ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
Published Tue, Aug 9 2016 11:29 PM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలో ఐటీఐలో 2వ విడత ప్రవేశానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కన్వీనర్ వేమారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులకు ఈనెల 11 నుంచి 20వ తేదీలోపు దరకాస్తు చేసుకోవాలని సూచించారు. ఏ కళాశాలలో అభ్యర్థులు ప్రవేశం పొందాలనుకుంటున్నారో ఆ కళాశాలలో మాత్రమే దరఖాస్తులు సమర్పించాలని కోరారు. అన్ని ప్రభుత్వ ఐటిఐలలో ఈనెల 24న కౌన్సిలింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. ప్రైవేటు ఐటిఐలలో ప్రవేశం కోసం ఈనెల 27 నుంచి 30వ తేదీ వరకు సంబంధిత ఐటీఐలలో జరుగుతుందని పేర్కొన్నారు.
Advertisement
Advertisement