convener
-
సమన్వయ కమిటీ! నితీశ్ సారథ్యంలో సీఎంపీ: జేడీయూ
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్డీఏ సర్కారు మనుగడకు కీలకంగా మారిన భాగస్వామ్య పక్షాలు బీజేపీ ముందు పలు డిమాండ్లు పెడుతున్నాయి. అందులో భాగంగా ఎన్డీఏ సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని జేడీ(యూ) డిమాండ్ చేస్తోంది. దాని కనీ్వనర్‌గా పార్టీ చీఫ్, బిహార్ సీఎం నితీశ్‌కుమార్ ఉండాలని కోరుతోంది. అంతేగాక ఎన్డీఏకు కనీస ఉమ్మడి ప్రణాళిక (సీఎంపీ) ఉండాలని, దాని అమలు కమిటీ సారథ్యాన్ని కూడా నితీశ్‌కు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. దీనికి అదనంగా నాలుగు కేబినెట్ బెర్తులు, బిహార్‌కు ప్రత్యేక హోదా తదితరాలను నితీశ్ ఇప్పటికే బీజేపీ పెద్దల ముందుంచారు. టీడీపీ కూడా నాలుగైదు కేబినెట్, ఒక సహాయ మంత్రి, లోక్‌సభ స్పీకర్ పదవి డిమాండ్ చేస్తున్నట్టు వార్తలు రావడం తెలిసిందే. టీడీపీ, జేడీ(యూ) డిమాండ్లకు బీజేపీ అంగీకరించడం లేదని తెలుస్తోంది. టీడీపీకి ఒకకేబినెట్, ఒకట్రెండు సహాయ పదవులను ఆఫర్ చేసినట్టు చేసినట్టు సమాచారం. జేడీ(యూ), ఇతర మిత్రపక్షాల డిమాండ్లపై వాటితో చర్చలు సాగుతున్నట్టు తెలుస్తోంది. -
‘ఇండియా’ చైర్‌పర్సన్‌గా సోనియా గాంధీ!
పట్నా: 26 పార్టీలతో కూడిన విపక్ష ‘ఇండియా’ కూటమి సమన్వయ కమిటీ చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ నేత సోనియా గాందీ, కన్వినర్‌గా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కూటమి తదుపరి సమావేశం ఆగస్టు 31, సెప్టెంబర్ 1న ముంబైలో జరుగనుంది. కూటమికి చెందిన 11 మంది సభ్యుల సమన్వయ కమిటీ చైర్‌పర్సన్‌గా సోనియా గాం«దీని, కన్వినర్‌గా నితీశ్ కుమార్‌ను ఈ సమావేశాల్లో ఎన్నుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. -
క్షేత్రస్థాయి సైనికులను కలుసుకోవడం ఆనందదాయకం.. సీఎం జగన్ ట్వీట్
సాక్షి, అమరావతి: సచివాలయాల్లోని ప్రతి ఇంటిని అవిశ్రాంతంగా సందర్శించి.. రాష్ట్ర ప్రగతి, అభివృద్ధి సందేశాన్ని ప్రతి గడపకూ తీసుకెళ్లిన తమ సైనికుల్లో కొందరిని కలుసుకోవడం పట్ల చాలా ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొన్న పలువురు సచివాలయ కన్వీనర్లు మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. అనంతరం తనను కలిసిన వారి ఫొటోలను జత చేసి సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. అంకితభావంతో పనిచేసే క్షేత్ర స్థాయి సైనికులను కలుసుకోవడం పట్ల ఆనందంగా ఉందని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి ఇది గర్వకారణమన్నారు. It was a pleasure meeting some of our dedicated grassroots soldiers, who have tirelessly visited every household in their Sachivalayams, taking our message of progress and development to every doorstep. Proud of our @YSRCParty Kutumbam! pic.twitter.com/b818JK0EKM — YS Jagan Mohan Reddy (@ysjagan) April 18, 2023 -
‘ఆప్’ జాతీయ కన్వీనర్‌గా మూడోసారి కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)జాతీయ కన్వీనర్‌గా వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. ఆదివారం ఆ పార్టీ జాతీయ కార్యనిర్వహక సమావేశం వర్చువల్‌గా నిర్వహించారు. కేజ్రీవాల్‌ను జాతీయ కన్వీనర్‌గా ఎన్నుకున్నారు. ‘ఆప్’ జాతీయ కార్యదర్శిగా పంకజ్ గుప్తా, జాతీయ కోశాధికారిగా ఎన్.డి.గుప్తా ఎన్నికయ్యారు. ఇక ఐదేళ్ల పదవీ కాలానికి ఆఫీస్ బేరర్లను కూడా ఎన్నుకున్నారు. కేజ్రీవాల్‌తో సహా 34 మంది సభ్యులతో కూడిన ఎగ్జిక్యూటివ్ బాడీని ఏర్పాటు చేశారు. పార్టీ జాతీయ కన్వీనర్‌గా కేజ్రీవాల్ పేరును ఎగ్జిక్యూటివ్ బాడీ సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. పార్టీ కోసం, పార్టీ సిద్ధాంతాల అమలు కోసం కేజ్రీవాల్ అలుపెరుగని కృషి సాగిస్తున్నారని, జాతీయ కన్వీనర్‌గా ఆయనను వరుసగా మూడోసారి ఎన్నుకోవడం సముచితమైన నిర్ణయమని ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ప్రకటనలో వెల్లడించింది. త్వరలో మరోసారి నిర్వహించనున్న జాతీయ కార్యనిర్వాహక భేటీలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించనున్నట్లు పేర్కొంది. -
సెట్ కన్వీనర్లు ఖరారు
సాక్షి, హైదరాబాద్: 2020–21 విద్యా సంవత్సరంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సెట్ (కామన్ ఎంట్రన్స్ టెస్టు్ట)ల కన్వీనర్లను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఈ మేరకు సోమవారం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. 2020–21 విద్యా సంవత్సరం సెట్లు నిర్వహించే వర్సిటీలను ఇదివరకే ఖరారు చేసిన టీఎస్సీహెచ్ఈ.. కన్వీనర్ల నియామకాలకు ఆయా వర్సిటీల నుంచి ముగ్గురి పేర్లను ప్రతిపాదించాలని సూచించింది. దీంతో ముగ్గురు చొప్పున పేర్లను టీఎస్సీహెచ్ఈకి ఇచ్చిన నేపథ్యంలో సీనియార్టీ ఆధారంగా ఉన్నత విద్యామండలి కన్వీనర్లను ఎంపిక చేసింది. ఎంసెట్ కన్వీనర్‌గా జేఎన్టీయూహెచ్ ప్రొఫెసర్ గోవర్ధన్ నియమితులయ్యారు. -
ప్రవేశ పరీక్షలకు కన్వీనర్లు వీరే..
హైదరాబాద్: తెలంగాణలో వివిధ వృత్తి విద్యా కోర్సుల ప్రవేశాలకు నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు తెలంగాణ ఉన్నత విద్యామండలి కన్వీనర్లను ప్రకటించింది. ఎంసెట్ కన్వీనర్‌గా జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదయ్య, ఈ సెట్‌కు ఎ.గోవర్దన్, పీఈ సెట్‌కు ఓయూకు చెందిన ప్రొఫెసర్ సత్యనారాయణ, ఐసెట్‌కు కేయూ ప్రొఫెసర్ ఓంప్రకాశ్‌ను, లాసెట్, పీజీ లాసెట్ కన్వీనర్‌గా కేయూ ప్రొఫెసర్ ఎన్వీ రంగారావును, పీజీ ఈసెట్‌కు కన్వీనర్‌గా ఓయూ ప్రొఫెసర్ సాహిదా సవిదా బేగంను నియమించింది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
‘డిజిటల్’ అధ్యయనానికి కమిటీ
-
‘సహకార’ పద్ధతి సరికాదు
ఎంపీ కవిత వ్యాఖ్యలు అర్థరహితం బోధన్: నిజాంషుగర్స్‌ను సహకార పద్ధతిలో నడపాలనే ఆలోచనును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఫ్యాక్టరీ రక్షణ కమిటీ కన్వీనర్ రాఘవులు డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుని ప్రభుత్వం నడుపుతుందని, పూర్వవైభవం తెస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. రక్షణ కమిటీ ప్రతినిధులతో కలిసి ఆదివారం ఆయన పట్టణంలో విలేకరులతో మాట్లాడారు. ఫ్యాక్టరీ భవిష్యత్‌పై ఎంపీ కవిత ఇటీవల చేసిన ప్రకటన అర్థరహితమన్నారు. రైతులు ముందుకు వస్తే సహకారపద్ధతిలో ఫ్యాక్టరీ నడుపుతామని ఎంపీ ప్రకటించడం సమస్యను పక్కదారిపట్టించే విధంగా ఉందన్నారు. సహకార పద్ధతిలో ఫ్యాక్టరీ నడపలేమని రైతులు, ప్రజాసంఘాలు, రక్షణ కమిటీ ఇదివరకే ప్రభుత్వానికి స్పష్టం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రజల ఆకాంక్షను గుర్తించకుండా మళ్లీ పాతపాటపాడటం సరికాదన్నారు. ప్రైవేట్ యాజమాన్యం లే ఆఫ్ ప్రకటించినా ప్రజాప్రతినిధులు మౌనం వహించారన్నారు. వీఆర్ఎస్ పేరుతో కార్మికులను ఇంటికి పంపిచే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఇప్పటికైనా ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నడపాలని, మొండివైఖరితో వ్యవహరిస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. సమావేశంలో కమిటీ ప్రతినిధులు పీ వరదయ్య, బీ మల్లేశ్, ఎన్ హన్మంత్‌రావు, శంకర్‌గౌ పాల్గొన్నారు. హామీ ఏమైంది..? అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుని నడుపుతామని ఇచ్చిన వాగ్ధానం ఏమైందని ప్రజాసంఘాల జేఏసీ కన్వీనర్ జీ నడ్పిభూమయ్య అన్నారు. పట్టణంలోని నీటిపారుదలశాఖ విశ్రాంతిభవనంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సహకార పద్ధతిలో ఫ్యాక్టరీ నడపాలని ఎంపీ కవిత ప్రకటించడం వెనుక ప్రభుత్వానిది మరో ఆలోచన అని, ఫ్యాక్టరీని సహకారంగంలోకి నెట్టి చేతులు దులుపుకుందామని యోచిస్తోందన్నారు. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో సహకార రంగంలో కొనసాగుతున్న ఫ్యాక్టరీలు నష్టాలో కూరుకుపోయాయన్నారు. మన జిల్లాలోని సారంగాపూర్ ఫ్యాక్టరీ మూతపడిందని, వీటి నుంచి గుణపాఠం నేర్చుకోకుండా ప్రకటనలు చేయడం తగదన్నారు. సమావేశంలో ప్రజా సంఘాల జేఏసీ కో కన్వీనర్ ఎల్ చిన్న పర్వయ్య, ప్రధాన కార్యదర్శి గౌతం కుమార్, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలో ఐటీఐలో 2వ విడత ప్రవేశానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కన్వీనర్ వేమారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులకు ఈనెల 11 నుంచి 20వ తేదీలోపు దరకాస్తు చేసుకోవాలని సూచించారు. ఏ కళాశాలలో అభ్యర్థులు ప్రవేశం పొందాలనుకుంటున్నారో ఆ కళాశాలలో మాత్రమే దరఖాస్తులు సమర్పించాలని కోరారు. అన్ని ప్రభుత్వ ఐటిఐలలో ఈనెల 24న కౌన్సిలింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. ప్రైవేటు ఐటిఐలలో ప్రవేశం కోసం ఈనెల 27 నుంచి 30వ తేదీ వరకు సంబంధిత ఐటీఐలలో జరుగుతుందని పేర్కొన్నారు. -
‘కర్కశత్వం’పై కదలిక
♦ జిల్లా మానవ హక్కుల వేదిక కన్వీన ర్ రాకతో కదిలిన అధికార గణం ♦ ఘటన జరిగి వారం గడుస్తున్నా పట్టించుకోని అధికారులు ♦ అధికారుల తీరుపై మండిపడ్డ జయశ్రీ ♦ పిల్లలను జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖకు తరలించేందుకు చర్యలు లక్కిరెడ్డిపల్లె : జిల్లా మానవ హక్కుల వేదిక కన్వీనర్ రాకతో ఎట్టకేలకు అధికారుల్లో కదలిక వచ్చింది. మండలంలోని రాయచోటి -వేంపల్లె మార్గంలో ప్రజాచైతన్య సేవాసంఘం ఆధ్వర్యంలో నడుస్తున్న అనాథాశ్రమంలో అటెండర్ సంపూర్ణమ్మ రూ.450 నగదు పోయిందంటూ అనాథ పిల్లల చేతుల్లో కర్పూరం వెలిగించి ప్రమాణం చేయించిన ఘటనపై సాక్షిలో కథనం ప్రచురితమైంది. నాలుగు రోజులు గడుస్తున్నా అధికారుల్లో చలనం రాకపోవడంతో సోమవారం జిల్లా మానవ హక్కుల వేదిక కన్వీనర్ జయశ్రీ రాకతో అధికార బృందం కట్టకట్టుకొని ప్రజా చైతన్య సేవా సంఘం అనాథాశ్రమానికి పరుగులు పెట్టారు. పిల్లలు పాఠశాలకు వెళ్లారని తెలిసి బాధిత విద్యార్థులైన నాగార్జున, నాగరాజు, నాగమల్లేష్లను పిలిపించి జరిగిన విషయంపై ఆరా తీశారు. ఆ విద్యార్థులు తమను కర్పూరం వెలిగించి కాల్చిందని చెబుతుంటే ఒళ్లు గగుర్పాటుకు గురై వెంటనే మండల విద్యాధికారి, తహసీల్దార్, ఎంపీడీఓ, సీడీపీఓ, సీఐ, ఎస్ఐలతో పాటు జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ చైర్ పర్సన్‌తో ఫోన్లో సంప్రదించారు. వెంటనే అనాథ పిల్లలకు మంచి సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని, లేదంటే రాష్ట్ర మానవహక్కుల వేదికకు నివేదిస్తానని చెప్పడంతో అధికారులందరూ అరగంటలోపే లక్కిరెడ్డిపల్లెకు వాలిపోయారు. అడిగితే కొడతారు అధికారులు పిల్లలను పిలిపించి ఏం జరిగిందని అడగ్గా అక్కడ జరుగుతున్న తంతును వారికి వివరించారు. వారానికి ఒక్కరోజే స్నానం అని, అది కూడా బట్టలు ఉతికే సబ్బుతో స్నానం చేసుకొనే వారమని పేర్కొన్నారు. స్నానపు గదులు, మరుగుదొడ్లు ఉన్నా తమను మాత్రం రోడ్డుకు అటువైపు వున్న చేతిపంపు వద్దకు తీసుకువెళ్లేవారని వారు చెప్పుకొచ్చారు. ఉదయం గంజి తాగి పాఠశాలకు వచ్చే వారమని చెప్పడంతో అధికారులు కంగుతిన్నారు. పాఠశాలలో నోట్ పుస్తకాలు, స్కూల్ బ్యాగులు ఇస్తే అటెండర్ అన్నీ లాక్కునేదని వారు వాపోయారు. వెంటనే సీజ్ చేయాలి : జయశ్రీ అనంతరం అన్ని శాఖల అధికారులతో కలిసి అనాథాశ్రమాన్ని తనిఖీ చేయగా చెత్తా చెదారంతో కూడిన గదులు, దుర్వాసన వస్తుండంతో వెంటనే సీజ్ చేయాలని జిల్లా మానవ హక్కుల వేదిక కన్వీనర్ జయశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అనాథ పిల్లల కోసం రూ.లక్షలు ఖర్చు చేస్తుంటే ప్రైవేటు వ్యక్తులు కొంత మంది ప్రభుత్వ ఖాజానాకు గండి కొడుతున్నారని, అన్నీ తెలిసి కూడా అధికారులు నిమ్మకుండి పోవడంతో ప్రభుత్వ లక్ష్యాలు నీరుగారిపోతున్నాయని ఆమె వాపోయారు వెంటనే అటెండెర్ సంపూర్ణమ్మతో పాటు చైర్మన్ చెన్నారెడ్డిలపై కేసు నమోదు చేసి అనాథాశ్రమాన్ని సీజ్ చేయాలని ఆమె సూచించారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రొటెక్షన్ అధికారి సునీత తన సిబ్బందికి తెలియజేసి అనాథ పిల్లలను మెరుగైన సౌకర్యాలు ఉన్న చోటకి తరలిస్తామని చెప్పడంతో ఆ పిల్లలు ఆనందం వ్యక్తం చేశారు. తహసీల్దార్ శ్రీరాములు నాయక్, సూపరింటెండెంట్ హైదర్ వల్లీ, సీడీపీఓ క వితాదేవి, ప్రధానోపాధ్యాయుడు పురుషోత్తం రెడ్డి, మానవ హక్కుల వేదిక సంఘం నాయకులు సుబ్బన్న, వీఆర్లోలు నరేంద్రారెడ్డి, గంగాధర్, అన్వర్ బాషా, ఉపాధ్యాయులు శిద్దేశ్వరుడు, శ్రీనివాసులు, దామోదర్‌రెడ్డి, రఘురామయ్య పాల్గొన్నారు. -
స్థానిక ఎన్నికలను సమష్టిగా ఎదుర్కోవాలి
స్థానిక ఎన్నికలను సమష్టిగా ఎదుర్కోవాలని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. పుత్తూరు, న్యూస్‌లైన్: స్థానిక ఎన్నికలను సమష్టిగా ఎదుర్కోవాలని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం నిండ్ర మండలం కొప్పేడు గ్రామం లో షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల సంఘం మాజీ అధ్యక్షుడు రెడ్డివారి భాస్కర్‌రెడ్డి వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభకు పెద్దిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ స్థానిక ఎన్నికల ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై పడనుందని, అందుకే అందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. 25 ఎంపీ స్థానాలు దక్కించుకుంటే కేంద్రంలోనూ జగన్మోహన్రెడ్డి రాజకీయాలను ప్రభావితం చేయగలరన్నారు. వైఎస్సార్సీపీ ప్రారంభంలోనే జెడ్పీటీసీ మాజీ సభ్యులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి పార్టీలో చేరినట్టు గుర్తుచేశారు. కొప్పేడుతో ఉన్న అనుబంధాన్ని పెద్దిరెడ్డి గుర్తుచేసుకున్నారు. పదవులు ఆశించకుండా పార్టీ కోసం శ్రమించే వారికి అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. మహానేత మృతిపై ఇప్పటికీ అనుమానాలే: రోజా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంపై ఇప్పటికీ అనేక అనుమానాలు ఉన్నాయని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యురాలు ఆర్కే రోజా అన్నారు. కాంగ్రెస్ పాలకులు దీనిపై స్పందించకపోవడం శోచనీయమన్నారు. రెడ్డివారి భాస్కర్‌రెడ్డి పార్టీలోకి రావడం శుభపరిణామమన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో సత్తాచాటాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీ సత్యవేడు సమన్వయకర్త ఆదిమూలం, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు భీరేంద్రవర్మ, జిల్లా స్టీరిం గ్కమిటీ సభ్యులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, లక్ష్మీపతి రాజు, శ్యాంలాల్, పార్టీ మండల కన్వీనర్ మనోహర్‌నాయుడు, పుత్తూరు నాయకులు మహేంద్రన్రెడ్డి, మైనారిటీ నాయకుడు మాహిన్ పాల్గొన్నారు. -
పెనుమత్సకే పగ్గాలు
విజయనగరం టౌన్, న్యూస్‌లైన్: వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు నియమితులయ్యా రు. పార్టీ ఆవిర్భావం నుంచి జిల్లా కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సాంబశివరాజుపై అధిష్టానం నమ్మకం ఉంచింది. దీంతో ఆయనకు రెండోసారి జిల్లా పార్టీ పగ్గాలు అప్పగిస్తూ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో ఆదివారం జరిగిన ప్రజాప్రస్థానం ప్లీనరీలో సాంబశివరాజు నియామకాన్ని ప్రకటించారు. ఆయన నియామకంపై పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమాను లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్‌గా శేఖర్‌గౌడ్
సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్‌గా ఈసీ శేఖర్‌గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉత్తర్వులు జారీ చేసినట్లు పార్టీ కేంద్ర కా ర్యాలయం తెలిపింది. ప్రస్తుతంఇబ్రహీంపట్నం నియోజకవర్గం సమన్వయకర్తగా శేఖర్‌గౌడ్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం సాధించే దిశగా కార్యాచర ణ ప్రణాళికను రూపొందిస్తానని శేఖర్‌గౌడ్ ఈ సందర్భంగా ‘సాక్షి’కి తెలిపారు. తనపై నమ్మకంతో పార్టీ అప్పగించిన బాధ్యతలకు సంపూర్ణ న్యాయం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు.