ఐసెట్ ద్వారా ఎంబీఏలో ప్రవేశానికి గాను సోమవారం నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రశాంతంగా జరిగింది.
ఐసెట్ కౌన్సెలింగ్‌కు 768 మంది హాజరు
Published Mon, Jul 25 2016 9:12 PM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM
ఐసెట్ ద్వారా ఎంబీఏలో ప్రవేశానికి గాను సోమవారం నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రశాంతంగా జరిగింది. కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో 1–5500 ర్యాంకు వరకు సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించగా 484 మంది రిజిస్టరు చేసుకున్నారు. కెమికల్ ఇంజనీరింగు కాలేజీలో 5501–11000 ర్యాంకుల వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరపగా 284 మంది సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయించుకున్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో డిగ్రీలో మార్కుల శాతం పరిశీలించాల్సి రావడంతో ఎక్కువ సమయం పట్టింది. దీంతో పాలిటెక్నిక్ కాలేజీలో పొద్దుపోయేవరకు కౌన్సెలింగ్ నిర్వహించారు. మంగళవారం పాలిటెక్నిక్ కాలేజీలో 11,001–16,500 ర్యాంకులు, కెమికల్ ఇంజనీరింగు కాలేజీలో 16,501–22,000 ర్యాంకుల వారికి సర్టిఫికెట్ల పరిశీలన చేస్తారు. పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాళ్లు డి.ఫణీంద్ర ప్రసాద్, డాక్టర్ బి.దేముడు కౌన్సెలింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. ఎస్టీ విద్యార్థులు అందరూ పాలిటెక్నిక్ కాలేజీకి హాజరు కావాల్సి ఉంటుంది.
Advertisement
Advertisement