సాక్షి, హైదరాబాద్ : బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కోర్సులో ప్రవేశానికి నిర్వహించనున్న ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్టు (ఎడ్‌సెట్–2018) షెడ్యూల్‌ను సెట్ కమిటీ ఖరారు చేసింది. ఈ నెల 15న ఎడ్‌సెట్ నోటిఫికేషన్‌ను జారీ చేయాలని నిర్ణయించింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన సెట్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఈ నెల 18 నుంచి వచ్చే నెల 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఎడ్‌సెట్‌ను ఈ సారి ఆన్‌లైన్‌లో నిర్వహించనున్న నేపథ్యంలో పరీక్ష ఫీజును సెట్ కమిటీ పెంచింది. గతేడాది ఎస్సీ, ఎస్టీలకు రూ.200, బీసీ, ఇతరులకు రూ.400గా ఉన్న ఫీజును.. ఈ సారి ఎస్సీ, ఎస్టీలకు రూ.450, బీసీ, ఇతరులకు రూ.650గా నిర్ణయించింది. ఆన్‌లైన్ పరీక్షలతో నిర్వహణ వ్యయం పెరగనుండటంతో కొంత ఫీజు పెంచాల్సి వచ్చిందని పాపిరెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment