సీఆర్‌పీఎఫ్‌లో కానిస్టేబుల్ కొలువులు | Constable jobs in CRPF | Sakshi
Sakshi News home page

సీఆర్‌పీఎఫ్‌లో కానిస్టేబుల్ కొలువులు

Published Thu, Dec 18 2014 1:12 AM | Last Updated on Tue, Mar 19 2019 5:56 PM

Constable jobs in CRPF

జాబ్ పాయింట్: కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్)లో టెక్నికల్, ట్రేడ్స్‌మెన్ విభాగాల్లో కానిస్టేబుల్ పోస్టులకు సీఆర్‌పీఎఫ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు 158 పోస్టులతో కలిపి కర్నాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్‌ల్లో మొత్తం 791 పోస్టులు భర్తీ చేస్తుంది.
     విభాగాలు: డ్రైవర్, ఫిట్టర్, బగ్లర్, టైలర్, కోబ్లర్, కార్పెంటర్, గార్డెనర్, పెయింటర్, బ్రాస్‌బ్యాండ్, కుక్, వాటర్ క్యారియర్, వాషర్‌మెన్, సఫాయికర్మచారి, బార్బర్.
     అర్హతలు: పదోతరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత. డ్రైవర్ పోస్టులకు ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ డ్రై వింగ్ లెసైన్స్ ఉండాలి. ఫిట్టర్ పోస్టులకు ఏడాది పని అనుభవం ఉండాలి.
     వయసు: డ్రైవర్ పోస్టులకు 21 నుంచి 27, ఇతర పోస్టులకు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. నిర్దేశ   శారీరక ప్రమాణాలుండాలి.
     ఎంపిక: మొత్తం నాలుగు ఫేజ్/స్టేజ్‌ల్లో పరీక్షించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కానిస్టేబుల్(డ్రైవర్, ఫిట్టర్) పోస్టులకు స్టేజ్-1 ఎంపిక ప్రక్రియ భిన్నంగా ఉంటుంది. ఇతర విధానం ఒకే విధంగా ఉంటుంది.
     మొదటి ఫేజ్(స్టేజ్-1): కానిస్టేబుల్(డ్రైవర్, ఫిట్టర్) పోస్టులకు 5 కిలోమీటర్ల పందెం నిర్వహిస్తారు. అలాగే ఫిజికల్ ఎఫీషియెన్సీ, ఫిజికల్ మెజర్‌మెంట్/ స్టాండర్స్ పరీక్షలు నిర్వహిస్తారు.
     రెండో ఫేజ్(స్టేజ్-2): స్టేజ్-1లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ దశలో రాత పరీక్ష నిర్వహిస్తారు. దానిలో రెండు పార్ట్‌ల్లో 100 మార్కులకు ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు అడుగుతారు. పార్ట్-1లో పదోతరగతి స్థాయిలో ప్రశ్నలుంటాయి. పార్ట్-2లో సంబంధిత ట్రేడ్ పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. రాత పరీక్షలో 35 శాతం మార్కులు సాధించిన వారిని అర్హులుగా ప్రకటిస్తారు. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ అభ్యర్థులకు 33శాతం.
     రాతపరీక్ష తేది: మార్చి 01, 2015.
     మూడో ఫేజ్(స్టేజ్-3): రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ దశలో ప్రాక్టికల్ అసెస్‌మెంట్ విధానంలో ట్రేడ్ టెస్ట్‌ను నిర్వహిస్తారు. 50 మార్కుల ప్రాక్టికల్ ట్రేడ్ టెస్ట్‌లో 20 మార్కులు సాధించాల్సి ఉంటుంది.
     నాలుగో ఫేజ్(స్టేజ్-4): దీనిలో అభ్యర్థులకు మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు.  ఐదో ఫేజ్‌లో అభ్యర్థుల మెరిట్ జాబితాను రాష్ట్ర, కేటగిరీ, విభాగాల వారీగా పేర్కొంటారు. ఆరో ఫేజ్‌లో తుది జాబితాను ప్రకటిస్తారు.
 దరఖాస్తు విధానం: నిర్దేశిత విధానంలో పూర్తిచేసిన దరఖాస్తును ‘ద డీ ఐజీపీ, గ్రూప్ సెంటర్, సీఆర్‌పీఎఫ్, కేశవగిరి, హైదరాబాద్ -500005కు పంపాలి.
 దరఖాస్తుకు చివరి తేది: డిసెంబర్ 20
 వెబ్‌సైట్: http://www.crpf.nic.in
 
 ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్-2015
 ఇండియన్ ఎయిర్‌ఫోర్స్(ఐఏఎఫ్) ఫ్లైయింగ్ బ్రాంచ్ లో షార్ట్‌సర్వీస్ కమిషన్, టెక్నికల్, గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్‌ల్లో శాశ్వత, షార్ట్‌సర్వీస్ కమిషన్ ఆఫీసర్ల నియామకానికి నిర్వహించే పరీక్షే.. ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్-2015. గ్రాడ్యుయేషన్ కనీస అర్హతతో ఈ పరీక్షకు హాజరై విజయం సాధిస్తే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో కొలువులకు మార్గం వేసుకోవచ్చు.
     ఫై ్లయింగ్ బ్రాంచ్(మేల్/ఫిమేల్)
 అర్హతలు: 60 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివి ఉండాలి. వయసు: 20-24 ఏళ్ల మధ్య ఉండాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలుండాలి.
 
 టెక్నికల్ బ్రాంచ్(మేల్/ఫిమేల్):
 అర్హతలు: ఏరోనాటికల్ (ఎలక్ట్రానిక్స్/ మెకానికల్) ఇంజనీరింగ్‌లో డిగ్రీ ఉండాలి. వయసు: 20-26 ఏళ్ల మధ్య ఉండాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలుండాలి.
 
 గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్(మేల్/ఫిమేల్):
 విభాగాలు: అడ్మినిస్ట్రేషన్ అండ్ లాజిస్టిక్స్, అకౌంట్స్, ఎడ్యుకేషన్. అర్హతలు: ఏదైనా డిగ్రీ/ బీకామ్/ ఎంకామ్/సీఏ/ ఐసీడబ్ల్యూ/ ఎంఎడ్/ పీహెచ్‌డీ ఉండాలి. వయసు: 20-28 ఏళ్ల మధ్య ఉండాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలుండాలి.
 దరఖాస్తు విధానం: అభ్యర్థులు http://www. careerairforce.nic.in/ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
 ఎంపిక: ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్, ఇంజనీరింగ్ నాలెడ్జ్ టెస్ట్(టెక్నికల్ బ్రాంచ్ అభ్యర్థులకు)లో అర్హత సాధించిన వారిని డెహ్రాడూన్, మైసూర్, గాంధీనగర్, వారణాసిల్లోని ఏదైనా ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డు పరీక్షిస్తుంది. మొదటి దశలో స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. రెండో దశలో సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టెస్ట్స్, ఇంటర్వ్యూను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఫ్లైయింగ్ బ్రాంచ్ అభ్యర్థులకు మూడో దశలో పైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్‌ను నిర్వహిస్తారు. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది.
 
 పరీక్ష విధానం:
 ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్‌లో ఆబ్జెక్టివ్ విధానంలో 100 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి మూడు మార్కులు. తప్పు సమాధానానికి ఒక నెగిటివ్ మార్కు ఉంటుంది. కాలవ్యవధి రెండు గంటలు. వెర్బల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, మిలిటరీ ఆప్టిట్యూడ్ విభాగాల్లోంచి ప్రశ్నలు ఇస్తారు. ఇంజనీరింగ్ నాలెడ్జ్ టెస్ట్ కాలవ్యవధి 45 నిమిషాలు. ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ పూర్తికాగానే ఫ్లయింగ్ బ్రాంచ్ అభ్యర్థులు ఈ పరీక్షను రాయాల్సి ఉంటుంది.
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: జనవరి 1, 2015
 కామన్ అడ్మిషన్ టెస్ట్: ఫిబ్రవరి 22, 2015
 వెబ్‌సైట్: http://indianairforce.nic.in/
 
 యూఐఐసీ ఏవో పరీక్షకు ప్రాక్టీస్ టెస్ట్స్
 హైదరాబాద్: యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి డిసెంబరు నెలాఖరులో రాత పరీక్షలు నిర్వహించనుంది. ఆన్‌లైన్‌లో నిర్వహించనున్న ఈ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. సమయం 120 నిమిషాలు. ఈ నేపథ్యంలో సాక్షి అన్ని ప్రశ్నలకు సాధనలు, వివరణలతో నిపుణులు రూపొందించిన ఆన్‌లైన్ ప్రాక్టీస్ మోడల్ టెస్టులను నిర్వహిస్తోంది. వీటితో పాటు సమగ్ర స్టడీ మెటీరియల్‌ను ఉచితంగా అందిస్తోంది.
 
 మోడల్ టెస్ట్స్ ప్రత్యేకతలు:
     అన్ని ప్రశ్నలకు సాధనలు, వివరణలు
     ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసుకునేందుకు వీలుగా 4 ప్రాక్టీస్ టెస్టులు
     అభ్యర్థికి రియల్ టైమ్ ఎగ్జామ్ ఎక్స్‌పీరియన్స్
     అభ్యర్థి ప్రదర్శనను తెలిపే     {V>íఫకల్ పెర్‌ఫార్మెన్స్ రిపోర్టులు
     పరీక్ష ముగిసిన వెంటనే గ్రేడులతో కూడిన ఫలితాలు
     సబ్జెక్టుల వారీ వీక్ అండ్ స్ట్రాంగ్ ఏరియా అనాలసిస్
 వెబ్‌సైట్: http://onlinetests.sakshieducation.com
 టి. మురళీధరన్
 టి.ఎం.ఐ. నెట్‌వర్క్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement