ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు తెలంగాణ ఉన్నత విద్యామండలి కన్వీనర్లను ప్రకటించింది.
ప్రవేశ పరీక్షలకు కన్వీనర్లు వీరే..
Published Fri, Jan 20 2017 2:29 PM | Last Updated on Wed, Sep 5 2018 8:36 PM
హైదరాబాద్: తెలంగాణలో వివిధ వృత్తి విద్యా కోర్సుల ప్రవేశాలకు నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు తెలంగాణ ఉన్నత విద్యామండలి కన్వీనర్లను ప్రకటించింది. ఎంసెట్ కన్వీనర్‌గా జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదయ్య, ఈ సెట్‌కు ఎ.గోవర్దన్, పీఈ సెట్‌కు ఓయూకు చెందిన ప్రొఫెసర్ సత్యనారాయణ, ఐసెట్‌కు కేయూ ప్రొఫెసర్ ఓంప్రకాశ్‌ను, లాసెట్, పీజీ లాసెట్ కన్వీనర్‌గా కేయూ ప్రొఫెసర్ ఎన్వీ రంగారావును, పీజీ ఈసెట్‌కు కన్వీనర్‌గా ఓయూ ప్రొఫెసర్ సాహిదా సవిదా బేగంను నియమించింది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Advertisement
Advertisement