న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో మరణించిన సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్(సీఆర్‌పీఎఫ్) కానిస్టేబుల్ కుటుంబానికి మోటారు యాక్సిడెంట్స్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్(ఎంఏసీటీ) ఏకంగా రూ.1.25 కోట్ల నష్టపరిహారం అందజేసింది. సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్‌కు భార్య, కుమార్తె, ఇద్దరు కొడుకులున్నారు. 2016 డిసెంబర్‌లో భార్య, కుమార్తెతో కలసి బైక్‌పై అలిఘర్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు. కలింద్ కుంజ్ వద్ద ట్రక్కు గుద్దేయడంతో రాజ్‌కుమార్, భార్య, కుమార్తె రితు(9) చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు ట్రిబ్యునల్ విచారణ చేపట్టి కుమారులకు రూ.1.25 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని, ట్రక్కు యజమానిని, బీమా సంస్థను ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment