ఏపీ ఐసెట్‌ 2021; ఇవే విజయానికి కీలకం | AP ICET 2021: Exam Date, Prepation Tips, Exam Pattern Full Deatails | Sakshi
Sakshi News home page

ఏపీ ఐసెట్‌ 2021; ఇవే విజయానికి కీలకం

Published Thu, Sep 9 2021 9:21 PM | Last Updated on Thu, Sep 9 2021 9:40 PM

AP ICET 2021: Exam Date, Prepation Tips, Exam Pattern Full Deatails - Sakshi

ఏపీ ఐసెట్‌.. ఆంధ్రప్రదేశ్‌ ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌! ఎంబీఏలో చేరి.. భవిష్యత్తులో మేనేజ్‌మెంట్‌ రంగంలో కొలువులు సాధించాలని కలలు కనే విద్యార్థులు; అదే విధంగా ఎంసీఏ పట్టాతో సాఫ్ట్‌వేర్‌ రంగంలో కెరీర్‌ సొంతం చేసుకోవాలనుకునే అభ్యర్థులకు చక్కటి మార్గం!! ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో ఏపీ ఐసెట్‌ ర్యాంకు ద్వారా ప్రవేశం లభిస్తుంది. వేల మంది రాసే ఈ పరీక్ష.. ఈ నెల(సెప్టెంబర్‌) 17, 18 తేదీల్లో జరుగనుంది. ఈ నేపథ్యంలో.. ఏపీ ఐసెట్‌లో విజయానికి ప్రిపరేషన్‌ టిప్స్‌...

ఎంబీఏ, ఎంసీఏ.. ఈ కోర్సుల పట్ల విద్యార్థుల్లో ఆసక్తి నెలకొంది. గ్రాడ్యుయేషన్‌ స్థాయి కోర్సులు ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో కొంతమంది కార్పొరేట్‌ రంగంలో మేనేజ్‌మెంట్‌ కెరీర్‌ లక్ష్యంగా ఎంబీఏలో చేరుతున్నారు. మరికొందరు ఎంసీఏతో సాఫ్ట్‌వేర్‌ కొలువులు సొంతం చేసుకోవాలని టార్గెట్‌ సెట్‌ చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వేల మంది ప్రతి ఏటా ఐసెట్‌కు హాజరవుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ ఐసెట్‌కు మరో వారం రోజులే సమయం ఉంది. దాంతో విద్యార్థులు ప్రిపరేషన్‌పై పూర్తిస్థాయిలో దృష్టిసారించాలని నిపుణులు సూచిస్తున్నారు. 

ఏపీ ఐసెట్‌ పరీక్ష విధానం
ఏపీ–ఐసెట్‌ 2021ను మూడు సెక్షన్లలో 200 ప్రశ్నలు–200 మార్కులకు నిర్వహించనున్నారు. ఒక్కో సెక్షన్‌లో మళ్లీ ఉప విభాగాలు కూడా ఉంటాయి. సెక్షన్‌ ఏ అనలిటికల్‌ ఎబిలిటీ 75 ప్రశ్నలు–75 మార్కులకు; సెక్షన్‌ బీ కమ్యూనికేషన్‌ ఎబిలిటీ 70 ప్రశ్నలు–70 మార్కులకు; సెక్షన్‌ సీ మ్యాథమెటికల్‌ ఎబిలిటీ 55 ప్రశ్నలు–55 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం రెండున్నర గంటలు. 


విభాగాల వారీగా ప్రిపరేషన్‌

► ప్రస్తుతం సమయంలో విద్యార్థులు ఐసెట్‌ సిలబస్‌లో విభాగాల వారీగా ముఖ్యాంశాలపై ఎక్కువగా దృష్టిపెట్టాలి. 

► డేటా సఫిషియెన్సీ; ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ అంశాల్లో బేసిక్‌ అర్థమెటిక్‌ను పునశ్చరణ చేసుకోవాలి. 

► అర్థమెటిక్‌ విభాగంలో..శాతాలు, లాభ నష్టాలు,నిష్పత్తులు, మెన్సురేషన్,పని–కాలం, పని –సమయం వంటి అంశాలను రివిజన్‌ చేసుకోవాలి. 

► అల్జీబ్రా అండ్‌ జామెట్రికల్‌ ఎబిలిటీ కోసం ట్రిగ్నోమెట్రీ, సెట్స్‌ అండ్‌ రిలేషన్స్, లీనియర్‌ ఈక్వేషన్స్, ప్రోగ్రెషన్స్‌ వంటి టాపిక్స్‌పై నైపుణ్యం సాధించాలి. 

► ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ విభాగంలో.. కోడింగ్, డీ–కోడింగ్, బ్లడ్‌ రిలేషన్, సిరీస్, సిలాజిజమ్, సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌ వంటి అంశాలపై పట్టు సాధించాలి. 

► మ్యాథమెటికల్‌ ఎబిలిటీలో.. ప్రాథమిక సూత్రాలపై అవగాహన పెంచుకోవాలి.

► స్టాటిస్టికల్‌ ఎబిలిటీ కోసం ప్రాబబిలిటీ, ఇన్‌–ఈక్వాలిటీస్‌ అంశాలను ప్రాక్టీస్‌ చేయాలి.
 
► కమ్యూనికేషన్‌ ఎబిలిటీ విభాగంలో.. రాణించేందుకు బేసిక్‌ ఇంగ్లిష్‌ గ్రామర్‌ నైపుణ్యాలు, వొకాబ్యులరీలను ప్రతి రోజు చదవాలి. 

► బిజినెస్‌ అండ్‌ కంప్యూటర్‌ టెక్నాలజీ విభాగంలో.. బిజినెస్‌ టెర్మినాలజీ, కొత్త వ్యాపార విధానాలు, ఆయా సంస్థలు–వాటి క్యాప్షన్లు వంటివి తెలుసుకోవాలి.

► కంప్యూటర్‌ టెర్మినాలజీకి సంబంధించి బేసిక్‌ ఆఫీస్‌ అడ్మినిస్ట్రేషన్‌ టూల్స్, అదే విధంగా కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌–ముఖ్య భాగాలు, వాటి పనితీరు గురించిన ప్రాథమిక నైపుణ్యం పరీక్ష పరంగా కలిసొస్తుంది. 

► రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ విభాగం కోసం అభ్యర్థులు ఇంగ్లిష్‌ దినపత్రికల్లోని ఎడిటోరియల్స్‌పై దృష్టి పెట్టాలి. 


మాక్‌ టెస్టులు

ఐసెట్‌ అభ్యర్థులు ప్రస్తుత సమయంలో పరీక్ష విధానంపై అవగాహన పెంచుకోవాలి. దాంతోపాటు ప్రాక్టీస్‌కు ఎక్కువ సమయం కేటాయించాలి. ఐసెట్‌ వెబ్‌సైట్‌లోని మాక్‌ టెస్ట్‌లను రాయాలి. ఫలితంగా పరీక్ష తీరుతెన్నులు తెలుస్తాయి. దాంతో పరీక్ష హాల్లో వ్యవహరించాల్సిన విధానంపై అవగాహన లభిస్తుంది. 

మోడల్‌ టెస్ట్‌లు
ఈ వారం రోజుల్లో అభ్యర్థులు వీలైనంత మేరకు మోడల్‌ టెస్ట్‌లు రాయడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతి రోజు కనీసం ఒక మోడల్‌ టెస్ట్‌ రాసి.. ఫలితాలు విశ్లేషించుకోవాలి. ఆ విశ్లేషణ ఆధారంగా తమ బలాలు బలహీనతలపై అవగాహన వస్తుంది. అభ్యర్థులు తాము ఇప్పటికీ బలహీనంగానే ఉన్న టాపిక్స్‌ను వదిలేయాలి. బాగా పట్టు ఉన్న అంశాలపై మరింతగా దృష్టిపెట్టాలి. 

షార్ట్‌ నోట్స్‌
ప్రిపరేషన్‌ సమయంలోనే సిలబస్‌ ఆధారంగా.. ఆయా సబ్జెక్ట్‌లు, టాపిక్‌లకు సంబంధించి ముఖ్యమైన అంశాలు, ఫార్ములాలతో షార్ట్‌ నోట్స్‌ రూపొందించుకోవాలి. ఈ షార్ట్‌ నోట్స్‌ ఆధారంగా పునశ్చరణ వేగవంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా డేటా సఫిషియన్సీ, మ్యాథమెటికల్‌ ఎబిలిటీ, అర్థమెటికల్‌ ఎబిలిటీ, అల్జీబ్రా అండ్‌ జామెట్రీ, స్టాటిస్టికల్‌ ఎబిలిటీ విషయంలో షార్ట్‌ నోట్స్‌ ఎంతో మేలు చేస్తుంది.


పరీక్ష హాల్లో టెన్షన్‌ లేకుండా

పరీక్ష హాల్లో అడుగుపెట్టిన అభ్యర్థులు.. ఎలాంటి ఒత్తిడి లేకుండా.. ప్రశాంతంగా వ్యవహరించాలి. ప్రశ్న పత్రంలో పేర్కొన్న నిబంధనలు పూర్తిగా చదివి సమాధానాలు ఇచ్చేందుకు ఉపక్రమించాలి. తొలుత సులువుగా భావించే ప్రశ్నలకు, ఆ తర్వాత ఓ మోస్తరు క్లిష్టత ఉన్న ప్రశ్నలకు, చివరగా అత్యంత క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం గుర్తించే ప్రయత్నం చేయాలి. 

మెరుగైన ర్యాంకుతోనే బెస్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌
ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలు, సీట్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే.. అర్హత సాధించిన అభ్యర్థులకు సీటు దక్కడం పెద్ద కష్టమేమీ కాదు. కాని యూనివర్సిటీ కాలేజీలు, క్యాంపస్‌ కళాశాలలు, టాప్‌–10, టాప్‌–20, టాప్‌–50 ఇన్‌స్టిట్యూట్‌లలో బెస్ట్‌ ర్యాంకుతోనే ప్రవేశం లభించే అవకాశం ఉంది. 


ఏపీ ఐసెట్‌ 2021 సమాచారం

► అర్హత: కనీసం 50శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులు కనీసం 45శాతం మార్కులు సాధించాలి. ఎంసీఏలో చేరాలనుకునే అభ్యర్థులు ఇంటర్మీడియెట్‌/డిగ్రీ స్థాయిలో మ్యాథమెటిక్స్‌ ఒక సబ్జెక్ట్‌గా చదివి ఉండాలి. అర్హత కోర్సు చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

► రూ.అయిదు వేల ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్‌ 13.
► హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ సదుపాయం: సెప్టెంబర్‌ 13 నుంచి

► ఏపీ ఐసెట్‌ పరీక్ష తేదీ: సెప్టెంబర్‌ 17, 18 (ప్రతి రోజు ఉదయం 9 నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు)
► ఫలితాల వెల్లడి: సెప్టెంబర్‌ 30, 2021
► వివరాలకు వెబ్‌సైట్‌: https://sche.ap.gov.in/icet/ICET/ICET_HomePage.aspx

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement