.30 గంటలకు స్కూల్ అసిస్టెంట్లు ఇంగ్లిష్‌కు వెబ్సైట్ తెరుచుకోగా, మధ్యాహ్నం 12.30 గంటలకు గణితం స్కూల్ అసిస్టెంట్ల కౌన్సెలింగ్‌కు సైట్ తెరుచుకుంది. ఈ సందర్భంగా ఇంగ్లిష్ సబ్జెక్టుకు సంబంధించి 525 మందికి, గణితం సబ్జెక్టుకు సంబంధించి 780 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం 200 మంది పీడీలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. కాగా బుధవారం ఉదయం 9 గంటల నుంచి ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్లు 522 మందికి ఎలిమెంటరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు 151 మందికి, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి బయోలాజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్లు 494 మందికి, సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్లు 393 మందికి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని జిల్లా విద్యాశాఖాధికారి ఆర్ఎస్ గంగాభవాని తెలిపారు. -
ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలో ఐటీఐలో 2వ విడత ప్రవేశానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కన్వీనర్ వేమారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులకు ఈనెల 11 నుంచి 20వ తేదీలోపు దరకాస్తు చేసుకోవాలని సూచించారు. ఏ కళాశాలలో అభ్యర్థులు ప్రవేశం పొందాలనుకుంటున్నారో ఆ కళాశాలలో మాత్రమే దరఖాస్తులు సమర్పించాలని కోరారు. అన్ని ప్రభుత్వ ఐటిఐలలో ఈనెల 24న కౌన్సిలింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. ప్రైవేటు ఐటిఐలలో ప్రవేశం కోసం ఈనెల 27 నుంచి 30వ తేదీ వరకు సంబంధిత ఐటీఐలలో జరుగుతుందని పేర్కొన్నారు. -
నేటి నుంచి ఐసెట్ కౌన్సిలింగ్
మురళీనగర్: ఐసెట్‌లో ర్యాంకులు పొందిన అభ్యర్థులు ఎంబీఏలో చేరడానికి సోమవారం నుంచి కౌన్సిలింగ్ ఐదు రోజుల పాటు నిర్వహిస్తామని పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ డి.ఫణీంద్ర ప్రసాద్ చెప్పారు. పాలిటెక్నిక్ కాలేజీతో పాటు కంచరపాలెం ప్రభుత్వ కెమికల్ ఇంజనీరింగు కాలేజీలల్లోని కౌన్సెలింగు కేంద్రాలకు అభ్యర్థులు వారికి ర్యాంకులకు కేటాయించిన షెడ్యూల్ ప్రకారం హాజరు కావాల్సి ఉంటుంది. మొదటి రోజు పాలిటెక్నిక్ కాలేజీలో 1–5,500ర్యాంకులు, కెమికల్ ఇంజినీరింగు కాలేజీలో 5,501–11,000ర్యాంకుల వారికి సర్టిఫికెట్ల పరిశీలన చేస్తారు. ఎస్టీ కేటగిరి విద్యార్థులు(1–11,000ర్యాంకుల వరకు) అందరూ పాలిటెక్నిక్ కాలేజీకి హాజరు కావాల్సి ఉంటుంది. అయితే డిగ్రీలో ఓసీ విద్యార్థులు 50% (49.50%), బీసీ/ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు 45%(44.50%)మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ విద్యార్థులురూ.500లు, ఇతరులు రూ.1,000లు రిజిస్ట్రేషను ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సర్టిఫికెట్లు: విద్యార్థులు తమతోపాటు ఐసెట్ ర్యాంకు కార్డు, ఐసెట్ హాల్ టికెట్, ఎస్ఎస్సి మార్కుల సర్టిఫికెట్, ఇంటర్మీడియట్ మార్కుల మెమో, డిగ్రీ ప్రొవిజనల్/ఓడీ/అన్ని సంవత్సరాల మార్కుల మెమొరాండమ్లు, 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికెట్, జనవరి1, 2016తర్వాత పొందిన ఆదాయ ధవపత్రం, కులం ధ్రువపత్రాలు రెండు సెట్ల జెరాక్సి కాపీలు, ఒరిజినల్స్‌తో హాజరు కావాల్సి ఉంటుంది. -
హిజ్రాలకు కౌన్సిలింగ్
వరంగల్ అర్బన్: రైళ్లలో ప్రయాణికుల పట్ల హిజ్రాల ఆగడాలు ఎక్కువ అవుతుండటంతో వరంగల్ జిల్లా రైల్వే పోలీసులు శుక్రవారం వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. సుమారు 100 మంది హిజ్రాలకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. రైళ్లలో ప్రయాణికుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించవద్దని వారికి సూచించారు. జుగుప్సాకరమైన కార్యక్రమాలకు పాల్పడి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించవద్దన్నారు. అలాంటి పనులకు పాల్పడితే రైల్వే చట్టప్రకారం శిక్ష తప్పదని హెచ్చరించారు. కౌన్సిలింగ్లో వరంగల్ జీఆర్పీ సీఐ రవికుమార్, ఎస్ఐ గోవర్ధన్, ఆర్పీఎఫ్ సీఐ హరిబాబు,ఎస్ అనామిక మిశ్రాలు నిర్వహించారు.