క్షేత్రస్థాయి సైనికులను కలుసుకోవడం ఆనందదాయకం.. సీఎం జగన్‌ ట్వీట్‌ | Cm Jagan Tweet On Secretariat Conveners | Sakshi
Sakshi News home page

క్షేత్రస్థాయి సైనికులను కలుసుకోవడం ఆనందదాయకం.. సీఎం జగన్‌ ట్వీట్‌

Apr 19 2023 7:26 AM | Updated on Apr 19 2023 8:02 AM

Cm Jagan Tweet On Secretariat Conveners - Sakshi

సచివాలయాల్లోని ప్రతి ఇంటిని అవిశ్రాంతంగా సందర్శించి.. రాష్ట్ర ప్రగతి, అభివృద్ధి సందేశాన్ని ప్రతి గడపకూ తీసుకెళ్లిన తమ సైనికుల్లో కొందరిని కలుసుకోవడం పట్ల చాలా ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.

సాక్షి, అమరావతి: సచివాలయాల్లోని ప్రతి ఇంటిని అవిశ్రాంతంగా సందర్శించి.. రాష్ట్ర ప్రగతి, అభివృద్ధి సందేశాన్ని ప్రతి గడపకూ తీసుకెళ్లిన తమ సైనికుల్లో కొందరిని కలుసుకోవడం పట్ల చాలా ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.

జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొన్న పలువురు సచివాలయ కన్వీనర్లు మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. అనంతరం తనను కలిసిన వారి ఫొటోలను జత చేసి సీఎం వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. అంకితభావంతో పనిచేసే క్షేత్ర స్థాయి సైనికులను కలుసుకోవడం పట్ల ఆనందంగా ఉందని తెలిపారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కుటుంబానికి ఇది గర్వకారణమన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement