సీఆర్‌పీఎఫ్‌లో 197 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | 197 CRPF constable jobs Notification | Sakshi
Sakshi News home page

సీఆర్‌పీఎఫ్‌లో 197 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

Published Sun, Feb 21 2016 4:05 AM | Last Updated on Tue, Mar 19 2019 5:56 PM

సీఆర్‌పీఎఫ్‌లో 197 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ - Sakshi

సీఆర్‌పీఎఫ్‌లో 197 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

హైదరాబాద్: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్) చాంద్రాయణగుట్ట కేశవగిరి గ్రూప్ సెంటర్‌లో 197 కానిస్టేబుల్ పోస్ట్‌లకు నియామకాలు చేపట్టనున్నట్లు సీఆర్‌పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్ సుధీర్ దివాకర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. చాంద్రాయణగుట్ట కేశవగిరిలోని సీఆర్‌పీఎఫ్ గ్రూప్ సెంటర్‌లో కానిస్టేబుల్(టెక్నికల్ అండ్ ట్రేడ్స్‌మెన్) పోస్ట్‌లకు అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 11 నుంచి మార్చి 10వ తేదీ వరకు అర్హులైనవారు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. సీఆర్‌పీఎఫ్‌ఇండియా.కామ్ లేదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సీఆర్‌పీఎఫ్.ఎన్‌ఐసీ.ఇన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అభ్యర్థులు మెట్రిక్యులేషన్ లేదా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఈ ఉద్యోగావకాశాలకు సంబంధించిన నోటీస్‌ను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సీఆర్‌పీఎఫ్.ఎన్‌ఐసీ.ఇన్‌లో కూడా ఉంచినట్లు తెలిపారు.

 ఉద్యోగ ఖాళీలివే..:  పురుష డ్రైవర్లు: 37, పురుష ఫిట్టర్లు: 14, పురుష బగ్‌లర్: 15, పురుష టైలర్లు: 6, పురుష కోబ్లర్: 3, పురుష గార్డెనర్: 1, పురుష బ్రాస్ బ్యాండ్: 1, పురుష కార్పెంటర్: 1, పురుష కుక్‌లు : 19, పురుష వాటర్ క్యారియర్: 10, పురుష వాషర్‌మెన్: 3, పురుష సఫాయి కరమ్‌చారి: 8, పురుష బార్బర్: 4, మహిళా బగ్‌లర్: 1, మహిళా కుక్‌లు : 2, మహిళా హెయిర్ డ్రెస్సెర్: 1, మహిళా సఫాయి కరమ్‌చారి: 1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement