Preparation Tips
-
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు.. ఈ టిప్స్ పాటిస్తే జాబ్ మీదే!
సాక్షి,హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామనే సర్కారు ప్రకటనతో నిరుద్యోగుల ఆశలు చిగురించాయి. పోటీ పరీక్షలకు శిక్షణ కోసం కోచింగ్ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. స్టడీ మెటీరియల్ కోసం పుస్తకాల షాపులను, నిపుణులను సంప్రదిస్తున్నారు. మరోవైపు స్టడీ హాళ్లు, లైబ్రరీలు సందడిగా మారాయి. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, చిక్కడపల్లి, అశోక్‌నగర్, దిల్‌సుక్‌నగర్, తదితర ప్రాంతాలోని కోచింగ్ సెంటర్లకు అభ్యర్థులు వెల్లువెత్తుతున్నారు. ఇదంతా ఒకవైపు అయితే, మరోవైపు పోటీ పరీక్షలనగానే ప్రతి ఒక్కరిలోనూ మానసిక ఒత్తిడి ఉంటుంది. ఆందోళనకు గురవుతారు. ఇలాంటి ఒత్తిళ్లను అధిగమించేందుకు సానుకూలమైన దృక్పథంతో అధ్యయనం ఆరంభించాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. లక్ష్యం పట్ల స్పష్టత ఉండాలి.. పోటీ పరీక్షల కోసం సన్నద్ధమయ్యేవారు మొదట స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ఎంపిక చేసుకున్న లక్ష్యం పట్ల బలమైన ఆకాంక్షను కలిగి ఉండాలి. ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చాయి కాబట్టి దరఖాస్తు చేస్తున్నాం అనే మొక్కుబడి వైఖరితో కాకుండా ఆ ఉద్యోగం తనకు ఎందుకు తప్పనిసరి అవసరమనే విషయంపై స్పష్టత ఏర్పర్చుకోవాలి. అనంతరం పరీక్షలకు అవసరమైన మెటీరియల్, కోచింగ్ వంటివి సమకూర్చుకొని మానసిక, శారీరక సంసిద్ధతతో ప్రిపరేషన్ ఆరంభించాలి. సంశయాత్మక వైఖరి కూడదు.. ప్రిపరేషన్ ప్రారంభించిన తర్వాత కూడా చాలా మంది ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. లక్షలాది మందితో పోటీపడడం తనకు సాధ్యం కాదేమోననే ఆందోళనకు గురవుతారు. తమ చుట్టూ ఉన్నవారు బాగా చదువుతున్నారని, తాము మాత్రమే వెనుకబడిపోతున్నామనే భావన కొంతమందిని వెంటాడుతుంది. ఇలాంటి సంశయాత్మక వైఖరి వల్ల చాలా నష్టం వాటిల్లుతుంది. తాము తప్పకుండా విజయం సాధిస్తామనే సానుకూలమైన భావనతో అధ్యయనం మొదలుపెట్టాలి. రాయబోయే పోటీపరీక్షలో తాను విజేతగా నిలవబోతున్నాననే ప్రగాఢమైన నమ్మకంతో సన్నద్ధం కావాలి. కఠినమైన అంశాలపై దృష్టి సారించాలి.. సాధారణంగా చాలా మంది పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే సమయంలో తేలిగ్గా ఉండే అంశాలతో ప్రారంభించి ఆ తర్వాత కఠినమైన అంశాల్లోకి వెళ్తారు. కానీ ఇది సరైన పద్ధతి కాదని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. ఎవరికి వారు తమకు కఠినమైనవిగా అనిపించిన పాఠ్యాంశాలను మొదట ఓ పట్టుపడితే ఆ తర్వాత తేలిగ్గా ఉన్న అంశాలను వేగంగా పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుంది. మన స్థాయిని అంచనా వేసుకోవాలి.. ఇతరులతో పోల్చుకొని తాము వెనుకబడిపోతున్నామని ఆందోళనకు గురికావొద్దు. తోటివారితో పోటీ ఆరోగ్యకరంగా ఉండాలి కానీ తమ ప్రిపరేషన్‌ను నిరుత్సాహానికి గురి చేసేలా ఉండకూడదు. రోజుకు ఎన్ని గంటలు చదివామనే దాని కంటే ఆ రోజు చదివిన అంశాలపై మన అవగాహన ఏ స్థాయిలో ఉంది అనేది అంచనా వేసుకోవడం మంచిది. – డాక్టర్ గీత చల్లా, మానసిక నిపుణులు ప్రశాంతంగా ఉండాలి.. ప్రిపరేషన్ సమయంలో ఆందోళనకు గురైతే ఆరోగ్యం దెబ్బతింటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. యోగా, ప్రాణాయామం, ధ్యానం తప్పనిసరిగా అలవర్చుకోవాలి. దీంతో శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం బాగుంటాయి. అలసట లేకుండా అధ్యయనం చేయగలుగుతారు. సరైన నిద్ర, చక్కటి పోషకాహారం కూడా ఈ సమయంలో ఎంతో అవసరం. – డాక్టర్ సంహిత, సీనియర్ సైకియాట్రిస్ట్ -
TS: ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అక్కడినుంచి చదవాల్సిందే..
సాక్షి, హైదరాబాద్: ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగుల ప్రభుత్వం తీపి కబురు అందించడంతో వారిలో ఆశలు చిగురించాయి. ఉద్యోగాల భర్తీకి సర్కారు చేసిన ప్రకటన అభ్యర్థులకు ఉత్సాహాన్నిచ్చింది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ మరోసారి పోటీపరీక్షల అధ్యయన కేంద్రంగా మారింది. ఏళ్లకేళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురు చూసి ఊళ్లకు వెళ్లిన లక్షలాది మంది తిరిగి నగరానికి చేరుకుంటున్నారు. కోచింగ్ సెంటర్లు, స్టడీహాళ్లు, పుస్తకాల దుకాణాలు కళకళలాడుతున్నాయి. నగరంలోని చిక్కడపల్లి, అశోక్‌నగర్, గాంధీనగర్, అమీర్‌పేట్ తదితర ప్రాంతాలు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులతో సందడిగా మారాయి. మరోవైపు సుమారు 18 వేల పోలీసుల ఉద్యోగాల కోసం పోలీసుశాఖ ఇప్పటికే సన్నాహాలు చేపట్టింది. కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల శిక్షణకు దిల్సుఖ్నగర్, మలక్‌పేట్‌లలోని కోచింగ్ సెంటర్లకు అభ్యర్థుల తాకిడి పెరిగింది. పోలీసు, గ్రూప్–1 మొదలుకొని గ్రూప్–4 వరకు వివిధ కేటగిరీల్లో ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న వాళ్లు శాస్త్రీయమైన పద్ధతిలో అధ్యయనం చేయాలని, ఏ పోటీ పరీక్షకైనా ఎలాంటి షార్ట్‌కట్ మెథడ్స్ ఉండబోవని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: ఉద్యోగ నియామకాలకు రెడీ.. సర్కారు అనుమతులివ్వగానే .. ఏ సెంటర్‌కు వెళ్తున్నారు... ఉద్యోగాల భర్తీపైన ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడిన వెంటనే కోచింగ్ సెంటర్లు తలుపులు బార్లా తెరిచాయి. మరోవైపు ఆన్లైన్ శిక్షణ సంస్థలు, యూట్యూబ్ కోచింగ్‌లు సైతం ముందుకొచ్చాయి. గ్రేటర్లో చిన్నవి, పెద్దవి కలిసి సుమారు 150కి పైగా కోచింగ్ సెంటర్లు ఉన్నట్లు అంచనా. బాగా పేరున్న సంస్థల్లో గ్రూప్–1కు రూ.70 వేలు.. గ్రూప్ –4కు రూ.25 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఎస్సై, కానిస్టైబుల్ ఉద్యోగాలకు సైతం ఇదే స్థాయిలో డిమాండ్ ఉంది. ప్రభుత్వం భర్తీ చేయనున్న 80 వేల ఉద్యోగాల కోసం సుమారు 10 లక్షల మందికి పైగా పోటీ పడనున్నట్లు అంచనా. అభ్యర్థులు కోచింగ్ సెంటర్లను ఎంపిక చేసుకోవడం కూడా ఎంతో ముఖ్యమైన అంశమని నిపుణులు పేర్కొంటున్నారు. దీర్ఘకాలికంగా కోచింగ్ నిర్వహిస్తున్న అనుభవం, ఆయా సెంటర్లలో గతంలో ఎలాంటి ఫలితాలు వెలువడ్డాయనే అంశాల ఆధారంగా ఈ ఎంపిక ఉండాలి. చదవండి: CM KCR: తెలంగాణలో భారీగా ఉద్యోగాల భర్తీ: సీఎం కేసీఆర్ ప్రకటన అక్కడినుంచి చదవాల్సిందే.. సాధారణంగా పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన తర్వాత మాత్రమే సీరియస్‌గా చదవడం మొదలెడతారు. దీంతో అప్పటికప్పుడు మార్కెట్లో లభించే గైడ్లు, ఇతర స్టడీ మెటీరియల్ పైన ఆధారపడుతారు. ప్రామాణికమైన కోచింగ్ కేంద్రాల నుంచి లభించే మెటీరియల్ మంచిదే. కానీ గ్రూప్ –1 నుంచి గ్రూపు–4 వరకు అన్ని పోటీపరీక్షలకు సొంతంగా మెటీరియల్ రూపొందించుకోవడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఆరు నుంచి పదో తరగతి వరకు సైన్స్, సోషల్ స్టడీస్, గణితంపై పట్టు సాధించాలి. వివిధ సబ్జెక్టులలో పాఠ్యాంశాలను లోతుగా అధ్యయనం చేయడంతో పాటు ముఖ్యమైన అంశాలను స్వదస్తూరితో రాసుకోవాలి. దీంతో రాయడంలో వేగం, నైపుణ్యం పెరుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. సమకాలీన అంశాలపై ప్రిపేర్ కావాలి.. సమకాలీన అంశాలు, సాధారణ పరిజ్ఞానంపై పట్టు పెంచాలి. పోటీ పరీక్షలలో వచ్చే ప్రశ్నల తీరు మారింది. అభ్యర్థుల విస్తృతమైన, లోతైన అవగాహన సామర్థ్యాన్ని పరీక్షించేలా ఈ ప్రశ్నలు ఉంటాయి. ఉదాహరణకు ఉక్రెయిన్ యుద్ధానికి నాలుగు కారణాలను ఇచ్చి అందులో ప్రధానమైన కారణమేంటని అడగవచ్చు. నాలుగింటిలో ఏది ప్రధానమో తేల్చుకోవాలంటే సమకాలీన ఘటనలు, పరిణామాలపై స్పష్టత తప్పనిసరి. కొంతకాలంగా ప్రశ్నల తీరు మారింది. అందుకనుగుణంగానే ప్రిపరేషన్ ఉండాలి. గందరగోళానికి గురికావొద్దు.. ఒక సబ్జెక్టుపై ఒకటి, రెండు ప్రామాణికమైన పుస్తకాలను మాత్రమే ఎంపికచేసుకొని లోతుగా అధ్యయనం చేయాలి. ఎస్సై ఉద్యోగాలు, గ్రూప్–1, గ్రూప్–2, వంటి పరీక్షల కోసం చదివేవాళ్లకు గణితం, రీజనింగ్, అరిథ్‌మెటిక్ వంటి అంశాల్లో శిక్షణ తప్పనిసరిగా అవసరం. – వి.వేణుగోపాల్, గణితశాస్త్ర నిపుణులు దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి ఏ పోటీ పరీక్షకు సన్నద్ధమయ్యే వాళ్లయినా సరే హడావుడిగా చదవకుండా దీర్ఘకాలిక ప్రణాళికతో ప్రారంభించాలి. ఇప్పటికే చదువుతున్న వాళ్లు అధ్యయనానికి మరింత పదును పెట్టాలి, కొత్తగా ప్రారంభించేవాళ్లు చక్కటి ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి. ఆందోళన వద్దు, కోచింగ్ సెంటర్ల ఎంపిక ఎంతో కీలకం. – కేవీఆర్, ఇంగ్లిష్ ఫ్యాకల్టీ -
ఐఏఎస్ కావాలనుకుంటున్నారా? ఈ సూచనలు పాటించారంటే..
ఐఏఎస్ ఎందరికో కల. కానీ కొందరు మాత్రమే విజయతీరాలను చేరగలుగుతారు. యూపీఎస్సీ ప్రతియేటా నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలు క్లియర్ చేయడం అంతసులువేంకాదనే విషయం మనందరికీ తెలిసిందే! అందుకు చదువుతోపాటు మానసిక, శారీరక ఆరోగ్యం కూడా కీలకమే. ఎందుకంటే.. అభ్యర్ధులు మానసికంగా, శారీరకంగా ఎప్పుడైతే దృఢంగా ఉండగలుగుతారో ప్రిపరేషన్‌పై మరింత ఫోకస్ చేయగలుగుతారు. 2018 బ్యాచ్‌కి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్ అనుపమ అంజలి కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. సివిల్స్ ఆశావహ అభ్యర్ధులకు అనుపమ సూచనలు, సలహాలు ఇవే.. విద్యాభ్యాసం అనుపమ అంజలి మెకానికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. రెండో ప్రయత్నంలోనే సివిల్ సర్వీస్ పరీక్షలను క్లియర్ చేశారు. ఆమె సామాజిక కార్యకర్త కూడా. కుటుంబ నేపథ్యం అనుపమ తండ్రి కూడా సివిల్ సర్వెంటే. ఐపీఎస్ ఆఫీసర్‌గా భోపాల్‌లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఫొటో కర్టెసీ: డీఎన్ఏ విజయ సూత్రం ఇదే సివిల్స్ ప్రిపరేషన్లో అభ్యర్ధులు బోర్‌గా ఫీలవడం సర్వసాధారణం. అనుపమ ఏం చెబుతున్నారంటే.. ఇటువంటి సందర్భాల్లో అభ్యర్ధులు తమని తాము పునరుత్తేజ పరచుకోవడానికి మధ్య మధ్యలో కొద్దిపాటి విరామాలు తీసుకుంటూ ఉండాలి. తద్వారా నూతన ఉత్సాహం నిండి, ప్రిపరేషన్ కొనసాగించడానికి ప్రోత్సాహకంగా ఉంటాయి. అలాగే శారీరక వ్యాయామాలు, ధ్యానం చేయడం కూడా ప్రతి అభ్యర్థికి ఎంతో ముఖ్యం. ఇది మిమ్మల్ని దృఢంగా, సానుకూలంగా ఉంచడానికి తోడ్పడుతుంది. సెల్ఫ్ మోటివేషన్ లేదా స్వీయ ప్రేరణ సుదీర్ఘ యూపీఎస్సీ ప్రిపరేషన్లో వ్యతిరేక ఆలోచనలు రావడం సాధారణమే. అయితే అనుపమ ఏమంటారంటే.. ప్రిపరేషన్ సమయంలో అభ్యర్ధులు తరచుగా ఒత్తిడికి గురై, నిరాశకు లోనవ్వడం జరుగుతుంది. ఏదేమైనా పాజిటివ్‌గా ఉండటం మాత్రం చాలా అవసరం. ఎందుకంటే ఈ విధమైన ధోరణి అత్యుత్తమ ప్రదర్శన కనబరచడానికి దోహదపడుతుంది. ప్రతికూల ఆలోచనలను అధిగమించకపోతే విజయం సాధించడం చాలా కష్టం. కాబట్టి పరీక్షలు సమర్ధవంతంగా రాయాలనుకునే అభ్యర్ధులు స్వీయ ప్రేరణను అలవరచుకోవాలి. ప్రేరణ పొందడానికి కొంత కృషి కూడా అవసరమౌతుంది. ఎందుకంటే.. మీ ప్రిపరేషన్ సజావుగా కొనసాగేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సివిల్స్ ఆశావహ అభ్యర్ధులకు అనుపమ సూచనలు యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమయ్యేటప్పుడు అన్నిరకాల ఆటంకాలకు/ఆందోళనలకు దూరంగా ఉండాలి. ఫ్యామిలీ ఫంక్షన్లు, ఫ్రెండ్స్ పార్టీలకు కూడా దూరంగా ఉండాలి. అలాగే కుటుంబ బాధ్యలకు దూరంగా ఉంటే మంచిది. యూపీఎస్సీ పరీక్షలను క్లియర్ చేయడానికి ఈ సూచనలు ఎంతో సహాయపడతాయి. చదవండి: Trupti Gaikwad: రెండేళ్ల కిందట అలా మొదలైంది.. పూజ తర్వాత -
ఏపీ ఐసెట్ 2021; ఇవే విజయానికి కీలకం
ఏపీ ఐసెట్.. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్! ఎంబీఏలో చేరి.. భవిష్యత్తులో మేనేజ్మెంట్ రంగంలో కొలువులు సాధించాలని కలలు కనే విద్యార్థులు; అదే విధంగా ఎంసీఏ పట్టాతో సాఫ్ట్వేర్ రంగంలో కెరీర్ సొంతం చేసుకోవాలనుకునే అభ్యర్థులకు చక్కటి మార్గం!! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో ఏపీ ఐసెట్ ర్యాంకు ద్వారా ప్రవేశం లభిస్తుంది. వేల మంది రాసే ఈ పరీక్ష.. ఈ నెల(సెప్టెంబర్) 17, 18 తేదీల్లో జరుగనుంది. ఈ నేపథ్యంలో.. ఏపీ ఐసెట్‌లో విజయానికి ప్రిపరేషన్ టిప్స్... ఎంబీఏ, ఎంసీఏ.. ఈ కోర్సుల పట్ల విద్యార్థుల్లో ఆసక్తి నెలకొంది. గ్రాడ్యుయేషన్ స్థాయి కోర్సులు ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో కొంతమంది కార్పొరేట్ రంగంలో మేనేజ్మెంట్ కెరీర్ లక్ష్యంగా ఎంబీఏలో చేరుతున్నారు. మరికొందరు ఎంసీఏతో సాఫ్ట్వేర్ కొలువులు సొంతం చేసుకోవాలని టార్గెట్ సెట్ చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వేల మంది ప్రతి ఏటా ఐసెట్‌కు హాజరవుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ ఐసెట్‌కు మరో వారం రోజులే సమయం ఉంది. దాంతో విద్యార్థులు ప్రిపరేషన్‌పై పూర్తిస్థాయిలో దృష్టిసారించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏపీ ఐసెట్ పరీక్ష విధానం ఏపీ–ఐసెట్ 2021ను మూడు సెక్షన్లలో 200 ప్రశ్నలు–200 మార్కులకు నిర్వహించనున్నారు. ఒక్కో సెక్షన్లో మళ్లీ ఉప విభాగాలు కూడా ఉంటాయి. సెక్షన్ ఏ అనలిటికల్ ఎబిలిటీ 75 ప్రశ్నలు–75 మార్కులకు; సెక్షన్ బీ కమ్యూనికేషన్ ఎబిలిటీ 70 ప్రశ్నలు–70 మార్కులకు; సెక్షన్ సీ మ్యాథమెటికల్ ఎబిలిటీ 55 ప్రశ్నలు–55 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం రెండున్నర గంటలు. విభాగాల వారీగా ప్రిపరేషన్ ► ప్రస్తుతం సమయంలో విద్యార్థులు ఐసెట్ సిలబస్‌లో విభాగాల వారీగా ముఖ్యాంశాలపై ఎక్కువగా దృష్టిపెట్టాలి. ► డేటా సఫిషియెన్సీ; ప్రాబ్లమ్ సాల్వింగ్ అంశాల్లో బేసిక్ అర్థమెటిక్‌ను పునశ్చరణ చేసుకోవాలి. ► అర్థమెటిక్ విభాగంలో..శాతాలు, లాభ నష్టాలు,నిష్పత్తులు, మెన్సురేషన్,పని–కాలం, పని –సమయం వంటి అంశాలను రివిజన్ చేసుకోవాలి. ► అల్జీబ్రా అండ్ జామెట్రికల్ ఎబిలిటీ కోసం ట్రిగ్నోమెట్రీ, సెట్స్ అండ్ రిలేషన్స్, లీనియర్ ఈక్వేషన్స్, ప్రోగ్రెషన్స్ వంటి టాపిక్స్‌పై నైపుణ్యం సాధించాలి. ► ప్రాబ్లమ్ సాల్వింగ్ విభాగంలో.. కోడింగ్, డీ–కోడింగ్, బ్లడ్ రిలేషన్, సిరీస్, సిలాజిజమ్, సీటింగ్ అరేంజ్మెంట్ వంటి అంశాలపై పట్టు సాధించాలి. ► మ్యాథమెటికల్ ఎబిలిటీలో.. ప్రాథమిక సూత్రాలపై అవగాహన పెంచుకోవాలి. ► స్టాటిస్టికల్ ఎబిలిటీ కోసం ప్రాబబిలిటీ, ఇన్–ఈక్వాలిటీస్ అంశాలను ప్రాక్టీస్ చేయాలి. ► కమ్యూనికేషన్ ఎబిలిటీ విభాగంలో.. రాణించేందుకు బేసిక్ ఇంగ్లిష్ గ్రామర్ నైపుణ్యాలు, వొకాబ్యులరీలను ప్రతి రోజు చదవాలి. ► బిజినెస్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ విభాగంలో.. బిజినెస్ టెర్మినాలజీ, కొత్త వ్యాపార విధానాలు, ఆయా సంస్థలు–వాటి క్యాప్షన్లు వంటివి తెలుసుకోవాలి. ► కంప్యూటర్ టెర్మినాలజీకి సంబంధించి బేసిక్ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ టూల్స్, అదే విధంగా కంప్యూటర్ హార్డ్‌వేర్–ముఖ్య భాగాలు, వాటి పనితీరు గురించిన ప్రాథమిక నైపుణ్యం పరీక్ష పరంగా కలిసొస్తుంది. ► రీడింగ్ కాంప్రహెన్షన్ విభాగం కోసం అభ్యర్థులు ఇంగ్లిష్ దినపత్రికల్లోని ఎడిటోరియల్స్‌పై దృష్టి పెట్టాలి. మాక్ టెస్టులు ఐసెట్ అభ్యర్థులు ప్రస్తుత సమయంలో పరీక్ష విధానంపై అవగాహన పెంచుకోవాలి. దాంతోపాటు ప్రాక్టీస్‌కు ఎక్కువ సమయం కేటాయించాలి. ఐసెట్ వెబ్‌సైట్‌లోని మాక్ టెస్ట్‌లను రాయాలి. ఫలితంగా పరీక్ష తీరుతెన్నులు తెలుస్తాయి. దాంతో పరీక్ష హాల్లో వ్యవహరించాల్సిన విధానంపై అవగాహన లభిస్తుంది. మోడల్ టెస్ట్‌లు ఈ వారం రోజుల్లో అభ్యర్థులు వీలైనంత మేరకు మోడల్ టెస్ట్‌లు రాయడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతి రోజు కనీసం ఒక మోడల్ టెస్ట్ రాసి.. ఫలితాలు విశ్లేషించుకోవాలి. ఆ విశ్లేషణ ఆధారంగా తమ బలాలు బలహీనతలపై అవగాహన వస్తుంది. అభ్యర్థులు తాము ఇప్పటికీ బలహీనంగానే ఉన్న టాపిక్స్‌ను వదిలేయాలి. బాగా పట్టు ఉన్న అంశాలపై మరింతగా దృష్టిపెట్టాలి. షార్ట్ నోట్స్ ప్రిపరేషన్ సమయంలోనే సిలబస్ ఆధారంగా.. ఆయా సబ్జెక్ట్‌లు, టాపిక్‌లకు సంబంధించి ముఖ్యమైన అంశాలు, ఫార్ములాలతో షార్ట్ నోట్స్ రూపొందించుకోవాలి. ఈ షార్ట్ నోట్స్ ఆధారంగా పునశ్చరణ వేగవంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా డేటా సఫిషియన్సీ, మ్యాథమెటికల్ ఎబిలిటీ, అర్థమెటికల్ ఎబిలిటీ, అల్జీబ్రా అండ్ జామెట్రీ, స్టాటిస్టికల్ ఎబిలిటీ విషయంలో షార్ట్ నోట్స్ ఎంతో మేలు చేస్తుంది. పరీక్ష హాల్లో టెన్షన్ లేకుండా పరీక్ష హాల్లో అడుగుపెట్టిన అభ్యర్థులు.. ఎలాంటి ఒత్తిడి లేకుండా.. ప్రశాంతంగా వ్యవహరించాలి. ప్రశ్న పత్రంలో పేర్కొన్న నిబంధనలు పూర్తిగా చదివి సమాధానాలు ఇచ్చేందుకు ఉపక్రమించాలి. తొలుత సులువుగా భావించే ప్రశ్నలకు, ఆ తర్వాత ఓ మోస్తరు క్లిష్టత ఉన్న ప్రశ్నలకు, చివరగా అత్యంత క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం గుర్తించే ప్రయత్నం చేయాలి. మెరుగైన ర్యాంకుతోనే బెస్ట్ ఇన్స్టిట్యూట్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలు, సీట్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే.. అర్హత సాధించిన అభ్యర్థులకు సీటు దక్కడం పెద్ద కష్టమేమీ కాదు. కాని యూనివర్సిటీ కాలేజీలు, క్యాంపస్ కళాశాలలు, టాప్–10, టాప్–20, టాప్–50 ఇన్స్టిట్యూట్లలో బెస్ట్ ర్యాంకుతోనే ప్రవేశం లభించే అవకాశం ఉంది. ఏపీ ఐసెట్ 2021 సమాచారం ► అర్హత: కనీసం 50శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులు కనీసం 45శాతం మార్కులు సాధించాలి. ఎంసీఏలో చేరాలనుకునే అభ్యర్థులు ఇంటర్మీడియెట్/డిగ్రీ స్థాయిలో మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్‌గా చదివి ఉండాలి. అర్హత కోర్సు చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ► రూ.అయిదు వేల ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 13. ► హాల్ టికెట్ డౌన్లోడ్ సదుపాయం: సెప్టెంబర్ 13 నుంచి ► ఏపీ ఐసెట్ పరీక్ష తేదీ: సెప్టెంబర్ 17, 18 (ప్రతి రోజు ఉదయం 9 నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు) ► ఫలితాల వెల్లడి: సెప్టెంబర్ 30, 2021 ► వివరాలకు వెబ్సైట్: https://sche.ap.gov.in/icet/ICET/ICET_HomePage.aspx -
యూజీసీ–నెట్ 2021: కంప్లీట్ ప్రిపరేషన్ గైడెన్స్
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ).. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్.. సంక్షిప్తంగా యూజీసీ నెట్! ఇది జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రతిష్టాత్మక పరీక్ష. పరిశోధనలు, అకడమిక్ కెరీర్, ఆర్థిక ప్రోత్సాహం పొందేందుకు చక్కటి మార్గం.. యూజీసీ నెట్! ఇందులో ప్రతిభ చూపి..మెరిట్ జాబితాలో నిలిస్తే.. ప్రముఖ యూనివర్సిటీలు, ప్రఖ్యాత రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్లో పరిశోధనలు చేసే అవకాశం లభిస్తుంది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(జేఆర్ఎఫ్) ద్వారా ఆర్థిక ప్రోత్సాహకాలు సొంతం చేసుకోవచ్చు! తాజాగా.. యూజీసీ–నెట్ జూన్–2021కు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. యూజీసీ నెట్‌తో ప్రయోజనాలు, భవిష్యత్తు అవకాశాలు, పరీక్ష విధానం, పరీక్షలో విజయానికి సలహాలు, తదితర అంశాలపై విశ్లేషణ... పీజీ స్థాయిలో సంప్రదాయ, టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసుకొని.. పరిశోధనల దిశగా అడుగులు వేయాలనుకునే వారికి సరైన మార్గం.. యూజీసీ నెట్. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ), యూజీసీ సంయుక్తంగా ప్రతి ఏటా రెండుసార్లు నిర్వహిస్తున్నాయి. ఇటీవల జూన్–2021 సెషన్‌కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. రెండు సెషన్లకు సంయుక్తంగా ఎన్టీఏ యూజీసీ నెట్లో ఈసారి కొన్ని మార్పులు ప్రకటించారు. డిసెంబర్–2020 సెషన్, జూన్–2021 సెషన్లు రెండింటినీ కలిపి సంయుక్తంగా నిర్వహించనున్నట్లు ఎన్టీఏ పేర్కొంది. కరోనా కారణంగా.. డిసెంబర్–2020 సెషన్ వాయిదా పడింది. అలాగే జూన్–2021 సెషన్ నిర్వహణలో జాప్యం జరిగింది. దాంతో ఈ రెండు సెషన్లను కలిపేసి ఉమ్మడిగా నిర్వహించనున్నారు. అంటే.. డిసెంబర్–2020 సెషన్ అభ్యర్థులు కూడా జూన్–2021 సెషన్‌కు హాజరు కావొచ్చు. 81 సబ్జెక్ట్‌లలో పరీక్ష యూజీసీ నెట్ మొత్తం 81 సబ్జెక్ట్ విభాగాల్లో జరగనుంది. వీటిలో ఎకనామిక్స్, హిస్టరీ, హ్యూమన్ రైట్స్ అండ్ డ్యూటీస్, ఇండియన్ కల్చర్ తదితర ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్, లింగ్విస్టిక్ సబ్జెక్ట్‌లతోపాటు కంప్యూటర్ సైన్స్, క్రిమినాలజీ, మేనేజ్మెంట్ వంటి ప్రొఫెషనల్ సబ్జెక్ట్‌లు కూడా ఉన్నాయి. పీజీ స్థాయిలో చదివిన స్పెషలైజేషన్‌కు అనుగుణంగా ఆయా పేపర్లకు హాజరయ్యే అర్హత లభిస్తుంది. అర్హతలు ► అర్హత: సంబంధిత పీజీ(పోస్ట్ గ్రాడ్యుయేషన్) లో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు అయిదు శాతం సడలింపు లభిస్తుంది. ► పీజీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ► వయో పరిమితి: జేఆర్ఎఫ్ అభ్యర్థులకు అక్టోబర్ 1, 2021 నాటికి 31ఏళ్లు మించకూడదు. ఓబీసీ–ఎన్సీఎల్, ఇతర రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో అయిదేళ్ల సడలింపు లభిస్తుంది. ► అసిస్టెంట్ ప్రొఫెసర్ అభ్యర్థులకు ఎలాంటి గరిష్ట వయో పరిమితి నిబంధన లేదు. రెండు కేటగిరీల్లో యూజీసీ నెట్ యూజీసీ–నెట్‌ను రెండు కేటగిరీలుగా వర్గీకరించారు. అవి.. అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్. దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు తాము ఏ కేటగిరీ పరీక్షకు హాజరవ్వాలనుకుంటున్నారో స్పష్టం చేయాలి. ఉదాహరణకు.. పరిశోధన అభ్యర్థులు.. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రాథమ్యాన్ని ఎంపిక చేసుకోవాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్ కేటగిరీ మాత్రమే కోరుకుంటే.. అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రాథమ్యాన్ని ఎంపిక చేసుకుంటే సరిపోతుంది. ఇలా అభ్యర్థులు ఎంపిక చేసుకున్న ప్రాథమ్యాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రశ్నలు అడుగుతారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ► యూజీసీ–నెట్ పరీక్ష ఆన్లైన్ విధానం (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్)లో ఆబ్జెక్టివ్ తరహాలో నిర్వహిస్తారు. ► మొత్తం మూడు వందల మార్కులకు జరిగే ఈ పరీక్షలో రెండు పేపర్లు.. పేపర్1, పేపర్ 2 ఉంటాయి. ► పేపర్–1కు అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అభ్యర్థులందరూ తప్పనిసరిగా హాజరు కావాలి. ► పేపర్–1లో టీచింగ్/రీసెర్చ్ అప్టిట్యూడ్‌పై 50 ప్రశ్నలు–100 మార్కులు ఉంటాయి. అంటే.. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించారు. ► పేపర్–2.. అభ్యర్థులు తమ పీజీ స్పెషలైజేషన్ ఆధారంగా ఎంచుకున్న సబ్జెక్టుకు సంబంధించిన పరీక్ష. ► పేపర్–2లో సంబంధిత సబ్జెక్ట్ పేపర్ నుంచి 100 ప్రశ్నలు–200 మార్కులకు ఉంటాయి. ► పరీక్ష కాల వ్యవధి మూడు గంటలు. కనీస అర్హత మార్కులు ► యూజీసీ నెట్లో కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. జనరల్ కేటగిరీ అభ్యర్థులు రెండు పేపర్లలో కలిపి 40 శాతం మార్కులు, రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు 35శాతం మార్కు లు సాధించాలి. ► కేవలం ఆరు శాతం మందిని మాత్రమే తుది జాబితాకు ఎంపిక చేసే నెట్ జేఆర్ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ కేటగిరీల్లో విజయం సాధించాలంటే.. అభ్యర్థులకు పరిశోధనలపై ఆసక్తితోపాటు సంబంధిత సబ్జెక్ట్‌పై గట్టి పట్టుండాలి. పేపర్1: ఆసక్తి, అవగాహన ► పేపర్–1లో అభ్యర్థుల్లోని టీచింగ్, రీసెర్చ్ ఆసక్తులను, అవగాహనను పరిశీలించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. మొత్తం పది విభాగాల నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి. ప్రధానంగా టీచింగ్, రీసెర్చ్ అప్టిట్యూడ్, రీడింగ్ కాంప్రహెన్షన్, కమ్యూనికేషన్, రీజనింగ్, లాజికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, పీపుల్ అండ్ ఎన్విరాన్మెంట్, హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్–గవర్నెన్స్, పాలిటీ అండ్ అడ్మినిస్ట్రేషన్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పేపర్ 2: సబ్జెక్ట్ ప్రశ్నలు పేపర్–2లో ప్రశ్నలు పీజీ స్పెషలైజేషన్ సిలబస్ స్థాయిలో ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్‌కు సంబంధించి ఇంటర్మీడియెట్ నుంచి పీజీ వరకూ.. అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ఆయా అంశాలను అప్లికేషన్ ఓరియెంటేషన్, ప్రాక్టికల్ అప్రోచ్‌తో చదవాలి. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉన్నప్పటికీ.. ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటప్పుడు ప్రాక్టికల్ థింకింగ్, అప్లికేషన్ ఓరియెంటేషన్‌ను పరీక్షించేలా ప్రశ్నలు అడుగుతున్నారు. అదేవిధంగా క్రిటికల్ థింకింగ్, అనలిటికల్ అప్రోచ్ అలవరచుకోవడం ఉపయుక్తంగా ఉంటుంది. ఫలితంగా ప్రశ్నలు ఏవిధంగా అడిగినా సమాధానాలు ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది. యూజీసీ నెట్ 2021–ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తు తేదీలు: సెప్టెంబర్ 5,2021 ► ఆన్లైన్లో ఫీజు చెల్లింపు చివరి తేదీ: సెప్టెంబర్ 6, 2021 ► ఆన్లైన్ దరఖాస్తుల సవరణ అవకాశం: సెప్టెంబర్ 7–సెప్టెంబర్ 12 ► పరీక్ష తేదీలు: అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 11 వరకు ► ప్రతి రోజు రెండు షిఫ్ట్‌ల్లో పరీక్ష (మొదటి షిప్ట్ ఉదయం 9–12 గంటలు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3–6 గంటలు) నిర్వహిస్తారు. ► పూర్తి వివరాలకు వెబ్సైట్: https://ugcnet.nta.nic.in -
APSET 2021: అసిస్టెంట్ ప్రొఫెసర్ అయ్యేలా..
ఆంధ్రప్రదేశ్‌లోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్ పోస్టుల నియామకాలకు అర్హత పరీక్షగా పేర్కొనే.. ‘ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్(ఏపీ సెట్)’కు నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర స్థాయిలో జరిగే ఈ పరీక్షను ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహించనుంది. ఇటీవల ఏపీసెట్–2021 నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో.. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హతలు, పరీక్ష విధానం, సిలబస్ విశ్లేషణతోపాటు ప్రిపరేషన్ టిప్స్... యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా, లెక్చరర్లుగా చేరాలనుకునే అభ్యర్థు లకు తగిన అకడమిక్ అర్హతలతోపాటు, ఆయా సబ్జెక్టుల్లో లోతైన పరిజ్ఞానం ఉండాలి. అలాంటి అభ్యర్థుల ప్రతిభను, సబ్జెక్టు నైపుణ్యాన్ని అంచనా వేసేందుకు ఉద్దేశించిందే ఏపీ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్(ఏపీ సెట్). ఈ పరీక్షను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 30 సబ్జెక్టుల్లో నిర్వహిస్తున్నారు. ఇందులో సాధించిన స్కోర్ ఆధారంగా లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకంలో ప్రాధాన్యం ఇస్తారు. అర్హతలు ► యూజీసీ గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం/కాలేజీ నుంచి కనీసం 55శాతం మార్కు లతో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ► ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ(నాన్ క్రిమీలేయర్)/పీడబ్ల్యూ డీ/ట్రాన్స్ జెండర్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో పీజీ పూర్తిచేయాలి. పోస్టు గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం విద్యార్థులు/ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ► 1991 సెప్టెంబరు 19 నాటికి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన పీహెచ్డీ అభ్యర్థులు(అన్ని కేటగిరీల అభ్యర్థులు) పీజీలో కనీసం 50శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. ► అభ్యర్థులు తాము చదివిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ సబ్జెక్టు సెట్ జాబితాలో లేకుంటే.. ఏదైనా ఇతర సంబంధిత సబ్జెక్టును ఎంచుకోవచ్చు. పరీక్ష విధానం ► ఏపీసెట్ పరీక్ష ఆఫ్‌లైన్(పెన్ పేపర్) విధానంలో జరుగుతుంది. ఇందులో రెండు పేపర్లు పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి. ► పేపర్–1లో.. టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూ డ్‌ను అన్ని విభాగాల అభ్యర్థులు రాయాల్సి ఉంటుంది. ఈ పేపర్ తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో(బైలింగ్వల్) ఉంటుంది. ► పేపర్–2 పరీక్ష అభ్యర్థి ఏ విభాగంలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారో దానిపై ఉంటుంది. ► పేపర్–1: టీచింగ్/రీసెర్చ్ అప్టిట్యూడ్ : ► ఈ పేపర్ టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్‌పై ఉంటుంది. ఇందులో ఆబ్జెక్టివ్ తరహా మల్టిఫుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఇది అందరూ రాయాల్సిన కామన్ పేపర్. మొత్తం 50 ప్రశ్నలు–100 మార్కులకు పేపర్1 పరీక్ష జరుగుతుంది. ప్రతి సరైన సమాధానానికి రెండు మార్కుల చొప్పున కేటాయించారు. ఎలాంటి నెగెటివ్ మార్కులు లేవు. తెలుగు/ఇంగ్లిష్‌లో ప్రశ్న పత్రం ఉంటుంది. ఈ పేపర్‌కు కేటాయించిన సమయం ఒక గంట మాత్రమే. ► పేపర్1లో.. టీచింగ్ అప్టిట్యూడ్, రీసెర్చ్ అప్టి ట్యూడ్, కాంప్రెహెన్షన్, కమ్యూనికేషన్, మ్యాథ మెటికల్ రీజనింగ్ అండ్ అప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రెటేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ(ఐసీటీ), పీపుల్, డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్, హయ్యర్ ఎడ్యుయేషన్ సిస్టమ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ► పేపర్–2 ఎలక్టివ్ సబ్జెక్ట్: ఇది అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టు(ఎలక్టివ్)కు సంబంధించిన పేపర్. ఇందులో ఆబ్జెక్టివ్ తరహా మల్టిఫుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 100 ప్రశ్నలు–200 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ప్రతి సరైన సమాధానానికి రెండు మార్కుల చొప్పున కేటాయించారు. ఈ పేపర్లో ఎలాంటి నెగెటివ్ మార్కుల విధానం లేదు. ► ఏపీ సెట్లో మొత్తం 30 సబ్జెక్టులు పేర్కొన్నారు. వీటిల్లో కామర్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ సబ్జెక్టులు రెండు భాషల్లో (తెలుగు/ఇంగ్లిష్) ఉంటాయి. మిగతా సబ్జెక్టులు ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటాయి. ► ఏపీ సెట్ సబ్జెక్టులు: ఆంత్రోపాలజీ, చరిత్ర, కెమికల్ సైన్సెస్, కామర్స్,కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్ అట్మాస్పియరిక్, ఓషన్ అండ్ ప్లానటరీ సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, జాగ్రఫీ, హిందీ, జర్న లిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, లా, లైఫ్ సైన్సె స్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, మేనేజ్ మెంట్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సంస్కృతం, సోషియాలజీ, సోషల్ వర్క్, తెలుగు, ఉర్దూ, విజువల్ ఆర్ట్స్. ఇలా చదవడం మేలు ► ఏపీసెట్ పరీక్షకు ఇంకా రెండున్నర నెలల సమ యం అందుబాటులో ఉంది. కాబట్టి ఈ విలువైన సమయాన్ని అభ్యర్థులు సమర్థంగా వినియోగించు కోవాలి. ► మొదట రెండు పేపర్ల సిలబస్‌పై సమగ్ర అవగాహన పెంచుకోవాలి. ► ముఖ్యంగా అందరికీ కామన్‌గా ఉండే పేపర్–1 ఎంతో కీలకమైంది. ఈ పేపర్ సిలబస్ కొంత భిన్నంగా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు తొలుత పేపర్1పై దృష్టిపెట్టి ప్రిపరేషన్ సాగించాలి. ఈ పేపర్ సిలబస్‌లో మొత్తం 10 యూనిట్లు ఉన్నాయి. వీటి నుంచి ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో గత ప్రశ్న పత్రాల ద్వారా అంచనాకు రావాలి. ముఖ్యమైన టాపిక్స్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ► పేపర్– 2లో.. అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఇది అభ్యర్థి పీజీ స్థాయిలో చదివిన సబ్జెక్టు. కాబట్టి ఓ మాదిరి ప్రిపరేషన్ సాగించినా మంచి మార్కులు స్కోరు చేయవచ్చు. అందుకోసం యూజీసీ గతంలో నిర్వహించిన నెట్ ప్రశ్న పత్రాలు, సెట్ గత పేపర్లను పరిశీలించి.. ప్రిపరేషన్ సాగించాలి. ముఖ్యమైన తేదీలు ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 13.09.2021 ► ఏపీసెట్ పరీక్ష తేది: 31.10. 2021 ► పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, తిరుపతి, కడప, కర్నూలు ► పూర్తి వివరాలకు వెబ్సైట్: https://apset.net.in/home.aspx -
ఏపీ జాబ్స్: ఇలా చేస్తే.. కొలువు ఖాయం
ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అంటే.. ఎండమావే! ఎదురుచూసి చూసి నిరుద్యోగుల కళ్లు కాయలు కాసేవి!! ఒకవేళ అరకొరగా ఏదైనా ఒక నోటిఫికేషన్ వచ్చినా.. ఎంపిక ప్రక్రియ పూర్తయ్యేందుకు సంవత్సరాలు గడిచిపోయేవి!! అలాంటి పరిస్థితులకు ఫుల్స్టాప్ పెడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. అంతేకాకుండా ఆయా జాబ్ నోటిఫికేషన్లు వెలువడే నెలను సైతం ప్రకటించడం.. ఉద్యోగార్థులకు అత్యంత శుభ పరిణామం! ఈ నేపథ్యంలో.. నిరుద్యోగులు తమ కలలను సాకారం చేసుకునేందుకు ఇప్పటి నుంచే సన్నద్ధమవడమెలాగో తెలుసుకుందాం... ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో ఉద్యోగాలతోపాటు నోటిఫికేషన్లు వెలువడే నెలను కూడా నిర్దిష్టంగా ప్రకటించారు. కాబట్టి అభ్యర్థులు ఇప్పటి నుంచే తమ సన్నద్ధతకు పదును పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నోటిఫికేషన్ వచ్చే రోజు వరకు వేచి చూడకుండా.. తమ అర్హతలకు సరితూగే ఉద్యోగాలను గుర్తించి.. వాటిని సాధించేందుకు కృషి చేయాలని సలహా ఇస్తున్నారు. గ్రూప్స్, పోలీస్, మెడికల్.. ఇంకా ఎన్నో ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జ్యాబ్ క్యాలెండర్ ప్రకారం–గ్రూప్–1,2 సర్వీసులు మొదలుకొని మరెన్నో శాఖల్లో పోస్టుల భర్తీ జరుగనుంది. గ్రూప్స్ తర్వాత ఎంతో క్రేజ్ ఉండే పోలీస్ రిక్రూట్మెంట్, భావి భారత పౌరులను తీర్చిదిద్దే అధ్యాపకులు, ప్రొఫెసర్లు; వైద్య రంగంలో ఎంతో కీలకమైన డాక్టర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, నర్సులు, పారా మెడికల్ ఉద్యోగాల భర్తీ జరుగనుంది. ఎన్నో ఏళ్లుగా ఖాళీగా ఉన్న ఎస్సీ/ఎస్టీ బ్యాక్లాగ్ పోస్ట్‌ల ఎంపిక ప్రక్రియ కూడా చేపట్టనున్నారు. ఇలా మొత్తంగా అన్ని శాఖల్లో కలిపి 10,143 పోస్ట్‌లకు ఇటీవల జాబ్ క్యాలెండర్ విడుదలైంది. వీటితోపాటు తాజా మరో 1180 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందులో రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉండటం నిరుద్యోగులకు మరో తీపికబురుగా చెప్పొచ్చు. ప్రతి ఒక్కరికీ అవకాశం ► జ్యాబ్ క్యాలెండర్లో పేర్కొన్న పోస్టులను పరిగణనలోకి తీసుకుంటే.. సంప్రదాయ డిగ్రీ కోర్సులు మొదలు మెడికల్ ప్రొఫెషనల్ కోర్సుల ఉత్తీర్ణుల వరకూ.. ప్రతి ఒక్కరికీ అవకాశం లభించనుంది. ఉదాహరణకు.. గ్రూప్–1,2 సర్వీసులకు బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో పోటీ పడొచ్చు. అదే విధంగా డిగ్రీతో ఎస్ఐ స్థాయి ఉద్యోగాలకు, ఇంటర్మీడియెట్ అర్హతతో కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ► పారా మెడికల్ సిబ్బంది విషయానికొస్తే.. ఆయా విభాగాల్లో పారా మెడికల్ కోర్సుల్లో డిప్లొమా తదితర కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు అర్హత లభించనుంది. ► వైద్య శాఖలో పేర్కొన్న డాక్టర్లు, ప్రొఫెసర్ల పోస్టులకు.. ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్ వంటి కోర్సులు పూర్తిచేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. నర్సింగ్ కోర్సు ఉత్తీర్ణులు వైద్య శాఖలో నర్స్ ఉద్యోగాలకు పోటీ పడొచ్చు. ► విద్యా శాఖలో లెక్చరర్ల పోస్టులకు ఆయా సబ్జెక్ట్ స్పెషలైజేషన్లలో పీజీ పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం పీజీ ఉత్తీర్ణతతోపాటు నెట్ లేదా సెట్ స్కోర్ సాధించిన వారికి దరఖాస్తుకు అర్హత లభించనుంది. సుదీర్ఘ ప్రక్రియకు స్వస్తి గతంలో వివిధ పోస్టులకు మూడంచెలు, రెండంచెల విధానంలో.. నియామక ప్రక్రియ సుదీర్ఘంగా సాగేది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అన్ని నియామకాల్లో స్క్రీనింగ్ టెస్ట్/ప్రిలిమినరీ టెస్ట్ విధానానికి స్వస్తి పలికింది. ఒకే ఒక రాత పరీక్ష నిర్వహించి.. అందులో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించారు. దీంతో.. గ్రూప్స్ మొదలు అన్ని రకాల నియామక ప్రక్రియల్లో ప్రిలిమ్స్ విధానం నుంచి విముక్తి లభించనుంది. దీనివల్ల ఉద్యోగార్థులకు పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు మరింత సమయం లభిస్తుంది. అంతేకాకుండా ఏకకాలంలో తమకు అర్హత ఉన్న పలు పరీక్షలకు హాజరయ్యేందుకు అవకాశం ఉంటుంది. సిలబస్‌ను పరిశీలించి ప్రస్తుతం జాబ్ క్యాలెండర్ ప్రకారం–ఉద్యోగాలు సొంతం చేసుకునేందుకు సిద్ధమవుతున్న అభ్యర్థులు.. ముందుగా తమ అర్హతకు సరితూగే పరీక్షలకు సంబంధించిన సిలబస్ అంశాలను పరిశీలించాలి. పరీక్ష విధానం, సిలబస్‌పై స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోవాలి. ఆ సిలబస్‌లో వెయిటేజీ ఆధారితంగా ప్రాధాన్యత ఉన్న అంశాలను గుర్తించి.. వాటిపై ఎక్కువ దృష్టిసారించాలి. వాటికి సంబంధించి అకడమిక్ పుస్తకాలతోపాటు.. ప్రామాణిక స్టడీ మెటీరియల్‌ను అనుసరిస్తూ ప్రిపరేషన్ సాగించాలి. జనరల్ స్టడీస్ ఏ ఉద్యోగ పరీక్ష అయినా.. జనరల్ స్టడీస్ తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు జనరల్ స్టడీస్ అంశాలుగా పేర్కొనే ఏపీ, ఇండియన్ హిస్టరీ; జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి కోర్ అంశాలతోపాటు..సమకాలీన పరిణామాలపైనా అవగాహన పెంచుకునేలా ప్రిపరేషన్ సాగించాలి. ముఖ్యంగా సమకాలీన అంశాలను.. జనరల్ స్టడీస్‌లోని కోర్ టాపిక్స్‌తో అనుసంధానిస్తూ చదవాలి. అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో అధ్యయనం చేయడం ఉపయుక్తంగా ఉంటుంది. రాష్ట్ర స్థాయి అంశాలు ఏపీ ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడుతున్న అభ్యర్థులు.. రాష్ట్ర స్థాయి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ చదవాలి. ప్రధానంగా రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు, చరిత్ర, సహజ వనరులు, కళలు–సంస్కృతి, రాష్ట్ర చరిత్రకు సంబంధించిన ప్రధాన ఘట్టాలను అవపోసన పట్టాలి. సహజ వనరులు ఎక్కువగా లభ్యమయ్యే ప్రదేశాలు, సదరు సహజ వనరులు అభివృద్ధికి దోహదపడుతున్న తీరును తెలుసుకోవాలి. ప్రభుత్వ పథకాలు జనరల్ స్టడీస్తోపాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపైనా అభ్యర్థులు దృష్టిపెట్టాలి. ముఖ్యంగా నవ రత్నాలు.. ఉద్దేశాలు, లక్షిత వర్గాలు, వాటికి బడ్జెట్ కేటాయింపులు, ఇప్పటి వరకు లబ్ధి పొందిన వారి సంఖ్య వంటి అంశాలపై గణాంక సహిత వివరాలతో సంసిద్ధంగా ఉండాలి. రాష్ట్ర సుస్థిరాభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల(ఉదా: ఐటీ పాలసీ, పారిశ్రామిక ప్రణాళిక, ఉపాధి కల్పనకు తీసుకుంటున్న చర్యలు) గురించి తెలుసుకోవాలి. అకడమిక్స్ + సమకాలీన జాబ్ క్యాలెండర్లో పలు స్పెషలైజ్డ్ పోస్ట్‌లు కూడా ఉన్నాయి. ఉదాహరణకు: వైద్యులు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్లు వంటివి. వీటి నియామక ప్రక్రియలో జనరల్ స్టడీస్తోపాటు ఆయా సబ్జెక్ట్ నైపుణ్యాలను పరిశీలించే సబ్జెక్ట్ పేపర్లు కూడా ఉంటాయి. ఈ సబ్జెక్ట్ పేపర్లలో రాణించాలంటే.. అభ్యర్థులు అకడమిక్‌గా ఆయా సబ్జెక్ట్ నైపుణ్యాలపై పూర్తి స్థాయి అవగాహన పెంచుకోవాలి. అదే విధంగా వాటికి సంబంధించి తాజాగా పరిణామాల గురించి కూడా తెలుసుకోవాలి. డిస్క్రిప్టివ్ ప్రిపరేషన్ ఉద్యోగ నియామక పరీక్షలు ఆబ్జెక్టివ్ విధానంలోనే జరిగినా.. అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ను మాత్రం డిస్క్రిప్టివ్ పద్ధతిలో కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. డిస్క్రిప్టివ్ అప్రోచ్‌తో చదవడం ద్వారా విభిన్న కోణాల్లో నైపుణ్యం లభిస్తుంది. ఫలితంగా ప్రశ్నను ఎలా అడిగినా.. సమాధానం ఇవ్వగలిగే సంసిద్ధత లభిస్తుంది. చదివేటప్పుడే ముఖ్యమైన అంశాలతో సొంత నోట్స్ రూపొందించుకోవాలి. ఇది పరీక్షకు ముందు వేగంగా పునశ్చరణకు ఉపయోగపడుతుంది. స్వీయ విశ్లేషణ అభ్యర్థులు.. ఎప్పటికప్పుడు తమ స్వీయ సామర్థ్యాలను విశ్లేషించుకోవాలి. ముఖ్యంగా మోడల్ టెస్ట్‌లు, మాక్ టెస్ట్‌లు రాయడం ద్వారా తమ ప్రిపరేషన్ స్థాయిపై ఒక అంచనాకు రావాలి. దీనివల్ల ఇంకా సామర్థ్యం పెంచుకోవాల్సిన అంశాలను గుర్తించేందుకు అవకాశం ఉంటుంది. పరీక్ష సిలబస్, టాపిక్స్‌ను పరిగణనలోకి తీసుకుంటూ.. ప్రతి రోజు ఆయా అంశాలకు కేటాయించాల్సిన సమయాన్ని నిర్దేశించుకోవాలి. టైమ్ టేబుల్ ప్రకారం చదవడం పూర్తిచేయాలి. ఒకే అర్హతతో పలు పరీక్షలు ఒకే అర్హతతో ఒకటి కంటే ఎక్కువ శాఖల్లోని పోస్టులకు పోటీ పడే అవకాశం ఉంటుంది. బ్యాచిలర్ డిగ్రీ అర్హతగా నిర్వహించే గ్రూప్స్, పోలీస్–ఎస్ఐ పోస్ట్‌లను ఇందుకు ఉదాహరణగా పేర్కొనొచ్చు. ఇలాంటి అభ్యర్థులు రెండు పరీక్షల సిలబస్‌ను బేరీజు వేసుకుంటూ.. ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలి. రెండు పరీక్షలకు సంబంధించి ఉమ్మడిగా ఉన్న సిలబస్ అంశాల ప్రిపరేషన్‌ను ముందుగా పూర్తిచేయాలి. ఆ తర్వాత వేర్వేరుగా ఉన్న టాపిక్స్‌పై పట్టు సాధించేలా ముందుకు సాగాలి. ముందుగా ఏ పరీక్ష జరగనుందో.. ఆ పరీక్షకు నెల రోజుల ముందు నుంచి సదరు పరీక్ష సన్నద్ధతకే పూర్తి సమయం కేటాయించాలి. ఇలా.. ఇప్పటి నుంచే పక్కా వ్యూహంతో, నిర్దిష్ట ప్రణాళికతో అడుగులు వేస్తే.. విజయావకాశాలను మెరుగు పరచుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ముందస్తు ప్రణాళికే ముఖ్యం ఏపీ జ్యాబ్ క్యాలెండర్లో.. ఆయా శాఖలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడే నెలను కూడా ముందుగానే ప్రకటించడం అభ్యర్థులకు ఎంతో మేలు చేసే అంశం. ఆ టైమ్ లైన్‌కు అనుగుణంగా అభ్యర్థులు ముందస్తు ప్రణాళికతో ప్రిపరేషన్ సాగించొచ్చు. తాము లక్ష్యంగా ఎంచుకున్న పోస్టులకు సంబంధించి సిలబస్ పరిశీలన, ప్రీవియస్ పేపర్ల అధ్యయనంతో ముందుగా పరీక్ష స్థాయిపై అవగాహన పెంచుకోవాలి. ఆ తర్వాత పూర్తి స్థాయి ప్రిపరేషన్‌కు ఉపక్రమించి.. టాపిక్‌వారీగా వెయిటేజీని అనుసరించి అధ్యయనం చేయాలి. ఏ పరీక్ష అయినా ప్రణాళిక, సమయ పాలన ఎంతో ముఖ్యం. ఈ రెండూ ప్రిపరేషన్లో ముందంజలో నిలిచేలా చేస్తాయి. – జి.బి.కృష్ణారెడ్డి, పోటీ పరీక్షల శిక్షణ నిపుణులు -
టెన్త్‌తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. ఐదంకెల జీతం
శారీరకంగా ధృడంగా ఉండి.. దేశ సేవ చేయాలనే తపన కలిగిన యువతకు కేంద్ర పారామిలిటరీ దళాలు ఆహ్వానం పలుకుతున్నాయి. ఆయా భద్రతా దళాల్లో ఖాళీగా ఉన్న 25వేలకు పైగా కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి పూర్తిచేసి కేంద్ర సాయుధ బలగాల్లో కొలువు సాధించాలని కలల కనే యువతకు చక్కటి అవకాశం.. ఎస్ఎస్సీ కానిస్టేబుల్ నోటిఫికేషన్. ఈ నేపథ్యంలో.. కానిస్టేబుల్ పోస్టుల దరఖాస్తుకు అర్హతలు.. ఎంపిక విధానం.. సిలబస్.. ప్రిపరేషన్ టిప్స్... ► పోస్టు పేరు: కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ) ► మొత్తం ఖాళీల సంఖ్య: 25,271 ► విభాగాల వారీగా పోస్టుల సంఖ్య: బీఎస్ఎఫ్–7545, సీఐఎస్ఎఫ్–8464, ఎస్ఎస్బీ–3806, ఐటీబీపీ–1431,ఏఆర్–3785,ఎస్ఎస్ఎఫ్–240 సీఏపీఎఫ్ ఆర్మీ, నేవీ ఎయిర్‌ఫోర్స్ మాదిరిగానే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్(సీఏపీఎఫ్)లో ప్రతి ఏటా నియామకాలు జరుగుతున్నాయి. ఇందులో పలు విభాగాలున్నాయి. అవి.. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్(సీఐఎస్ఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ), సశస్త్ర సీమాబల్ (ఎస్ఎస్బీ), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్(ఎప్‌ఎస్‌ఎఫ్), అస్సాం రైఫిల్స్(ఏఆర్). వీటిల్లో ఉమ్మడి పరీక్ష ద్వారా కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) ఆయా ఉద్యోగాల భర్తీకి ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తోంది. అర్హతలు ► ఎస్ఎస్సీ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు 2021, ఆగస్టు 1 నాటికి పదోతరగతి/తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. మహిళలు కూడా దరఖాస్తుకు అర్హులే. ► వయసు: 2021, ఆగస్టు 1 నాటికి 18–23ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు్ల, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. వేతనం ఎంపికైతే పే లెవెల్–3 ప్రకారం–రూ.21700–రూ.69100 వేతన శ్రేణి లభిస్తుంది. ఎంపిక విధానం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్(సీబీఈ),సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్(సీఏపీఎఫ్) నిర్వహించే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(పీఎస్టీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్ టెస్ట్ ► తొలిదశలో సీబీఈ(కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్) ఆన్లైన్ విధానంలో జరుగుతుంది. మొత్తం 100 ప్రశ్నలకు–100 మార్కులకు ఈ టెస్ట్ ఉంటుంది. పరీక్ష సమయం 90 నిమిషాలు. ► ఈ పరీక్షలోనాలుగు విభాగాల నుంచి ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు అడుగుతారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 ప్రశ్నలు–25 మార్కులు, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 25 ప్రశ్నలు–25 మార్కులు, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 25 ప్రశ్నలు–25 మార్కులు, ఇంగ్లిష్/హిందీల నుంచి 25ప్రశ్నలు–25 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ► జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్‌లో.. వెర్బల్, నాన్ వెర్బల్, అనలిటికల్ రీజనింగ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పజిల్స్, డిస్టన్స్ అండ్ డైరెక్షన్, నంబర్ సిరీస్ కంప్లిషన్, అనాలజీ, కౌంటింగ్ ఫిగర్,డైస్, సిలోజిజం తదితర అంశాలుంటాయి. ఇందులో మంచి మార్కులు సాధించేందుకు లాజికల్ థింకింగ్ ఉపయోగపడుతుంది. ► జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ విభాగంలో.. హిస్టరీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, ఇండియన్ పాలిటీ, ఇంటర్నేషనల్ అఫైర్స్, పుస్తకాలు, రచయితలు తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఈ విభాగంలో అభ్యర్థికి సమకాలీన పరిణామాలపై ఉన్న అవగాహనను పరిశీలిస్తారు. కాబట్టి వర్తమాన అంశాలపై పట్టుకోసం నిత్యం దినపత్రికలు చదివి నోట్స్ రాసుకోవడం అలవాటు చేసుకోవాలి. ► ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌లో..టైమ్ అండ్ డిస్టన్స్, బోట్ అండ్ స్ట్రీమ్, ఆల్జీబ్రా, జామెట్రీ, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో అండ్ ప్రపోర్షన్, టైమ్ అండ్ వర్క్ వంటి వాటి నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇది అభ్యర్థికి గణితంపై ఉన్న అవగాహనను పరీక్షించే విభాగం. కాబట్టి పదో తరగతి స్థాయి మ్యాథమెటిక్స్ అంశాలపై గట్టి పట్టు సాధించాలి. ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. వేగం పెంచుకోవాలి. తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించడం చాలా అవసరం. ► ఇంగ్లిష్/హిందీ: ఇందులో మంచి స్కోర్ సాధించేందుకు గ్రామర్‌తోపాటు వొకాబ్యులరీపై పట్టు సాధించాలి. సెంటెన్స్ కరెక్షన్, సినానిమ్స్, యాంటోనిమ్స్, సెంటెన్స్ ఎరేంజ్మెంట్, ఎర్రర్స్ ఫైండింగ్ తదితరాలపై అవగాహన పెంచుకోవాలి. ఇంగ్లిష్ పుస్తకాలు, ఇంగ్లిష్ దినపత్రికలు, వ్యాసాలు చదవడం ద్వారా ఈ విభాగాన్ని సులువుగానే గట్టెక్కే అవకాశముంది. ► ఈ పరీక్షలో నెగిటివ్ మార్కుల విధానం అమలులో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి నాల్గోవంతు(0.25) మార్కు తగ్గిస్తారు. ► ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(పీఎస్టీ): ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల శారీరకంగా «ధృడంగా ఉండాలి. ఎత్తు: పురుషులు 170 సెం.మీ, మహిళలు 157 సెం.మీ ఉంటే సరిపోతుంది. ఛాతీ: పురుషులు 170 సెం.మీ ఉండాలి. గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ వ్యాకోచించాలి. బరువు: ఎత్తుకు తగిన విధంగా ఉండాలి. ► ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(పీఈటీ): ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టుల్లో భాగంగా పురుషులు 5 కిలోమీటర్ల దూరాన్ని 24 నిమిషాల్లో; అలాగే 1.6 కిలోమీటర్ల దూరాన్ని 6 1/2 నిమిషాల్లో పరుగెత్తాలి. మహిళలు 1.6 కిలోమీటర్ల దూరాన్ని 8 1/2 నిమిషాల్లో, 800 మీటర్ల దూరాన్ని 4 నిమిషాల్లో పరుగెత్తాలి. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు ► ఆంధ్రప్రదేశ్‌లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నంల్లో పరీక్ష కేంద్రాలున్నాయి. ► తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ల్లో పరీక్ష కేంద్రాలున్నాయి. ప్రిపరేషన్ టిప్స్ ► కానిస్టేబుల్ పరీక్షకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల పరీక్ష విధానాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత సరైన స్టడీ ప్లాన్ సిద్దం చేసుకోవాలి. ► సిలబస్‌ను గురించిన అవగాహన పెంచుకోవాలి. ముఖ్యమైన టాపిక్స్‌ను గుర్తించాలి. ► గత ప్రశ్నపత్రాలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ► ఆన్లైన్ మాక్‌టెస్టులు రాయాలి. దీనిద్వారా పరీక్షలో ఎక్కడ పొరపాట్లు చేస్తున్నామో తెలుస్తుంది. ► ఒత్తిడిని దూరం చేసుకుంటూ ప్రిపరేషన్ కొనసాగించాలి. అప్పుడే పరీక్షలో మంచి ప్రతిభ కనబరిచే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తు చివరి తేదీ: 31.08.2021 ► పరీక్ష తేదీ: త్వరలో ప్రకటిస్తారు ► వెబ్సైట్: https://ssc.nic.in -
IIT JAM 2022: ఐఐటీలకు మరో మార్గం.. జామ్
ఐఐటీలు..దేశంలోని ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్లు. ఈ విద్యాసంస్థలు బీటెక్, ఎంటెక్ వంటి ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సులేకాకుండా.. సైన్స్, మేనేజ్మెంట్ తదితర కోర్సులను కూడా అందిస్తున్నాయి. ముఖ్యంగా ఐఐటీలు సైన్స్ సబ్జెక్టుల్లో అందించే ఎమ్మెస్సీ, పీహెచ్డీ కోర్సులకు ఎంతో డిమాండ్ ఉంది. వీటిల్లో ప్రవేశానికి మార్గం.. జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్(జామ్)! దేశవ్యాప్తంగా నిర్వహించే జామ్‌లో విజయం సాధిస్తే.. ఐఐటీల్లో పీజీ స్థాయి కోర్సుల్లో అడుగుపెట్టొచ్చు. ఇటీవల ఐఐటీ జామ్–2022 షెడ్యూల్ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. జామ్‌తో ప్రవేశం కల్పించే ఇన్స్టిట్యూట్లు, కోర్సులు, పరీక్ష విధానం, పరీక్షలో విజయానికి ప్రిపరేషన్ టిప్స్.. ఐఐటీల్లో ఏ కోర్సు చదివినా.. ఉజ్వల కెరీర్ ఖాయమనే అభిప్రాయం. అందుకే ఇంటర్ అర్హతగా నిర్వహించే జేఈఈ–అడ్వాన్స్డ్ మొదలు.. బీటెక్ ఉత్తీర్ణులు రాసే గేట్ వరకూ.. ఐఐటీల్లో అడ్మిషన్ కోసం ఏటా లక్షల మంది పోటీ పడుతుంటారు. కానీ అందుబాటులో ఉన్న సీట్లు, పోటీని పరిగణనలోకి తీసుకుంటే.. అవకాశం దక్కేది కొందరికే. అడ్వాన్స్డ్, లేదా గేట్ ద్వారా ప్రవేశం లభించకపోయినా.. అంతగా నిరుత్సాహపడాల్సిన అవసరంలేదు. ఎందుకంటే.. ఐఐటీల కలను నిజం చేసుకునేందుకు మరో మార్గం ఉంది.. అదే జామ్!! జామ్ అంటే జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్నే సంక్షిప్తంగా జామ్ అని పిలుస్తున్నారు. దీన్ని ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహిస్తారు. ప్రతి ఏటా ఒక్కో ఐఐటీ ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతలు చేపడుతుంది. 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐఐటీ–రూర్కీ.. జామ్–2022 షెడ్యూల్‌ను ప్రకటించింది. అర్హత సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. డిగ్రీలో కనీసం 55శాతం మార్కులు లేదా 5.5 సీజీపీఏ సాధించాలి. 2022లో చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వారు సెప్టెంబర్ 30, 2022లోపు సర్టిఫికెట్లు అందించాల్సి ఉంటుంది. ఇన్స్టిట్యూట్లు జామ్‌లో ప్రతిభ ఆధారంగా దేశ వ్యాప్తంగా 20 ఐఐటీలు, ఐఐఎస్సీ–బెంగళూరుల్లో రెండేళ్ల ఎమ్మెస్సీ, పీహెచ్డీ స్థాయి ప్రోగ్రామ్స్‌లో ప్రవేశం లభిస్తుంది. ప్రస్తుతం ఐఐటీ–భిలాయ్, భువనేశ్వర్, ముంబై, ఢిల్లీ, ధన్‌బాద్, గాంధీనగర్, గువహటి, హైదరాబాద్, ఇండోర్, జోథ్‌పూర్, కాన్పూర్, ఖరగ్‌పూర్, చెన్నై, మండి, పాలక్కాడ్, పాట్నా, రూర్కీ, రోపార్, తిరుపతి, వారణాసి క్యాంపస్‌లతోపాటు ఐఐఎస్సీ–బెంగళూరులోనూ ఆయా కోర్సుల్లో అడ్మిషన్ పొందొచ్చు. కోర్సులు ► జామ్‌లో సాధించిన స్కోర్‌తో.. ఎమ్మెస్సీ(రెండేళ్లు); మాస్టర్స్ ఇన్ ఎకనామిక్స్(రెండేళ్లు); జాయింట్ ఎమ్మెస్సీ–పీహెచ్డీ; ఎమ్మెస్సీ–పీహెచ్డీ డ్యూయల్ డిగ్రీ; పోస్ట్ బ్యాచిలర్ డిగ్రీ ప్రోగ్రామ్స్; ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశం పొందొచ్చు. ► వీటితోపాటు ఐఐఎస్సీ బెంగళూరులో బయలాజికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, కెమికల్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్ విభాగాల్లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ అందుబాటులో ఉంది. జామ్ స్కోర్ ఆధారంగా ఈ ఇన్స్టిట్యూట్ సొంతంగా ప్రవేశ ప్రక్రియ చేపడుతుంది. ఇందుకోసం అభ్యర్థులు ఐఐఎస్సీ బెంగళూరు వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో విభాగంలో కనిష్టంగా 15 మందికి, గరిష్టంగా 23 మందికి ప్రవేశం కల్పిస్తారు. ఏడు పేపర్లలో పరీక్ష జామ్ పరీక్షను మొత్తం ఏడు పేపర్లలో నిర్వహిస్తారు. అవి.. బయోటెక్నాలజీ; కెమిస్ట్రీ; ఎకనామిక్స్; జియాలజీ; మ్యాథమెటిక్స్;మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్; ఫిజిక్స్. అభ్యర్థులు గరిష్టంగా రెండు పేపర్లకు హాజరవ్వొచ్చు. ఈ విషయాన్ని దరఖాస్తు సమయంలోనే పేర్కొనాల్సి ఉంటుంది. మూడు విభాగాలు ► జామ్ పరీక్ష మొత్తం మూడు విభాగాల్లో జరుగుతుంది. ► సెక్షన్ ఏ: 30 మల్టిపుల్ ఛాయిస్ కొశ్చన్స్(ఎంసీక్యూ)ఉంటాయి. ఈ విభాగంలో 10 ఒక మార్కు ప్రశ్నలు, రెండు మార్కుల ప్రశ్నలు 20 అడుగుతారు. ► సెక్షన్ బీ: ఈ విభాగంలో 10 మల్టిపుల్ సెలక్ట్ కొశ్చన్స్(ఎంఎస్క్యూ) ఉంటాయి. వీటిలో ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానాలు ఉంటాయి. అభ్యర్థులు అడిగిన ప్రశ్నకు సరితూగే సమాధానాలను గుర్తించాల్సి ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కులు లభిస్తాయి. ► సెక్షన్ సీ: ఈ విభాగంలో 20 న్యూమరికల్ ఆన్సర్ టైప్ ప్రశ్నలు అడుగుతారు. వీటిలో 10 ప్రశ్నలకు 1 మార్కు చొప్పున, 10 ప్రశ్నలకు 2 మార్కులు చొప్పున కేటాయిస్తారు. ► ఇలా మొత్తం మూడు గంటల వ్యవధిలో 60 ప్రశ్నలు–100 మార్కులకు జామ్ పరీక్ష జరుగుతుంది. ► నెగెటివ్ మార్కింగ్ నిబంధన అమలవుతోంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కు కోత విధిస్తారు. ఎంఎస్క్యూ, ఎన్ఏటీ ప్రశ్నలకు ఎలాంటి నెగెటివ్ మార్కులు ఉండవు. ఆన్లైన్ విధానంలో సీట్ల కేటాయింపు జామ్‌లో స్కోర్ సాధించిన అభ్యర్థులు ఆ తర్వాత దశలో.. ఐఐటీల్లో ప్రవేశం కోసం ప్రత్యేకంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం.. జామ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్(జేఓఏపీఎస్)ను ప్రత్యేకంగా అందుబాటులోకి తెస్తారు. అభ్యర్థులు ఈ పోర్టల్‌లో లాగిన్ ఐడీ క్రియేట్ చేసుకొని.. ఆన్లైన్ దరఖాస్తును పూర్తి చేయాలి. ఈ దరఖాస్తు సమయంలోనే తమకు ఆసక్తి ఉన్న కోర్సులు, ఇన్స్టిట్యూట్ల ప్రాథమ్యాలను పేర్కొనాలి. ఆ తర్వాత అభ్యర్థులు సాధించిన స్కోర్, పేర్కొన్న ప్రాథమ్యాల ఆధారంగా ఆన్లైన్లోనే సీట్ అలాట్మెంట్ చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం నాలుగు రౌండ్లలో నిర్వహిస్తారు. సిలబస్.. ప్రిపరేషన్ ఐఐటీ–జామ్‌లో విజయం సాధించేందుకు..అభ్యర్థులు తమ అకడమిక్ సబ్జెక్ట్‌లకు సంబంధించి బ్యాచిలర్ డిగ్రీస్థాయి పుస్తకాలను సమగ్రంగా చదవాలి. కెమిస్ట్రీ ఫిజికల్ కెమిస్ట్రీ: బేసిక్ మ్యాథమెటికల్ కాన్సెప్టులు, అటామిక్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్, థియరీ ఆఫ్ గ్యాసెస్, సాలిడ్ స్టేట్, కెమికల్ థర్మోడైనమిక్స్, కెమికల్ అండ్ ఫేజ్ ఈక్విలిబ్రియా, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనటిక్స్, అబ్సార్పన్, స్పెక్టోమెట్రి; ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ స్పెక్టోమెట్రి బేసిక్ కాన్సెప్టులు, ఆర్గానిక్ రియాక్షన్ మెకానిజం, సింథటిక్ అప్లికేషన్స్,క్వాలిటేటివ్ ఆర్గానిక్ అనాలసిస్, ఆరోమాటిక్ అండ్ హెటిరోసైక్లిక్ కెమిస్ట్రీ. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో.. పిరియాడిక్ టేబుల్, కెమికల్ బాండింగ్, షేప్స్ ఆఫ్ కాంపౌండ్స్, మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్, ట్రాన్సిషన్ మెటల్స్, బయో ఇనార్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ తదితర అంశాలు చదవాలి. బయోటెక్నాలజీ బయోటెక్నాలజీ పేపర్‌కు హాజరయ్యే అభ్యర్థులు బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ను ప్రిపేరవ్వాల్సి ఉంటుంది. బయాలజీ విభాగానికి సంబంధించి పదో తరగతి నుంచి డిగ్రీ స్థాయి వరకు అకడమిక్స్ పుస్తకాలను చదవడం లాభిస్తుంది. జనరల్ బయాలజీ, బయోకెమిస్ట్రీ అండ్ ఫిజియాలజీ, బేసిక్ బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బయాలజీ, సెల్ బయాలజీ, మైక్రోబయాలజీ చాప్టర్లను ప్రిపేరవ్వాలి. కెమిస్ట్రీకి సంబంధించి పదోతరగతి, ఇంటర్, డిగ్రీ పాఠ్యాంశాలను చదవాలి. మ్యాథ్స్, ఫిజిక్స్‌లను ఇంటర్ స్థాయిలో చదివితే సరిపోతుంది. ఎకనామిక్స్ మైక్రో ఎకనామిక్స్, మాక్రో ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ ఫర్ ఎకనామిక్స్, ఇండియన్ ఎకానమీ, మ్యాథమెటిక్స్ ఫర్ ఎకనామిక్స్‌లను అధ్యయనం చేయాలి. జియాలజీ ప్లానెట్ ఎర్త్, జియో మార్ఫాలజీ, స్ట్రక్చరల్ జియాలజీ, పాలియోంటాలజీ, స్టాటిగ్రఫీ, మినరాలజీ, పెట్రోలజీ, ఎకనామిక్ జియాలజీ, అప్లయిడ్ జియాలజీలపై దృష్టి పెట్టాలి. మ్యాథమెటిక్స్ సీక్వెన్సెస్ అండ్ సిరీస్ ఆఫ్ రియల్ నంబర్స్, ఫంక్షన్స్ ఆఫ్ వన్/టూ/త్రీ రియల్ వేరియబుల్, ఇంటెగ్రల్ క్యాల్కులస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, వెక్టార్ క్యాల్కులస్, గ్రూప్ థియరీ, లీనియర్ ఆల్జీబ్రా, రియల్ అనాలసిస్ పాఠ్యాంశాలను ప్రిపేరవ్వాలి. మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ మ్యాథ్స్‌కు 40 శాతం, స్టాటిస్టిక్స్‌కు 60 శాతం వెయిటేజీ ఉండే ఈ పేపర్లో.. మ్యాథ్స్‌కు సంబంధించి సీక్వెన్సెస్ అండ్ సిరీస్, డిఫరెన్షియల్ క్యాల్కులస్, ఇంటెగ్రల్ క్యాల్కులస్, మాట్రిసెస్ చాప్టర్లను అధ్యయనం చేయాలి. స్టాటిస్టిక్స్‌లో ప్రాబబిలిటీ, ర్యాండమ్ వేరియబుల్స్, స్టాండర్డ్ డిస్ట్రిబ్యూషన్, జాయింట్ డిస్ట్రిబ్యూషన్, సాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్, లిమిట్ థీరమ్స్, ఎస్టిమేషన్, టెస్టింగ్ ఆఫ్ హైపోథీసిస్లను అధ్యయనం చేయాలి. ఫిజిక్స్ మ్యాథమెటికల్ మెథడ్స్, మెకానిక్స్ అండ్ జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ మేటర్, ఆసిలేషన్స్, వేవ్స్ అండ్ ఆప్టిక్స్, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నటిజం, కైనటిక్ థియరీ, థర్మోడైనమిక్స్, మోడ్రన్ ఫిజిక్స్, సాలిడ్ స్టేట్ ఫిజిక్స్, డివైజెస్ అండ్ ఎలక్ట్రానిక్స్ పాఠ్యాంశాలను అభ్యసనం చేయాలి. ఐఐటీ–జామ్ 2022 ముఖ్య సమాచారం ► ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం: ఆగస్ట్ 30, 2021 ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 11, 2021 ► అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ సదుపాయం: జనవరి 4, 2022 ► జామ్ పరీక్ష తేదీ: ఫిబ్రవరి 13, 2022 ► ఫలితాల వెల్లడి: మార్చి 22, 2022 ► తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి. ► పూర్తి వివరాలకు వెబ్సైట్: https://jam.iitr.ac.in -
ఆర్ఆర్బీ పరీక్షలో సక్సెస్ సాధించాలంటే..?
ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అంటే... రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్–నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఎగ్జామ్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు.. ఈనెల 23 నుంచి 31 వరకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పరీక్ష నిర్వహణకు షెడ్యూల్ ఖరారు చేసింది. ప్రస్తుతం నిర్వహించేది స్టేజ్–1 పరీక్ష. ఎగ్జామ్‌కు మరో పది రోజులు మాత్రమే సమయం ఉంది. అభ్యర్థులు ఈ విలువైన సమయాన్ని సమర్థంగా వినియోగించుకుంటే పరీక్షలో విజయం సాధించవచ్చు. ఈ నేపథ్యంలో.. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ టిప్స్.. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పరీక్షను దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఈ పరీక్ష ద్వారా అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, కమర్షియల్ అప్రెంటిస్, ట్రైన్స్ క్లర్క్, జూనియర్ టైమ్ కీపర్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రాఫిక్ అసిస్టెంట్, ట్రాఫిక్ అప్రెంటిస్, గూడ్స్ గార్డ్ మొదలైన ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఇంటర్మీడియెట్(10+2) ఉత్తీర్ణులు, గ్రాడ్యుయేట్స్ ఈ పరీక్ష దరఖాస్తుకు అర్హులు. వయసు 18 ఏళ్ల నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పోస్టులకు మొత్తం నాలుగు దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. తొలుత సీబీటీ(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్)1, ఆ తర్వాత సీబీటీ(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) 2, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా తుది ఎంపిక నిర్వహిస్తారు. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ టెస్ట్‌ను ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు. ప్రస్తుతం జరిగే ది పరీక్ష స్టేజ్–1. ఇందులో అర్హత సాధించిన వారిని రెండో దశ(స్టేజ్–2)కు ఎంపిక చేస్తారు. రెండో దశ పరీక్ష సైతం ఆన్లైన్ విధానంలోనే ఉంటుంది. ఆ తర్వాత టైపింగ్ స్కిల్ టెస్ట్/కంప్యూటర్ ఆధారిత అప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్/మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి. స్టేజ్–1 పరీక్ష ► తొలి దశ పరీక్ష 100 ప్రశ్నలు–100 మార్కులకు జరుగుతుంది.ఇందులో మ్యాథమెటిక్స్ 30 ప్రశ్నలు–30 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 ప్రశ్నలు–30 మార్కులు, జనరల్ అవేర్నెస్ 40 ప్రశ్నలు–40 మార్కులకు ఉంటాయి. పరీక్ష సమయం 90నిమిషాలు. స్టేజ్1లో అర్హత సాధించినవారిని స్టేజ్2కు అనుమతిస్తారు. స్టేజ్–2 పరీక్ష రెండో దశ పరీక్ష 120 ప్రశ్నలు–120 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో మ్యాథమెటిక్స్ 35 ప్రశ్నలు–35 మార్కులు, రీజనింగ్ 35 ప్రశ్నలు–35 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ 50 ప్రశ్నలు–50 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 90 నిమిషాలు. నెగిటివ్ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానినికి 1/3 మార్కు కోత వేస్తారు. ప్రిపరేషన్ ప్రణాళిక ► ఎంతో కాలంగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పరీక్ష కోసం సిద్ధమవుతున్న వారు ఇప్పటికే సిలబస్ అంశాల అధ్యయనం పూర్తిచేసి ఉంటారు. ► ఇప్పుడున్న తక్కువ సమయంలో అభ్యర్థులు తమ బలాలు, బలహీనతలను అంచనా వేసుకోవడం అవసరం. ఏ విభాగంలో బలహీనంగా ఉన్నారో గుర్తించి.. దానికి ఎక్కువ సమయం కేటాయించాలి. ► పరీక్ష రోజు వరకు అభ్యర్థులు గత ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్ చేయడం మంచిది. ఇది పరీక్షలో టైమ్ మేనేజ్మెంట్కు దోహదపడుతుంది. ► ఒక సబ్జెక్ట్ కోసం ఎంత సమయం కేటాయించారో.. ఆలోపే చదవడం పూర్తి చేయాలి. ప్రతిరోజు రివిజన్ చేయడం మరిచిపోవద్దు. ► ఆన్లైన్లో మాక్‌టెస్టులు ప్రాక్టీస్ చేయడం ద్వారా ఒత్తిడిని జయించడంతోపాటు వేగం పెంచుకోవచ్చు. ► ప్రస్తుతం అందుబాటులో ఉన్న తక్కువ సమయంలో ఎలాంటి చిట్కాలు పాటిస్తే మంచి మార్కులు స్కోరు చేయవచ్చో తెలుసుకోవాలి. ► గణిత విభాగానికి సంబంధించిన ఫార్ములాలు, సూత్రాలను గుర్తుంచుకోవాలి. ► ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సిలబస్‌లో పేర్కొన్న టాపిక్స్ అన్నీ కవర్ చేశారో లేదో చూసుకోవాలి. ఇప్పుడు కొత్త అంశాల జోలికి వెళ్లడం కంటే ఇప్పటికే చదివిన టాపిక్స్‌ను మరోసారి అధ్యయనం చేయడం మంచిది. ► ఏదో ఒక ఒక సబ్జెక్టుకు ఎక్కువ సమయం కేటాయించకుండా..టైమ్ టేబుల్ ప్రకారం అన్ని అంశాలకు సన్నద్ధమవ్వాలి. ► ప్రతి ప్రశ్నను పరిష్కరించడానికి నిర్దిష్ట సమయాన్ని కేటాయించాలి. జవాబులను త్వరగా గుర్తించేందుకు సత్వరమార్గాలు, చిట్కాలను గుర్తుంచుకోవాలి. ► ఏదైనా ఒక టాపిక్‌ను సాధన చేసే క్రమంలో ఇబ్బందులు తలెత్తితే.. ఇతర టాపిక్స్‌ను చదవడం లేదా ఇంతకుముందు చదివిన టాపిక్స్‌ను మరోసారి ప్రాక్టీస్ చేయడం మంచిది. పరీక్ష రోజు టిప్స్ ► పరీక్షలో మొదట తేలికపాటి ప్రశ్నల నుంచి క్లిష్టమైన ప్రశ్నలకు జవాబులు గుర్తించడం మంచిది. దీనివల్ల ఒత్తిడి తగ్గడంతోపాటు ఎక్కువ ప్రశ్నలకు జవాబులు గుర్తించేందుకు వీలవుతుంది. ► గణిత విభాగంతో పోలిస్తే, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ విభాగాల ప్రశ్నలకు సులభంగానే సమాధానాలు గుర్తించవచ్చు. కాబట్టి మొదట సులభమైన వాటితో పరీక్ష ప్రారంభించాలి. దీనివల్ల కేటాయించిన సమయం కంటే ముందే తేలికపాటి ప్రశ్నలు ముగిస్తే.. క్లిష్ట ప్రశ్నలకు కేటాయించేందుకు అధిక సమయం లభిస్తుంది. ► ఒక ప్రశ్నకు 30 సెకన్ల కంటే ఎక్కువ సమయం కేటాయించకుండా చూసుకోవాలి. ఎక్కువ సమయం తీసుకునే ప్రశ్నలను చివరగా ప్రయత్నించడం మేలుచేస్తుంది. -
TS EDCET 2021: ఎడ్‌సెట్ విజయం ఇలా
ఉపాధ్యాయ వృత్తిలో రాణించాలంటే.. బీఈడీ తప్పనిసరి. వృత్తిపరమైన నైపుణ్యాలను అందించే బీఈడీ కోర్సులో ప్రవేశం పొందాలంటే.. ఎడ్‌సెట్ రాయాల్సి ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణలో టీఎస్ ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్షకు ప్రకటన విడుదలైంది. నూతన విద్యావిధానానికి అనుగుణంగా టీఎస్ ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్షలో పలు మార్పులు చేర్పులు చేశారు. ఈ నేపథ్యంలో.. టీఎస్ ఎడ్‌సెట్ 2021కు అర్హతలు, పరీక్ష విధానం, సిలబస్ అంశాల గురించి తెలుసుకుందాం... తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ వృత్తికి సంబం«ధించిన రెండేళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశం పొందాలంటే.. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే టీఎస్ ఎడ్‌సెట్‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది. డిగ్రీ స్థాయి కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు టీఎస్ ఎడ్‌సెట్‌కు దరఖాస్తు చేసుకునేందకు అర్హులు. అర్హతలు ► కనీసం 50 శాతం మార్కులతో బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎస్సీ(హోంసైన్స్), బీసీఏ, బీబీఎం, బీఏ(ఓరియంటల్ లాంగ్వేజ్), బీబీఏ కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులు/ఫైనల్ పరీక్షలకు హాజరైన వారు దరఖాస్తుకు అర్హులు. బీఈ/బీటెక్ కోర్సులను చదివిన వారు ఆయా కోర్సుల్లో కనీసం 50 శాతం మార్కులను సాధించాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ ఇతర ప్రభుత్వ రిజర్వేషన్లు కలిగిన అభ్యర్థులకు ఉత్తీర్ణత శాతంలో సడలింపు ఉంది. వీరు కనీసం 40 శాతం మార్కులు సాధించాలి. ► వయసు జూలై1, 2021 నాటికి 19ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు. ► ఎంబీబీఎస్, బీఎస్సీ(అగ్రికల్చర్), బీవీఎస్సీ, బీహెచ్‌ఎంటీ, బీఫార్మసీ, ఎల్ఎల్బీ వంటి కోర్సులు చదివిన విద్యార్థులు టీఎస్ ఎడ్‌సెట్ పరీక్షను రాసేందుకు, బీఈడీ కోర్సులో చేరేందుకు అనర్హులు. ► డిగ్రీ లేకుండా పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా ఎడ్‌సెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు కాదు. పరీక్ష ఇలా ► ఎడ్‌సెట్ పరీక్ష మొత్తం 150 మార్కులకు ఉంటుంది. ఆన్లైన్(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్–సీబీటీ) విధానంలో ఆబ్జెక్టివ్ తరహా పరీక్ష నిర్వహిస్తారు. సబ్జెక్టు/కంటెంట్–60మార్కులకు(మ్యాథమెటిక్స్–20మార్కులు, సైన్స్–20మార్కులు, సోషల్ స్టడీస్–20 మార్కులు), టీచింగ్ అప్టిట్యూడ్–20 మార్కులు, జనరల్ ఇంగ్లిష్–20 మార్కులు, జనరల్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషనల్ ఇష్యూస్–30మార్కులు, కంప్యూటర్ అవేర్నెస్–20 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ఎడ్‌సెట్ పరీక్ష సమయం రెండు గంటలు. ► ఎడ్‌సెట్‌లో అర్హత పొందేందుకు కనీసం 25శాతం మార్కులు అంటే.. మొత్తం 150 మార్కులకు 38 మార్కులు సాధించాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు కనీస అర్హత మార్కుల నిబంధన లేదు. ► గతంలో ఎడ్‌సెట్‌కు సంబంధించిన సిలబస్ డిగ్రీ స్థాయి వరకు ఉండేది. కానీ ప్రస్తుతం 2021 నుంచి మార్పులు చేశారు. దీనిలో చేసిన మార్పుల ప్రకారం–పదోతరగతి వరకు అన్ని సబ్జెక్టులపై ప్రశ్నలు ఇస్తున్నారు. అదేవిధంగా కొత్తగా కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా కంప్యూటర్‌కు సంబంధించిన సాంకేతిక అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్/తెలుగు, ఇంగ్లిష్/ఉర్దూ మాధ్యమంలో ఉంటుంది. సిలబస్ అంశాలు ఇవే ► తెలంగాణ స్టేట్ కరిక్యులానికి సంబంధించి పదోతరగతి వరకు ఉన్న పాఠ్యపుస్తకాలు అన్నీ చదవాలి. ► మ్యాథమెటిక్స్:సంఖ్యావ్యవస్థ(నంబర్ సిస్టమ్), వాణిజ్య గణితం(కమర్షియల్ మ్యాథమెటిక్స్), బీజగణితం(ఆల్జీబ్రా), జ్యామితి(జామెట్రీ), కొలతలు(మెన్సురేషన్), త్రికోణమితి(ట్రిగ్నోమెట్రీ), సమాచార నిర్వహణ(డేటా హ్యాడ్లింగ్). ► ఫిజికల్ అండ్ బయోలాజికల్ సైన్స్: ఆహారం(ఫుడ్), జీవులు(లివింగ్ ఆర్గానిజమ్స్), జీవన ప్రక్రియలు(లైఫ్ ప్రాసెస్ ), జీవవైవి«ధ్యం(బయోడైవర్సిటీ), కాలుష్యం(పొల్యూషన్), పదార్థం(మెటీరియల్), కాంతి(లైట్), విద్యుత్ అండ్ అయస్కాంతత్వం(ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నటిజమ్), వేడి(హీట్), ధ్వని(సౌండ్), కదలిక(మోషన్), మార్పులు(చేంజెస్),వాతావరణం(వెదర్ అండ్ క్లయిమెట్), బొగ్గు అండ్ పెట్రోల్(కోల్ అండ్ పెట్రోల్), కొన్ని సహజ సిద్దమైన దృగ్విషయం (సమ్ నేచురల్ ఫినామినా) నక్షత్రాలు, సౌరవ్యవస్థ(స్టార్స్ అండ్ సోలార్ సిస్టమ్), లోహశాస్త్రం(మెటాలజీ), రసాయన ప్రతిచర్యలు(కెమికల్ రియాక్షన్స్). ► సాంఘిక శాస్త్రం: భౌగోళికశాస్త్రం(జాగ్రఫీ), చరిత్ర(హిస్టరీ), రాజనీతి శాస్త్రం (పొలిటికల్ సైన్స్), అర్థశాస్త్రం(ఎకనామిక్స్). ► టీచింగ్ ఆప్టిట్యూడ్: ఆప్టిట్యూడ్ ప్రశ్నలు.. బోధన అభ్యసన ప్రక్రియ, క్లాస్ రూంలో పిల్లలతో వ్యవహరించే విధానం, విశ్లేషణాత్మక ఆలోచన, జనరల్ ఇంటెలిజెన్స్ వంటివి వాటిపై ఉంటాయి. ► జనరల్ ఇంగ్లిష్: రీడింగ్ కాంప్రహెన్షన్, స్పెల్లింగ్ ఎర్రర్, వొకాబ్యులరీ, ఫ్రేస్ రీప్లేస్మెంట్, ఎర్రర్ డిటెక్షన్ అండ్ వర్డ్ అసోసియేషన్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ► జనరల్ నాలెడ్జ్, ఎడ్యుకేషనల్ ఇష్యూ: కరెంట్ అఫైర్స్, ప్రస్తుత జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలు, సమకాలీన విద్యాసమస్యలు, జనరల్ పాలసీలు, సైంటిఫిక్ పరిశోధనలు, ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు, వాతావరణ పరిస్థితులకు సంబంధించిన అంశాలుంటాయి. ► కంప్యూటర్ అవేర్నెస్: కంప్యూటర్, ఇంటర్నెట్, మెమొరీ, నెట్వర్కింగ్, ఫండమెంటల్స్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి. ప్రిపరేషన్ ఇలా ► ఎడ్‌సెట్ పరీక్షలో అర్హత సాధించాలంటే.. పాఠశాల స్థాయిలోని పదోతరగతి వరకు అన్ని సబ్జెక్టులను చదవాలి. ఇందుకోసం తెలంగాణ స్టేట్ కరిక్యులం ప్రాథమిక స్థాయి నుంచి పదోతరగతి వరకూ పుస్తకాలను సమగ్రంగా చదవాలి. ► చక్కని ప్రిపరేషన్, సబ్జెక్ట్‌పై పట్టు సాధిస్తే ఎంట్రన్‌లో మంచి మార్కులు(ర్యాంక్) సాధించేందుకు అవకాశం ఉంటుంది. ► ఎడ్‌సెట్ పరీక్షకు ఇంకా దాదాపు నాలుగు నెలల సమయం ఉంది. కాబట్టి నిర్ణిష్టమైన టైమ్ టెబుల్ సిద్ధం చేసుకొని.. దానికి అనుగుణంగా ప్రిపరేషన్ కొనసాగించాలి. ► పాఠ్య పుస్తకాలను చదివే సమయంలో సులువుగా గుర్తుండేలా ముఖ్యమైన అంశాలతో నోట్స్ తయారు చేసుకోవాలి. ఇది ఒక ఎడ్‌సెట్‌కే కాకుండా.. భవిష్యత్తులో టెట్, టీఆర్టీ వంటి పరీక్షలకు కూడా ఉపయోగపడుతుంది. ► కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ కోసం పత్రికలను చదవడం, న్యూస్ బుల్‌టెన్లను అనుసరించాలి. దినపత్రికల్లో ముఖ్యమైన వార్తలను, పేపర్ కట్స్‌ను నోట్ రూపంలో సిద్ధం చేసుకొని ఎప్పటికప్పుడు చూస్తుండాలి. ► పరీక్ష సమయం వరకు ముఖ్యమైన అంశాలను సాధ్యమైనన్నిసార్లు రివిజన్ చేసుకోవాలి. ఇందుకోసం గతంలో రాసి,సిద్ధం చేసుకున్న నోట్‌బుక్ ఉపయోగించాలి. ముఖ్యమైన సమాచారం ► దరఖాస్తు విధానం: టీఎస్ ఎడ్‌సెట్ పరీక్షకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు ప్రక్రియను పూర్తిచేయాలి. ఇందుకోసం ఎడ్‌సెట్ అధికారిక వెబ్సైట్ https://edcet.tsche.ac.in/లాగిన్ అవ్వాలి. ► దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/పీహెచ్ అభ్యర్థులకు రూ.450, మిగతా వారికి రూ.650. ► దరఖాస్తు చివరి తేదీ: 15.06.2021(ఆలస్య రుసం లేకుండా) ► హాల్‌టికెట్ డౌన్లోడ్ ప్రారంభం: 10.08.2021 ► ఎడ్‌సెట్ పరీక్ష తేదీలు: 24.08.2021, 25.08.2021 ► వెబ్సైట్: https://edcet.tsche.ac.in/TSEDCET/EDCET_HomePage.aspx -
ACET 2021: నిత్యనూతనం.. యాక్చూరియల్ సైన్స్!
ఇంటర్మీడియెట్ పూర్తి చేయబోతున్నారా.. ఆర్థిక గణాంకాలంటే మక్కువ ఉందా.. ఉజ్వల కెరీర్ సొంతం చేసుకోవాలని భావిస్తున్నారా..! అయితే మీకు సరైన మార్గం.. ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్చుయరీస్ ఆఫ్ ఇండియా(ఐఏఐ) నిర్వహించే.. యాక్చూరియల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఏసెట్)! ఈ పరీక్షలో.. విజయం సాధిస్తే.. భవిష్యత్తులో బీమా రంగంలో చక్కటి కొలువులు దక్కించుకోవచ్చు. బీమా సంస్థల్లో ఎంతో కీలకంగా నిలిచే.. యాక్చూరియల్ విభాగంలో ఉన్నత ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. తాజాగా ఐఏఐ.. ఏసెట్–2021 జూన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఏసెట్ పరీక్ష విధానం, యాక్చూరియల్ సైన్స్ కోర్సులు, కెరీర్ స్కోప్‌పై ప్రత్యేక కథనం... బీమా రంగంలో యాక్చుయరీ అత్యంత కీలకమైన విభాగం. ఏదైనా ఒక పాలసీని ప్రవేశ పెట్టే క్రమంలో ప్రీమియాన్ని నిర్ణయించడం, వయో వర్గాల వారీగా పాలసీ గడువు, మెచ్యూరిటీ సమయంలో చెల్లించాల్సిన మొత్తాలు వంటి అంశాలను నిర్ణయించే విభాగమే..యాక్చుయరీ. ఈ విభాగం లో కొలువులు సొంతం చేసుకోవాలంటే.. బ్యాచిలర్, పీజీ స్థాయిలో యాక్చూరియల్ సైన్స్ స్పెషలైజేషన్ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించాలి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్చుయరీస్ ఆఫ్ ఇండియా(ఐఏఐ)లో రిజిస్ట్రేషన్ ద్వారా ఇంటర్మీడియెట్ అర్హతతోనే ఇందుకు మార్గం వేసుకునే అవకాశం ఉంది. ఐఏఐ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్చుయరీస్ ఆఫ్ ఇండియా(ఐఏఐ).. యాక్చుయరీ విభాగంలో నిపుణులను తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా ఏర్పాటైన సంస్థ ఇది. ఐఏఐ స్వయం ప్రతిపత్తి సంస్థ. ఈ సంస్థకు అంతర్జాతీయ గుర్తింపు కూడా ఉంది. ఐఏఐ యాక్చుయరీ నిపుణలను తీర్చిదిద్దే క్రమంలో మొత్తం మూడు దశల్లో కోర్సును అందిస్తుంది. అవి.. స్టూడెంట్ మెంబర్షిప్ ప్రోగ్రామ్, అసోసియేట్ మెంబర్షిప్ ప్రోగ్రామ్, ఫెలో మెంబర్షిప్ ప్రోగ్రా మ్. ఈ మూడు దశల ప్రోగ్రామ్‌లను పూర్తి చేసుకున్న అభ్యర్థులకు అంతర్జాతీయ స్థాయిలో బీమా రంగంలో ఉజ్వల అవకాశాలు లభిస్తాయని చెప్పొచ్చు. తొలి దశ.. స్టూడెంట్ మెంబర్షిప్ యాక్చుయరీస్ ఆఫ్ ఇండియా అందించే మూ డు మెంబర్షిప్ హోదాల్లో.. ముందుగా స్టూడెంట్ మెంబర్‌గా గుర్తింపు పొందాలి. ఇందుకోసం ఈ సంస్థ ఏటా రెండుసార్లు నిర్వహించే యాక్చురియల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఏసెట్)లో ఉత్తీర్ణత సాధించాలి. 70 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు–వంద మార్కులకు రెండు విభాగాలుగా ఈ పరీక్ష నిర్వహిస్తారు. మొదటి విభాగంలో మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, డేటా ఇంటర్‌ప్రిటేషన్; రెండో విభాగంలో ఇంగ్లిష్, లాజికల్ రీజనింగ్ అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. కనీసం 50 శాతం మార్కులు వస్తే ఏసెట్‌లో అర్హత సాధించినట్టు భావిస్తారు. ఏసెట్ తర్వాత దశలు ► ఏసీఈటీ(ఏసెట్) పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు.. ఐఏఐ నాలుగు దశల్లో ఆయా సబ్జెక్ట్‌లలో నిర్వహించే పరీక్షలకు హాజరుకావచ్చు. ► స్టేజ్–1: కోర్ టెక్నికల్: ఇందులో యాక్చురియల్ స్టాటిస్టిక్స్, యాక్చురియల్ మ్యాథమెటిక్స్, యాక్చురియల్ బిజినెస్ విభాగాల నుంచి తొమ్మిది పేపర్లు ఉంటాయి. ► స్టేజ్–2: కోర్ అప్లికేషన్: ఈ దశలో యాక్చురియల్ రిస్క్ మేనేజ్మెంట్; మోడల్ డాక్యుమెంటేషన్ అనాలిసిస్ అండ్ రిపోర్టింగ్; కమ్యూనికేషన్ ప్రాక్టీస్ పేపర్లలో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ► స్టేజ్–3: స్పెషలిస్ట్ టెక్నిషియన్: ఈ దశలో ఎనిమిది పేపర్లు ఉంటాయి. అభ్యర్థులు ఎనిమిది పేపర్లలో ఏవైనా రెండు పేపర్లను ఎంచుకునే అవకాశం ఉంటుంది. ► స్టేజ్–4: స్పెషలిస్ట్ అప్లికేషన్: యాక్చురియల్ సైన్స్‌కు సంబంధించి నిర్వహించే చివరి దశ ఇది. ఇందులో ఆరు పేపర్లు ఉంటాయి. వీటిల్లో ఉత్తీర్ణత సా«ధిస్తే.. ఐఏఐ యాక్చురియల్ సైన్స్ కోర్సు పూర్తి చేసినట్లే. స్టేజ్–1, 2లు పూర్తి చేసుకుంటే.. అసోసియేట్ మెంబర్ ► ఏసెట్‌లో అర్హత సాధించి.. స్టూడెంట్ మెంబర్ హోదా సొంతం చేసుకొని.. ఆ తర్వాత నిర్వహించే స్టేజ్–1, స్టేజ్–2 పరీక్షలు ఉత్తీర్ణులైతే అసోసియేట్ మెంబర్‌గా గుర్తింపు లభిస్తుంది. ► స్టేజ్–3, స్టేజ్–4లకు సంబంధించిన పేపర్లలోనూ ఉత్తీర్ణత సాధించి.. మొత్తం నాలుగు దశలూ పూర్తి చేసుకొని.. మూడేళ్ల పని అనుభవం గడిస్తే ఫెలో మెంబర్ హోదా దక్కుతుంది. కామర్స్, మ్యాథ్స్–అనుకూలం యాక్చూరియల్ సైన్స్ కోర్సులోని పేపర్లు, టాపిక్స్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. ఇది కామర్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్‌లు చదివిన వారికి అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ విభాగంలో నిర్వహించాల్సిన విధులన్నీ గణాంకాలు, నిధుల విశ్లేషణకు సంబంధించి ఉండటమే ఇందుకు కారణం. డిగ్రీ స్థాయిలో బీకాం, బీఎస్సీ, బీటెక్ చదివిన అభ్యర్థులు; పీజీ స్థాయిలో ఎంబీఏ, ఎంటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా ఈ విభాగంలో ప్రవేశించే అవకాశం ఉంది. విస్తృత అవకాశాలు ప్రస్తుతం యాక్చూరియల్ విభాగంలో దేశంలో నిపుణుల కొరత ఎక్కువగా ఉంది. దాంతో అసోసియేట్ మెంబర్షిప్ సర్టిఫికెట్‌తోనే చక్కటి అవకాశాలు లభిస్తున్నాయి. అసోసియేట్ మెంబర్ హోదా పొందిన వారికి బీమా రంగ సంస్థలు ప్రారంభంలోనే సగటున రూ.8లక్షల వార్షిక వేతనంతో కొలువులు అందిస్తున్నాయి. అన్ని దశలు పూర్తి చేసుకున్న వారికి బీమా రంగంలో యాక్చుయరీ విభాగంలో విస్తృత కొలువులు అందుబాటులో ఉన్నాయి. యాక్చూరియల్ సైన్స్‌లో సర్టిఫికెట్తో బీమారంగ సంస్థల్లో యాక్చుయరీ స్పెషలిస్ట్, రిస్క్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్, అండర్ రైటర్స్, అనలిస్ట్ వంటి ఉద్యోగాలు లభిస్తున్నాయి. వీరికి ప్రారంభంలోనే దాదాపు రూ.పది లక్షల వరకూ వార్షిక వేతనం అందుతోంది. యాక్చుయరీస్ విధులు బీమా సంస్థల్లో యాక్చురియల్ విభాగంలో చేరిన వారు.. నూతన పాలసీలను రూపొందించడం, వినియోగదారులకు ఇవ్వాల్సిన వడ్డీ, రిస్క్ మేనేజ్మెంట్, బీమా కంపెనీల ఆర్థిక ప్రణాళికకు సంబంధించి రిస్క్‌ను ముందుగానే అంచనా వేయడం వంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఒక పాలసీని ప్రవేశ పెట్టే ముందు సంస్థ ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని.. సదరు పాలసీ సరైందా.. దాన్ని ప్రవేశ పెట్టొచ్చా.. అనే అంశాలను కూడా గుర్తించి.. సంస్థ యాజమాన్యానికి తగిన సలహాలు, సూచనలు అందించాలి. ప్రధాన ఉపాధి వేదికలు యాక్చుయరీ విభాగంలో ఐఏఐ సర్టిఫికేషన్ సొంతం చేసుకున్న వారికి లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, ఫైనాన్స్, ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్, రెగ్యులేటరీ, రీ–ఇన్సూరెన్స్ కంపెనీలు, కన్సల్టింగ్ సంస్థలు ప్రధాన ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి. అదే విధంగా అకౌంటింగ్ సంస్థలు, ఇన్వెస్ట్మెంట్ సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్, క్రెడిట్ రిస్క్ అండ్ హెల్త్ మేనేజ్మెంట్ కంపెనీలు, స్టాక్ మార్కెట్లు, సోషల్ సెక్యూరిటీ స్కీంల్లోనూ వీరు కన్సల్టెంట్లుగా పనిచేయొచ్చు. ప్రొడక్ట్ అనలిస్ట్, యాక్చూరియల్ అనలిస్ట్, రిస్క్ అనలిస్ట్ హోదాలతో బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థలు, బిజినెస్ కన్సల్టెన్సీలు, ప్రభుత్వ విభాగాల్లోనూ ఉద్యోగా లుంటాయి. నాన్–ఏసీఈటీ విధానం ఐఏఐ ఇంటర్మీడియెట్ అర్హతగా నిర్వహించే ఏసెట్ పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా ఈ కోర్సులోని దశలకు నమోదు చేసుకునే అవకాశంతోపాటు.. నాన్–ఏసీఈటీ విధానం కూడా అమలవుతోంది. సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యూఏ కోర్సుల ఉత్తీర్ణులు, ఎంబీఏ (ఫైనాన్స్ స్పెషలైజేషన్) ఉత్తీర్ణులు, గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ల నుంచి బీఏ/ ఎమ్మెస్సీలో యాక్చురియల్ సైన్స్ ఉత్తీర్ణులు, బీఈ/బీటెక్ ఉత్తీర్ణులు నేరుగా స్టూడెంట్ మెంబర్షిప్ హోదాకు నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ నిర్వహించే బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ లేదా మ్యాథమెటిక్స్; అదే విధంగా పీజీ స్థాయిలోని ఎంస్టాట్, మ్యాథమెటిక్స్ స్పెషలైజేషన్ ఉత్తీర్ణులు కూడా నేరుగా స్టూడెంట్ మెంబర్షిప్ హోదాకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. జూన్ 2021కు నోటిఫికేషన్ ► యాక్చూరియల్ సైన్స్ విభాగంలో అడుగు పెట్టడానికి తొలి దశగా పేర్కొంటున్న ఏసెట్ పరీక్ష– 2021 జూన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పరీక్షను జూన్ 26న నిర్వహించనున్నారు. ఈ ఏడాది అభ్యర్థులు ఇంటి నుంచే ఆన్లైన్ విధానంలో ఏసెట్కు హాజరయ్యే అవకాశం కల్పించారు. ► అర్హత: ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► ఏసెట్ దరఖాస్తు చివరి తేదీ: జూన్ 2, 2021 ► పరీక్ష తేదీ: జూన్ 26, 2021 ► ఫలితాల వెల్లడి: జూలై 3, 2021 ► పూర్తి వివరాలకు వెబ్సైట్: http://www.actuariesindia.org/index.aspx -
SBI Clerk 2021: బ్యాంక్ జాబ్స్‌కు.. బెస్ట్ ప్రిపరేషన్ ప్లాన్ ఇలా
బ్యాంకింగ్ రంగంలో కొలువు.. క్లర్క్ నుంచి స్పెషలిస్ట్ కేడర్ వరకు.. ఏ పోస్ట్‌లో కొలువుదీరినా ఉజ్వల భవిష్యత్తు ఖాయమనే అభిప్రాయం! ఒక్కసారి బ్యాంక్ ఉద్యోగంలో చేరితే ఇక వెనుదిరిగి చూసుకోనక్కర్లేదనే భావన! అందుకే దేశంలో కొన్ని లక్షల మంది బ్యాంక్ జాబ్ కోసం పరీక్షలకు ప్రిపేరవుతుంటారు! అలాంటి వారందరికీ ప్రభుత్వ రంగ బ్యాంకు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తీపి కబురు చెప్పింది. క్లరికల్ కేడర్‌లో 5వేలకు పైగా జూనియర్ అసోసియేట్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఎస్బీఐ 2021 నోటిఫికేషన్ వివరాలు, ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్ వ్యూహాలు తదితర అంశాలపై విశ్లేషణ.. మొత్తం 5,454 పోస్ట్‌లు ► ఎస్బీఐ జూనియర్ అసోసియేట్స్(కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్)–2021 ఎంపిక ప్రక్రియ ద్వారా జాతీయ స్థాయిలో 5,454 పోస్ట్‌లను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. రెగ్యులర్ నియామకాల ద్వారా 5,000 పోస్ట్‌లను, బ్యాక్లాగ్ 454 ఖాళీలకు నియామకాలు చేపట్టనుంది. క్లరికల్ కేడర్‌లో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ► అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్ట్ 16, 2021లోపు ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ► వయసు: ఏప్రిల్ 1, 2021 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. గరిష్ట వయో పరిమితిలో ఎస్సీ/ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు లభిస్తుంది. హైదరాబాద్ సర్కిల్–275 పోస్టులు మొత్తం పోస్ట్‌లలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ సర్కిల్ పరిధిలో 275 పోస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. జనరల్ కేటగిరీలో 111, ఎస్సీ కేటగిరీలో 44, ఎస్టీ కేటగిరీలో 19, ఓబీసీ కేటగిరీలో 74, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 27 ఖాళీలను కేటాయించారు. హైదరాబాద్ సర్కిల్లో పరీక్ష రాయాలనుకునే వారు తెలుగు లేదా ఉర్దూ మీడియంలను పరీక్ష మాధ్యమాలుగా పేర్కొనాల్సి ఉంటుంది. రెండు దశల్లో ఎంపిక ప్రక్రియ ఎస్బీఐ జూనియర్ అసోసియేట్స్ ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో రాత పరీక్షల విధానంలో జరుగుతుంది. అవి.. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ ఎగ్జామినేషన్. ముందుగా ప్రిలిమినరీలో ఉత్తీర్ణత సాధించిన వారికి తర్వాత దశలో మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమ్స్, మెయిన్ రెండూ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. నెగిటివ్ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కుల కోత వేస్తారు. ఇంటర్వ్యూ ఉండదు. ప్రిలిమినరీ పరీక్ష ► అభ్యర్థులకు ముందుగా ఆన్లైన్ విధానంలో ప్రిలిమినరీ పరీక్షను నిర్వహిస్తారు. ఇది మూడు గంటల వ్యవధిలో వంద మార్కులకు జరుగుతుంది. మొత్తం మూడు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు–30మార్కులు; న్యూమరికల్ ఎబిలిటీ 35 ప్రశ్నలు–35 మార్కులు; రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు–35 మార్కులకు ఉంటుంది. ► ప్రతి విభాగానికి నిర్దిష్ట సమయం నిబంధన అమల్లో ఉంటుంది. ఈ నిబంధన కారణంగా.. అభ్యర్థులు ఒక విభాగానికి సంబంధించిన సమాధానాలను దానికి కేటాయించిన సమయంలోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. ► అభ్యర్థులు పరీక్ష హాజరయ్యే మాధ్యమాన్ని దరఖాస్తు సమయంలోనే తెలియజేయాల్సి ఉంటుంది. దాని ఆధారంగానే పరీక్ష పేపర్ మాధ్యమం ఉంటుంది. –ఒకవేళ మాతృ భాష కాకుండా.. వేరే భాషలో పరీక్ష రాసేందుకు ఆసక్తి చూపిన అభ్యర్థులకు.. మెయిన్ తర్వాత ప్రత్యేకంగా వారు ఎంపిక చేసుకున్న భాషలో లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ నిర్వహిస్తారు. అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న సర్కిల్లో అధికార భాషకు సంబంధించిన లాంగ్వేజ్ టెస్ట్‌కు హాజరు కావాలి. మెయిన్ ఎగ్జామినేషన్ ► ప్రిలిమినరీలో ప్రతిభ ఆధారంగా..మొత్తం పోస్ట్‌ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని.. ఒక్కో పోస్ట్‌కు పది మంది చొప్పున మెయిన్ ఎగ్జామినేషన్‌కు ఎంపిక చేస్తారు. ఈ మెయిన్ పరీక్ష కూడా ఆన్లైన్ విధానంలోనే జరుగుతుంది. మెయిన్ పరీక్ష మొత్తం నాలుగు విభాగాల్లో ఉంటుంది. జనరల్/ఫైనాన్షియల్ అవేర్నెస్ 50 ప్రశ్నలు–50 మార్కులు; జనరల్ ఇంగ్లిష్ 40 ప్రశ్నలు–40 మార్కులు; క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు–50 మార్కులు; రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ అప్టిట్యూడ్ 50ప్రశ్నలు–60 మార్కులకు చొప్పున మొత్తంగా190 ప్రశ్నలు–200 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం 2 గంటల 40 నిమిషాలు. తుది జాబితా ఇలా ఎంపిక ప్రక్రియలో రెండు దశల(ప్రిలిమినరీ, మెయిన్) విధానాన్ని అనుసరిస్తున్నప్పటికీ.. నియామకం ఖరారు చేసే క్రమంలో మెయిన్‌లో చూపిన ప్రతిభనే పరిగణనలోకి తీసుకుంటారు. ప్రిలిమినరీలో నిర్ణీత కటాఫ్ మార్కులు పొందితేనే.. మెయిన్ పరీక్ష పేపర్ మూల్యాంకనం చేస్తారు. కాబట్టి అభ్యర్థులు ప్రిలిమినరీ నుంచే చక్కటి ప్రతిభ చూపేలా సన్నద్ధం కావాలి. ఉమ్మడి ప్రిపరేషన్ రెండు దశల్లో నిర్వహించే ఎంపిక ప్రక్రియలో విజయం సాధించి.. తుది జాబితాలో నిలవాలంటే.. అభ్యర్థులు ప్రిలిమ్స్ ప్రిపరేషన్ నుంచే మెయిన్‌పైనా దృష్టిపెట్టాలి. ప్రిలిమ్స్‌లో ఉండే ఇంగ్లిష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీలను మెయిన్‌లోని జనరల్ ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీలతో అనుసంధానించుకుంటూ ప్రిపరేషన్ సాగించే వీలుంది. జూన్‌లో పరీక్ష ఎస్బీఐ నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారం–ప్రిలిమినరీ పరీక్ష జూన్‌లో జరిగే ∙అవకాశముంది. అదే విధంగా మెయిన్‌ను జూలై 31న నిర్వహించనున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకునే విధంగా నిర్దిష్ట వ్యూహంతో అడుగులు వేయాలి. ముందుగా ప్రిలిమ్స్ తేదీ వరకు.. ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటిలో ఉన్న సబ్జెక్ట్‌లను చదవాలి. ఆ తర్వాత అందుబాటులో ఉన్న సమయంలో.. మెయిన్ ఎగ్జామ్‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలి. మెయిన్‌లో మాత్రమే ఉన్న జనరల్/ఫైనాన్షియల్ అవేర్నెస్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ విభాగాలకు ప్రత్యేక సమయం కేటాయించాలి. వాస్తవానికి ఈ రెండు సబ్జెక్ట్‌లకు కూడా ఇప్పటి నుంచే సన్నద్ధమయ్యేలా సమయం కేటాయించుకోవడం ఉపయుక్తంగా ఉంటుంది. ప్రిపరేషన్ పటిష్టంగా ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఈ విభాగం ముఖ్య ఉద్దేశం అభ్యర్థుల ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పరీక్షించడం. ఇందులో రాణించాలంటే.. బేసిక్ గ్రామర్‌పై అవగాహన పెంచుకోవాలి. ఇడియమ్స్,సెంటెన్స్ కరెక్షన్, వొ కాబ్యులరీ, సెంటెన్స్ రీ అరేంజ్మెంట్, వన్ వర్డ్ సబ్‌స్టిట్యూట్స్‌పై పట్టు సాధించాలి. జనరల్ ఇం గ్లిష్ నైపుణ్యం పెంచుకోవాలి. ఇందుకోసం ఇంగ్లిష్ దినపత్రికలు చదవడం, వాటిలో వినియోగిస్తున్న పదజాలం, వాక్య నిర్మాణం వంటి వాటిపై దృష్టి పెట్టాలి. మోడల్ ప్రశ్నలు ప్రాక్టీస్ చేయాలి. న్యూమరికల్ ఎబిలిటీ మెయిన్ ఎగ్జామినేషన్‌లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగానికి సరితూగే విభాగంగా దీన్ని పేర్కొనొచ్చు. ప్రధానంగా అర్థమెటిక్ అంశాల(పర్సంటేజెస్, నిష్పత్తులు, లాభ–నష్టాలు, నంబర్ సిరీస్, బాడ్‌మాస్ నియమాలు)పై పూర్తిగా అవగాహన పొందేలా ప్రాక్టీస్ చేయాలి. వీటితోపాటు డేటా ఇంటర్‌ప్రిటేషన్, డేటా అనాలిసిస్‌లపై ప్రత్యేక దృక్పథంతో అడుగులు వేయాలి. రీజనింగ్ ఇది కూడా రెండు దశల్లోనూ(ప్రిలిమ్స్, మెయిన్స్) ఉంటుంది. ఇందులో మంచి మార్కుల సాధనకు కోడింగ్–డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్, సిలాజిజమ్ విభాగాలను బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇలా ప్రిలిమ్స్ సమయానికి ఈ అంశాలపై పట్టు సాధిస్తే.. మెయిన్‌లో అధిక శాతం సిలబస్‌ను కూడా పూర్తి చేసినట్లవుతుంది. జనరల్/ఫైనాన్షియల్ అవేర్నెస్ మెయిన్‌లో మాత్రమే ఉండే ఈ విభాగంలో రాణించాలంటే.. తాజా బ్యాంకింగ్ రంగం పరిణామాలు, విధానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. బ్యాంకింగ్ రంగంలోని అబ్రివేషన్లు, పదజాలం, విధులు, బ్యాంకులకు సంబంధించిన కొత్త విధానాలు, కోర్ బ్యాంకింగ్‌కు సంబంధించి చట్టాలు, విధానాలు, రిజర్వ్ బ్యాంకు విధులు వంటి వాటిపై పూర్తిగా అవగాహన ఏర్పరచుకోవాలి. జనరల్ అవేర్‌నెస్‌లో కరెంట్ అఫైర్స్, స్టాక్ జనరల్ నాలెడ్జ్ కోణంలోనూ ఆర్థిక సంబంధ వ్యవహారాల(ఎకానమీ, ప్రభుత్వ పథకాలు)కు కాస్త ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. కంప్యూటర్ ఆప్టిట్యూడ్ మెయిన్‌లో మాత్రమే ఉండే మరో విభాగం.. కంప్యూటర్ ఆప్టిట్యూడ్. ఈ విభాగానికి సంబంధించి ప్రధానంగా కంప్యూటర్ ఆపరేషన్ సిస్టమ్స్, కంప్యూటర్ స్ట్రక్చర్, ఇంటర్నెట్ సంబంధిత అంశాలు, పదజాలంపై దృష్టి పెట్టాలి. కీ బోర్డ్ షాట్ కట్స్, కంప్యూటర్ హార్డ్‌వేర్ సంబంధిత అంశాల(సీపీయూ, మానిటర్, హార్డ్ డిస్క్ తదితర) గురించి తెలుసుకోవాలి. ప్రీవియస్ పేపర్స్, మాక్ టెస్ట్స్ గత ప్రశ్న పత్రాల సాధన, మాక్ టెస్ట్‌లకు హాజరు కావడం మేలని నిపుణులు అంటున్నారు. ఫలితంగా ఆయా విభాగాలు, అంశాల పరంగా వెయిటేజీపై అవగాహన వస్తుంది. గ్రాండ్ టెస్ట్‌ల సమాధానాలను సరి చూసుకోవడం ద్వారా.. తాము ఇంకా అవగాహన పొందాల్సిన అంశాలపై స్పష్టత లభిస్తుంది. మాక్ టెస్ట్‌లకు హాజరవడం వల్ల పరీక్ష హాల్లో టైమ్ మేనేజ్మెంట్ పరంగా స్పష్టత వస్తుంది. ఇలా ఇప్పటి నుంచే మెయిన్ పరీక్షను దృష్టిలోపెట్టుకొని చదివితే.. ప్రిలిమ్స్‌లో సులువుగా నెగ్గడంతోపాటు మెయిన్‌కు కూడా సన్నద్ధత లభిస్తుంది. క్లర్క్ కెరీర్ గ్రాఫ్ ఇలా ► క్లర్క్ కేడర్‌లో జూనియర్ అసోసియేట్‌గా కొలువు సొంతం చేసుకుంటే.. చీఫ్ మేనేజర్,డీజీఎం వంటి స్థానాలకు చేరుకునే అవకాశం ఉంది. ► ఎంపికైన అభ్యర్థులకు ముందుగా ఆరు నెలల ప్రొబేషన్ ఉంటుంది. దీన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంటే క్లర్క్‌గా కెరీర్ మొదలవుతుంది. ► ఆ తర్వాత ప్రతిభ, పనితీరు ఆధారంగా భవిష్యత్తులో సీజీఎం స్థాయి వరకు వెళ్లే అవకాశం కూడా ఉంది. ► క్లర్క్‌గా నియమితులైన అభ్యర్థులకు మూడేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న తర్వాత.. బ్యాంకు అంతర్గతంగా నిర్వహించే రాత పరీక్ష, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తే ట్రైనీ ఆఫీసర్ హోదా లభిస్తుంది. ► జేఏఐఐబీ, సీఏఐఐబీ కోర్సులు పూర్తి చేసుకున్న వారు ఫాస్ట్ ట్రాక్ ప్రమోషన్ ఛానల్ విధానంలో 20 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకునే సమయానికి డీజీఎం హోదాకు సైతం చేరుకోవచ్చు. ► ప్రస్తుతం అమలవుతున్న సర్వీస్ నిబంధనల ప్రకారం–క్లర్క్ స్థాయిలో కొలువుదీరిన వారు చీఫ్ మేనేజర్ స్థాయికి చేరుకోవడం ఖాయం. ఎస్బీఐ నోటిఫికేషన్– ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తు తేదీలు: ఏప్రిల్ 27, 2021 నుంచి మే 17, 2021; ► ప్రిలిమినరీ పరీక్ష తేదీ: జూన్ నెలలో జరుగుతుంది. ► మెయిన్ ఎగ్జామినేషన్ తేదీ: జూలై 31, 2021 ► తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: చీరాల, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్ కరీంనగర్, ఖమ్మం, వరంగల్. ► పూర్తి వివరాలకు వెబ్సైట్: https://bank.sbi/careers, https://www.sbi.co.in/careers -
NEET UG 2021: ర్యాంక్ సాధించే మార్గం!
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్–అండర్ గ్రాడ్యుయేట్.. సంక్షిప్తంగా.. నీట్–యూజీ! జాతీయ స్థాయిలో.. సెంట్రల్ యూనివర్సిటీలు, స్టేట్ యూనివర్సిటీలు, ఇతర అన్ని మెడికల్ ఇన్స్టిట్యూట్స్లో.. ఎంబీబీఎస్, బీడీఎస్లతోపాటు ఆయుష్ కోర్సుల్లో చేరాలంటే.. నీట్–యూజీ ఎంట్రన్స్‌లో స్కోరే ప్రధానం! నీట్లో సాధించిన స్కోర్ ఆధారంగానే మెడికల్ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. అందుకే.. ఇంటర్మీడియెట్ బైపీసీ అర్హతగా నిర్వహించే ఈ పరీక్షకు.. ఏటేటా పోటీ పెరుగుతోంది. నీట్–యూజీ–2021 తేదీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారికంగా ప్రకటించింది. ఆగస్ట్ 1వ తేదీన ఈ పరీక్ష జరుగుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో.. నీట్–యూజీ 2021 విధి విధానాలు.. పరీక్ష ప్యాట్రన్.. ఈ టెస్ట్‌లో మంచి స్కోర్ సాధించడానికి నిపుణుల సలహాలు.. ఎంబీబీఎస్, బీడీఎస్.. దేశంలో లక్షల మంది విద్యార్థుల కల. తమ డాక్టర్ కలను సాకారం చేసుకునే దిశగా.. నీట్ యూజీలో ర్యాంకు సాధిం చేందుకు ఇంటర్ తొలిరోజు నుంచే కృషి చేస్తుంటారు. ఇంతటి కీలకమైన నీట్–యూజీ –2021 తేదీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఇటీవల వెల్లడించింది. దీంతో విద్యార్థులు ఈ పరీక్షలో స్కోర్ సాధించే దిశగా కసరత్తు ముమ్మరం చేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పొచ్చు. మొత్తం పదకొండు భాషలు నీట్–యూజీని తెలుగు సహా మొత్తం పదకొండు భాషల్లో నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పష్టం చేసింది. విద్యార్థులు దరఖాస్తు సమ యంలోనే తమకు ఆసక్తి ఉన్న భాషను ఎంచు కుంటే.. ఆ భాషలోనే పరీక్ష పేపర్‌ను అందిస్తారు. ఒక్కసారే.. ఆఫ్‌లైన్‌లోనే నీట్‌ను కూడా జేఈఈ మెయిన్ మాదిరిగానే ఒకటి కంటే ఎక్కువసార్లు నిర్వహించే అవకాశముందనే వార్తలు ఇటీవల వినిపించాయి. వీటన్నింటికీ ఫుల్స్టాప్ పెడుతూ.. గతేడాది మాదిరిగానే నీట్ ఈ ఏడాది ఒక్కసారి మాత్రమే జరుగుతుందని ఎన్టీఏ స్పష్టం చేసింది. అది కూడా ఆఫ్‌లైన్ విధా నంలో పెన్ పేపర్ పద్ధతిలో నిర్వహించనున్న ట్లు పేర్కొంది. దీంతో విద్యార్థులకు పరీక్ష నిర్వహణపై ఒక స్పష్టత వచ్చింది. కాబట్టి ఇప్పుడిక ఎలాంటి ఆందోళన లేకుండా.. పూర్తిగా ప్రిపరేషన్‌కు ఉప క్రమించాలని నిపుణులు సూచిస్తున్నారు. 180 ప్రశ్నలు.. 720 మార్కులు నీట్ యూజీకి అర్హత ఇంటర్మీడియెట్ బైపీసీ. ఈ పరీక్ష మొత్తం మూడు విభాగాల్లో 180 ప్రశ్నలకు ఆబ్జెక్టివ్ (బహుళైచ్ఛిక ప్రశ్నలు) విధానంలో జరుగుతుంది. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు చొప్పున 720 మార్కులకు నీట్ పరీక్ష ఉంటుంది. వివరాలు.. సిలబస్ కుదింపు కష్టమే కొవిడ్ కారణంగా ఇంటర్మీడియెట్, సీబీఎస్ఈ +2 స్థాయిలో సిలబస్‌ను తగ్గించిన సంగతి తెలిసిందే. దాంతో నీట్ సిలబస్‌ను కూడా కుదిస్తారా? అనే సందేహం విద్యార్థుల్లో వ్యక్తమవుతోంది. కాని నీట్ సిలబస్ గతేడాది మాదిరిగానే యథాతథంగా ఉంటుందని, ఎలాంటి మార్పులు ఉండవని కొన్ని రోజుల క్రితం కేంద్ర విద్యా శాఖ మంత్రి ట్వీట్ ద్వారా తెలిపారు. జేఈఈ–మెయిన్ మాదిరిగానే నీట్‌లోనూ ఛాయిస్ విధానం ఉంటుందా అనే వాదన కూడా వినిపిస్తోంది. దీనిపైనా మరో వారం రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అవగాహన ముఖ్యం నీట్–యూజీ–2021కు తేదీ వెల్లడైంది. కాబట్టి ఇప్పటి నుంచి అందుబాటులో ఉన్న సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. ఇంటర్ పరీక్షల ప్రిపరేషన్‌తో సమన్వయం చేసుకుంటూ.. నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు సాగాల్సి ఉంటుంది. తొలుత అభ్యర్థులు నీట్ సిలబస్‌పై పూర్తి స్థాయి అవగాహన తెచ్చుకోవాలి. ఆ తర్వాతే ప్రిపరేషన్‌కు ఉపక్రమించాలి. సిలబస్‌లో పేర్కొన్న దానికి అదనంగా ఇతర అంశాలను చదవాల్సిన అవసరం లేదు. నీట్, బోర్డ్ సిలబస్‌లో కొన్ని కామన్ టాపిక్స్ ఉంటాయి. ఆయా అంశాలను మొదట బోర్డు ఎగ్జామ్స్ కోణంలో ప్రిపేరవ్వాలి. దీనివల్ల ఎంతో విలువైన సమయం ఆదా అవుతుంది. టైమ్ ప్లాన్ కూడా ► నీట్ విద్యార్థులు ఆయా సబ్జెక్టుల ప్రిపరేషన్ కోసం ముందుగానే నిర్దిష్ట సమయ ప్రణాళికను రూపొందించుకోవాలి. దానికి కట్టుబడి ప్రిపరేషన్ సాగించాలి. ► ప్రిపరేషన్ టైమ్ టేబుల్‌ను తప్పనిసరిగా ఏరోజుకారోజు అనుసరించాలి. ► నీట్ సిలబస్‌కు అనుగుణంగా ఆయా సబ్జెక్ట్‌లకు కేటాయించాల్సిన సమయాన్ని నిర్దేశించుకోవాలి. ► నిర్దిష్ట సమయంలో సిలబస్‌ను పూర్తి చేసేలా ముందుకు కదలాలి. ► ఈ సమయంలో అభ్యర్థులంతా స్వీయ సామర్థ్యాలపై స్పష్టతతో వ్యవహరించాలి. ► ప్రతి సబ్జెక్టుకూ సమానంగా సమయం కేటాయించుకోవాలి. ► ప్రతి రోజు చదవాల్సిన టాపిక్స్‌ను ముందుగానే విభజించుకుని.. దానికి అనుగుణంగా అధ్యయనం చేయాలి. ► ప్రతి రోజు మాక్ టెస్టులకు హాజరవ్వాలి. ఫలితంగా స్వీయ సామర్థ్యాలపై అవగాహన వస్తుంది. ఇంకా ఏఏ సబ్జెక్ట్‌లలో పట్టు సాధించాలనే దానిపై స్పష్టత లభిస్తుంది. ► సబ్జెక్ట్ పరంగా బలహీనంగా ఉన్న అంశాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి. ► పరీక్షకు రెండు నెలల ముందు కొత్త చాప్టర్లు, అంశాల జోలికి వెళ్లకూడదు. ఈ సమయాన్ని పూర్తిగా రివిజన్‌కే కేటాయించాలి. ► మోడల్ ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్ చేయాలి. ► డైరెక్ట్ కొశ్చన్స్ కంటే ఇన్ డైరెక్ట్ కొశ్చన్స్‌నే ఎక్కువ అడుగుతున్న విషయాన్ని గుర్తించాలి. దీనికి అనుగుణంగా మోడల్ టెస్ట్‌లను వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ► ఇంటర్ పరీక్షలకు నెల రోజుల ముందు వరకు నీట్ ప్రిపరేషన్‌ను సమాంతరంగా కొనసాగించొచ్చు. ► ఇంటర్మీడియెట్ పరీక్షలకు నెల రోజుల ముందు నుంచి పూర్తిగా బోర్డ్ పరీక్షలకే సమయం కేటాయించాలి. ► ఇంటర్మీడియెట్ పరీక్షలు పూర్తయ్యాక.. తిరిగి నీట్‌కు పూర్తిస్థాయిలో ప్రిపరేషన్ సాగించాలి. ► ప్రిపరేషన్ సమయంలోనే షార్ట్ నోట్స్ రూపొందించుకోవాలి. ఇది రివిజన్‌కు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. సబ్జెక్టుల వారీగా నిపుణుల ప్రిపరేషన్ టిప్స్ ఫిజిక్స్.. ఈ టాపిక్స్ ప్రధానం నీట్ ఫిజిక్స్ విభాగంలో మంచి స్కోర్ సాధించాలంటే.. ఆప్టిక్స్, మెకానిక్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, మోడరన్ ఫిజిక్స్ చాప్టర్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో అధ్యాయానికి చివర ఇచ్చిన ప్రశ్నలను సాధించాలి. అవకలనం, సమాకలనం అనువర్తనాలపై పట్టు సాధించాలి. ఇంటర్ రెండేళ్ల పాఠ్యాంశాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. పైన పేర్కొన్న చాప్టర్లతోపాటు మిగిలిన సిలబస్ అంశాలను అధ్యయనం చేయాలి. గత రెండేళ్ల ప్రశ్నల సరళిని పరిశీలిస్తే.. రొటేషనల్ డైనమిక్స్, సిగ్మా పార్టికల్స్‌పై ఎక్కువగా దృష్టిపెట్టాలని అర్థం అవుతోంది. అదేవిధంగా ఎలక్ట్రోమ్యాగ్నటిజం, ఇండక్షన్, కరెంట్ ఎలక్ట్రిసిటీ వంటి చాప్టర్లు విద్యార్థులకు అంత త్వరగా ఎక్కవు. వీటిని చదవడంతోపాటు ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని గుర్తించాలి. - ఎన్.నరసింహమూర్తి, సబ్జెక్ట్ నిపుణులు కెమిస్ట్రీ.. పునశ్చరణ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, మోల్ కాన్సెప్ట్, కెమికల్ బాండింగ్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కోఆర్డినేషన్ కాంపౌండ్, ఈక్విలిబ్రియమ్, పాలిమర్లు, బయో మాలిక్యూల్స్, పరమాణు నిర్మాణం, సాలిడ్ స్టేట్, ద్రావణాలు, సర్ఫేజ్ కెమిస్ట్రీ తదితరాలను కెమిస్ట్రీలో కీలక పాఠ్యాంశాలుగా పేర్కొవచ్చు. ఆర్గానిక్ కెమిస్ట్రీలో.. ఐసోమెరిసమ్, సమ్మేళనాల తయారీ, ధర్మాలపై ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి. కెమిస్ట్రీలో విద్యార్థులు చర్యలు, సమీకరణాలను మర్చిపోతుంటారు. కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు పునఃశ్చరణ చేయాలి. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో.. వివిధ మూలకాలు, వాటి సమ్మేళనాల ధర్మాలను అధ్యయనం చేయాలి. కెమిస్ట్రీలో.. ఫిజికల్, ఆర్గానిక్, ఇనార్గానిక్ కెమిస్ట్రీలను వాటి వాటి స్వభావాల ఆధారంగా ప్రిపేరవ్వాలి. ఫిజికల్ కెమిస్ట్రీ విషయానికొస్తే... ఇందులో ఫార్ములాలతో సొంత నోట్స్ రూపొందిం చుకోవాలి. ఫలితంగా ఫార్ములాను అన్వయించే నైపుణ్యాలు సొంతమవుతాయి. పీరియాడిక్ టేబుల్‌పై పట్టు సాధిస్తే.. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మంచి మార్కులు సాధించొచ్చు. పునశ్చరణ చేస్తూ, మాదిరి ప్రశ్నలు సాధించడం ద్వారా.. పరీక్షకు కావల్సిన సన్నద్ధత లభిస్తుంది. - విజయ్ కిశోర్, కెమిస్ట్రీ సబ్జెక్ట్ నిపుణులు బయాలజీ.. కాన్సెప్ట్లపై పట్టు నీట్–యూజీ పరీక్షలో కీలకంగా భావించే విభాగంగా బయాలజీని పేర్కొనొచ్చు. ఇంటర్ బైపీసీ విద్యార్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ కంటే బయాలజీపై ఎక్కువ పట్టు కలిగి ఉంటారు. నీట్ బయాలజీలో రాణించాలంటే.. ఫిజియాలజీ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, మార్ఫాలజీ, జెనిటిక్స్ అండ్ ఎవల్యూషన్, సెల్ బయాలజీ, బయోటెక్నాలజీ, హ్యూమన్ ఫిజియాలజీ, డైవర్సిటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్‌లను ముఖ్య చాప్టర్లుగా భావించి చదవాలి. అన్ని అంశాలకు సంబంధించి కాన్సెప్ట్ట్‌లపై పట్టు సాధించాలి. ఎకాలజీలో ఆర్గనైజేషన్స్ అండ్ పాపులేషన్, ఎకోసిస్టమ్‌పై ప్రశ్నలు వస్తున్నాయి. వీటితోపాటు బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ పాఠ్యాంశాలపై ఫోకస్ చేయడం లాభిస్తుంది. ప్లాంట్ ఫిజియాలజీలో.. ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, మొక్కల హార్మోనులు, ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్, మినరల్ న్యూట్రిషన్ చాప్టర్లను ప్రిపేరవ్వాలి. సెల్ స్ట్రక్చర్స్ అండ్ ఫంక్షన్స్‌లో కణ విభజన(సమ విభజన, క్షయకరణ విభజన)లోని వివిధ దశల్లో జరిగే మార్పులు, కణచక్రం తదితరాలను అధ్యయనం చేయాలి. బయోమాలిక్యూల్స్ నుంచి కంటెంట్ సంబంధిత ప్రశ్నలు వస్తాయి. రీప్రొడక్షన్ నుంచి దాదాపు 10 ప్రశ్నల వరకు అడుగుతున్నారు. మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థను బాగా అధ్యయనం చేయాలి. మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్‌హెరిటన్స్‌లో రెప్లికేషన్, ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్, రెగ్యులేషన్లపై దృష్టిపెట్టాలి. నీట్లో ఇంటర్ సిలబస్‌లో లేని అంశాలను గుర్తించి.. వాటికోసం ప్రత్యేక సమయం కేటాయించాలి. - బి.రాజేంద్ర, బోటనీ సబ్జెక్ట్ నిపుణులు జువాలజీలో ఇలా జువాలజీలో గత రెండేళ్ల ప్రశ్న పత్రాలను పరిగణనలోకి తీసుకుంటే.. మొత్తం 45 ప్రశ్నల్లో హ్యూమన్ ఫిజియాలజీ నుంచి 14, ఎకాలజీ నుంచి 10–12, జెనిటిక్స్, ఎవల్యూషన్ కలిపి 6 ప్రశ్నలు వరకు వస్తున్నాయి. కాబట్టి విద్యార్థులు ఆయా పాఠ్యాంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఎన్‌సీఈఆర్‌టీతోపాటు ఇంటర్ పుస్తకాల నుంచీ ప్రశ్నలు అడుగుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని గత ప్రశ్న పత్రాలను, ఇంటర్లో ఆయా చాప్టర్స్ చివరలో అడిగే ప్రశ్నలను సాధన చేయాలి. ఎన్సీఈఆర్టీ, ఇంటర్ పుస్తకాలను క్షుణ్నంగా చదవాలి. ఇలా చేస్తే ఆశించిన ర్యాంకు సొంతమవడం ఖాయం. - కె.శ్రీనివాస్, జువాలజీ సబ్జెక్ట్ నిపుణులు అనలిటికల్ అప్రోచ్‌తో ఎంతో మేలు నీట్ ప్రిపరేషన్ క్రమంలో అనలిటికల్ అప్రోచ్‌తో సాగితే..ఎలాంటి ప్రశ్నలకైనా సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది. ప్రతి రోజు తాము చదివిన అంశాలతో షార్ట్ నోట్స్ రూపొందించుకోవడం, ఇన్స్టిట్యూట్లు నిర్వహించే వీక్లీ టెస్ట్‌లు, మోడల్ టెస్ట్‌లకు హాజరు కావడం కూడా ఎంతో మేలు చేస్తుంది. – అనంత పరాక్రమ్ భార్గవ్, నీట్–2020 11వ ర్యాంకు నీట్–యూజీ(2021) సమాచారం ► నీట్ పరీక్ష తేదీ: ఆగస్ట్ 1, 2021 ► పరీక్ష వ్యవధి: మూడు గంటలు(పెన్, పేపర్ విధానంలో) ► అర్హత: బైపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సులు ఉత్తీర్ణులై ఉండాలి. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ► నీట్‌కు బైపీసీతో ఉత్తీర్ణత అని పేర్కొన్నప్పటికీ.. ప్రవేశాల సమయంలో కొన్ని ఇన్స్టిట్యూట్లు బైపీసీ గ్రూప్ సబ్జెక్ట్‌లలో 50 శాతం మార్కులు పొంది ఉండాలనే నిబంధన విధిస్తున్నాయి. ► వయో పరిమితి: కనిష్ట వయోపరిమితి 17 ఏళ్లు, గరిష్ట వయో పరిమితి 25 ఏళ్లు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ► పూర్తి నోటిఫికేషన్ ఏప్రిల్ మొదటి వారంలో వెల్లడయ్యే అవకాశం ఉంది. ► పూర్తి వివరాలకు వెబ్‌సైట్స్: https://ntaneet.nic.in, https://nta.ac.in -
JEE Advanced 2021: అడ్వాన్స్‌డ్‌లో విజయం ఇలా..!
దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీల్లో ప్రవేశం పొందాలంటే.. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో ఉత్తీర్ణులవ్వడం తప్పనిసరి. ఈ అడ్వాన్స్‌డ్‌లో విజయం సాధించడానికి ప్రత్యేక మ్యాజిక్ ఫార్ములాలు అంటూ ఏమీలేవు. పక్కా ప్రణాళిక, పట్టుదలతో కూడిన ప్రిపరేషన్ మాత్రమే అడ్వాన్స్‌డ్‌లో విజయానికి దారి చూపుతుంది. జేఈఈ అడ్వాన్స్ పరీక్ష జులై 3న నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో.. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు సన్నద్ధమయ్యే విద్యార్థుల కోసం సబ్జెక్ట్ వారీ ప్రిపరేషన్ టిప్స్.. ఐఐటీలు వంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లలో ఇంజనీరింగ్ చదవాలని దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు కోరుకుంటారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో అర్హత సాధించిన వారు మాత్రమే ఐఐటీల్లో ప్రవేశాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. అందుకే విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో విజయం సాధించేందుకు ఇంటర్లో చేరిన తొలిరోజు నుంచే ప్రిపరేషన్ సాగిస్తుంటారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరు కావాలంటే.. మొదట జేఈఈ మెయిన్ పరీక్షల్లో టాప్‌లో నిలవాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం నాలుగుసార్లు నిర్వహించనున్న జేఈఈ మెయిన్ పరీక్షలు.. ఇప్పటికే రెండుసార్లు జరిగాయి. ఈ ఏడాది ఇలా ఈ ఏడాది జులై 3వ తేదీన అడ్వాన్స్డ్ పరీక్ష జరుగనుంది. కొవిడ్ కారణంగా గతేడాది రాయలేకపోయిన వారు, ప్రస్తుతం అడ్వాన్స్డ్ పరీక్షలకు హాజరుకాబోయే వారితో ఈసారి పోటీ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటున్నారు. కాబట్టి విద్యార్థులు సరైన ప్రణాళికతో సబ్జెక్ట్ వారీ ప్రిపరేషన్‌తో ముందుకు వెళ్తేనే పరీక్షలో విజయం సాధించేందుకు వీలుంటుంది. సన్నద్ధత ఇలా ప్రస్తుత సంవత్సరం జరిగే పరీక్షా స్వరూపంలో ఎలాంటి మార్పులు లేవు. ఎప్పటిలాగానే ఆన్లైన్ విధానంలో మూడు గంటల కాలవ్యవధితో పరీక్షను నిర్వహించనున్నారు. సిలబస్ విషయానికివస్తే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి ప్రశ్నలుంటాయి. కాబట్టి అభ్యర్థులు సబ్జెక్ట్ వారీగా ఆయా సిలబ్ అంశాలపై దృష్టిపెట్టి ప్రిపరేషన్ కొనసా గించాలని నిపుణులు సూచిస్తున్నారు. సబ్జెక్ట్‌ల వారీగా ప్రిపరేషన్ మ్యాథమెటిక్స్ : జేఈఈ అడ్వాన్స్ పరీక్షలో మ్యాథమెటిక్స్ విభాగంలో మంచి స్కోర్ సాధించాలంటే.. ప్రాక్టీస్ చాలా ముఖ్యం. ఇందులో సూత్రాలను ఎక్కువగా గుర్తుపెట్టుకోవ డానికి షార్ట్ కట్ మెథడ్స్‌ను తెలుసుకోవాలి. కోఆర్డినేట్ జామెట్రీ, డిఫరెన్షియల్ కాలిక్యులస్, ఇంటిగ్రల్ కాలిక్యులస్, మాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్తోపాటు 3డీ జామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, వెక్టార్ అల్జీబ్రా, ఇంటిగ్రేషన్, కాంప్లెక్స్ నెంబర్స్, పారాబోలా, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, పెర్ముటేషన్ అండ్ కాంబినేషన్, బైనామియల్ థీరమ్, లోకస్ తదితర అంశాలపై బాగా పట్టు సాధించాలి. కెమిస్ట్రీ: కెమిస్ట్రీ సబ్జెక్టు కాంబినేషన్ అఫ్ థియరీగా ఉంటుంది. ఈక్వేషన్స్ అండ్ రియాక్షన్ వంటి కలయికతో ఉంటుంది. కాబట్టి విద్యార్థులు కెమిస్ట్రీ కోసం ప్రత్యేకంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. వీటిని నోట్‌బుక్‌లో రాసుకోవ డం ద్వారా ఆయా అంశాలను త్వరగా రివిజన్ చేసుకోవ డానికి వీలుంటుంది. ఇందులో కెమికల్ బాండింగ్, ఆల్కైల్ హలైడ్, ఆల్కహాల్స్ అండ్ ఈథర్, కార్బొనైల్ కాంపౌండ్స్, అటామిక్ స్ట్రక్చర్ అండ్ న్యూక్లియర్ కెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్ అండ్ థర్మోకెమిస్ట్రీ అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. అంతేకాకుండా మోల్కాన్సెప్ట్, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, ఫినాల్స్, పీ బ్లాక్ ఎలిమెంట్స్, అటామిక్ స్ట్రక్చర్, గ్యాసియస్ స్టేట్, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, డీ అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్‌పై అవగాహన పెంచుకోవాలి. ఫిజిక్స్ : ఈ సబ్జెక్టుకు సంబంధించి బేసిక్ ఫిజిక్స్ కాన్సెప్ట్లపై అభ్యర్థులు పట్టు సాధించాలి. లాజికల్ థింకింగ్ సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. సమస్యలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఫండమెంటల్స్‌పై పట్టు సాధించడానికి ఎన్సీఈఆర్టీ ఫిజిక్స్ బుక్స్, హెచ్‌సీ వర్మ, డీసీ పాండే ఫిజిక్స్ బుక్స్‌ను చదవాలి. అలాగే ఒక టాపిక్ మొదలు పెట్టినప్పడు దానికి సంబంధించిన సమస్యలను అదేరోజు పూర్తిచేసుకునే విధంగా ప్రిపరేషన్‌ను కొనసాగించాలి. ఇందులో ఎలక్ట్రో డైనమిక్స్, మెకానిక్స్ వంటివి కీలకమైన టాపిక్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అలాగే హీట్ అండ్ థర్మోడైనమిక్స్, మోడ్రన్ ఫిజిక్స్, ఆప్టిక్స్, ఎస్హెచ్ఎం అండ్ వేవ్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. అలాగే సెంటర్ ఆఫ్ మాస్, మూమెంటమ్ అండ్ కొలిజన్, సింపుల హార్మోనిక్ మోషన్, వేవ్ మోషన్ అండ్ స్ట్రింగ్ వేవ్స్‌లో లోతైన అవగాహన ఏర్పరచుకుంటే మంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. రివిజన్‌కు ప్రాధాన్యం సబ్జెక్టుల వారిగా అన్ని టాపిక్స్‌ను పూర్తి చేసుకున్న తర్వాత రివిజన్‌కు ప్రాధాన్యం∙ఇవ్వాలి. ఆయా టాపిక్స్‌లోని ముఖ్యమైన అంశాలు తేలిగ్గా గుర్తుకు వచ్చేవిధంగా షార్ట్‌నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇది పరీక్ష ముందు రివైజ్ చేసుకోవడానికి బాగా ఉపయోగకరంగా ఉంటుంది. మాక్ టెస్టులతో స్పీడ్ విద్యార్థులు అడ్వాన్స్డ్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలంటే.. ఎక్కువగా మాక్‌టెస్టులు, మోడల్ టెస్టులను రాయాలి. దీనివల్ల పరీక్షను వేగంగా నిర్దేశిత సమయంలోపు పూర్తిచేయడానికి వీలవుతుంది. అంతే కాకుండా మాక్ టెస్టులు విద్యార్థులు పరీక్షలో మంచి ప్రతిభ చూపేందుకు ఉపయోగపడతాయి. అలాగే ఆన్లైన్ పరీక్ష విధానంపైనా అవగాహన ఏర్పడుతుంది. సీఏ, సీఎస్, సీఎంఏలకు పీజీ హోదాతో ప్రయోజనాలెన్నో! -
కొత్త ఏడాదికి కేక్లెట్లతో స్వాగతం పలుకుదాం..
కొత్త సంవత్సరం.. కొత్త ఉత్సాహం.. కొత్త నిర్ణయాలు.. కొత్త ఆలోచనలు.. కొత్త వంటలు... కొత్త కొత్త రుచులు... కేకులు... చాకొలేట్లు మామూలే. ఈసారి కొత్తగా కేక్లెట్లు చేద్దామా... కొత్త వంటేమీ కాదు... సరదాగా కొత్త పిలుపు... అంతే... కొత్త కేకులు చేసి పాత స్నేహితులకు పంచుదాం... కొత్త సంవత్సరానికి కేక్లెట్లతో స్వాగతం పలుకుదాం... చాకొలేట్ బర్ఫీ కావలసినవి: పాలు – ఒకటిన్నర లీటర్లు; పంచదార – ఒక కప్పు; పటిక లేదా నిమ్మ రసం – కొద్దిగా; కోకో పొడి – అర కప్పు; జీడి పప్పు తరుగు – 2 టేబుల్ స్పూన్లు; బాదం పప్పుల తరుగు – ఒక టేబుల్ స్పూను; తయారీ: స్టౌ మీద ఒక పాత్రలో ఒకటిన్నర లీటర్ల పాలు, ఒక కప్పు పంచదార వేసి బాగా కలపాలి ∙పాలు సగం అయ్యాక కొద్దిగా పటిక/నిమ్మ రసం జత చేయాలి పాలు బాగా చిక్కబడి ముద్దలా అయ్యేవరకు కలుపుతూనే ఉండాలి (చిక్కబడటానికి సుమారు అరగంట సమయం పడుతుంది) పావు కప్పు కోకో పొడి, రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు జత చేసి, మంట పెంచి, ఆపకుండా బాగా కలియబెట్టాలి ∙మిశ్రమం బాగా దగ్గర పడ్డాక దింపేయాలి అల్యూమినియం ప్లేటుకి నెయ్యి పూసి, తయారైన చాకొలేట్ మిశ్రమాన్ని అంగుళం మందంలో సమానంగా పరిచి, అప్పడాల కర్రతో జాగ్రత్తగా ఒత్తి, చాకుతో కట్ చేయాలి ∙జీడిపప్పు, బాదం తరుగులతో అలంకరించి, అందించాలి. బ్లాక్ ఫారెస్ట్ కేక్ కావలసినవి: డార్క్ చాకొలేట్ – పావు కప్పు; బటర్ – 100 గ్రా. (అరకప్పు కంటె తక్కువ + ఒక టేబుల్ స్పూను); పంచదార – 200 గ్రా. కోడి గుడ్లు – 3; మైదా పిండి – 150 గ్రా. బేకింగ్ పౌడర్ – ఒక టీ స్పూను కోకో పౌడర్ – పావు కప్పు; వెనిలా ఎసెన్స్ – ఒక టీ స్పూను; ఇన్స్టంట్ కాఫీ పొడి – ఒక టేబుల్ స్పూను; నెయ్యి – ఒక టీ స్పూను; సిరప్ కోసం... నీళ్లు – పావు లీటరు; పంచదార – 200 గ్రా.; దాల్చిన చెక్క – చిన్న ముక్క; క్రీమ్ – 400 గ్రా. తయారీ: స్టౌ మీద ఒక పాత్రలో నీళ్లు పోసి మరిగించాలి ∙ఒక చిన్న పాత్రలో డార్క్ చాకొలేట్ వేసి, ఆ నీళ్ల మీద ఉంచి కరిగించాలి ∙ఒక పాత్రలో బటర్, పంచదార వేసి కరిగే వరకు బ్లెండర్తో బాగా గిలకొట్టాలి ∙కోడి గుడ్డు సొనలు జత చేస్తూ మరోమారు గిలకొట్టాలి ∙కరిగించిన చాకొలేట్ జత చేసి మరోమారు గిలకొట్టాలి ∙బేకింగ్ పౌడర్, కోకో పొడి జల్లెడలో వేసి జల్లించాలి ∙వెనిలా ఎసెన్స్, ఇన్స్టంట్ కాఫీ పొడి జత చేసి, మరోమారు కలపాలి (కట్ అండ్ ఫోల్డ్ అంటే ఒకే వైపుగా కలపాలి, రెండో వైపు నుంచి కలపకూడదు) 180 డిగ్రీల దగ్గర అవెన్‌ను సుమారు పావు గంట సేపు ప్రీహీట్ చేయాలి ∙వెడల్పుగా లోతుగా ఉన్న కేక్ మౌల్డ్‌కు బటర్ పూసి, దానిలోనే చాకొలేట్ మిశ్రమాన్ని సమానంగా పరిచి, ప్రీహీట్ చేసిన అవెన్‌లో ఉంచాలి (కుకర్‌లో అయితే, కుకర్ గ్యాస్ కట్, విజిల్ తీసేసి, లోపల స్టాండ్ పెట్టి, మూత పెట్టి, హై ఫ్లేమ్ మీద పది నిమిషాలు వేడి చేసి, అప్పుడు కేక్ మౌల్డ్ పెట్టి, మూత పెట్టి 40 నిమిషాలు సన్నటి మంట మీద బేక్ చేయాలి. పంచదార సిరప్ తయారీ ∙స్టౌ మీద ఒక పాత్రలో నీళ్లు పోసి, దాల్చిన చెక్క చిన్న ముక్క, 200 గ్రా. పంచదార జత చేసి మరిగించి, దింపాలి ∙ఒక పాత్రలో క్రీమ్ వేసి, క్రీమ్ బాగా గట్టిగా అయ్యేవరకు ఆపకుండా స్పీడ్‌గా గిలకొట్టాలి ∙బేక్ చేసుకున్న కేక్ పూర్తిగా చల్లారాక, పైన ఉన్న పొరను తీసేసి, ఒక ప్లేటులోకి బోర్లించి, అర అంగుళం మందంలో రెండు పొరలుగా కట్ చేయాలి ∙కేకు కింది భాగాన్ని ప్లేట్లో ఉంచి, దాని మీద పంచదార సిరప్, ఆ తరవాత క్రీం వేసి సమానంగా పరవాలి మొదటి పొరను అంటే కేక్ మీద ఉన్న లేయర్‌ను పెట్టి, దాని మీద పంచదార సిరప్, క్రీమ్ వేసి సమానంగా పరవాలి ∙మధ్య పొరను కూడా ఉంచి ఇదేవిధంగా చేయాలి ∙కేకు మీద కొద్దిగా డార్క్ చాకొలేట్‌ను తురుముకుని, పక్కల వరకు వెళ్లేలా పరచుకోవాలి ∙కేక్ మీద, పక్కల... నచ్చిన ఆకారంలో డిజైన్ చేసుకోవాలి ∙ఇలా కేకు పూర్తిగా తయారైన తరవాత ఫ్రిజ్‌లో ఉంచి, గంట తరవాత బయటకు తీసి, ముక్కలుగా చేసి, అందించాలి. ఎగ్‌లెస్ చాకొలేట్ నట్స్ కేక్ కావలసినవి: మైదా పిండి – కప్పు; కార్న్‌ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్లు; బేకింగ్ పౌడర్ – టీ స్పూను; కోకో పొడి – 2 టేబుల్ స్పూన్లు; బటర్ – పావు కప్పు; పంచదార పొడి – పావు కప్పు; కండెన్స్డ్ మిల్క్ – అర కప్పు; జీడిపప్పు తరుగు – 2 టేబుల్ స్పూన్లు; బాదం పప్పుల తరుగు – 2 టేబుల్ స్పూన్లు; బ్లూ బెర్రీలు – 2 టేబుల్ స్పూన్లు (ఎండబెట్టినవి); కిస్మిస్ – టేబుల్ స్పూను; ఖర్జూరం తరుగు – టేబుల్ స్పూను; ఉప్పు – ఒకటిన్నర కప్పులు. తయారీ: ∙ఒక పాత్రలో అర కప్పు వేడి నీళ్లు, కోకో పొడి వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి ∙ ప్రెజర్ కుకర్‌లో కింద ఉప్పు వేసి, దాని మీద వైర్ స్టాండ్, పెర్ఫరేట్ ప్లేట్ ఉంచి మూతపెట్టి, సన్నని మంట మీద ఉంచాలి ∙ బేకింగ్ పౌడర్, మైదా పిండి, కార్న్‌ఫ్లోర్‌లను జల్లించి పక్కన ఉంచాలి ∙ మిక్సింగ్ బౌల్లో బటర్, పంచదార పొడి వేసి బాగా గిలకొట్టాక, కండెన్స్డ్ మిల్క్ జత చేసి మరోమారు గిలకొట్టాలి (ఎంత ఎక్కువ సేపు గిలకొడితే అంత రుచిగా వస్తుంది) ∙ ఒక పాత్రలో మైదాపిండి మిశ్రమంలో సగం భాగం, కోకో పొడి, డ్రైఫ్రూట్స్ (జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, ఖర్జూరం) ముక్కలు వేసి కలిపాక, మిగిలిన సగం పిండి జత చేసి కలపాలి ఏడు అంగుళాల మందం ఉన్న అల్యూమినియం గిన్నెకు బటర్ పూసి ఈ మిశ్రమాన్ని అందులో పోసి సమానంగా పరవాలి (బటర్ బదులు బటర్ పేపర్‌ను కూడా ఉపయోగించవచ్చు) ∙ ఈ గిన్నెను కుకర్‌లో ఉంచి మూత పెట్టి (విజిల్ పెట్టకూడదు) సన్నని మంట మీద సుమారు అర గంటసేపు ఉంచాలి (పుల్లతో గుచ్చితే పూర్తిగా తయారైనదీ లేనిదీ తెలుస్తుంది. ఒకవేళ ఇంకా పూర్తి కాలేదనిపిస్తే మరి కాసేపు స్టౌ మీద ఉంచాలి) ∙పూర్తయిన తర్వాత బయటకు తీసి, అంచుల మీదుగా చాకుతో కట్ చేస్తూ కేక్‌ను బయటకు తీసి, పైన పంచదారను కొద్దిగా చల్లి అందించాలి. రవ్వ కేక్ కావలసినవి: బొంబాయి రవ్వ – ఒక కప్పు; మైదా పిండి – అర కప్పు; పంచదార పొడి – ముప్పావు కప్పు; తాజా పెరుగు – అర కప్పు; వేడి పాలు – ఒక కప్పు; నెయ్యి – 3 టీ స్పూన్లు; ఏలకులు – 4; బేకింగ్ పౌడర్ – ఒక టీ స్పూను తయారీ: ఒక పాత్రలో ముందుగా పెరుగు వేసి గిలకొట్టాలి ∙పంచదార పొడి జత చేసి మరోమారు గిలకొట్టాలి ∙నెయ్యి, మైదా పిండి, ఒకదాని తరవాత ఒకటి వేసి కలియబెట్టాలి ∙బొంబాయి రవ్వ వేసి మరోమారు కలపాలి ∙చివరగా పాలు జత చేసి అన్నీ కలిసేలా బాగా కలియబెట్టాలి ∙మూత పెట్టి అరగంటసేపు వదిలేయాలి ∙స్టౌ మీద కుకర్‌లో ఉప్పు వేసి దాని మీద స్టాండ్ ఉంచాలి ∙విజిల్ లేకుండా మూత ఉంచి కుకర్‌ను వేడి చేయాలి ∙తయారుచేసి ఉంచుకున్న మిశ్రమానికి ఏలకుల పొడి, బేకింగ్ పౌడర్, కొద్దిగా పాలు జత చేసి కలియబెట్టి, మౌల్డ్‌లో సమానంగా పోయాలి ∙ప్రీ హీట్ చేసిన కుకర్‌లో ఈ పాత్రను జాగ్రత్తగా ఉంచి మూత పెట్టి, మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, సుమారు అర గంటసేపు ఉంచాలి (పుల్లతో గుచ్చితే అంటుకోకపోతే కేక్ సిద్ధమైనట్లే) ∙గిన్నె బయటకు తీసి, కొద్దిగా చల్లారాక కేక్‌ను జాగ్రత్తగా బయటకు తీసి, నచ్చిన ఆకారంలో కట్ చేసుకోవాలి. ఎగ్‌లెస్ మిల్క్ కేక్ కావలసినవి: మైదా పిండి – ముప్పావు కప్పు; కరిగించిన వెన్న – ముప్పావు కప్పు; నీళ్లు – ముప్పావు కప్పు; పాల పొడి – పావు కప్పు; బేకింగ్ పౌడర్ – ఒక టేబుల్ స్పూను; పంచదార – ముప్పావు కప్పు; మిక్స్డ్ డ్రైఫ్రూట్స్ – పావు కప్పు తయారీ: ఒక పాత్రలో నీళ్లు, పంచదార వేసి పంచదార కరిగే వరకు బాగా కలపాలి ∙పాల పొడి జత చేసి ఉండలు లేకుండా కలపాలి ∙కరిగించిన వెన్న జత చేసి క్రీమ్‌లా అయ్యే వరకు బాగా కలపాలి ∙జల్లెడ పట్టిన మైదా, బేకింగ్ పౌడర్ మిశ్రమాన్ని జత చేసి బాగా కలియబెట్టాలి (ఒకే దిశలో కలపాలి, రెండో వైపుకి కలిపితే కేక్ గట్టిగా వస్తుంది) ∙కేక్ టిన్‌లో బటర్ పేపర్ వేసి దాని మీద పిండి పోయాలి (ఆలస్యం చేయకూడదు) ∙డ్రైఫ్రూట్స్‌కి మైదా పిండి జత చేసి, కేక్ మీద సమానంగా పరవాలి ∙ప్రీహీట్ చేసిన అవెన్‌లో 180 డిగ్రీల దగ్గర 25 నిమిషాలు పాటు కేక్‌ను బేక్ చేయాలి ∙కొద్దిగా చల్లారాక టిన్‌లో నుంచి బయటకు తీసి, కట్ చేసుకోవాలి. వెనిలా కప్ కేక్స్ కావలసినవి: ఉప్పు – 2 కప్పులు; బటర్ – పావు కప్పు; పంచదార పొడి – పావు కప్పు; వెనిలా ఎసెన్స్ – టీ స్పూను; కండెన్స్డ్ మిల్క్ – అర కప్పు; బేకింగ్ పౌడర్ – టీ స్పూను; మైదా పిండి – కప్పు; సోడా – అర కప్పు (క్లబ్ సోడా); చెర్రీస్ – 20. తయారీ: ∙కుకర్‌లో రెండు కప్పుల ఉప్పు వేసి, దాని మీద ఒక స్టాండు, ఆ పైన ఒక ప్లేట్ పెట్టి, మీడియం మంట మీద ఉంచాలి ∙మిక్సింగ్ బౌల్లో బటర్, పంచదార పొడి వేసి బాగా గిలకొట్టాక, వెనిలా ఎసెన్స్, కండెన్స్డ్ మిల్క్ జత చేసి మరోమారు బాగా గిలకొట్టాలి ∙ఒక పాత్రలో బేకింగ్ పౌడర్, మైదా పిండి వేసి బాగా కలిపి, సగం మిశ్రమాన్ని పైన తయారుచేసి ఉంచుకున్న బటర్ మిశ్రమానికి జత చేసి బాగా కలిపాక, మిగిలిన సగం వేసి మరోమారు కలపాలి ∙సోడా (క్లబ్ సోడా వంటివి) వేసి బాగా కలపాలి ∙కప్ కేక్‌లను తీసుకుని అందులో ఒక్కోదానిలో ఒక్కో చెర్రీ వేసి, తయారుచేసి ఉంచుకున్న మిశ్రమం అందులో పోసి, వీటిని చిన్న ట్రేలో ఉంచి, ట్రేను కుకర్‌లో ఉంచి మూత పెట్టాలి (విజిల్ పెట్టకూడదు) సుమారు అరగంటసేపయ్యాక తీసేయాలి చల్లారాక బయటకు తీసి అందించాలి. ఎగ్‌లెస్ ఫ్రెష్ ఫ్రూట్ కేక్ కావలసినవి: మైదా పిండి – కప్పు; బటర్ – పావు కప్పు; పంచదార పొడి – పావు కప్పు; కండెన్స్డ్ మిల్క్ – అర కప్పు; తాజా క్రీమ్ – పావు కప్పు; బేకింగ్ పౌడర్ – టీ స్పూను; కస్టర్డ్ పౌడర్ – టీ స్పూను; వెనిలా ఎసెన్స్ – టీ స్పూను; ఉప్పు – 2 కప్పులు; చిలకరించిన క్రీమ్ – 500 గ్రా.; పంచదార పొడి – పావు కప్పు; పంచదార సిరప్ – పావు కప్పు; తాజా పండ్ల ముక్కలు – (కివి, కమలాపండు తొనలు, దానిమ్మ గింజలు, చెర్రీలు, ఆపిల్ ముక్కలు, పైనాపిల్ ముక్కలు....)– ఒక కప్పు; స్ట్రాబెర్రీ వేఫర్స్ – తగినన్ని. తయారీ: ∙కుకర్‌లో రెండు కప్పుల ఉప్పు వేసి, దాని మీద ఒక స్టాండు, ఆ పైన ఒక ప్లేట్ ఉంచి, స్టౌ మీద సన్నని మంట మీద ఉంచాలి ∙మిక్సింగ్ బౌల్లో బటర్, పంచదార వేసి బాగా క్రీమీగా వచ్చేవరకు కలపాలి ∙కండెన్స్డ్ మిల్క్, వెనిలా ఎసెన్స్ జత చేసి సుమారు రెండు మూడు నిమిషాలు బాగా గిలకొట్టాక, పావు కప్పు క్రీమ్ జత చేసి మరోమారు గిలకొట్టాలి ∙మైదా పిండి, బేకింగ్ పౌడర్, కస్టర్డ్ పౌడర్... వీటిని జల్లెడ పట్టి, పైన తయారుచేసి ఉంచుకున్న మిశ్రమంలో వేసి కలపాలి ∙ఏడు అంగుళాల అల్యూమినియం కేక్ ట్రే కి బటర్ పూసి, కేక్ మిశ్రమాన్ని అందులో పోసి సమానంగా పరిచి, కుకర్‌లో ఉంచి సుమారు అరగంటసేపు సన్నని మంట మీద ఉంచి (విజిల్ పెట్టకూడదు) దింపి, పది నిమిషాలు చల్లారాక, అంచుల మీదుగా చాకుతో కట్ చేసి కేక్‌ను బయటకు తీయాలి 500 మి.లీ. క్రీమ్‌ను బాగా గిలకొట్టాలి ∙పావు కప్పు పంచదార పొడి జత చేసి మరోమారు గిలకొట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి (వాడే ముందు మాత్రమే బయటకు తీయాలి) ∙కేక్‌ను ఒక ప్లేట్లోకి తిరగదీసి అంచులను చాకుతో నీట్‌గా కట్ చేయాలి ∙చాకుతో కేక్ చుట్టూ క్రీమ్ అప్లయ్ చేయాలి ∙పైన మధ్యభాగంలో మాత్రం కొద్దిగా ఎక్కువ క్రీమ్‌ను ఉంచి, దాని మీద కొద్దిగా పంచదార సిరప్ చిలకరించి ఆ పైన మరి కాస్త క్రీమ్ వేసి, దాని మీద తాజా పండ్ల ముక్కలు వేసి, చేతితో నెమ్మదిగా ఒత్తాలి ∙పైన మళ్లీ క్రీమ్, పళ్ల ముక్కలు వేసి ఒత్తాలి ∙ఇలా మూడు పొరలు పూర్తయ్యాక చివరగా పంచదార సిరప్, క్రీమ్ వేసి పెద్ద చాకు సహాయంతో సమానంగా పరిచి, ఎక్కువైన క్రీమ్‌ను చాకుతో తీసేసి, కేక్‌ను ఫ్రీజ్‌లో సుమారు అర గంట సేపు ఉంచి తీయాలి ∙చివరగా మళ్లీ కేక్ మీద క్రీమ్ వేసి చాకుతో సమానంగా పరిచి, చుట్టూ కూడా వచ్చేలా చేసి, చివరగా స్ట్రాబెర్రీ వేఫర్లు అలంకరించి సుమారు నాలుగు గంటలు ఫ్రిజ్‌లో ఉంచి, తీసి అందించాలి. బ్లూ బెర్రీ రసగుల్లా చీజ్ కేక్ కావలసినవి: బిస్కెట్లు – 125 గ్రా.; కరిగించిన బటర్ – 75 మి.లీ.; క్రీమ్ చీజ్ – 200 గ్రా.; పంచదార పొడి – 1/3 కప్పు; క్రీమ్ – 300 మి.లీ. (బాగా గిలకొట్టాలి); కండెన్స్డ్ మిల్క్ – 200 మి.లీ.; చైనా గ్రాస్ – 10 గ్రా.; బ్లూ బెర్రీలు – 3 టేబుల్ స్పూన్లు (ఎండినవి వాడుతుంటే, ముందు రోజు రాత్రి అర కప్పు నీళ్లలో నానబెట్టాలి); బాదం పప్పులు – 3 టేబుల్ స్పూన్లు; చిన్న రసగుల్లాలు – 30. తయారీ: •బిస్కెట్లను చేత్తో గట్టిగా నలిపి పొడి చేసి, కరిగించిన బటర్లో నెమ్మదిగా వేస్తూ కలపాలి (కలపడం పూర్తయ్యే సరికి తడిసిన ఇసుకలా ఉంటుంది) •ఈ మిశ్రమాన్ని తొమ్మిది అంగుళాల స్ప్రింగ్ ఫామ్ కేక్ టిన్‌లో పోసి గట్టిగా ఒత్తి ఫ్రిజ్‌లో ఉంచాలి •1/3 వంతు కప్పు నీళ్లలో చైనా గ్రాస్‌ను సుమారు పావు గంట సేపు నానబెట్టాలి •ఒక పాత్రలో క్రీమ్ వేసి బాగా గిలకొట్టాలి •మరో పాత్రలో క్రీమ్ చీజ్, పంచదార పొడి వేసి గిలకొట్టాలి •సన్నని మంట మీద పాన్ ఉంచి, వేడయ్యాక, నానబెట్టి ఉంచుకున్న చైనా గ్రాస్ వేసి పూర్తిగా ఉడికేవరకు ఉంచి తీసేయాలి •పాన్‌లో కండెన్స్డ్ మిల్క్, గోరు వెచ్చని నీళ్లు జత చేయాలి •ఉడికించిన చైనా గ్రాస్ జత చేసి, బాగా కలిపి రెండు నిమిషాలు ఉంచి, దించి కొద్దిగా చల్లార్చాలి •ఈ మిశ్రమాన్ని క్రీమ్ చీజ్ మిక్స్‌కి జత చేసి బాగా గిలకొట్టాలి •బెర్రీలు, బాదం పప్పులు వేసి కలపాలి •(బ్లూబెర్రీలు నానబెట్టిన నీళ్లు కొన్నిటిని జత చేయవచ్చు) •గిలకొట్టిన క్రీమ్, రసగుల్లాలను వేయాలి •కేక్ టిన్‌లో చీజ్ కేక్ మిశ్రమం వేసి సమానంగా పరిచి ఫ్రిజ్‌లో సుమారు 12 గంటలు ఉంచి తీయాలి •కేక్‌ను టిన్ నుంచి జాగ్రత్తగా విడదీసి అందంగా అలంకరించి అందించాలి. -
ఏపీపీఎస్సీకి ప్రిపేరవుతున్నారా?
ఏపీపీఎస్సీలో ఏదైనా ఉద్యోగానికి సిద్దం అయ్యే ముందు కొన్ని కచ్చితమైన పనులు అభ్యర్దన చేయవలసి ఉంటుంది. అవి ఏంటంటే... పరీక్ష సిలబస్ / పాఠ్య ప్రణాళిక. పరీక్షకు ప్రిపేరయ్యేవారు కచ్చితమైన పాఠ్య ప్రణాళికను సిద్దం చేసుకోవాలి. పాఠ్య ప్రణాళిక లో ముఖ్యమైన విషయాలు (టాపిక్స్) ఎప్పటికప్పుడు టిక్ చేసుకొని, వీటినే ముందుగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది.కనీసం 30 నుంచి 60 రోజుల సమయాన్ని కేటాయించడం లేదా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రణాళిక వేసుకోవాలి.అలా, ముఖ్యమైన విషయాలు చదివిన తర్వాత మిగతా సిలబస్‌ని చదవాలి. అదేవిదంగా, పూర్తి సిలబస్ పై పట్టు వచ్చిన తర్వాత లేదా పూర్తి సిలబస్ అయ్యాక, మళ్ళీ ఒక్కసారి సిలబస్‌ను పూర్తిగా రివిజన్ చేసుకోవాలి. ఇలా, కచ్చితమైన ప్రణాళికతో ముందుకు వెళ్ళితే ప్రభుత్వరంగ ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. ఇందులో మీకు ఎటువంటి సందేహం అనవసరం. అయితే ఏపీపీఎస్సీ కాలెండర్ 2020లో అసలు ఉద్యోగాలు ఉన్నాయా అనే డౌటు మీకు రావచ్చు.. కానీ కచ్చితంగా ఉన్నాయనే చెప్పాలి! ఎందుకంటే 2019 సంవత్సరంలో హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌లు చేసిన ప్రకటనతో పాటు రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటన నిరుద్యోగుల్లో ఆశాభావం రేకెత్తించింది. వీరి ప్రకటనను పరిగణలోకి తీసుకుని చూస్తే మొత్తంగా లక్షకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు తెలుస్తుంది. AP DSC 2020 Notification AP Police Constable 2020 Notification AP SI Police 2020 Notification AP Sachivalayam Notification 2020 AP Groups Notification 2020 (1, 2, 3, & 4) AP GENCO AE Notification 2020 AP MLHP Notification 2020 AP Staff Nurse Notification 2020 తదితర ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కావున అభ్యర్డులు, ఉన్న సమయాన్ని బాగా ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. ప్రణాళిక సరిగ్గా పాటించడం లేదా? కొందరు అభ్యర్థులు సిలబస్ ప్రణాళిక వేసుకున్న తర్వాత కూడా దానిని పాటించడం కష్టంగా బావిస్తారు. అయితే గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలంటే ఆ మాత్రం కష్టపడాల్సిందే. అప్పుడే అనుకున్న ఉద్యోగం / పని సాధించడానికి వీలవుతుంది. -
గ్రూప్స్... ప్రిపరేషన్ టిప్స్
అభ్యర్థుల ప్రిపరేషన్ సరైన మార్గంలో సాగేందుకు ఉపయోగపడే మరో సాధనం.. స్విచ్ ఓవర్ సిస్టమ్! ఒక సబ్జెక్టు లేదా అంశాన్ని చదువుతున్నప్పుడు విసుగొస్తే వెంటనే తమకు ఆసక్తి ఉన్న మరో సబ్జెక్టు లేదా అంశంపై దృష్టిసారించాలి. అంతేకానీ, ఆసక్తి లేకున్నా పరీక్షల కోణంలో ముఖ్యమైంది కాబట్టి అదే అంశానికి గంటల కొద్దీ సమయం వెచ్చిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు సరికదా ప్రతికూల ప్రభావం చూపుతుంది. చెక్లిస్టుతో పక్కాగా! ప్రిపరేషన్ పరంగా అభ్యర్థులు అనుసరించాల్సిన ముఖ్య వ్యూహం చెక్ లిస్ట్ రూపొందించుకోవడం. చదవడానికి సిద్ధమయ్యే ముందు దీన్ని తయారుచేసుకోవాలి. ప్రాధాన్యత వారీగా చదవాల్సిన అంశాలు కేటాయించాల్సిన సమయం బ్రేక్ టైం రోజువారీ రివిజన్‌కు కేటాయించాల్సిన సమయం రి‘విజన్’ గ్రూప్స్ అభ్యర్థులకు పరీక్షలో విజయం దిశగా మలి దశలో ఉపకరించే సాధనం రివిజన్ (పునశ్చరణ). దీని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రివిజన్‌కు ఉపయోగపడే కొన్ని ముఖ్య విధానాలు... చదివిన అంశంపై సహచరులు, ఇతరుల ద్వారా స్వీయ మూల్యాంకనం (ట్ఛజ ్ఛఠ్చిఠ్చ్టజీౌ) చేసుకోవాలి. రివిజన్‌కు కూడా ప్రత్యేకంగా టైంటేబుల్ రూపొందించుకోవాలి. గతంలో జరిగిన పరీక్షల ప్రశ్నపత్రాలను సేకరించి, ప్రాక్టీస్ చేయాలి. సందేహాలను ఎప్పటికప్పుడు సహచరులు, సబ్జెక్టు నిపుణుల సహకారంతో నివృత్తి చేసుకోవాలి. ఒత్తిడిపై గెలుపు సులువే ఉద్యోగ పరీక్షలైనా, అకడమిక్ పరీక్షలైనా ప్రస్తుతం విద్యార్థులు ఆందోళనకు గురవటం అధికమవుతోంది. ఒత్తిడి బారినపడుతున్నారు. దీనికి రెండు ప్రధాన కారణాలు.. ఒకటి సబ్జెక్టు అంశాల ప్రభావం కాగా, రెండోది ఇతరులతో పోల్చుకోవడం. వీటిని విడనాడితే ఒత్తిడి దరిచేరకుండా చేయొచ్చు. ఇది అభ్యర్థుల చేతుల్లోనే ఉంటుంది. ముఖ్యంగా సహచరులతో పోల్చుకోవడాన్ని మానుకోవాలి. సహచరుల్లో భిన్న నేపథ్యాల నుంచి వచ్చిన వారుంటారు. కొందరు గంటల కొద్దీ చదువుతుంటారు. ఇలాంటి వారిని చూసి, తాము వెనుకబడుతున్నామేమో అనుకొని ఆందోళన చెందితే ఒత్తిడి మొదలవుతుంది. అది పరీక్ష వరకు సాగుతుంది. అందుకే అభ్యర్థులు ‘మన లక్ష్యం ఏమిటి? మనం ఎలా చదివితే విజయావకాశాలు మెరుగవుతాయి?’అనే విషయాలపైనే దృష్టిసారించాలి. - డాక్టర్ ఎం.ఎస్.రెడ్డి, సైకియాట్రిస్ట్. రైటింగ్ ప్రాక్టీస్‌తో మరింత కచ్చితంగా గ్రూప్స్ వంటి పోటీపరీక్షల్లో విజయం సాధించాలంటే రైటింగ్ ప్రాక్టీస్ ముఖ్యం. ఇలా చేస్తే మరింత కచ్చితత్వంతో ముందుకుసాగొచ్చు. అలాగని గంటల కొద్దీ సమయాన్ని రైటింగ్‌కు కేటాయించటం కూడా సరికాదు. ప్రతి టాపిక్కు సంబంధించి వ్యక్తిగతంగా కొంత సమయాన్ని నిర్దేశించుకొని, ఆ సమయంలో చదివిన అంశాలను రాస్తూ ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత తాము చదివిన అంశాలు - రాసుకున్న అంశాలను సరిపోల్చుకొని, తప్పులను సరిదిద్దుకోవాలి. ఫలితంగా సబ్జెక్టు పరిజ్ఞానం పెరగడంతో పాటు చదివిన అంశాలు ఎక్కువ కాలం గుర్తుంటాయి. - ఆర్.సి.రెడ్డి, డెరైక్టర్, ఆర్.సి.రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్. వ్యక్తిగత సామర్థ్యమే గీటురాయి ప్రస్తుతం చాలా మంది అభ్యర్థులు కోచింగ్ తీసుకుంటేనే విజయం సాధ్యమని భావిస్తున్నారు. కోచింగ్ అనేది అభ్యర్థులను విజయం దిశగా మార్గనిర్దేశనం చేసే సాధనం మాత్రమే. మిగిలిన బాధ్యత అంతా అభ్యర్థులదే. కోచింగ్ ద్వారా ఏ అంశాలు చదవాలి? ఎలా చదవాలి? ముఖ్యమైన అంశాలేంటి? అనే విషయాలపై స్పష్టత లభిస్తుంది. వాటి ఆధారంగా అభ్యర్థులు స్వీయ ప్రిపరేషన్ ద్వారా సబ్జెక్టులపై పట్టు సాధించాలి. కోచింగ్ తీసుకోలేని అభ్యర్థులు కోచింగ్ తీసుకునే వారితో పోల్చుకుని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కోచింగ్ లేకుండానే విజయం సాధించిన వారు గతంలో ఎందరో ఉన్నారు. అభ్యర్థి వ్యక్తిగత సామర్థ్యమే విజయాన్ని నిర్దేశిస్తుందన్నది గుర్తించాలి. - వి.గోపాలకృష్ణ, డెరైక్టర్, బ్రెయిన్ ట్రీ అకాడమీ. ఎన్ఐడీలో డిజైన్ కోర్సులు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడీ) వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థుల కోసం పూర్తి సమాచారం... బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (బీడీఈఎస్): కాలవ్యవధి: నాలుగేళ్లు అర్హత: ఇంటర్ ఉత్తీర్ణత లేదా తత్సమాన అర్హత. వయసు: 2016, జూలై 1 నాటికి 20 ఏళ్లు మించ కూడదు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, నాన్ క్రీమిలేయర్ అహ్మదాబాద్‌లోని ఎన్ఐడీలో మాత్రమే ఈ కోర్సు ఉంది. మాస్టర్ ఆఫ్ డిజైన్ (ఎండీఈఎస్): కాలవ్యవధి: రెండున్నరేళ్లు. అర్హత: 2016, జూలై నాటికి గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి బ్యాచిలర్ డిగ్రీ (10+2+4)/డిప్లొమా ఇన్ డిజైన్ (10+2+4) ఉత్తీర్ణత లేదా చివరి సంవత్సర పరీక్షలకు హాజరై ఉండాలి/2015, జూలై నాటికి బ్యాచిలర్ డిగ్రీ(10+2+3) ఉత్తీర్ణత లేదా హాజరై ఉండాలి. అహ్మదాబాద్, బెంగళూరు, గాంధీనగర్ ఎన్ఐడీల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. వయసు: 2016, జులై 1 నాటికి 30 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, నాన్ క్రీమిలేయర్ ఓబీసీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో మూడేళ్ల సడలింపు ఉంటుంది. గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రాం ఇన్ డిజైన్(జీడీపీడీ) ఇంటర్ ఉత్తీర్ణత లేదా తత్సమాన అర్హత. ఈ కోర్సు విజయవాడ ఎన్ఐడీ క్యాంపస్‌లో మాత్రమే ఉంది. మొత్తం 60 సీట్లు ఉన్నాయి. డాట్(డిజైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్), ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు ఖరారు చేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. వెబ్సైట్: www.admissions.nid.edu ఫీజు: బ్యాచిలర్ ఆఫ్ డిజైన్/ మాస్టర్ ఆఫ్ డిజైన్/గ్రాడ్యుయేట్ డిప్లొమా పోగ్రాం ఇన్ డిజైన్ దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ.1500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, నాన్‌క్రీమిలేయర్ అభ్యర్థులకు రూ.750. ఎంపిక ప్రక్రియ: డాట్ (డిజైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్): ఎండీఈఎస్/బీడీఈఎస్/జీడీపీడీ కోర్సులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులంతా డాట్ పరీక్ష రాయాలి. ప్రశ్నపత్రం 100 మార్కులకు ఉంటుంది. ఆబ్జెక్టివ్ అండ్ సబ్జెక్టివ్ విధానాల్లో ప్రశ్నలు అడుగుతారు. స్టూడియో టెస్ట్: డాట్లో ప్రతిభ కనబరచిన వారితో మెరిట్ జాబితాను తయారు చేస్తారు. వీరందరికీ స్పెషలైజేషన్ల వారీగా ప్రాక్టికల్ అసైన్మెంట్లు, గ్రూప్ డిస్కషన్లు నిర్వహిస్తారు. ఈ టెస్ట్‌కు 100 మార్కులు కేటాయించారు. పర్సనల్ ఇంటర్వ్యూ: స్టూడియో టెస్ట్ పూర్తయిన వెంటనే అదే రోజు స్పెషలైజేషన్ల వారీగా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ముఖ్యసమాచారం: ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేదీ: నవంబరు 27, 2015 డిజైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (బీడీఈఎస్/ఎండీఈఎస్/జీడీపీడీ): జనవరి 10, 2016 (ఆదివారం) పరీక్ష సమయం: ఉదయం 10గం.-మ.1 గంట వరకు రెండు రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ (జీడీపీడీ) టిస్‌లో పీజీ, పీహెచ్డీ కోర్సులు పీజీ, పీహెచ్డీ, ఇంటిగ్రేటెడ్-ఎంఫిల్ కోర్సుల్లో ప్రవేశాలకు టాటా ఇన్స్టిస్టూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్(టిస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ముంబై, తుల్జాపూర్, గువహటి, హైదరాబాద్‌లలో టిస్ క్యాంపస్‌లు ఉన్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు: ఎంఏ, ఎంహెచ్ఏ, ఎంపీహెచ్ విభాగాల్లో మొత్తం 56 మాస్టర్ డిగ్రీ స్పెషలైజేషన్లను టిస్ అందిస్తోంది. అర్హత: బ్యాచిలర్ డిగ్రీ. దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఫీజు: దరఖాస్తు ఫీజు రూ.1,000. తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం రూ.2.5 లక్షలు మించని ఎస్సీ, ఎస్టీ; లక్ష రూపాయల ఆదాయం మించని ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.250. క్రెడిట్/డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్‌ల ద్వారా ఫీజు మొత్తాన్ని చెల్లించవచ్చు. పరీక్ష విధానం: టిస్-నెట్ పరీక్ష ఆన్లైన్ విధానంలో జరుగుతుంది. మల్టిపుల్ చాయిస్ విధానంలోప్రశ్నలు ఉంటాయి. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 100 నిమిషాల్లో సమాధానాలు గుర్తించాలి. జనరల్ నాలెడ్జ్, అనలిటికల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీల నుంచి ప్రశ్నలు అడుగుతారు.ఎంపిక ప్రక్రియ: ఎంపిక ప్రక్రియ మూడంచెల్లో ఉంటుంది. రాత పరీక్ష, ప్రీ ఇంటర్వ్యూ టెస్ట్ (పీఐటీ)/గ్రూప్ డిస్కషన్(జీడీ), పర్సనల్ ఇంటర్వ్యూలు ఉంటాయి. ముఖ్య సమాచారం: ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 30, 2015 టిస్-నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ (నెట్): జనవరి 9, 2016 (మ. 2గం-3.40 గం) పీఐటీ/పీఐ (హైదరాబాద్): మార్చి 30- ఏప్రిల్ 2 ఫలితాల వెల్లడి: ఏప్రిల్ 15, 2016, రెండు రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం. . ప్రతి స్పెషలైజేషన్‌లో 30 సీట్లు ఉన్నాయి. పీహెచ్డీ, ఇంటిగ్రేటెడ్ ఎంఫిల్-పీహెచ్డీ: అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. డెరైక్ట్ పీహెచ్‌డీలో ప్రవేశాలకు పీజీ తర్వాత ఐదేళ్ల వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇంటిగ్రేటెడ్ ఎంఫిల్-పీహెచ్డీ ప్రవేశాలకు ఎలాంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఈ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలంటే రీసెర్చ ఆప్టిట్యూడ్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఫీజు: రూ.1500, ఎస్సీ, ఎస్టీలకు రూ.375. ముఖ్యసమాచారం: ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేదీ: జనవరి 15, 2016 రీసెర్చ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ తేదీ: ఫిబ్రవరి 12, 2016 పర్సనల్ ఇంటర్వ్యూలు: మార్చి 21-31, 2016 ఫలితాల వెల్లడి: ఏప్రిల్ 15, 2016