సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో సీట్ల భర్తీ శుక్రవారం ముగిసింది. రెండో విడత కౌన్సెలింగ్ తొలిరోజు మొత్తం 753 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే తొలివిడతలో మిగిలిపోయిన 74 ఎంబీబీఎస్ సీట్లు మొదటి రోజే భర్తీ అయ్యాయి. ఇక బీడీఎస్‌లో భర్తీ అయిన సీట్లు పోనూ ఇంకా 78సీట్లున్నాయి. వీటికి శనివారం కౌన్సెలింగ్ జరుగనుంది.
ఐసెట్ కౌన్సెలింగ్ పూర్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు చేపట్టిన ఐసెట్ చివరి దశ కౌన్సెలింగ్ శుక్రవారంతో ముగిసినట్లు ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ ప్రకటించారు. తొలి దశ కౌన్సెలింగ్‌లో 26,826 సీట్లకు 20,243 మంది కాలేజీల్లో చేరినట్లు పేర్కొన్నారు. చివరి దశ కౌన్సెలింగ్‌లో 6,583 సీట్లను కేటాయించగా 3,893 సీట్లు మిగిలిపోయాయన్నారు. చివరి దశ లో సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 16లోగా ఫీజు చెల్లించి, కాలేజీల్లో ఈ నెల 12 నుంచి 16లోగా చేరాలని, అంతకంటే ముందుగా వెబ్‌సైట్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలన్నారు.
ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్‌కు చివరి అవకాశం
హైదరాబాద్: ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్మీడియెట్ పరీక్ష ఫీజు తత్కాల్ కింద చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు ఓపెన్ స్కూల్ సొసైటీ ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థులు ఈనెల 12 నుంచి 15లోగా పరీక్ష ఫీజుతోపాటు తత్కాల్ కింద అదనంగా రూ. 1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది.
ముగిసిన ఎంబీబీఎస్ సీట్ల భర్తీ
Published Sat, Sep 12 2015 2:16 AM | Last Updated on Sun, Sep 3 2017 9:12 AM
Advertisement