అభ్యర్థుల ప్రిపరేషన్ సరైన మార్గంలో సాగేందుకు ఉపయోగపడే మరో సాధనం.. స్విచ్ ఓవర్ సిస్టమ్! ఒక సబ్జెక్టు లేదా అంశాన్ని చదువుతున్నప్పుడు విసుగొస్తే వెంటనే తమకు ఆసక్తి ఉన్న మరో సబ్జెక్టు లేదా అంశంపై దృష్టిసారించాలి. అంతేకానీ, ఆసక్తి లేకున్నా పరీక్షల కోణంలో ముఖ్యమైంది కాబట్టి అదే అంశానికి గంటల కొద్దీ సమయం వెచ్చిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు సరికదా ప్రతికూల ప్రభావం చూపుతుంది.
చెక్‌లిస్టుతో పక్కాగా!
ప్రిపరేషన్ పరంగా అభ్యర్థులు అనుసరించాల్సిన ముఖ్య వ్యూహం చెక్ లిస్ట్ రూపొందించుకోవడం. చదవడానికి సిద్ధమయ్యే ముందు దీన్ని తయారుచేసుకోవాలి.
ప్రాధాన్యత వారీగా చదవాల్సిన అంశాలు
కేటాయించాల్సిన సమయం
బ్రేక్ టైం
రోజువారీ రివిజన్‌కు కేటాయించాల్సిన సమయం
రి‘విజన్’
గ్రూప్స్ అభ్యర్థులకు పరీక్షలో విజయం దిశగా మలి దశలో ఉపకరించే సాధనం రివిజన్ (పునశ్చరణ). దీని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రివిజన్‌కు ఉపయోగపడే కొన్ని ముఖ్య విధానాలు...
చదివిన అంశంపై సహచరులు, ఇతరుల ద్వారా స్వీయ మూల్యాంకనం (ట్ఛజ ్ఛఠ్చిఠ్చ్టజీౌ) చేసుకోవాలి.
రివిజన్‌కు కూడా ప్రత్యేకంగా టైంటేబుల్ రూపొందించుకోవాలి.
గతంలో జరిగిన పరీక్షల ప్రశ్నపత్రాలను సేకరించి, ప్రాక్టీస్ చేయాలి. సందేహాలను ఎప్పటికప్పుడు సహచరులు, సబ్జెక్టు నిపుణుల సహకారంతో నివృత్తి చేసుకోవాలి.
ఒత్తిడిపై గెలుపు సులువే
ఉద్యోగ పరీక్షలైనా, అకడమిక్ పరీక్షలైనా ప్రస్తుతం విద్యార్థులు ఆందోళనకు గురవటం అధికమవుతోంది. ఒత్తిడి బారినపడుతున్నారు. దీనికి రెండు ప్రధాన కారణాలు.. ఒకటి సబ్జెక్టు అంశాల ప్రభావం కాగా, రెండోది ఇతరులతో పోల్చుకోవడం. వీటిని విడనాడితే ఒత్తిడి దరిచేరకుండా చేయొచ్చు. ఇది అభ్యర్థుల చేతుల్లోనే ఉంటుంది. ముఖ్యంగా సహచరులతో పోల్చుకోవడాన్ని మానుకోవాలి. సహచరుల్లో భిన్న నేపథ్యాల నుంచి వచ్చిన వారుంటారు. కొందరు గంటల కొద్దీ చదువుతుంటారు. ఇలాంటి వారిని చూసి, తాము వెనుకబడుతున్నామేమో అనుకొని ఆందోళన చెందితే ఒత్తిడి మొదలవుతుంది. అది పరీక్ష వరకు సాగుతుంది. అందుకే అభ్యర్థులు ‘మన లక్ష్యం ఏమిటి? మనం ఎలా చదివితే విజయావకాశాలు మెరుగవుతాయి?’అనే విషయాలపైనే దృష్టిసారించాలి.
- డాక్టర్ ఎం.ఎస్.రెడ్డి, సైకియాట్రిస్ట్.
రైటింగ్ ప్రాక్టీస్‌తో మరింత కచ్చితంగా
గ్రూప్స్ వంటి పోటీపరీక్షల్లో విజయం సాధించాలంటే రైటింగ్ ప్రాక్టీస్ ముఖ్యం. ఇలా చేస్తే మరింత కచ్చితత్వంతో ముందుకుసాగొచ్చు. అలాగని గంటల కొద్దీ సమయాన్ని రైటింగ్‌కు కేటాయించటం కూడా సరికాదు. ప్రతి టాపిక్‌కు సంబంధించి వ్యక్తిగతంగా కొంత సమయాన్ని నిర్దేశించుకొని, ఆ సమయంలో చదివిన అంశాలను రాస్తూ ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత తాము చదివిన అంశాలు - రాసుకున్న అంశాలను సరిపోల్చుకొని, తప్పులను సరిదిద్దుకోవాలి. ఫలితంగా సబ్జెక్టు పరిజ్ఞానం పెరగడంతో పాటు చదివిన అంశాలు ఎక్కువ కాలం గుర్తుంటాయి.
- ఆర్.సి.రెడ్డి, డెరైక్టర్, ఆర్.సి.రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్.
వ్యక్తిగత సామర్థ్యమే గీటురాయి
ప్రస్తుతం చాలా మంది అభ్యర్థులు కోచింగ్ తీసుకుంటేనే విజయం సాధ్యమని భావిస్తున్నారు. కోచింగ్ అనేది అభ్యర్థులను విజయం దిశగా మార్గనిర్దేశనం చేసే సాధనం మాత్రమే. మిగిలిన బాధ్యత అంతా అభ్యర్థులదే. కోచింగ్ ద్వారా ఏ అంశాలు చదవాలి? ఎలా చదవాలి? ముఖ్యమైన అంశాలేంటి? అనే విషయాలపై స్పష్టత లభిస్తుంది. వాటి ఆధారంగా అభ్యర్థులు స్వీయ ప్రిపరేషన్ ద్వారా సబ్జెక్టులపై పట్టు సాధించాలి. కోచింగ్ తీసుకోలేని అభ్యర్థులు కోచింగ్ తీసుకునే వారితో పోల్చుకుని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కోచింగ్ లేకుండానే విజయం సాధించిన వారు గతంలో ఎందరో ఉన్నారు. అభ్యర్థి వ్యక్తిగత సామర్థ్యమే విజయాన్ని నిర్దేశిస్తుందన్నది గుర్తించాలి.
- వి.గోపాలకృష్ణ, డెరైక్టర్, బ్రెయిన్ ట్రీ అకాడమీ.
ఎన్‌ఐడీలో డిజైన్ కోర్సులు
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్‌ఐడీ) వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థుల కోసం పూర్తి సమాచారం...
బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (బీడీఈఎస్):
కాలవ్యవధి: నాలుగేళ్లు
అర్హత: ఇంటర్ ఉత్తీర్ణత లేదా తత్సమాన అర్హత.
వయసు: 2016, జూలై 1 నాటికి 20 ఏళ్లు మించ కూడదు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, నాన్ క్రీమిలేయర్ అహ్మదాబాద్‌లోని ఎన్‌ఐడీలో మాత్రమే ఈ కోర్సు ఉంది.
మాస్టర్ ఆఫ్ డిజైన్ (ఎండీఈఎస్):
కాలవ్యవధి: రెండున్నరేళ్లు.
అర్హత: 2016, జూలై నాటికి గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి బ్యాచిలర్ డిగ్రీ (10+2+4)/డిప్లొమా ఇన్ డిజైన్ (10+2+4) ఉత్తీర్ణత లేదా చివరి సంవత్సర పరీక్షలకు హాజరై ఉండాలి/2015, జూలై నాటికి బ్యాచిలర్ డిగ్రీ(10+2+3) ఉత్తీర్ణత లేదా హాజరై ఉండాలి.
అహ్మదాబాద్, బెంగళూరు, గాంధీనగర్ ఎన్‌ఐడీల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది.
వయసు: 2016, జులై 1 నాటికి 30 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, నాన్ క్రీమిలేయర్ ఓబీసీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో మూడేళ్ల సడలింపు ఉంటుంది.
గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రాం ఇన్ డిజైన్(జీడీపీడీ)
ఇంటర్ ఉత్తీర్ణత లేదా తత్సమాన అర్హత.
ఈ కోర్సు విజయవాడ ఎన్‌ఐడీ క్యాంపస్‌లో మాత్రమే ఉంది. మొత్తం 60 సీట్లు ఉన్నాయి. డాట్(డిజైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్), ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు ఖరారు చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్‌సైట్: www.admissions.nid.edu
ఫీజు: బ్యాచిలర్ ఆఫ్ డిజైన్/ మాస్టర్ ఆఫ్ డిజైన్/గ్రాడ్యుయేట్ డిప్లొమా పోగ్రాం ఇన్ డిజైన్ దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ.1500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, నాన్‌క్రీమిలేయర్ అభ్యర్థులకు రూ.750.
ఎంపిక ప్రక్రియ:
డాట్ (డిజైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్): ఎండీఈఎస్/బీడీఈఎస్/జీడీపీడీ కోర్సులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులంతా డాట్ పరీక్ష రాయాలి. ప్రశ్నపత్రం 100 మార్కులకు ఉంటుంది. ఆబ్జెక్టివ్ అండ్ సబ్జెక్టివ్ విధానాల్లో ప్రశ్నలు అడుగుతారు.
స్టూడియో టెస్ట్:
డాట్‌లో ప్రతిభ కనబరచిన వారితో మెరిట్ జాబితాను తయారు చేస్తారు. వీరందరికీ స్పెషలైజేషన్ల వారీగా ప్రాక్టికల్ అసైన్‌మెంట్‌లు, గ్రూప్ డిస్కషన్లు నిర్వహిస్తారు. ఈ టెస్ట్‌కు 100 మార్కులు కేటాయించారు.
పర్సనల్ ఇంటర్వ్యూ: స్టూడియో టెస్ట్ పూర్తయిన వెంటనే అదే రోజు స్పెషలైజేషన్ల వారీగా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
ముఖ్యసమాచారం:
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: నవంబరు 27, 2015
డిజైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (బీడీఈఎస్/ఎండీఈఎస్/జీడీపీడీ): జనవరి 10, 2016 (ఆదివారం)
పరీక్ష సమయం: ఉదయం 10గం.-మ.1 గంట వరకు
రెండు రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ (జీడీపీడీ)
టిస్‌లో పీజీ, పీహెచ్‌డీ కోర్సులు
పీజీ, పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్-ఎంఫిల్ కోర్సుల్లో ప్రవేశాలకు టాటా ఇన్‌స్టిస్టూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్(టిస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ముంబై, తుల్జాపూర్, గువహటి, హైదరాబాద్‌లలో టిస్ క్యాంపస్‌లు ఉన్నాయి.
పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు:
ఎంఏ, ఎంహెచ్‌ఏ, ఎంపీహెచ్ విభాగాల్లో మొత్తం 56 మాస్టర్ డిగ్రీ స్పెషలైజేషన్లను టిస్ అందిస్తోంది.
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
ఫీజు: దరఖాస్తు ఫీజు రూ.1,000. తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం రూ.2.5 లక్షలు మించని ఎస్సీ, ఎస్టీ; లక్ష రూపాయల ఆదాయం మించని ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.250.
క్రెడిట్/డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్‌ల ద్వారా ఫీజు మొత్తాన్ని చెల్లించవచ్చు.
పరీక్ష విధానం:
టిస్-నెట్ పరీక్ష ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది. మల్టిపుల్ చాయిస్ విధానంలోప్రశ్నలు ఉంటాయి. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 100 నిమిషాల్లో సమాధానాలు గుర్తించాలి. జనరల్ నాలెడ్జ్, అనలిటికల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీల నుంచి ప్రశ్నలు అడుగుతారు.ఎంపిక ప్రక్రియ: ఎంపిక ప్రక్రియ మూడంచెల్లో ఉంటుంది. రాత పరీక్ష, ప్రీ ఇంటర్వ్యూ టెస్ట్ (పీఐటీ)/గ్రూప్ డిస్కషన్(జీడీ), పర్సనల్ ఇంటర్వ్యూలు ఉంటాయి.
ముఖ్య సమాచారం:
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:
నవంబరు 30, 2015
టిస్-నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ (నెట్):
జనవరి 9, 2016 (మ. 2గం-3.40 గం)
పీఐటీ/పీఐ (హైదరాబాద్): మార్చి 30- ఏప్రిల్ 2
ఫలితాల వెల్లడి: ఏప్రిల్ 15, 2016,
రెండు రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలు:
హైదరాబాద్, విశాఖపట్నం.
. ప్రతి స్పెషలైజేషన్‌లో 30 సీట్లు ఉన్నాయి.
పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్ ఎంఫిల్-పీహెచ్‌డీ:
అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. డెరైక్ట్ పీహెచ్‌డీలో ప్రవేశాలకు పీజీ తర్వాత ఐదేళ్ల వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఇంటిగ్రేటెడ్ ఎంఫిల్-పీహెచ్‌డీ ప్రవేశాలకు ఎలాంటి వర్క్ ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. ఈ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలంటే రీసెర్‌చ ఆప్టిట్యూడ్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
ఫీజు: రూ.1500, ఎస్సీ, ఎస్టీలకు రూ.375.
ముఖ్యసమాచారం:
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: జనవరి 15, 2016
రీసెర్చ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ తేదీ: ఫిబ్రవరి 12, 2016
పర్సనల్ ఇంటర్వ్యూలు: మార్చి 21-31, 2016
ఫలితాల వెల్లడి: ఏప్రిల్ 15, 2016
గ్రూప్స్... ప్రిపరేషన్ టిప్స్
Published Thu, Oct 22 2015 1:13 AM | Last Updated on Sun, Sep 3 2017 11:18 AM
Advertisement
Advertisement