పోటీ పరీక్షల ప్రిపరేషన్‌లో సందేహాల అడ్డంకుల్ని తొలగించుకోండి..
ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ముందుకు కదిలి.. లక్షలాది మంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంత యువత పోటీ పరీక్షల్లో గెలుపు కోసం శ్రమిస్తోంది. సర్కారీ కొలువుల మేళాలో సక్సెస్ కోసం పరితపిస్తోంది. ఈ క్రమంలో చేస్తున్న ప్రిపరేషన్ ప్రయాణంలో అనేక సందేహాలు అడ్డుతగులుతుంటాయి.. వీటిని తొలగించి, ముందుకుసాగేలా చేయూతనిచ్చేందుకు మీ ‘భవిత’ సిద్ధంగా ఉంది. సివిల్స్, బ్యాంకు పరీక్షలతో పాటు త్వరలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్న పరీక్షలకు సంబంధించి గ్రూప్-1, గ్రూప్-2, కానిస్టేబుల్, ఎస్‌ఐ, డీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, రైల్వే, రక్షణ తదితర అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్న నిపుణుల వివరాలు..
సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్
బీఏ, బీఎస్సీ, బీటెక్.. ఇలా ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో జాతీయ స్థాయిలో ఉన్నత హోదాలకు నెలవైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి 23 సర్వీసుల్లో అడుగుపెట్టేందుకు వీలుకల్పిస్తుంది సివిల్ సర్వీసెస్ పరీక్ష. దీన్ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి వయోపరిమితిని, ప్రయత్నాల సంఖ్యను పెంచడం శుభపరిణామం. ఈ పరీక్షకు పోటీ తీవ్రంగా ఉంటుంది. సివిల్స్-2014 ప్రిలిమ్స్‌కు 4,52,334 మంది హాజరయ్యారు. సివిల్స్ పరీక్ష మూడు దశలుగా ఉంటుంది. అవి.. 1. ప్రిలిమ్స్ 2. మెయిన్స్ 3. పర్సనాలిటీ టెస్ట్ (మౌఖిక పరీక్ష). ఇప్పటికే ప్రిలిమ్స్‌ను పూర్తిచేసుకొని, మెయిన్స్‌కు సిద్ధమవుతున్నవారు లేదంటే సివిల్స్-2015కు దీర్ఘకాలిక ప్రిపరేషన్ ప్రారంభించిన వారు తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
గ్రూప్ 1, గ్రూప్ 2
రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రభుత్వ కొలువులకు నోటిఫికేషన్లు రాకపోవడంతో ఉద్యోగార్థులు నిరాశ చెందారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల చర్యలు ఇప్పుడు వారిలో కొత్త ఆశలను రేకెత్తిస్తున్నాయి. పలు శాఖల్లో ఖాళీల భర్తీకి పచ్చజెండా ఊపడమే ఇందుకు కారణం. గ్రూప్-1, గ్రూప్-2 తదితర పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం సుముఖంగా ఉంది. ఇందుకోసం ఇటీవలే తెలంగాణ ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను కూడా ఏర్పాటు చేసింది. డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఆర్‌టీవో, సీటీవో తదితర పోస్టుల భర్తీకి నిర్వహించే గ్రూప్-1 రాత పరీక్ష ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు దశలుగా ఉంటుంది. డిప్యూటీ తహశీల్దార్, ఏసీటీవో, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-3 తదితర మండల స్థాయి పోస్టుల భర్తీ కోసం నిర్వహించే గ్రూప్ 2లో మొత్తం మూడు పేపర్లుంటాయి. అవి.. పేపర్-1 జనరల్ స్టడీస్; పేపర్-2 హిస్టరీ అండ్ పాలిటీ; పేపర్-3 ఎకానమీ. పరీక్ష 450 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.
ఎస్‌ఐ/పోలీస్ కానిస్టేబుల్
అధికారిక చిహ్నం మొదలు.. విధులకు అవసరమైన వాహనాల వరకు అన్నింటికీ ఆధునిక సొబగులు అద్దిన తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనుంది. కానిస్టేబుల్, ఎస్‌ఐ పోస్టుల్లో విజయానికి అభ్యర్థులు ఫిజికల్ ఫిట్‌నెస్, సబ్జెక్ట్ నాలెడ్జ్ రెండింటిలోనూ సన్నద్ధత సాధించాలి. ఈ నియామకాల్లో అభ్యర్థుల సామర్థ్యాన్ని రెండు దశల్లో అంటే.. దేహ దారుఢ్యం, రాత పరీక్ష ద్వారా పరీక్షిస్తారు. ఇంటర్మీడియెట్ అర్హతగా నిర్వహించే కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి గతంలో బ్యాచిలర్ డిగ్రీ, బీటెక్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల ఉత్తీర్ణులు సైతం పోటీ పడ్డారు. దీన్నిబట్టి పోటీ తీవ్రతను అంచనా వేయొచ్చు. ఔత్సాహిక అభ్యర్థులు శారీరక సామర్థ్యం, రాత పరీక్షలకు సంబంధించి తమ సందేహాలను పంపొచ్చు.
నిపుణుల బృందం:
బ్యాంకు పరీక్షలు
ఆకర్షణీయ వేతనాలు; ప్రతిభ ఆధారంగా పదోన్నతులు, ప్రోత్సాహకాలు.. ఇవీ బ్యాంకు ఉద్యోగులకు అందే సౌకర్యాలు. ఇవే యువతను బ్యాంకు కొలువుల వైపు ఆకర్షితులను చేస్తున్నాయి. బ్యాంకు ఉద్యోగాలను చేజిక్కించుకోవాలనుకునే వారికి వచ్చే నాలుగైదేళ్లు స్వర్ణయుగమంటే అతిశయోక్తి కాదు. సేవల విస్తరణ, కొత్త బ్రాంచ్‌ల ఏర్పాటు, ప్రైవేటు బ్యాంకులకు లెసైన్సులు వంటివి దీనికి కారణం. ఐబీపీఎస్ క్లరికల్, ఐబీపీఎస్ పీవో, ఎస్‌బీఐ క్లరికల్, ఎస్‌బీఐ పీవో, ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకుల్లో పీవో.. ఇలా వివిధ నోటిఫికేషన్లు ఎప్పటికప్పుడు యువత ముంగిట వచ్చి వాలుతున్నాయి. కాస్త శ్రమిస్తే చాలు వీటిలో విజయం సాధించి, మంచి కొలువును సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం బ్యాంకు పరీక్షలకు సిద్ధమవుతున్న వారు విజయానికి కీలకమైన క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, డేటా ఇంటర్‌ప్రెటేషన్, రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్ ఇలా ఏ సబ్జెక్టుకు సంబంధించిన సందేహాలైనా పంపి, నివృత్తి చేసుకోవచ్చు.
నిపుణుల బృందం:
డీఎస్సీ
ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే డీఎస్సీ పరీక్షకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రయత్నిస్తోంది. ముందే ప్రకటించినట్లు సెప్టెంబర్ 5న నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్‌జీటీ పోస్టులకు బీఎడ్ అభ్యర్థులను అర్హులుగా చేసేందుకు ప్రయత్నిస్తుండటం వల్లే నోటిఫికేషన్ విడుదలలో జాప్యం జరుగుతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. అన్ని అడ్డంకులూ తొలగి త్వరలోనే నోటిఫికేషన్ రావొచ్చని ఉద్యోగార్థులు ఆశిస్తున్నారు. ఖాళీల భర్తీ జిల్లా యూనిట్‌గా నిర్వహించడం.. ఆయా సబ్జెక్ట్ టీచర్ పోస్ట్‌ల బ్రేక్-అప్ సంఖ్య తక్కువగా ఉండటంతో అభ్యర్థులు డీఎస్సీలో విజయానికి తీవ్రంగా కృషి చేయాల్సి ఉంటుంది. ఎస్‌జీటీ.. స్కూల్ అసిస్టెంట్.. డీఎస్సీలో నిర్వహించే రెండు పరీక్షలు. ఈ రెండింటికి సంబంధించి ఔత్సాహికులు తమ సందేహాలను పంపవచ్చు.
నిపుణుల బృందం: