జేఎన్‌టీయూ (అనంతపురం) : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్–2017 (ఐసెట్) ఫలితాలను ఈ నెల 13న విడుదల చేస్తున్నట్లు ఏపీ కన్వీనర్ ఆచార్య బి.సుధీర్ తెలిపారు. ప్రిలిమినరీ ‘కీ’ని బుధవారం (నేడు) విడుదల చేస్తామన్నారు. ఇందులో అభ్యంతరాలను ఈ నెల ఆరు వరకు పంపవచ్చునని విద్యార్థులకు సూచించారు. అనంతపురం రీజియన్ కేంద్రంలో 88 శాతం హాజరు నమోదైనట్లు వివరించారు. ఐసెట్ ఆన్‌లైన్ రాత పరీక్ష మంగళవారం సజావుగా ముగిసిందన్నారు.