హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో అడ్మిషన్ పొందేలా చేయూతనిచ్చేందుకు ‘సాక్షి’ముందుకు వచ్చింది. నిపుణుల ఆధ్వర్యంలో జేఈఈ మెయిన్, ఎంసెట్, నీట్ పరీక్షలకు మాక్ టెస్టులు నిర్వహించనుంది. పరీక్షకు కొద్ది రోజుల ముందుగా వాస్తవ పరీక్షలాంటి వాతావరణంలో మాక్ టెస్టులు రాయడం ద్వారా విద్యార్థులు ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకోవచ్చు. ప్రిపరేషన్‌ను మరింత మెరుగు పరుచుకోవచ్చు. అంతేకాకుండా సాక్షి మాక్ టెస్టుల్లో ఉత్తమ ప్రతిభను చూపడం ద్వారా టాప్ టెన్ ర్యాంకర్లు ఆకర్షణీయ బహుమతులు గెలుచుకోవచ్చు.
► సాక్షి మాక్ జేఈఈ మెయిన్ పరీక్ష 25–3–2018 (ఆదివారం)న ఆఫ్‌లైన్‌లో ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరుగుతుంది. రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ 15–3–2018
► సాక్షి మాక్ ఎంసెట్ (ఇంజనీరింగ్) పరీక్ష 15–4–2018 (ఆదివారం)న ఆన్‌లైన్‌లో జరుగుతుంది. మొదటి సెషన్ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు; రెండో సెషన్ మధ్యాహ్నం 2:00 గంటల నుంచి 5:00 గంటల వరకు జరుగుతుంది. రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ 5–4–2018
► సాక్షి మాక్ నీట్ పరీక్ష 22–4–2018 (ఆదివారం)న ఆఫ్‌లైన్‌లో ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరుగుతుంది. రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ 15–4–2018
► ఒక్కో పరీక్షకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.150. అభ్యర్థులు www.sakshieducation.com ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు పరీక్షకు పది రోజుల ముందు తమ హాల్‌టికెట్‌ను www. sakshieducation.com ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
వివరాలకు సంప్రదించాల్సిన నంబర్లు:
చిత్తూరు, కర్నూలు, కడప: 9666697219
అనంతపురం, నెల్లూరు: 9505139111
విజయవాడ, వరంగల్, గుంటూరు: 9666372301
తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి: 9948977455
వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం: 9666283534
తెలంగాణ: 9505514424
గ్రేటర్ హైదరాబాద్: 9666421880, 9505981114, 9505834448
Comments
Please login to add a commentAdd a comment