మాక్ టెస్ట్‌లు...మేలెంతో!! | mock tests Applications | Sakshi
Sakshi News home page

మాక్ టెస్ట్‌లు...మేలెంతో!!

Published Wed, May 11 2016 11:15 PM | Last Updated on Sun, Sep 3 2017 11:53 PM

మాక్ టెస్ట్‌లు...మేలెంతో!!

మాక్ టెస్ట్‌లు...మేలెంతో!!

ప్రతి పరీక్షకి పోటీ తీవ్రం..
వందల్లో పోస్టులు, సీట్లుంటే... లక్షల్లోనే దరఖాస్తులు!
సివిల్స్, గ్రూప్స్, బ్యాంక్స్.. వంటి ఉద్యోగ పరీక్షలైనా..
గేట్, జేఈఈ, ఎంసెట్  తదితరప్రవేశ పరీక్షలకైనా..
టోఫెల్, జీఆర్‌ఈ, జీమ్యాట్ మొదలైన స్టడీ అబ్రాడ్ స్టాండర్ట్ టెస్టులైనా..
మాక్ టెస్టులతో మెనీ బెనిఫిట్స్ అంటున్నారు నిపుణులు!!


పోటీలో మేటిగా నిలుపుతూ అభ్యర్థుల విజయంలో కీలకంగా  మారుతున్న మాక్ టెస్టులపై టాప్ స్టోరీ..

నాటి నమూనా పరీక్షలే నేటి మాక్ టెస్ట్‌లు
మాక్ టెస్ట్‌లు.. అంటే అర్థం.. నమూనా పరీక్షలు. వాస్తవానికి ఇవి విద్యార్థులకు ఎప్పటి నుంచో సుపరిచితం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్‌కు కార్పొరేట్ కళాశాలల్లో శిక్షణ మొదలైనప్పటి నుంచే మాక్‌టెస్టులు కొనసాగుతున్నాయి. అయితే ఇవి కేవలం ఆయా కళాశాలల విద్యార్థులకే పరిమితం. ఇతర విద్యార్థులకు మాత్రం మాక్ టెస్ట్‌లు/నమూనా పరీక్షల గురించి  పెద్దగా అవగాహన ఉండేదికాదు. ఇటీవల కాలంలో మాక్ టెస్ట్‌లు అన్ని వర్గాల విద్యార్థులకు అందుబాటులోకి వస్తున్నాయి. విజయపథంలో నడిపించేందుకు సాధనంగా నిలుస్తున్నాయి.

అన్నిటికీ మాక్
పోటీ పరీక్షల విజయంలో కీలకంగా నిలుస్తున్న మాక్‌టెస్ట్‌లు అన్ని రకాల పోటీ పరీక్షలకు అందుబాటులోకి వస్తున్నాయి. స్టడీ అబ్రాడ్ ఔత్సాహికులు హాజరయ్యే టోఫెల్, జీఆర్‌ఈ, జీమ్యాట్ తదితర స్టాండర్డ్ టెస్ట్‌లు.. జాతీయ స్థాయిలో నిర్వహించే క్యాట్, గేట్ వంటి ఉన్నత విద్య ప్రవేశ పరీక్షలు.. రాష్ట్రాల స్థాయిలో జరిగే ఎంసెట్, ఐసెట్ వంటి ఎంట్రన్స్‌ల వరకు.. మాక్‌టెస్ట్‌లు విస్తరించాయి. ఉద్యోగార్థుల కోణంలో జాతీయ స్థాయిలో నిర్వహించే సివిల్ సర్వీసెస్ నుంచి బ్యాంక్స్, ఎస్‌ఎస్‌సీ సీజీఎల్.. రాష్ట్రాల స్థాయిలో జరిగే గ్రూప్స్ పరీక్షల వరకూ.. అన్నిటా ఇప్పుడు మాక్‌టెస్టుల హవా నడుస్తోంది.

ఆన్‌లైన్ / ఆఫ్‌లైన్
మాక్ టెస్ట్‌లు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ల్లోనూ ఉన్నాయి. ఆన్‌లైన్‌లో మాక్ టెస్ట్‌లను ఆన్‌లైన్ ట్యుటోరియల్ సంస్థలు, ఆన్‌లైన్ కోచింగ్ పోర్టల్స్ అందిస్తున్నాయి. ఆయా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు వీటికి హాజరుకావచ్చు. మాక్ టెస్ట్‌లు అందించే విషయంలో ఆన్‌లైన్‌దే పైచేయి. కొన్ని ఆన్‌లైన్ ట్యుటోరియల్ సంస్థలు ఉచితంగా కూడా మాక్ టెస్ట్‌లు అందుబాటులోకి తెస్తున్నాయి. ఆఫ్‌లైన్ మాక్ టెస్ట్‌లు ఆయా శిక్షణ సంస్థల విద్యార్థులకే పరిమితం.

పరీక్ష శైలిపై అవగాహన
నిర్దిష్ట పరీక్షకు నిర్వహించే మాక్ టెస్ట్ అసలు పరీక్ష తరహాలోనే ఉంటుంది. దీంతో మాక్‌టెస్ట్‌కు హాజరవడం ద్వారా సదరు పరీక్ష శైలిపై అవగాహన పెంచుకోవచ్చు. ప్రశ్నలు అడిగే తీరు, ఏ తరహా ప్రశ్నలు వస్తాయి? తదితర అంశాలపై స్పష్టత వస్తుంది. అంతేకాకుండా మాక్‌టెస్టుల ప్రశ్నపత్రాలను సబ్జెక్టు నిపుణులతో రూపొందించడం వల్ల వాస్తవ పరీక్షకు హాజరైన అనుభవం అభ్యర్థికి కలుగుతుంది.

సబ్జెక్ట్ వైజ్.. చాప్టర్ వైజ్
మాక్ టెస్ట్‌లలో సబ్జెక్ట్ వారీగా, చాప్టర్ వారీగా అందుబాటులో ఉంటున్నాయి. ఒక పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ ప్రిపరేషన్ పరంగా నిర్దిష్ట చాప్టర్‌ను పూర్తి చేసుకోగానే ఆ చాప్టర్‌లో తమ నైపుణ్యాన్ని పరీక్షించుకునే విధంగా మాక్ టెస్ట్‌లకు హాజరు కావచ్చు. అదేవిధంగా పరీక్ష ప్యాట్రన్‌ను అనుసరించి ఆ పరీక్షలో ఉండే విభాగాల్లో తమకు నచ్చిన విభాగంలోనూ మాక్ టెస్ట్‌కు హాజరు కావచ్చు.

 ఫీడ్ బ్యాక్
మాక్ టెస్ట్‌లతో మరో ప్రయోజనం.. తక్షణ ఫీడ్‌బ్యాక్. అంటే.. ఒక మాక్ టెస్ట్‌ను పూర్తి చేసుకున్న వెంటనే మార్కులు తెలుసుకోవచ్చు. అభ్యర్థుల సమాధానాలు ఆధారంగా..ఇంకా పట్టు సాధించాల్సిన అంశాల గురించి కూడా సలహాలు తీసుకోవచ్చు. ఫలితంగా ప్రిపరేషన్ పరంగా మెరుగుపరచుకోవాల్సిన అంశాలపై అవగాహన ఏర్పడుతుంది. నిర్దిష్ట టెస్ట్‌లో సెక్షన్ వారీగా లేదా చాప్టర్ వారీగా అంతకుముందు టెస్ట్‌లో పొందిన స్కోర్‌ను చూసుకునే అవకాశం కూడా లభిస్తోంది. దీనివల్ల గతంలో తాము బలహీనంగా ఉన్న అంశాల్లో ప్రస్తుతం పెంచుకున్న అవగాహన స్థాయి గురించి తెలుసుకోవచ్చు.

ఒత్తిడికి దూరంగా
మాక్ టెస్ట్‌లలో ముఖ్యమైన ప్రయోజనం పరీక్ష రోజు ఒత్తిడి నుంచి ఉపశమనం లభించడం. ఎందుకంటే.. మాక్‌టెస్టులు వాస్తవ పరీక్షను పోలి ఉంటాయి. ఫలితంగా పరీక్ష రోజు లభించే సమయం మేరకు ముందుగానే సన్నద్ధం కావచ్చు. అంతేకాకుండా పరీక్ష సమయంలో అనుసరించాల్సిన విధానంపైనా అవగాహన ఏర్పడుతుంది. పరీక్ష శైలిపై అవగాహన నుంచి ఎగ్జామ్ డే స్ట్రాటజీ వరకు మాక్ టెస్ట్‌లతో ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చు.

మాక్ టెస్ట్స్ ప్రయోజనాలివే
ఎగ్జామ్ ప్యాట్రన్‌పై అవగాహన
టైం మేనేజ్‌మెంట్
సబ్జెక్ట్‌లలో నైపుణ్యం స్థాయిపై అవగాహన
నిపుణుల సలహాలు
సమాధానాలివ్వాల్సిన తీరుపై అవగాహన
వీలైన సమయంలో హాజరయ్యే అవకాశం
తక్షణ ఫలితం, ఫీడ్ బ్యాక్‌తో ప్రిపరేషన్‌ను
మెరుగుపరచుకునే అవకాశం
నిరంతరం ప్రోగ్రెస్‌ను సమీక్షించుకోవచ్చు.
ఎగ్జామ్ డే ఒత్తిడి నుంచి ఉపశమనం

మాక్ టెస్ట్స్‌లు.. జాగ్రత్తలు
మాక్ టెస్ట్‌ల విషయంలో విద్యార్థులు జాగ్రత్తలు వహించాల్సిన అవసరముంది. విద్యార్థులు ఆన్‌లైన్ మాక్‌టెస్ట్‌లకు హాజరయ్యే ముందు సదరు వెబ్‌పోర్టల్‌కు ఉన్న ప్రాముఖ్యత, ఆదరణ.. సబ్జెక్ట్ నిపుణుల వివరాలు అందుబాటులో ఉంచుతోందా? లేదా?..  ప్రశ్నపత్రాలు, అడుగుతున్న ప్రశ్నల్లో మార్పు ఉంటోందా?..  ఫీడ్‌బ్యాక్ అందిస్తుందా? తదితర విషయాలు తెలుసుకున్న తర్వాతే సదరు ఆన్‌లైన్ మాక్‌టెస్ట్ ప్రొవైడింగ్ వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఫలితాల్లో 25 నుంచి 30 శాతం ప్రభావం
మాక్ టెస్ట్‌లకు హాజరు కావడం ప్రిపరేషన్‌లో భాగంగా, విజయ వ్యూహంగా భావించాలి. జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీ పరీక్షలు, ముఖ్యంగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్‌లలో రాణించేందుకు మాక్ టెస్ట్‌లు ఎంతో మేలు చేస్తాయి. సబ్జెక్ట్ వారీగా, సెక్షన్ వారీగా మాక్ టెస్ట్‌లు అందుబాటులోకి వచ్చినప్పటికీ.. గ్రాండ్ మాక్ టెస్ట్‌లు రాయడం ఎంతో అవసరం. జాతీయ స్థాయి పరీక్షలకు కనీసం ఆరు నుంచి ఎనిమిది మాక్ టెస్ట్‌లు par రాయాలి.ఙ- రామ్‌నాథ్ ఎస్.కనకదండి,
డెరైక్టర్, క్యాట్ కోచింగ్, టైమ్ ఇన్‌స్టిట్యూట్

ఎంఎన్‌సీ ఇంటర్వ్యూల్లో రాణించొచ్చు..
ఇటీవల కాలంలో మాక్ ఇంటర్వ్యూస్ కూడా అందిస్తున్న సంస్థలు ఆవిర్భవిస్తున్నాయి. వీటివల్ల ఆయా ఉద్యోగాలకు ముఖ్యంగా ఎంఎన్‌సీ ఔత్సాహికులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంటర్వ్యూలో అనుసరించాల్సిన పర్సనాలిటీ స్కిల్స్, బాడీలాంగ్వేజ్ వంటి బిహేవియరల్ స్కిల్స్‌తోపాటు సబ్జెక్ట్ నైపుణ్యాల ఫీడ్‌బ్యాక్ కూడా ఈ మాక్ ఇంటర్వ్యూ ద్వారా లభిస్తుంది. అయితే అభ్యర్థులు మాక్ ఇంటర్వ్యూస్‌ను నిర్వహించే సంస్థలకున్న ప్రాముఖ్యత ఆధారంగా వాటిని ఎంపిక par చేసుకోవాలి.ఙ- ఎం.మదన్‌మోహన్ రెడ్డి,
డెరైక్టర్, టెస్ట్ మై ఇంటర్వ్యూ డాట్ కామ్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement