ఊపందుకున్న బదిలీల కౌన్సెలింగ్
Published Tue, Jul 25 2017 11:47 PM | Last Updated on Tue, Sep 5 2017 4:51 PM
ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : ఈ నెల 22 నుంచి ప్రారంభించిన ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ మంగళవారం ఊపందుకుంది. తొలి 3 రోజుల్లో సాంకేతిక సమస్యలతో ఆలస్యమైన కౌన్సెలింగ్ మంగళవారం సజావుగానే సాగింది. ఈ కౌన్సెలింగ్‌లో ఉదయం 11.30 గంటలకు స్కూల్ అసిస్టెంట్లు ఇంగ్లిష్‌కు వెబ్‌సైట్ తెరుచుకోగా, మధ్యాహ్నం 12.30 గంటలకు గణితం స్కూల్ అసిస్టెంట్ల కౌన్సెలింగ్‌కు సైట్ తెరుచుకుంది. ఈ సందర్భంగా ఇంగ్లిష్ సబ్జెక్టుకు సంబంధించి 525 మందికి, గణితం సబ్జెక్టుకు సంబంధించి 780 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం 200 మంది పీడీలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. కాగా బుధవారం ఉదయం 9 గంటల నుంచి ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్లు 522 మందికి ఎలిమెంటరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు 151 మందికి, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి బయోలాజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్లు 494 మందికి, సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్లు 393 మందికి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని జిల్లా విద్యాశాఖాధికారి ఆర్‌ఎస్ గంగాభవాని తెలిపారు.
Advertisement