Mock Tests
-
నీట్ ర్యాంకు.. మాక్ టెస్టులే కీలకం
సాక్షి, అమరావతి: దేశంలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ యూజీని మే 5న నిర్వహించనున్నారు. పరీక్షకు మరికొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో మంచి ర్యాంక్ సాధించడంలో మాక్ టెస్టులు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. నీట్‌కు సిద్ధమవుతున్న విద్యార్థులు రోజుకు ఒకటి చొప్పున మాక్ టెస్ట్ రాయడం మంచిదంటున్నారు. ప్రతి మాక్ టెస్ట్ తర్వాత స్వయంవిశ్లేషణ చేసుకుని.. బలహీనంగా ఉన్న విభాగాలపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు. ఎన్సీఈఆర్టీ పుస్తకాలతో ప్రయోజనం.. ఈ ఏడాది నీట్ సిలబస్‌లో చాలా మార్పులు చేశారు. దాదాపు 18 అంశాలను సిలబస్ నుంచి తొలగించారు. బయాలజీ, కెమిస్ట్రీల్లో కొన్ని కొత్త అంశాలను జోడించారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సిలబస్‌లో లేని అంశాల జోలికి విద్యార్థులు వెళ్లకపోవడం ఉత్తమం. ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలు నీట్ విజయంలో కీలకపాత్ర పోషిస్తాయని.. వీటిని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రం నుంచి 70 వేల మంది.. నీట్ యూజీ రాస్తున్న విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఈ ఏడాది 23.80 లక్షల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేశారు. గతేడాది 20.87 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాగే గతేడాది ఆంధ్రప్రదేశ్ నుంచి 68 వేల మంది నీట్ రాయగా 42 వేల మంది అర్హత సాధించారు. ఈ ఏడాది మన రాష్ట్రం నుంచి 70 వేల మందికిపైగా నీట్ రాసే అవకాశాలున్నాయి. గతేడాది శ్రీకాకుళం జిల్లాకు చెందిన వరుణ్ చక్రవర్తి అఖిల భారత స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన సంగతి తెలిసిందే. తరచూ పునశ్చరణ చేయాలి.. ఎన్సీఈఆర్టీ బయాలజీ, కెమిస్ట్రీ ప్రతి అధ్యాయంలో ముఖ్యమైన అంశాలతో షార్ట్స్ నోట్స్ రాసుకోవాలి. వాటిని తరచూ పునశ్చరణ చేస్తూ ఉండాలి. బయాలజీలో ప్లాంట్ అండ్ యానిమల్, హ్యూమన్ ఫిజియాలజీ, మార్ఫాలజీ, జెనెటిక్స్, ఎకాలజీ, బయోటెక్నాలజీ, రీప్రొడక్షన్ వంటివి ముఖ్యమైన అధ్యాయాలు. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయొద్దు. పరీక్షకు తక్కువ సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో కొత్త విషయాలు, అంశాలు నేర్చుకోవడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించకపోవడం ఉత్తమం. – కె. రవీంద్రకుమార్, నీట్ కోచింగ్ నిపుణులు, శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఏ రోజు సిలబస్ ఆ రోజే పూర్తి చేయాలి.. పరీక్షలకు అందుబాటులో ఉన్న సమయాన్ని సరిగ్గా సది్వనియోగం చేసుకోవాలి. ఏ రోజు సిలబస్‌ను ఆ రోజే పూర్తి చేస్తే ఒత్తిడి ఉండదు. నా స్నేహితులతో కలిసి గ్రూప్ స్టడీ చేసేవాడిని. వారితో కలిసి మాక్ టెస్ట్‌లు రాయడం వల్ల మాలో మాకు మంచి పోటీ ఉండేది. అత్యుత్తమ ప్రతిభ కనబరచడంలో గ్రూప్ స్టడీ నాకు ఎంతో మేలును చేకూర్చింది. ప్రశ్నను చదవడం, అర్థం చేసుకోవడంలో పొరపాటు చేయొద్దు. పరీక్ష రాసేప్పుడు తొలుత బయాలజీ సెక్షన్ పూర్తి చేసి, తర్వాత ఫిజిక్స్, చివరలో కెమిస్ట్రీ రాయడం మంచిదని నా అభిప్రాయం. – వరుణ్ చక్రవర్తి, నీట్ యూజీ–2023, ఆలిండియా ఫస్ట్ ర్యాంకర్ -
ఈఏపీసెట్, నీట్ విద్యార్థులకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో మాక్ టెస్ట్‌లు
సాక్షి ఎడ్యుకేషన్: ఎక్కువ మంది విద్యార్థుల లక్ష్యం..ఇంజినీరింగ్, లేదా మెడిసిన్. అధిక శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్‌ను అందించే ఇంజినీరింగ్/మెడికల్ కోర్సుల్లో చేర్పించాలని కోరుకుంటున్నారు. అందుకు ఖర్చులకు వెనుకాడకుండా పిల్లలను కోచింగ్‌లో చేరి్పస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్..అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్/అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో అడ్మిషన్లున్కల్పించే ఈఏపీసెట్‌కు లక్షల మంది విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. విద్యార్థులకు చేయూతనిచ్చేలా నిపుణుల ఆధ్వర్యంలో ఈఏపీసెట్, నీట్ పరీక్షలకు ‘సాక్షి’ మాక్ టెస్ట్‌లు నిర్వహించనుంది. దీనికి టెక్నాలజీ పార్ట్నర్గా ‘మై ర్యాంక్’ వ్యవహరిస్తోంది. పరీక్షకు కొద్దిరోజుల ముందు వాస్తవ పరీక్ష లాంటి వాతావరణంలో జరిగే ‘సాక్షి’ మాక్ టెస్టులు రాయడం ద్వారా విద్యార్థులు తమ ప్రిపరేషన్స్ స్థాయిని అంచనా వేసుకుని, దాన్ని మరింత మెరుగుపరచుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు https://www.arenaone.in/mock ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్న్ఫీజు రూ.250గా నిర్ణయించారు. రిజిస్ట్రేషన్‌కు ఏప్రిల్ 22 చివరి తేదీ. రిజిస్టర్ చేసుకున్న ఈ మెయిల్‌కు హాల్ టికెట్ నంబర్ వస్తుంది. ఏప్రిల్ 27న నీట్, ఏప్రిల్ 28న ఈఏపీసెట్ అగ్రికల్చర్, ఇంజినీరింగ్ పరీక్షలుంటాయి. ఈ ఆన్లైన్ టెస్ట్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సమయంలో ఎప్పుడైనా రాసుకోవచ్చు. పరీక్షా సమయం 3 గంటలు. ఈ పరీక్షలకు హాల్ టికెట్ నంబర్ (యూజర్ నేమ్), ఫోన్ నెంబర్ (పాస్వర్డ్)తో ఆ సమయంలో ఎప్పుడైనా లాగిన్ అయ్యి రాసుకోవచ్చు. పరీక్ష ముగిసిన వెంటనే స్కోర్‌ను వెంటనే చెక్ చేసుకోవచ్చు. మాక్ పరీక్షలను https://sakshimocktest.myrank.co.in లో నిర్వహిస్తారు. టెస్ట్ కీ ని ఏప్రిల్ 30న ఇదే వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. çపూర్తి వివరాలకు 95055 14424, 96660 13544, 96665 72244 నంబర్లకు కాల్ చేయవచ్చు. -
మంచి ర్యాంక్‌కు మాక్ టెస్టులు
సాక్షి మీడియా గ్రూప్, నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్(తెలంగాణ)/ ఈఏపీసెట్(ఆంధ్రప్రదేశ్), నీట్ మాక్ టెస్టులు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది విద్యార్థుల లక్ష్యం.. ఇంజనీరింగ్, లేదా మెడిసిన్. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్‌ను అందించే ఇంజనీరింగ్/మెడికల్ కోర్సుల్లో చేర్పించాలని కోరుకుంటున్నారు. అందుకోసం ఖర్చులకు వెనుకాడకుండా పిల్లలను కోచింగ్‌కు పంపిస్తున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే ‘నీట్’.. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్/అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో అడ్మిషన్ కల్పించే ఎంసెట్/ఈఏపీసెట్ కోసం లక్షల మంది సన్నద్ధమవుతున్నారు. వీరికి చేయూతనిచ్చేలా నిపుణుల ఆధ్వర్యంలో రూపొందించిన ఎంసెట్/ఈఏపీసెట్, నీట్ మాక్ టెస్టులను నిర్వహించనున్నారు. పరీక్షకు ముందు వాస్తవ పరీక్షలాంటి వాతావరణంలో జరిగే ‘సాక్షి’ మాక్ టెస్ట్ రాయడం ద్వారా.. విద్యార్థులు తమ ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకొని, మరింత మెరుగుపడవచ్చు. అలాగే ‘సాక్షి’ మాక్ టెస్టుల్లో ఉత్తమ ప్రతిభను చూపిన టాప్ టెన్ ర్యాంకర్లు ఆకర్షణీయ బహుమతులూ గెలుచుకోవచ్చు. ఆన్లైన్ టెస్ట్‌లకు టెక్నాలజీ పార్ట్నర్గా‘MY RANK’ వారు వ్యవహరిస్తున్నారు. ►సాక్షి మాక్ ఎంసెట్ (ఇంజనీరింగ్) /ఈఏపీసెట్ పరీక్ష 30.06.2022. ►ఎంసెట్ / ఈఏపీసెట్ అగ్రికల్చర్ పరీక్ష 01.07.2022 తేదీల్లో ఆన్లైన్లో జరుగుతుంది. ►సాక్షి మాక్ నీట్ పరీక్ష 03.07.2022 ఆఫ్‌లైన్ విధానంలో జరుగుతుంది. ►ఒక్కో పరీక్షకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.250. అభ్యర్థులు http://www.arenaone.in/mock ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. విజయవంతంగా దరఖాస్తులు పూర్తిచేసిన అభ్యర్థుల హాల్‌టికెట్ నంబర్ మీరు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్‌కు వస్తుంది. పరీక్ష కేంద్రం: విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, దేశ్ముఖి గ్రామం, పోచంపల్లి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 25.06.2022 వివరాలకు సంప్రదించాల్సిన నంబర్: 9666013544 -
నీట్, ఎంసెట్ విద్యార్థులకు సాక్షి మాక్‌టెస్టులు
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది విద్యార్థుల లక్ష్యం.. ఇంజనీరింగ్, లేదా మెడిసిన్. అధికశాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్‌ను అందించే ఇంజనీరింగ్/మెడికల్ కోర్సుల్లో చేర్పించాలని కోరుకుంటున్నారు. అందుకు ఖర్చులకు వెనుకాడకుండా పిల్లలను కోచింగ్‌లో చేర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్.. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్/అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో అడ్మిషన్ కల్పించే ఎంసెట్‌కు లక్షల మంది విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. చదవండి👉: Competitive Exams: ఏ పోటీ పరీక్షలకైనా.. రాజకీయ అవగాహన తప్పనిసరి.. ఈ వ్యూహాలను అనుసరిస్తే..! ఈ నేపథ్యంలో విద్యార్థులకు చేయూతనిచ్చేలా నిపుణుల ఆధ్వర్యంలో ఎంసెట్, నీట్ పరీక్షలకు సాక్షి మాక్‌టెస్టులు నిర్వహించనుంది. పరీక్షకు కొద్దిరోజుల ముందు వాస్తవ పరీక్షలాంటి వాతావరణంలో జరిగే సాక్షి మాక్ టెస్టులు రాయడం ద్వారా విద్యార్థులు తమ ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకుని, ప్రిపరేషన్‌ను మరింత మెరుగుపరచుకోవచ్చు. అంతేకాకుండా సాక్షి మాక్ టెస్టుల్లో ఉత్తమ ప్రతిభను చూపడం ద్వారా టాప్ టెన్ ర్యాంకర్లు ఆకర్షణీయ బహుమతులూ గెలుచుకోవచ్చు. సాక్షి మాక్ ఎంసెట్ (ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్) పరీక్ష 25 జూన్, 2022, 26 జూన్, 2022 (శనివారం, ఆదివారం) తేదీల్లో ఆన్లైన్లో జరగనుంది. సాక్షి మాక్ నీట్ పరీక్ష 3 జూలై, 2022 (ఆదివారం) ఆన్లైన్/ఆఫ్‌లైన్ విధానంలో జరుగుతుంది. ఒక్కో పరీక్షకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.250. అభ్యర్థులు https://www. arenaone.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు పూర్తిచేసిన అభ్యర్థుల ఈమెయిల్‌కు హాల్‌టికెట్ నంబర్ వస్తుంది. వివరాలకు సంప్రదించాల్సిన నెంబర్లు: 96666 97219, 99126 71555, 96662 83534 -
ఏపీ ఐసెట్ 2021; ఇవే విజయానికి కీలకం
ఏపీ ఐసెట్.. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్! ఎంబీఏలో చేరి.. భవిష్యత్తులో మేనేజ్మెంట్ రంగంలో కొలువులు సాధించాలని కలలు కనే విద్యార్థులు; అదే విధంగా ఎంసీఏ పట్టాతో సాఫ్ట్వేర్ రంగంలో కెరీర్ సొంతం చేసుకోవాలనుకునే అభ్యర్థులకు చక్కటి మార్గం!! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో ఏపీ ఐసెట్ ర్యాంకు ద్వారా ప్రవేశం లభిస్తుంది. వేల మంది రాసే ఈ పరీక్ష.. ఈ నెల(సెప్టెంబర్) 17, 18 తేదీల్లో జరుగనుంది. ఈ నేపథ్యంలో.. ఏపీ ఐసెట్‌లో విజయానికి ప్రిపరేషన్ టిప్స్... ఎంబీఏ, ఎంసీఏ.. ఈ కోర్సుల పట్ల విద్యార్థుల్లో ఆసక్తి నెలకొంది. గ్రాడ్యుయేషన్ స్థాయి కోర్సులు ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో కొంతమంది కార్పొరేట్ రంగంలో మేనేజ్మెంట్ కెరీర్ లక్ష్యంగా ఎంబీఏలో చేరుతున్నారు. మరికొందరు ఎంసీఏతో సాఫ్ట్వేర్ కొలువులు సొంతం చేసుకోవాలని టార్గెట్ సెట్ చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వేల మంది ప్రతి ఏటా ఐసెట్‌కు హాజరవుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ ఐసెట్‌కు మరో వారం రోజులే సమయం ఉంది. దాంతో విద్యార్థులు ప్రిపరేషన్‌పై పూర్తిస్థాయిలో దృష్టిసారించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏపీ ఐసెట్ పరీక్ష విధానం ఏపీ–ఐసెట్ 2021ను మూడు సెక్షన్లలో 200 ప్రశ్నలు–200 మార్కులకు నిర్వహించనున్నారు. ఒక్కో సెక్షన్లో మళ్లీ ఉప విభాగాలు కూడా ఉంటాయి. సెక్షన్ ఏ అనలిటికల్ ఎబిలిటీ 75 ప్రశ్నలు–75 మార్కులకు; సెక్షన్ బీ కమ్యూనికేషన్ ఎబిలిటీ 70 ప్రశ్నలు–70 మార్కులకు; సెక్షన్ సీ మ్యాథమెటికల్ ఎబిలిటీ 55 ప్రశ్నలు–55 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం రెండున్నర గంటలు. విభాగాల వారీగా ప్రిపరేషన్ ► ప్రస్తుతం సమయంలో విద్యార్థులు ఐసెట్ సిలబస్‌లో విభాగాల వారీగా ముఖ్యాంశాలపై ఎక్కువగా దృష్టిపెట్టాలి. ► డేటా సఫిషియెన్సీ; ప్రాబ్లమ్ సాల్వింగ్ అంశాల్లో బేసిక్ అర్థమెటిక్‌ను పునశ్చరణ చేసుకోవాలి. ► అర్థమెటిక్ విభాగంలో..శాతాలు, లాభ నష్టాలు,నిష్పత్తులు, మెన్సురేషన్,పని–కాలం, పని –సమయం వంటి అంశాలను రివిజన్ చేసుకోవాలి. ► అల్జీబ్రా అండ్ జామెట్రికల్ ఎబిలిటీ కోసం ట్రిగ్నోమెట్రీ, సెట్స్ అండ్ రిలేషన్స్, లీనియర్ ఈక్వేషన్స్, ప్రోగ్రెషన్స్ వంటి టాపిక్స్‌పై నైపుణ్యం సాధించాలి. ► ప్రాబ్లమ్ సాల్వింగ్ విభాగంలో.. కోడింగ్, డీ–కోడింగ్, బ్లడ్ రిలేషన్, సిరీస్, సిలాజిజమ్, సీటింగ్ అరేంజ్మెంట్ వంటి అంశాలపై పట్టు సాధించాలి. ► మ్యాథమెటికల్ ఎబిలిటీలో.. ప్రాథమిక సూత్రాలపై అవగాహన పెంచుకోవాలి. ► స్టాటిస్టికల్ ఎబిలిటీ కోసం ప్రాబబిలిటీ, ఇన్–ఈక్వాలిటీస్ అంశాలను ప్రాక్టీస్ చేయాలి. ► కమ్యూనికేషన్ ఎబిలిటీ విభాగంలో.. రాణించేందుకు బేసిక్ ఇంగ్లిష్ గ్రామర్ నైపుణ్యాలు, వొకాబ్యులరీలను ప్రతి రోజు చదవాలి. ► బిజినెస్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ విభాగంలో.. బిజినెస్ టెర్మినాలజీ, కొత్త వ్యాపార విధానాలు, ఆయా సంస్థలు–వాటి క్యాప్షన్లు వంటివి తెలుసుకోవాలి. ► కంప్యూటర్ టెర్మినాలజీకి సంబంధించి బేసిక్ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ టూల్స్, అదే విధంగా కంప్యూటర్ హార్డ్‌వేర్–ముఖ్య భాగాలు, వాటి పనితీరు గురించిన ప్రాథమిక నైపుణ్యం పరీక్ష పరంగా కలిసొస్తుంది. ► రీడింగ్ కాంప్రహెన్షన్ విభాగం కోసం అభ్యర్థులు ఇంగ్లిష్ దినపత్రికల్లోని ఎడిటోరియల్స్‌పై దృష్టి పెట్టాలి. మాక్ టెస్టులు ఐసెట్ అభ్యర్థులు ప్రస్తుత సమయంలో పరీక్ష విధానంపై అవగాహన పెంచుకోవాలి. దాంతోపాటు ప్రాక్టీస్‌కు ఎక్కువ సమయం కేటాయించాలి. ఐసెట్ వెబ్‌సైట్‌లోని మాక్ టెస్ట్‌లను రాయాలి. ఫలితంగా పరీక్ష తీరుతెన్నులు తెలుస్తాయి. దాంతో పరీక్ష హాల్లో వ్యవహరించాల్సిన విధానంపై అవగాహన లభిస్తుంది. మోడల్ టెస్ట్‌లు ఈ వారం రోజుల్లో అభ్యర్థులు వీలైనంత మేరకు మోడల్ టెస్ట్‌లు రాయడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతి రోజు కనీసం ఒక మోడల్ టెస్ట్ రాసి.. ఫలితాలు విశ్లేషించుకోవాలి. ఆ విశ్లేషణ ఆధారంగా తమ బలాలు బలహీనతలపై అవగాహన వస్తుంది. అభ్యర్థులు తాము ఇప్పటికీ బలహీనంగానే ఉన్న టాపిక్స్‌ను వదిలేయాలి. బాగా పట్టు ఉన్న అంశాలపై మరింతగా దృష్టిపెట్టాలి. షార్ట్ నోట్స్ ప్రిపరేషన్ సమయంలోనే సిలబస్ ఆధారంగా.. ఆయా సబ్జెక్ట్‌లు, టాపిక్‌లకు సంబంధించి ముఖ్యమైన అంశాలు, ఫార్ములాలతో షార్ట్ నోట్స్ రూపొందించుకోవాలి. ఈ షార్ట్ నోట్స్ ఆధారంగా పునశ్చరణ వేగవంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా డేటా సఫిషియన్సీ, మ్యాథమెటికల్ ఎబిలిటీ, అర్థమెటికల్ ఎబిలిటీ, అల్జీబ్రా అండ్ జామెట్రీ, స్టాటిస్టికల్ ఎబిలిటీ విషయంలో షార్ట్ నోట్స్ ఎంతో మేలు చేస్తుంది. పరీక్ష హాల్లో టెన్షన్ లేకుండా పరీక్ష హాల్లో అడుగుపెట్టిన అభ్యర్థులు.. ఎలాంటి ఒత్తిడి లేకుండా.. ప్రశాంతంగా వ్యవహరించాలి. ప్రశ్న పత్రంలో పేర్కొన్న నిబంధనలు పూర్తిగా చదివి సమాధానాలు ఇచ్చేందుకు ఉపక్రమించాలి. తొలుత సులువుగా భావించే ప్రశ్నలకు, ఆ తర్వాత ఓ మోస్తరు క్లిష్టత ఉన్న ప్రశ్నలకు, చివరగా అత్యంత క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం గుర్తించే ప్రయత్నం చేయాలి. మెరుగైన ర్యాంకుతోనే బెస్ట్ ఇన్స్టిట్యూట్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలు, సీట్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే.. అర్హత సాధించిన అభ్యర్థులకు సీటు దక్కడం పెద్ద కష్టమేమీ కాదు. కాని యూనివర్సిటీ కాలేజీలు, క్యాంపస్ కళాశాలలు, టాప్–10, టాప్–20, టాప్–50 ఇన్స్టిట్యూట్లలో బెస్ట్ ర్యాంకుతోనే ప్రవేశం లభించే అవకాశం ఉంది. ఏపీ ఐసెట్ 2021 సమాచారం ► అర్హత: కనీసం 50శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులు కనీసం 45శాతం మార్కులు సాధించాలి. ఎంసీఏలో చేరాలనుకునే అభ్యర్థులు ఇంటర్మీడియెట్/డిగ్రీ స్థాయిలో మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్‌గా చదివి ఉండాలి. అర్హత కోర్సు చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ► రూ.అయిదు వేల ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 13. ► హాల్ టికెట్ డౌన్లోడ్ సదుపాయం: సెప్టెంబర్ 13 నుంచి ► ఏపీ ఐసెట్ పరీక్ష తేదీ: సెప్టెంబర్ 17, 18 (ప్రతి రోజు ఉదయం 9 నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు) ► ఫలితాల వెల్లడి: సెప్టెంబర్ 30, 2021 ► వివరాలకు వెబ్సైట్: https://sche.ap.gov.in/icet/ICET/ICET_HomePage.aspx -
సాక్షి ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ‘ఎంసెట్’ మాక్ టెస్టులు, రిజిస్ట్రేషన్ చేసుకోండిలా..
సాక్షి, ఎడ్యుకేషన్: ఇంటర్ తర్వాత.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది విద్యార్థుల లక్ష్యం ‘ఇంజనీరింగ్’..! ఇందు కోసం ప్రతి ఏడాది లక్షలాది మంది విద్యార్థులు ‘ఎంసెట్’ పరీక్ష కోసం ప్రిపేరవుతుంటారు. కోవిడ్ కారణంగా వాయిదా పడిన ఈ ప్రవేశ పరీక్షను త్వరలోనే నిర్వహించనున్నారు. ఒక వైపు కరోనా ప్రభావం..మరో వైపు భవిష్యత్‌కు దారి చూపే ప్రవేశ పరీక్ష! ఇలాంటి కష్ట సమయంలో తెలుగు విద్యార్థులకు అండగా నిలిచేందుకు సాక్షి ఎడ్యుకేషన్.కామ్ ముందుకు వచ్చింది. ఇంటి నుంచే ఆన్లైన్ మాక్ ఎంసెట్ పరీక్ష రాసి..తమ ప్రతిభను సమీక్షించుకొని..ప్రిపరేషన్‌ను మెరుగుపరచుకునేందుకు ఇదో చక్కని సదావకాశం. ఈ మాక్ టెస్టులను ప్రముఖ sakshieducation.com, Xplore సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోండి. https://special.sakshi.com/online-classes/eapcet-registration లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత...లాగిన్ ID, Password ను ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీకి పంపిస్తారు. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థి మూడు ఆన్లైన్ టెస్టులకు హాజరుకావచ్చు. ఈ పరీక్షల ఫలితాలను ఆగస్టు 17వ తేదీన విడుదల చేస్తారు. అలాగే www.sakshieducation.com లో మార్కులను తెలుసుకోవడంతో పాటు ర్యాంక్ కార్డ్‌ను పొందవచ్చు. -
విద్యార్థుల కోసం సాక్షి మాక్ టెస్టులు
హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో అడ్మిషన్ పొందేలా చేయూతనిచ్చేందుకు ‘సాక్షి’ముందుకు వచ్చింది. నిపుణుల ఆధ్వర్యంలో జేఈఈ మెయిన్, ఎంసెట్, నీట్ పరీక్షలకు మాక్ టెస్టులు నిర్వహించనుంది. పరీక్షకు కొద్ది రోజుల ముందుగా వాస్తవ పరీక్షలాంటి వాతావరణంలో మాక్ టెస్టులు రాయడం ద్వారా విద్యార్థులు ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకోవచ్చు. ప్రిపరేషన్‌ను మరింత మెరుగు పరుచుకోవచ్చు. అంతేకాకుండా సాక్షి మాక్ టెస్టుల్లో ఉత్తమ ప్రతిభను చూపడం ద్వారా టాప్ టెన్ ర్యాంకర్లు ఆకర్షణీయ బహుమతులు గెలుచుకోవచ్చు. ► సాక్షి మాక్ జేఈఈ మెయిన్ పరీక్ష 25–3–2018 (ఆదివారం)న ఆఫ్‌లైన్‌లో ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరుగుతుంది. రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ 15–3–2018 ► సాక్షి మాక్ ఎంసెట్ (ఇంజనీరింగ్) పరీక్ష 15–4–2018 (ఆదివారం)న ఆన్లైన్లో జరుగుతుంది. మొదటి సెషన్ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు; రెండో సెషన్ మధ్యాహ్నం 2:00 గంటల నుంచి 5:00 గంటల వరకు జరుగుతుంది. రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ 5–4–2018 ► సాక్షి మాక్ నీట్ పరీక్ష 22–4–2018 (ఆదివారం)న ఆఫ్‌లైన్‌లో ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరుగుతుంది. రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ 15–4–2018 ► ఒక్కో పరీక్షకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.150. అభ్యర్థులు www.sakshieducation.com ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు పరీక్షకు పది రోజుల ముందు తమ హాల్‌టికెట్‌ను www. sakshieducation.com ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వివరాలకు సంప్రదించాల్సిన నంబర్లు: చిత్తూరు, కర్నూలు, కడప: 9666697219 అనంతపురం, నెల్లూరు: 9505139111 విజయవాడ, వరంగల్, గుంటూరు: 9666372301 తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి: 9948977455 వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం: 9666283534 తెలంగాణ: 9505514424 గ్రేటర్ హైదరాబాద్: 9666421880, 9505981114, 9505834448 -
మాక్ టెస్ట్‌లు...మేలెంతో!!
ప్రతి పరీక్షకి పోటీ తీవ్రం.. వందల్లో పోస్టులు, సీట్లుంటే... లక్షల్లోనే దరఖాస్తులు! సివిల్స్, గ్రూప్స్, బ్యాంక్స్.. వంటి ఉద్యోగ పరీక్షలైనా.. గేట్, జేఈఈ, ఎంసెట్ తదితరప్రవేశ పరీక్షలకైనా.. టోఫెల్, జీఆర్ఈ, జీమ్యాట్ మొదలైన స్టడీ అబ్రాడ్ స్టాండర్ట్ టెస్టులైనా.. మాక్ టెస్టులతో మెనీ బెనిఫిట్స్ అంటున్నారు నిపుణులు!! పోటీలో మేటిగా నిలుపుతూ అభ్యర్థుల విజయంలో కీలకంగా మారుతున్న మాక్ టెస్టులపై టాప్ స్టోరీ.. నాటి నమూనా పరీక్షలే నేటి మాక్ టెస్ట్‌లు మాక్ టెస్ట్‌లు.. అంటే అర్థం.. నమూనా పరీక్షలు. వాస్తవానికి ఇవి విద్యార్థులకు ఎప్పటి నుంచో సుపరిచితం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్‌కు కార్పొరేట్ కళాశాలల్లో శిక్షణ మొదలైనప్పటి నుంచే మాక్‌టెస్టులు కొనసాగుతున్నాయి. అయితే ఇవి కేవలం ఆయా కళాశాలల విద్యార్థులకే పరిమితం. ఇతర విద్యార్థులకు మాత్రం మాక్ టెస్ట్‌లు/నమూనా పరీక్షల గురించి పెద్దగా అవగాహన ఉండేదికాదు. ఇటీవల కాలంలో మాక్ టెస్ట్‌లు అన్ని వర్గాల విద్యార్థులకు అందుబాటులోకి వస్తున్నాయి. విజయపథంలో నడిపించేందుకు సాధనంగా నిలుస్తున్నాయి. అన్నిటికీ మాక్ పోటీ పరీక్షల విజయంలో కీలకంగా నిలుస్తున్న మాక్‌టెస్ట్‌లు అన్ని రకాల పోటీ పరీక్షలకు అందుబాటులోకి వస్తున్నాయి. స్టడీ అబ్రాడ్ ఔత్సాహికులు హాజరయ్యే టోఫెల్, జీఆర్ఈ, జీమ్యాట్ తదితర స్టాండర్డ్ టెస్ట్‌లు.. జాతీయ స్థాయిలో నిర్వహించే క్యాట్, గేట్ వంటి ఉన్నత విద్య ప్రవేశ పరీక్షలు.. రాష్ట్రాల స్థాయిలో జరిగే ఎంసెట్, ఐసెట్ వంటి ఎంట్రన్స్‌ల వరకు.. మాక్‌టెస్ట్‌లు విస్తరించాయి. ఉద్యోగార్థుల కోణంలో జాతీయ స్థాయిలో నిర్వహించే సివిల్ సర్వీసెస్ నుంచి బ్యాంక్స్, ఎస్ఎస్సీ సీజీఎల్.. రాష్ట్రాల స్థాయిలో జరిగే గ్రూప్స్ పరీక్షల వరకూ.. అన్నిటా ఇప్పుడు మాక్టెస్టుల హవా నడుస్తోంది. ఆన్లైన్ / ఆఫ్‌లైన్ మాక్ టెస్ట్‌లు ఆన్లైన్, ఆఫ్‌లైన్‌ల్లోనూ ఉన్నాయి. ఆన్లైన్లో మాక్ టెస్ట్‌లను ఆన్లైన్ ట్యుటోరియల్ సంస్థలు, ఆన్లైన్ కోచింగ్ పోర్టల్స్ అందిస్తున్నాయి. ఆయా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు వీటికి హాజరుకావచ్చు. మాక్ టెస్ట్‌లు అందించే విషయంలో ఆన్‌లైన్‌దే పైచేయి. కొన్ని ఆన్లైన్ ట్యుటోరియల్ సంస్థలు ఉచితంగా కూడా మాక్ టెస్ట్‌లు అందుబాటులోకి తెస్తున్నాయి. ఆఫ్‌లైన్ మాక్ టెస్ట్‌లు ఆయా శిక్షణ సంస్థల విద్యార్థులకే పరిమితం. పరీక్ష శైలిపై అవగాహన నిర్దిష్ట పరీక్షకు నిర్వహించే మాక్ టెస్ట్ అసలు పరీక్ష తరహాలోనే ఉంటుంది. దీంతో మాక్‌టెస్ట్‌కు హాజరవడం ద్వారా సదరు పరీక్ష శైలిపై అవగాహన పెంచుకోవచ్చు. ప్రశ్నలు అడిగే తీరు, ఏ తరహా ప్రశ్నలు వస్తాయి? తదితర అంశాలపై స్పష్టత వస్తుంది. అంతేకాకుండా మాక్టెస్టుల ప్రశ్నపత్రాలను సబ్జెక్టు నిపుణులతో రూపొందించడం వల్ల వాస్తవ పరీక్షకు హాజరైన అనుభవం అభ్యర్థికి కలుగుతుంది. సబ్జెక్ట్ వైజ్.. చాప్టర్ వైజ్ మాక్ టెస్ట్‌లలో సబ్జెక్ట్ వారీగా, చాప్టర్ వారీగా అందుబాటులో ఉంటున్నాయి. ఒక పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ ప్రిపరేషన్ పరంగా నిర్దిష్ట చాప్టర్‌ను పూర్తి చేసుకోగానే ఆ చాప్టర్లో తమ నైపుణ్యాన్ని పరీక్షించుకునే విధంగా మాక్ టెస్ట్‌లకు హాజరు కావచ్చు. అదేవిధంగా పరీక్ష ప్యాట్రన్‌ను అనుసరించి ఆ పరీక్షలో ఉండే విభాగాల్లో తమకు నచ్చిన విభాగంలోనూ మాక్ టెస్ట్‌కు హాజరు కావచ్చు. ఫీడ్ బ్యాక్ మాక్ టెస్ట్‌లతో మరో ప్రయోజనం.. తక్షణ ఫీడ్‌బ్యాక్. అంటే.. ఒక మాక్ టెస్ట్‌ను పూర్తి చేసుకున్న వెంటనే మార్కులు తెలుసుకోవచ్చు. అభ్యర్థుల సమాధానాలు ఆధారంగా..ఇంకా పట్టు సాధించాల్సిన అంశాల గురించి కూడా సలహాలు తీసుకోవచ్చు. ఫలితంగా ప్రిపరేషన్ పరంగా మెరుగుపరచుకోవాల్సిన అంశాలపై అవగాహన ఏర్పడుతుంది. నిర్దిష్ట టెస్ట్‌లో సెక్షన్ వారీగా లేదా చాప్టర్ వారీగా అంతకుముందు టెస్ట్‌లో పొందిన స్కోర్‌ను చూసుకునే అవకాశం కూడా లభిస్తోంది. దీనివల్ల గతంలో తాము బలహీనంగా ఉన్న అంశాల్లో ప్రస్తుతం పెంచుకున్న అవగాహన స్థాయి గురించి తెలుసుకోవచ్చు. ఒత్తిడికి దూరంగా మాక్ టెస్ట్‌లలో ముఖ్యమైన ప్రయోజనం పరీక్ష రోజు ఒత్తిడి నుంచి ఉపశమనం లభించడం. ఎందుకంటే.. మాక్‌టెస్టులు వాస్తవ పరీక్షను పోలి ఉంటాయి. ఫలితంగా పరీక్ష రోజు లభించే సమయం మేరకు ముందుగానే సన్నద్ధం కావచ్చు. అంతేకాకుండా పరీక్ష సమయంలో అనుసరించాల్సిన విధానంపైనా అవగాహన ఏర్పడుతుంది. పరీక్ష శైలిపై అవగాహన నుంచి ఎగ్జామ్ డే స్ట్రాటజీ వరకు మాక్ టెస్ట్‌లతో ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చు. మాక్ టెస్ట్స్ ప్రయోజనాలివే ఎగ్జామ్ ప్యాట్రన్‌పై అవగాహన టైం మేనేజ్మెంట్ సబ్జెక్ట్‌లలో నైపుణ్యం స్థాయిపై అవగాహన నిపుణుల సలహాలు సమాధానాలివ్వాల్సిన తీరుపై అవగాహన వీలైన సమయంలో హాజరయ్యే అవకాశం తక్షణ ఫలితం, ఫీడ్ బ్యాక్‌తో ప్రిపరేషన్‌ను మెరుగుపరచుకునే అవకాశం నిరంతరం ప్రోగ్రెస్‌ను సమీక్షించుకోవచ్చు. ఎగ్జామ్ డే ఒత్తిడి నుంచి ఉపశమనం మాక్ టెస్ట్స్లు.. జాగ్రత్తలు మాక్ టెస్ట్‌ల విషయంలో విద్యార్థులు జాగ్రత్తలు వహించాల్సిన అవసరముంది. విద్యార్థులు ఆన్లైన్ మాక్‌టెస్ట్‌లకు హాజరయ్యే ముందు సదరు వెబ్‌పోర్టల్‌కు ఉన్న ప్రాముఖ్యత, ఆదరణ.. సబ్జెక్ట్ నిపుణుల వివరాలు అందుబాటులో ఉంచుతోందా? లేదా?.. ప్రశ్నపత్రాలు, అడుగుతున్న ప్రశ్నల్లో మార్పు ఉంటోందా?.. ఫీడ్‌బ్యాక్ అందిస్తుందా? తదితర విషయాలు తెలుసుకున్న తర్వాతే సదరు ఆన్లైన్ మాక్‌టెస్ట్ ప్రొవైడింగ్ వెబ్సైట్లో పేరు నమోదు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫలితాల్లో 25 నుంచి 30 శాతం ప్రభావం మాక్ టెస్ట్‌లకు హాజరు కావడం ప్రిపరేషన్లో భాగంగా, విజయ వ్యూహంగా భావించాలి. జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీ పరీక్షలు, ముఖ్యంగా ఆన్లైన్ విధానంలో నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్‌లలో రాణించేందుకు మాక్ టెస్ట్‌లు ఎంతో మేలు చేస్తాయి. సబ్జెక్ట్ వారీగా, సెక్షన్ వారీగా మాక్ టెస్ట్‌లు అందుబాటులోకి వచ్చినప్పటికీ.. గ్రాండ్ మాక్ టెస్ట్‌లు రాయడం ఎంతో అవసరం. జాతీయ స్థాయి పరీక్షలకు కనీసం ఆరు నుంచి ఎనిమిది మాక్ టెస్ట్‌లు par రాయాలి.ఙ- రామ్‌నాథ్ ఎస్.కనకదండి, డెరైక్టర్, క్యాట్ కోచింగ్, టైమ్ ఇన్స్టిట్యూట్ ఎంఎన్సీ ఇంటర్వ్యూల్లో రాణించొచ్చు.. ఇటీవల కాలంలో మాక్ ఇంటర్వ్యూస్ కూడా అందిస్తున్న సంస్థలు ఆవిర్భవిస్తున్నాయి. వీటివల్ల ఆయా ఉద్యోగాలకు ముఖ్యంగా ఎంఎన్సీ ఔత్సాహికులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంటర్వ్యూలో అనుసరించాల్సిన పర్సనాలిటీ స్కిల్స్, బాడీలాంగ్వేజ్ వంటి బిహేవియరల్ స్కిల్స్‌తోపాటు సబ్జెక్ట్ నైపుణ్యాల ఫీడ్‌బ్యాక్ కూడా ఈ మాక్ ఇంటర్వ్యూ ద్వారా లభిస్తుంది. అయితే అభ్యర్థులు మాక్ ఇంటర్వ్యూస్‌ను నిర్వహించే సంస్థలకున్న ప్రాముఖ్యత ఆధారంగా వాటిని ఎంపిక par చేసుకోవాలి.ఙ- ఎం.మదన్మోహన్ రెడ్డి, డెరైక్టర్, టెస్ట్ మై ఇంటర్వ్యూ డాట్ కామ్