సాక్షి, విజయవాడ: రాష్ట్రంలోని బీఈడీ కళాశాల్లో ప్రవేశానికి ఈ నెల 6న నిర్వహించిన ఏపీ ఎడ్‌సెట్-2019 ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి. పరీక్ష ఫలితాలను ఇవాళ ఉదయం 11.30 గంటలకు విజయవాడలోని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ విజయరాజు విడుదల చేశారు. ఈ ప్రవేశ పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా 11,650మంది రాయగా 11,490మంది అర్హత సాధించారు. 18వ తేదీ నుంచి ర్యాంక్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, జూలై మొదటివారం నుంచి కౌన్సిలింగ్ ప్రారంభం కానుందని ఏపీ ఎడ్‌సెట్ చైర్మన్ రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఏపీ ఎడ్‌సెట్‌ను ఈ ఏడాది ఎస్వీ యూనివర్శిటీ నిర్వహించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment