ఆంధ్రప్రదేశ్‌లోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్ పోస్టుల నియామకాలకు అర్హత పరీక్షగా పేర్కొనే.. ‘ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్(ఏపీ సెట్)’కు నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర స్థాయిలో జరిగే ఈ పరీక్షను ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహించనుంది. ఇటీవల ఏపీసెట్–2021 నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో.. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హతలు, పరీక్ష విధానం, సిలబస్ విశ్లేషణతోపాటు ప్రిపరేషన్ టిప్స్...
యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా, లెక్చరర్లుగా చేరాలనుకునే అభ్యర్థు లకు తగిన అకడమిక్ అర్హతలతోపాటు, ఆయా సబ్జెక్టుల్లో లోతైన పరిజ్ఞానం ఉండాలి. అలాంటి అభ్యర్థుల ప్రతిభను, సబ్జెక్టు నైపుణ్యాన్ని అంచనా వేసేందుకు ఉద్దేశించిందే ఏపీ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్(ఏపీ సెట్). ఈ పరీక్షను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 30 సబ్జెక్టుల్లో నిర్వహిస్తున్నారు. ఇందులో సాధించిన స్కోర్ ఆధారంగా లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకంలో ప్రాధాన్యం ఇస్తారు.
అర్హతలు
► యూజీసీ గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం/కాలేజీ నుంచి కనీసం 55శాతం మార్కు లతో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.
► ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ(నాన్ క్రిమీలేయర్)/పీడబ్ల్యూ డీ/ట్రాన్స్ జెండర్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో పీజీ పూర్తిచేయాలి. పోస్టు గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం విద్యార్థులు/ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
► 1991 సెప్టెంబరు 19 నాటికి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన పీహెచ్‌డీ అభ్యర్థులు(అన్ని కేటగిరీల అభ్యర్థులు) పీజీలో కనీసం 50శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది.
► అభ్యర్థులు తాము చదివిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ సబ్జెక్టు సెట్ జాబితాలో లేకుంటే.. ఏదైనా ఇతర సంబంధిత సబ్జెక్టును ఎంచుకోవచ్చు.
పరీక్ష విధానం
► ఏపీసెట్ పరీక్ష ఆఫ్‌లైన్(పెన్ పేపర్) విధానంలో జరుగుతుంది. ఇందులో రెండు పేపర్లు పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి.
► పేపర్–1లో.. టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూ డ్‌ను అన్ని విభాగాల అభ్యర్థులు రాయాల్సి ఉంటుంది. ఈ పేపర్ తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో(బైలింగ్వల్) ఉంటుంది.
► పేపర్–2 పరీక్ష అభ్యర్థి ఏ విభాగంలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారో దానిపై ఉంటుంది.
► పేపర్–1: టీచింగ్/రీసెర్చ్ అప్టిట్యూడ్ :
► ఈ పేపర్ టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్‌పై ఉంటుంది. ఇందులో ఆబ్జెక్టివ్ తరహా మల్టిఫుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఇది అందరూ రాయాల్సిన కామన్ పేపర్. మొత్తం 50 ప్రశ్నలు–100 మార్కులకు పేపర్1 పరీక్ష జరుగుతుంది. ప్రతి సరైన సమాధానానికి రెండు మార్కుల చొప్పున కేటాయించారు. ఎలాంటి నెగెటివ్ మార్కులు లేవు. తెలుగు/ఇంగ్లిష్‌లో ప్రశ్న పత్రం ఉంటుంది. ఈ పేపర్‌కు కేటాయించిన సమయం ఒక గంట మాత్రమే.
► పేపర్1లో.. టీచింగ్ అప్టిట్యూడ్, రీసెర్చ్ అప్టి ట్యూడ్, కాంప్రెహెన్షన్, కమ్యూనికేషన్, మ్యాథ మెటికల్ రీజనింగ్ అండ్ అప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రెటేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ(ఐసీటీ), పీపుల్, డెవలప్‌మెంట్ అండ్ ఎన్విరాన్‌మెంట్, హయ్యర్ ఎడ్యుయేషన్ సిస్టమ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
► పేపర్–2 ఎలక్టివ్ సబ్జెక్ట్: ఇది అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టు(ఎలక్టివ్)కు సంబంధించిన పేపర్. ఇందులో ఆబ్జెక్టివ్ తరహా మల్టిఫుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 100 ప్రశ్నలు–200 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ప్రతి సరైన సమాధానానికి రెండు మార్కుల చొప్పున కేటాయించారు. ఈ పేపర్‌లో ఎలాంటి నెగెటివ్ మార్కుల విధానం లేదు.
► ఏపీ సెట్‌లో మొత్తం 30 సబ్జెక్టులు పేర్కొన్నారు. వీటిల్లో కామర్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ సబ్జెక్టులు రెండు భాషల్లో (తెలుగు/ఇంగ్లిష్) ఉంటాయి. మిగతా సబ్జెక్టులు ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటాయి.
► ఏపీ సెట్ సబ్జెక్టులు: ఆంత్రోపాలజీ, చరిత్ర, కెమికల్ సైన్సెస్, కామర్స్,కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్ అట్మాస్పియరిక్, ఓషన్ అండ్ ప్లానటరీ సైన్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, జాగ్రఫీ, హిందీ, జర్న లిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, లా, లైఫ్ సైన్సె స్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, మేనేజ్ మెంట్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సంస్కృతం, సోషియాలజీ, సోషల్ వర్క్, తెలుగు, ఉర్దూ, విజువల్ ఆర్ట్స్.
ఇలా చదవడం మేలు
► ఏపీసెట్ పరీక్షకు ఇంకా రెండున్నర నెలల సమ యం అందుబాటులో ఉంది. కాబట్టి ఈ విలువైన సమయాన్ని అభ్యర్థులు సమర్థంగా వినియోగించు కోవాలి.
► మొదట రెండు పేపర్ల సిలబస్‌పై సమగ్ర అవగాహన పెంచుకోవాలి.
► ముఖ్యంగా అందరికీ కామన్‌గా ఉండే పేపర్–1 ఎంతో కీలకమైంది. ఈ పేపర్ సిలబస్ కొంత భిన్నంగా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు తొలుత పేపర్1పై దృష్టిపెట్టి ప్రిపరేషన్ సాగించాలి. ఈ పేపర్ సిలబస్‌లో మొత్తం 10 యూనిట్లు ఉన్నాయి. వీటి నుంచి ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో గత ప్రశ్న పత్రాల ద్వారా అంచనాకు రావాలి. ముఖ్యమైన టాపిక్స్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టాలి.
► పేపర్– 2లో.. అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఇది అభ్యర్థి పీజీ స్థాయిలో చదివిన సబ్జెక్టు. కాబట్టి ఓ మాదిరి ప్రిపరేషన్ సాగించినా మంచి మార్కులు స్కోరు చేయవచ్చు. అందుకోసం యూజీసీ గతంలో నిర్వహించిన నెట్ ప్రశ్న పత్రాలు, సెట్ గత పేపర్లను పరిశీలించి.. ప్రిపరేషన్ సాగించాలి.
ముఖ్యమైన తేదీలు
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
► ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 13.09.2021
► ఏపీసెట్ పరీక్ష తేది: 31.10. 2021
► పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, తిరుపతి, కడప, కర్నూలు
► పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://apset.net.in/home.aspx
Comments
Please login to add a commentAdd a comment